'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు' | we will provide funds to prakasam district for fluoride, says siddha raghavarao | Sakshi
Sakshi News home page

'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు'

Published Tue, Sep 29 2015 4:38 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు'

'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు'

ఒంగోలు టౌన్ : ప్రకాశం జిల్లాను ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు. బుధవారం ఒంగోలులో ఫ్లోరైడ్‌ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని మంత్రి రాఘవరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement