bura narsayya goud
-
బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు
-
కాంగ్రెస్‌కు జలగండం తప్పదు
ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ నేతలు సైంధవుల్లా అడ్డుతగులుతున్నారని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని రైతుల వెంట పడుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నదీజలాలను వినియోగించుకోవడానికి ఇప్పటిదాకా సరైన ప్రణాళికలే లేవని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నియోజకవర్గంలో పులిచింతల ప్రాజె క్టు కింద 28 గ్రామాలు ముంపునకు గురైనా ఆయన బాధితులకు చేసిన న్యాయం ఏమీ లేదన్నారు. ప్రాజెక్టులకు అడ్డుపడితే కాంగ్రెస్‌కు జలగండం తప్పదని ఆయన హెచ్చరించారు. అవినీతికి అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి రహిత టీఆర్ఎస్ పాలన చూసి ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. -
ఎంపీ ల్యాడ్స్ నిధులు పెంచండి
ప్రధానికి టీఆర్ఎస్ ఎంపీల లేఖ సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పథకం నిధులను రూ.8 కోట్లకు పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గాల్లోని చిన్న సమస్యలను పరిష్కరించడానికి ఇవి ఉపయోగపడుతాయన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో దత్తత తీసుకునే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక కేటగిరీగా గుర్తించి నిధులను కేటాయించాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా, వ్యవసాయ వర్సిటీ, మూసీ అభివృద్ధి, బయ్యారం ఉక్కు ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధికోసం రాయి తీలు, పునర్విభజన చట్టం అమలుకు పార్లమెంట్లో పట్టుబడతామన్నారు. విమానాశ్రయానికి ఆంధ్రనేత పేరా? తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయానికి ఆంధ్రనాయకుడైన ఎన్టీఆర్ పేరు పెట్టాలని తెలంగాణ టీడీపీనేతలు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రతిపాదించిన పేర్లను తెలంగాణ రాష్ట్రంలో ఎలా పెడతారని, వారికి ఆ అధికారం ఎక్కడిదని ఎంపీలు ప్రశ్నించారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు. ఈ విషయంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. విభజన తర్వాత కూడా స్వేచ్ఛ లేదా? రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణ వారికి స్వేచ్ఛ లేదా అని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభను అపహాస్యం చేస్తున్నారన్నారు. దురదృష్టకరం: ఎంపీ కొండా ఎన్టీరామారావు పేరును తెలంగాణలోని విమానాశ్రయానికి పెట్టాలనుకోవడం దురదృష్టకరమని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. కొమురం భీం, రాణి రుద్రమదేవి, ప్రొఫెసర్ జయశంకర్, పీవీ నరసింహారావు వంటి వారందరినీ కాదని ఎన్టీఆర్ పేరును తెరపైకి తేవడం దిగ్భ్రాంతికరమన్నారు. దీనితో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటుం దని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. -
మాపై గురుతర బాధ్యత ఉంది
తెలంగాణ పునర్నిర్మాణంలో కలిసికట్టుగా పనిచేయాలి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఇబ్రహీపట్నం రూరల్: 60 ఏళ్ల తెలంగాణ కల నెరవేరి.. సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తమపై గురుతర బాధ్యత వుందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్మానించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వంగేటి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధి గురించి దేశంలోని అన్ని వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా శ్రమించాల్సి ఉందన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణలో తొలిగా అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చేందుకు తాము తప్పకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్తున్న 100 సింగపూర్ సిటీలను తెలంగాణలోనూ నిర్మించుకునే సత్తా మనకుందన్నారు. ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకుంటే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమేనన్నారు. ప్రతీ గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పట్నం పెద్ద చెరువులో నీటిని నింపి ఈ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని అన్ని రకాలా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధానంగా ప్రతీ గ్రామానికి తాగునీరు అందించి ఇక్కడి ప్రజల దాహార్తిని తీరుస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఏర్పాటైన కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. పలు ఐటీ కంపెనీల రాకతో ఇబ్రహీంపట్నంకు మహర్దశ వచ్చింద ని, రైతులు భూముల్ని ఇప్పుడే అమ్ముకోవద్దని సూచించారు. పాలమూరు- జూరాల నుంచి నీటిని తరలించి పట్నం పెద్ద చెరువును నింపేందుకు కృషి చేస్తామన్నారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ తెలంగాణ పునర్నిర్మాణంలోనూ పాలుపంచుకోవాలన్నారు. పార్టీ నాయకులు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నాగేందర్‌గౌడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, నాయకులు కొత్త మనోహర్‌రెడ్డి, సామల రంగారెడ్డి, జేపీ శ్రీనివాస్‌రావు, డబ్బీకార్ శ్రీనివాస్, బర్ల జగదీశ్ యాదవ్, బోసుపల్లి గణేశ్, మండల ప్రధానకార్యదర్శి కావలి లక్ష్మణ్, పలు గ్రామాల నాయకులు దోర్నాల మల్లేశ్, గొరిగె క్రిష్ణ, మాయిని అమర్నాథ్, మడుపు గోపాల్, బోసుపల్లి నందకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుతాం
భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చడమే టీఆర్ఎస్ లక్ష్యమని, అందుకు కేసీఆర్ కంకణబద్దులై ఉన్నారని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, అంగవైకల్యం తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కృష్ణాజలాలు అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, త్వరలోనే జిల్లాకు ఫ్లోరైడ్ పీడ విరుగడ అవుతుందని చెప్పారు. కేసీఆర్‌తో భువనగిరిలోని నిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. పార్టీ మేనిఫెస్టోను అమలు చేసి రాజ కీయ అవినీతి లేకుండా చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పారు. తనను గెలిపించి వారికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు మైనం శ్రీనివాస్, మాలే శరణ్యారెడ్డి, నాగార్జున, సాయి, వెంకన్న పాల్గొన్నారు.