siddha raghavarao
-
సంక్రాంతికి అదనపు చార్జీలుండవు
మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడి సాక్షి, అమరా వతి: సంక్రాంతి పండక్కి ఆర్టీసీ ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసే ప్రసక్తే లేదని మంత్రి శిద్ధా రాఘవరావు తేల్చి చెప్పారు. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల్ని పిలిచి మాట్లాడతామని, అధిక చార్జీలు ఎవరైనా వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా మన్నారు. శుక్రవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రవాణాశాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రవాణా శాఖలో సంస్క రణలు తెచ్చి 83 రకాల సేవల్ని ఆన్ లైన్ చేశామన్నారు. గతేడాది కంటే రవాణా శాఖకు విధించిన లక్ష్యంలో 20 శాతం వృద్ధి సాధించామన్నారు. -
అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు: శిద్ధా
హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండగకు రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,600 ప్రత్యేక బస్సు సర్వీసులు కల్పించనున్నట్లు చెప్పారు. ఎవరైనా రవాణా కోసం ప్రయాణికుల నుంచి టిక్కెట్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. -
'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు'
ఒంగోలు టౌన్ : ప్రకాశం జిల్లాను ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు. బుధవారం ఒంగోలులో ఫ్లోరైడ్ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని మంత్రి రాఘవరావు తెలిపారు.