సంక్రాంతికి అదనపు చార్జీలుండవు | no extra charges at sankranthi | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి అదనపు చార్జీలుండవు

Published Sat, Dec 31 2016 3:40 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

సంక్రాంతికి అదనపు చార్జీలుండవు - Sakshi

సంక్రాంతికి అదనపు చార్జీలుండవు

మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడి
సాక్షి, అమరా వతి: సంక్రాంతి పండక్కి ఆర్టీసీ ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసే ప్రసక్తే లేదని మంత్రి శిద్ధా రాఘవరావు తేల్చి చెప్పారు. ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకుల్ని పిలిచి మాట్లాడతామని, అధిక చార్జీలు ఎవరైనా వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా మన్నారు. శుక్రవారం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన రవాణాశాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రవాణా శాఖలో సంస్క రణలు తెచ్చి 83 రకాల సేవల్ని ఆన్ లైన్  చేశామన్నారు. గతేడాది కంటే రవాణా శాఖకు విధించిన లక్ష్యంలో 20 శాతం వృద్ధి సాధించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement