Additional charges
-
నీటిపారుదల అదనపు బాధ్యతలపై స్మితాసబర్వాల్ అయిష్టత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగడం పట్ల ఐఏ ఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ప్రభుత్వం వద్ద అయిష్టత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖపై నిర్వహిస్తున్న సమీక్షలకు ఆమె ఎందుకు రావడం లేదని ఇటీవల ఆ శాఖమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించగా.. ఈ మేరకు అధికారులు వివరణ ఇచ్చినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిషన్ భగీరథ విభాగం కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రజత్‌కుమార్ పదవీ విరమణ చేసిన సమయంలో స్మితా సబర్వాల్‌కు నీటిపారుదల శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగి స్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జా రీచేశారు. అయితే ఆమె ఆ బాధ్యతలు స్వీకరించలేదు. నీటిపారుదల శాఖ కార్య దర్శిగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తే ఆ పోస్టులో కొనసాగుతానని స్మితా సబర్వాల్ పేర్కొన్నారని ఆశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఫైళ్లపై సంతకాలు చేయడానికి కూడా ఆమె అయిష్టత వ్యక్తంచేయడంతో రెండు వారాలుగా ముఖ్యమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయని వెల్లడించారు. -
యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు..
ఏప్రిల్ 1 నుంచి పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే అదనపు చార్జీలు ఉంటాయని, ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో యూజర్లకు చార్జీల మోత తప్పదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో వాస్తవం లేదు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు ఆన్లైన్ వాలెట్లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు ఇంటర్చేంజ్ రుసుము విధించేందుకు ఎన్పీసీఐ ప్రతిపాదనలు చేసిన విషయం నిజమే. అయితే ఈ చార్జీలు యూజర్లకు వర్తించవు. ఇంటర్చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. బ్యాంక్, ప్రీపెయిడ్ వాలెట్ మధ్య వ్యక్తి-వ్యక్తి లావాదేవీలు లేదా వ్యక్తి నుంచి వ్యాపారి లావాదేవీలకు ఈ ఇంటర్చేంజ్ రుసుము వర్తించదు. అంటే యూపీఐ చెల్లింపులు చేసే యూజర్లు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ పీపీఐ ద్వారా చేసిన రూ. 2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్‌కి చెల్లించాలి. మర్చెంట్స్ ప్రొఫైల్‌ను బట్టి ఇంటర్‌ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. వివిధ పరిశ్రమలకు ఇంటర్‌ఛేంజ్ రుసుము వేరువేరుగా ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్పీసీఐ పేర్కొంది. -
ఫ్లాట్ కొంటున్నారా? అదనపు వసూళ్లు తప్పడం లేదా? ఏం చేస్తే బెటర్!
సాక్షి, హైదరాబాద్: అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు ఎంత వ్యయమవుతోందో.. అదే స్థాయిలో వసతుల చార్జీలూ తడిసిమోపెడవుతున్నాయి. క్లబ్‌హౌస్, పార్కింగ్, సెలబ్రిటీ జిమ్, స్విమ్మింగ్ పూల్, స్వా్కష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ పిచ్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ పార్క్, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్, యోగా, మెడిటేషన్ హాల్, గెస్ట్ రూమ్స్, 7 స్టార్ రెస్టారెంట్.. ఇలా బోలెడన్నీ వసతులను ప్రకటిస్తున్నారు. అన్నింటికీ రూ.లక్షల్లోనే చార్జీలను వసూలు చేస్తున్నారు. రెరా నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్ ధరలోనే వసతుల చార్జీలు కూడా కలిపి ఉండాలి. కానీ, నిర్మాణ సంస్థలు వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్, గ్రీనరీ, పైప్డ్ గ్యాస్, విద్యుత్, తాగునీరు ఇలా కనీస మౌలిక వసతులకు కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు క్లబ్‌హౌస్ నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రకటిస్తూనే.. మరోవైపు సభ్వత్య రుసుము పేరిట రూ.2– 3 లక్షల వరకూ బాదుతున్నారు. చదవండి: గీతం పూర్వ విద్యార్థిని శివాలి మరో గిన్నిస్ రికార్డు ఓసీ రాకముందే వసూళ్లు.. ► ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) రాకముందు వసతుల ఏర్పాటు, నిర్వహణకు చార్జీలు వసూలు చేయకూడదనేది నిబంధన. నిర్మాణ సంస్థలు మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ విభాగాలు సైతం నియంత్రించడంలేదు. ► మౌలిక వసతులను కల్పించిన తర్వాతే మున్సిపల్ విభాగం ఓసీని విడుదల చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్.. అంటూ కొనుగోలుదారుకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వసతులను పర్యవేక్షించే వారే కరువయ్యారు. ► భౌతికంగా ఆయా వసతులను డెవలపర్ కల్పించాడా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే లేరు. ఒక్కసారి ఓసీ రిలీజ్ అయ్యాక ఇక ఆ అపార్ట్‌మెంట్‌కు డెవలపర్‌కు సంబంధం ఉండదు. వెంచర్లలో రిసార్ట్ అంటూ.. ► ఓపెన్ ప్లాట్లు చేసే బిల్డర్లు అపార్ట్మెంట్లలో కల్పించే వసతులను వెంచర్లలోనూ కల్పిస్తామంటూ భారీగా వసూలు చేస్తున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం వెంచర్లలో రహదా రులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ వంటివి కల్పించాల్సిన బాధ్యత డెవలపర్లదే. కానీ.. బిల్డర్లు వీటికి కూడా వసతుల ఏర్పాటు పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. ► వీకెండ్ రిసార్ట్, ఫార్మింగ్, గోల్ఫ్ కోర్స్, క్లబ్‌హౌస్ సభ్యత్వం అని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. శామీర్‌పేట, షాద్‌నగర్, తుక్కుగూడ, యాదాద్రి, చేవెళ్ల, శ్రీశైలం జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లోని వెంచర్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఇలా చేయొచ్చు. ► అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా రెండేళ్ల పాటు వసతుల నిర్వహణ నిర్మాణ సంస్థే భరించాలి. ఒకే ఏరియాలో ఉండే 3– 4 ప్రాజెక్ట్‌లకు ఒకే క్లబ్‌హౌస్ కట్టుకోవటం ఉత్తమం. ► అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులు చ.అ.ల చొప్పున కాకుండా నివాసితుందరికీ ఒకేలా ఉండాలి. ఫ్లాట్ల సంఖ్యను బట్టి చార్జీలను విభజించాలి. ►హౌసింగ్ సొసైటీల్లోని క్లబ్‌హౌస్‌లను థర్డ్ పార్టీకి అప్పగించాలి. రెస్టారెంట్, సూపర్‌మార్కెట్, మెడికల్ వంటి ఇతరత్రా వాటికి అప్పగించాలి. ఆ అద్దెతో కమ్యూనిటీలో ఇతరత్రా ఖర్చులను వినియోగించుకోవచ్చు. ప్రచారంగా మారిన వసతులు కొనుగోలుదారులను ఆకర్షించాలంటే ఆధునిక వసతులనేవి అనివార్యం. పిల్లలు, యువత, పెద్దల కోసం వేర్వేరుగా వసతులకు ఎక్కువ స్థలం వదలాల్సి ఉంటుంది. ఆ స్థలం ధర, వసతుల కల్పనకు అయ్యే ఖర్చు అన్నింటినీ కొనుగోలుదారుల నుంచే వసూలు చేయాల్సి వస్తోంది. సౌకర్యాలతో పాటు ఇంటి విలువ కూడా పెరుగుతోంది. దీంతో అపార్ట్మెంట్ ధరలో 10– 15 శాతం వరకు వసతుల చార్జీలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ వసూలు చేయడం సరికాదు. – ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ కార్పడ్ ఫండ్ లెక్కించడంలేదు.. పదేళ్ల క్రితం కాప్రాలో అపార్ట్మెంట్ కొనుగోలు చేశాను. చ.అ.కు రూ.3 వేల చొప్పున 1,100 చ.అ.లకు రూ.33 లక్షలు అయింది. ఆ సమయంలో కార్పస్ ఫండ్, వసతుల నిర్వహణ కోసమని రూ.5 లక్షలు వసూలు చేశారు. ప్రతి నెలా అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నా. ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఫ్లాట్‌ను అమ్మేద్దామని నిర్ణయించుకున్నా. కొనడానికి ఎవరొచ్చినా సరే అపార్ట్మెంట్ ధరనే లెక్కిస్తున్నారే తప్ప.. నేను చెల్లించిన కార్పస్ ఫండ్ పరిగణనలోకి తీసుకోవటం లేదు. – అజయ్, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి అదనంగా రూ.10లక్షలు చెల్లించా స్విమ్మింగ్ పూల్, జిమ్, పిల్లలకు క్రచ్, ప్లే ఏరియా వంటివి ఉన్నాయని కూకట్‌పల్లిలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో రూ.80 లక్షలకు ఫ్లాట్ కొన్నా. వీటి కోసం డెవలపర్‌కు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాను. ప్రస్తుతం బెంగళూరుకు బదిలీ అయింది. అపార్ట్మెంట్ సొసైటీకి అప్పగించిన రెండేళ్ల తర్వాత సరైన నిర్వహణ లేక స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది. – ఉజ్వల్, ఐటీ ఉద్యోగి -
బ్యాంకాక్ టూర్ వెళ్తున్నారా? మీకో ముఖ్యగమనిక
కరోనా కారణంగా భారీగా దెబ్బతిన్న రంగం పర్యాటకం. ట్రావెల్ బ్యాన్, కఠిన ఆంక్షల కారణంగా లెక్కకు అందని నష్టం వాటిల్లింది ఈ రంగానికి. ముఖ్యంగా లక్షల మంది ఉపాధి లేకుండా పోయారు. మరోవైపు టూరిజం ఆకర్షణగా ఉన్న ప్రాంతాలు.. ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. ఈ తరుణంలో థాయ్‌లాండ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. థాయ్‌లాండ్‌కు టూర్ మీద వెళ్లే వాళ్లు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే. ఈ మేరకు 300 బహ్త్(9 డాలర్లు-మన కరెన్సీలో 665 రూ.) టూరిస్ట్ ఎంట్రీ ఫీజును ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎంట్రీ ఫీజును సందర్శన ప్రాంతాల అభివృద్ధి కోసం, అలాగే సందర్శకుల ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఎంట్రీ ఫీజు నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే విమాన ప్రయాణికుల విషయంలో.. ఈ ఫీజును విమాన ఛార్జీలకు ఏప్రిల్ నుంచి జత చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇతర మార్గాల గుండా వచ్చే సందర్శకుల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ ఫీజు.. చాలాదేశాల్లో వసూలు చేస్తున్న టూరిస్ట్ ఫీజుకు సమానంగానే ఉందని, కానీ, సందర్శకులకు కలిగే ప్రయోజనాలు మాత్రం అదనంగా ఉంటున్నాయని లెక్కలతో సహా చెప్తోంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. ఒకవైపు ప్రపంచం అంతా ఒమిక్రాన్, కరోనా కేసుల భయంతో ఆంక్షలు విధిస్తుంటే.. థాయ్‌లాండ్ మాత్రం టూరిస్టులకు వెల్కమ్ చెప్తోంది. భారత్ నుంచి రాజధాని బ్యాంకాక్‌కు ఎక్కువ మంది క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దెబ్బతిన్న థాయ్ టూరిజాన్ని.. తిరిగి నిలదొక్కుకునేలా చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే టూరిజం ఎంట్రీ ఫీజు విధించింది. ప్రస్తుతం యాభై లక్షల మంది సందర్శకులు వస్తారని థాయ్ ప్రభుత్వం భావిస్తోంది. యూరప్, అమెరికాల నుంచి రెగ్యులర్ టూరిస్టుల తాకిడి ఉందని ప్రకటించుకుంది. మరోవైపు భారత్, చైనా గనుక తమ ప్రజలకు సడలింపులు ఇస్తే.. ఆ సంఖ్య 90 లక్షలకు చేరుతుందని భావిస్తోంది. ఒకవేళ భూమార్గం సరిహద్దులు గనుక తెరిస్తే.. ఆ సంఖ్య కోటి యాభై లక్షలకు చేరొచ్చని అంచనా వేస్తోంది. చదవండి: మహీంద్రా గ్రూప్స్ సంచలన నిర్ణయం -
TSRTC: ‘అదనం’ లేదు
ఆర్టీసీ బస్సులు గత 5 రోజుల్లో 1.30 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. ఆర్టీసీపై ప్రజల్లో అభిమానం ఉందనడానికి ఇదే నిదర్శనం. పండుగ వేళ మిగతా వాళ్లు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా ప్రయాణించి సంస్థకు అండగా నిలవాలి. ప్రయాణికులు తమ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుంది. –ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సాక్షి, హైదరాబాద్: పండుగకు ఊరెళ్లాలంటే జేబులు గుల్లకావడం ఖాయం. ప్రైవేటు ట్రావెల్స్ రెండు మూడు రెట్లకుపైగా చార్జీలు వసూలు చేస్తే.. ఆర్టీసీ కూడా టికెట్ రేటుపై 50శాతం అదనంగా తీసుకునేది. దసరా సహా ప్రతి పండుగకూ మామూలు సర్వీసులను తగ్గించి పండుగ స్పెషల్ బస్సులు వేసేది. కానీ ఈసారి దసరాకు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. సాధారణ బస్సులతోపాటు స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ టికెట్ ధరలనే వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆదరణ పెంచుకునేందుకు కొన్నాళ్లుగా ఆర్టీసీ కునారిల్లుతూ వస్తోంది. సంస్థ నిర్వహణ లోపాల కారణంగా ప్రయాణికుల ఆదరణ తగ్గింది. పండుగల సమయంలోనే కాదు సాధారణ రోజుల్లోనూ.. ఆర్టీసీ కంటే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకే గిరాకీ ఎక్కువగా ఉండటం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చడంపై సంస్థ కొత్త ఎండీ సజ్జనార్ దృష్టిపెట్టారు. ఇందుకు దసరా పండుగ సమయాన్ని అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించారు. సాధారణంగా పండుగల సమయంలో ఆర్టీసీ ముందస్తు రిజర్వేషన్‌తో నడిపే ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధర 50 శాతం అదనంగా ఉంటుంది. ఈసారి కూడా అదనపు రుసుముతో స్పెషల్ బస్సులు తిప్పాలని అధికారులు భావించినా.. సజ్జనార్ దీనిని వ్యతిరేకించారు. పండుగల సమయంలో లక్షల మంది బస్సుల్లో సొంతూర్లకు వెళతారని, ఇలాంటి సమయంలో అదనపు వసూలును వదిలేయడం వల్ల ప్రజల్లో ఆర్టీసీపై ఆదరణ పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు నిత్యం ఆర్టీసీ బస్సులు ఎక్కితే.. ఆక్యుపెన్సీ రేషియో, ఆదాయం ఆటోమేటిక్‌గా పెరుగుతాయని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అదనపు చార్జీలేవీ లేకుండానే స్పెషల్ బస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు రాబడి తక్కువ.. చెడ్డపేరు ఎక్కువ.. ఆర్టీసీకి రోజువారీ టికెట్ ఆదాయం గరిష్టంగా రూ.13 కోట్ల వరకు ఉంటుంది. కోవిడ్‌కు ముందు (సమ్మె కాలం కాకుండా) ఈస్థాయి ఆదాయం నమోదైంది. దసరా పండుగకు మూడు రోజుల ముందు, తర్వాత అదనపు బస్సుల వల్ల మరికొంత ఆదాయం పెరుగుతుంది. ఇందులో టికెట్ చార్జీలపై 50శాతం ఎక్కువ ధర తీసుకోవడం వల్ల.. ఆర్టీసీకి అదనంగా సమకూరేది రోజుకు రూ.40 లక్షలేనని అంచనా. ఈ మాత్రం ఆదాయం కోసం.. అదనపు చార్జీల బాదుడు అంటూ ప్రజల్లో చెడ్డపేరు వస్తోందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. సజ్జనార్ ఈ అంశాలన్నింటినీ పరిశీలించి, అదనపు బాదుడు వద్దనే నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నాయి. అలా ప్రయాణికులను తరలించొద్దు పండుగ వేళ డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని కొందరు సాధారణ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు. తెలుపురంగు నంబర్ ప్లేట్ ఉన్న (నాన్ కమర్షియల్) వాహనాల్లో ప్రయాణికులను తరలించడం నేరమని.. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రకటించారు. ఇటీవల ఆర్టీసీ–రవాణా శాఖ అధికారుల సంయుక్త తనిఖీల్లో 20 వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. నాన్–కమర్షియల్ వాహనాల్లో ప్రయాణించేప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా కూడా రాదని అధికారులు పేర్కొంటున్నారు. -
TSRTC: దసరా పండగకు ప్రయాణికులకు తీపికబురు..
హైదరాబాద్: దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక బస్సులకు గానూ..టీఎస్ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు. ఈనెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. దీని కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సులలో టికెట్ ఛార్జీకి అదనంగా 50 శాతం రుసుము వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పండగకు మొత్తం.. 4035 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఎంజీబీఎస్ నుంచి 3,200 బస్సులు, జేబీఎస్ నుంచి 1200 బస్సులు తెలంగాణ, ఏపీకి నడవనున్నాయి. ఇవికాకుండా మరికొన్ని బస్సులు అదనంగా తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు. ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల,నిజామాబాద్ లాంటి ప్రాంతాలకు ముందస్తు బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించారు. దీంతో పండగకు రూ. 3 నుంచి రూ.4 కోట్ల ఆదాయం చార్జీల రూపంలో వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ బస్సులు జేబీఎస్ నుంచి బయలుదేరుతుండగా.. వరంగల్, మహబూబాబాద్‌కు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి బయలు దేరనున్నాయి. అదే విధంగా ఖమ్మం, విజయవాడకు వెళ్లే బస్సులు.. ఎల్బీనగర్, హయత్‌నగర్ నుంచి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌కు వెళ్లే బస్సులు దిల్సుఖ్నగర్ నుంచి బయలుదేరతాయిని అధికారులు తెలిపారు. అదే విధంగా, వైఎస్సార్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరతాయని టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. చదవండి: సరిలేరు మాకెవ్వరూ... అనవసర ఖర్చుల్లో ‘ గ్రేటర్’ -
సీఆర్పీఎఫ్ డీజీకి ఎన్ఐఏ బాధ్యతలు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్ఐఏ డీజీగా ఉన్న వైసీ మోదీ సోమవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శనివారం కుల్దీప్సింగ్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ అదేశాలు వెలువడ్డాయి. కుల్దీప్ సింగ్ 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. ప్రస్తుతం ఆయన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తదుపరి చీఫ్ నియామకం వరకు కుల్దీప్ ఎన్ఐఏ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని హోంశాఖ స్పష్టం చేసింది. పదవీ విరమణ చేయనున్న మోదీ 1984 ఐపీఎస్ బ్యాచ్ అస్సాం–మేఘాలయ కేడర్ అధికారి. (చదవండి: MK Stalin: అనాథ బాలలకు రూ.5 లక్షల సాయం) -
వెలుగుల మాటున వసూళ్లు!
పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణకు 2017లో అప్పటి ప్రభుత్వం ఐలెట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీపాలు ఏర్పాటు చేయించింది. 2021 వరకు దీపాల నిర్వహణ బాధ్యతను సంస్థే చూడాలి. కానీ ఈ నిబంధనను పక్కనపెట్టి పంచాయతీల నుంచి నిర్వహణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరమ్మతుల పేరిట నిధులు కొల్లగొడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయనగరం రూరల్: పంచాయతీల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలో 2015లో ఎల్ఈడీ ప్రాజెక్టు ప్రారంభం కాగా 2017లో విజయనగరం ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎల్ఈడీ దీపాల కొనుగోళ్లు, నిర్వహణను గంట్యాడ మండలం కరకవలసకు చెందిన ఐలైట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. ఒక్కో ఎల్ఈడీ విద్యుత్ దీపం కొనుగోలుకు ప్రభుత్వం రూ.999లుగా ధర నిర్ణయించింది. ఎల్ఈడీ కొనుగోలుకు ఎంపీ లాడ్స్ నుంచి 70 శాతం వాటా, గ్రామ పంచాయతీల నిధుల నుంచి 30 శాతం వాటాను ఐలైట్ ఇండియా సంస్థకు చెల్లించింది. జిల్లాలోని 18 మండలాల్లో ఉన్న 463 గ్రామ పంచాయతీల్లో ఎంపీల్యాడ్స్ నుంచి 55,974 ఎల్ఈడీ బల్బులు కొనుగోలు చేసి పంచాయతీల్లో అమర్చింది. విద్యుత్ బల్బుల ఏర్పాటు, ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2021 వరకు విద్యుత్ దీపాల నిర్వహణ బాధ్యత అంతా సంస్థదే. ప్రకృతి వైపరీత్యాల పేరిట డబ్బుల వసూలు.. విద్యుత్ దీపాల నిర్వహణ ఒప్పందం నాలుగేళ్లు. కానీ ఆ సంస్థ ప్రకృతి వైపరీత్యాలను కారణంగా చూపి బల్బులు పూర్తి గా పాడయ్యాయని చెప్పి ఒక్కోదానికి గ్రామ పంచాయతీల నుంచి రూ. 300 చొప్పున వసూలు చేస్తున్నట్లు అధికారు లు, గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మండలంలో ఒక నెలలో 40 బల్బులు పాడయ్యాయి. వాటిని బాగుచేసేందుకు ఆ సంస్థకు అప్పగిస్తే అందులో 20 వరకు పూర్తిగా పాడైపోయాయని, ఒక్కో దానికి రూ.300లు చెల్లించాలని సంస్థ నిర్వాహకులు డిమాండ్ చేసినట్టు పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. పాడైపోయిన 20 బల్బులకు డబ్బులు చెల్లించకపోతే మిగిలినవాటిని మరమ్మతు చేయడం లేదని పంచాయతీల కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిడుగులు పడినా, చెట్టు కొమ్మలు విరిగిపడి ఎల్ఈడీ విద్యుత్ దీపాలు పాడైపోతే వాటికి వారంటీ ఇవ్వలేమని, బిల్లులు చెల్లించాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. వాస్తవంగా పాడైపోయిన దీపాలను నిర్వాహకులకు అప్పగించిన 72 గంటల్లో మరమ్మతులు చేపట్టి అందించాల్సి ఉన్నా వారు స్పందించడంలేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతు న్నారు. నాటి టీడీపీ పెద్దల సహకారంతో ఈ కాంట్రాక్టును రూ. 5.50 కోట్లకు దక్కించుకున్న సంస్థ ఇప్పుడు మరమ్మతుల పేరిట అదనంగా వసూలు చేయ డం పంచాయతీలకు భారమేనని పేర్కొంటున్నారు. దీనిపై ఓ ఎంపీడీఓ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో హడావుడిగా సమావేశం ఏర్పాటు చేసి ఐలైట్ సంస్థ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసు జారీచేశాం ఎల్ఈడీ విద్యుత్ దీపాలు పాడైపోతే 72 గంటల్లో వాటికి మరమ్మతు చేయాల్సి ఉన్నా సంస్థ నిర్వాహ కులు సకాలంలో వాటిని అందించలేదని మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శుల నుంచి వస్తు న్న ఫిర్యాదుల ఆధారంగా షోకాజ్ నోటీసు జారీ చేశాం. ఇటీవల ఈ విషయంపై అధికారులు, ఐలైట్ సంస్థ నిర్వాహకులతో సమావేశం నిర్వహించాం. సంస్థ నిర్వాహకులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పూర్తిగా పాడైపోయిన బల్బులకు వారంటీ లేదని చెప్పారు. వారంటీ లేనివాటికి మరమ్మతులు చేపట్టలేమని చెప్పారు. – కె.సునీల్ రాజ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి కరోనాయే కారణం కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఏడు నెలలుగా పాడైపోయిన ఎల్ఈడీ దీపాలు బాగుచేయ డంలో ఆలస్యమైంది. మా దగ్గరకు వచ్చిన 455 బల్బులకు 276 బల్బులు బాగుచేశాం. కేవలం 179 విద్యుత్ దీపాలను మరమ్మతు చేపట్టడంలో ఆలస్యమైంది. వారంటీలో లేని విద్యుత్ దీపాలు పూర్తిగా చెడిపోతే కొత్తవి కావాలని అధికారులు అడిగితే వాటిని విక్ర యిస్తున్నాం. మరమ్మతుల పేరిట అదనపు వసూలు చేయడం లేదు. – కళ్యాణ్, ఐలైట్ సంస్థ ,నిర్వాహకుడు -
అప్రోచ్ ‘వంద’ ఉంటేనే లేఅవుట్
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారుల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లేఅవుట్ అనుమతుల మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా భవిష్యత్‌లో ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో భాగంగా హెచ్ఎండీఏ లేఅవుట్లకు అనుమతులు మంజూరు కావాలంటే వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు ఉండాలని తాజాగా విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. గతంలో 2008, 2013లో విడుదల చేసిన జీవో ప్రకారం లేఅవుట్ అనుమతికి 30 ఫీట్ల రోడ్డు ఉంటే సరిపోతుందనే నియమాలను మార్చింది. ఈ కొత్త నిబంధన ఇప్పటికే అనుమతులు కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకొని ప్రాసెస్‌లో ఉన్నవాటన్నింటికి వర్తిస్తుందని పేర్కొంది. ఒకవేళ ప్రస్తుత రోడ్డు 100 ఫీట్ల కన్నా తక్కువగా ఉంటే వారి లేఅవుట్ వరకు మిగిలిన రోడ్డును చూపిస్తేనే అనుమతులు ఇస్తామని హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా రోడ్డు చూపించినా వాటి అభివృద్ధి కోసం అదనపు చార్జీలు చెల్లించాలని స్పష్టం చేశారు. దీంతో హెచ్ఎండీఏకు వచ్చే ఆదాయం మరింత రెట్టింపవుతుందని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతికూల ప్రభావం: రియల్ ఎస్టేట్ వ్యాపారులు హెచ్ఎండీఏ తాజాగా తీసుకున్న వంద ఫీట్ల నిర్ణయం రియల్ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కరోనా దెబ్బతో విలవిలలాడుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం రోడ్డు ఇంపాక్ట్ ఫీజు కింద అదనపు చార్జీలు వడ్డించడం ఎంతవరకు సమంజసం. గత రెండేళ్ల నుంచి చిన్నచిన్న లోపాలతో అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటికి కొత్త నిబంధనలు వర్తింపచేయడం కరెక్ట్ కాదు. చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది ఊహించని దెబ్బ. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో ఏకంగా రియల్ వ్యాపారాన్ని కుదేలు చేయవద్దు. వంద ఫీట్ల అప్రోచ్ రోడ్డు లేనివారు ఇప్పుడు ఏం చేయాలి’అని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు ఇలా.. ♦ ప్రస్తుత రోడ్డు వెడల్పు(ఫీట్లు): అదనంగా చెల్లించాల్సిన నగదు ♦ 80 నుంచి 100లోపు ఉంటే: 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు ♦ 60 నుంచి 80 లోపు ఉంటే : 66 శాతం డెవలప్మెంట్ చార్జీలు ♦ 30 నుంచి 60లోపు ఉంటే : 100 శాతం డెవలప్మెంట్ చార్జీలు ► 100 ఫ్లాట్ల కన్నా ఎక్కువగా ఉండి నాన్ హైరైజ్ బిల్డింగ్‌ల అనుమతి కోసం 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలి. ► ఇప్పటికే డ్రాఫ్ట్ లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి, కొత్త దరఖాస్తులకు, అలాగే లేఅవుట్ విత్ హౌసింగ్ (ఓపెన్, గేటెడ్)కు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ► అమోదం పొందిన మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్లు, అంతకన్నా ఎక్కువగా ఉండి ప్రస్తుత రోడ్డు వెడల్పు ఎంత తక్కువగా ఉన్నా (30 ఫీట్ల వరకు) రోడ్డు ఇంపాక్ట్ ఫీ కింద 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► అయితే ఈ రోడ్డు ఇంపాక్ట్ ఫీజులను ‘స్పెషల్ ఎస్క్రో అకౌంట్’కింద ఉంచి లేఅవుట్లకు రోడ్ల అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ ఉపయోగించనుంది. -
ఆర్టీసీ బాదుడు
అనంతపురం న్యూసిటీ: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) దూర ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసుల్లో పండుగ పూట టికెట్ చార్జీలు భారీగా పెంచింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే టికెట్ ధర పెంచుతారు. అయితే అది మాటల వరకే పరిమితమైంది. రెగ్యులర్ సర్వీసుల్లోనూ టికెట్‌పై 50 శాతం మేర అదనంగా దండుకోనుంది. ఇదేమని అడిగితే ‘పండుగ పూట మామూలే కదా’ అని అంటోంది. అనంతపురం రీజియన్‌లోని 13 డిపోల నుంచి రెగ్యులర్ సర్వీసులు కాక 80 స్పెషల్ బస్సులు తిప్పనున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు అధిక సర్వీసులు పంపనున్నారు. అందుకోసం పలు ప్రాంతాల సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ఫ్లెక్స్‌బుల్ ఫెయిర్ పేరుతో రెగ్యులర్ సర్వీసుల్లోనూ అదనంగా డబ్బులు వసూలు చేయనున్నారు. పండుగ సీజన్లో మామూలే.. రెగ్యులర్ సర్వీసుల్లో సాధారణ ధర మాత్రమే కేటాయించాం. స్పెషల్ సర్వీసుల్లో మాత్రం వన్ అండ్ ఆఫ్ ధర (టకెట్ ధరకు అదనంగా) వసూలు చేస్తాం. పండుల సీజన్లో మామూలే. వివిధ ప్రాంతాలకు వెళ్లే స్పెషల్ బస్సుల టికెట్ ధరలు ఇవే... సర్వీసు రెగ్యులర్ సర్వీసు ధర స్పెషల్ ధర హైదరాబాద్ రూ. 473 రూ. 682 చెన్నై రూ. 550 రూ. 807 బెంగళూరు రూ. 320 రూ. 459 బెంగళూరు(ఎక్స్‌ప్రెస్)రూ. 232 రూ. 330 విజయవాడ రూ. 620 రూ. 900 తిరుపతి(ఎక్స్‌ప్రెస్) రూ. 281 రూ. 409 -
అడ్వాణీకి బిగుసుకుంటున్న ఉచ్చు!
లక్నో: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీపై లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. అడ్వాణీతోపాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్జోషి, ఉమా భారతి తదితరులపై కూడా కొత్త అభియోగాలు నమోదు కావొచ్చు. బాబ్రీ కూల్చివేత అంశంలో వీరిపై ఉన్న నేరపూరిత కుట్ర ఆరోపణలను 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టు గత నెలలో పునరుద్ధరించడం తెలిసిందే. ఏప్రిల్ 19న సీబీఐ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తూ... ఈ కేసులో వాదనలు ప్రతిరోజూ వినాలనీ, నెల రోజుల్లో విచారణ మొదలుపెట్టి, రెండేళ్లలోపు ముగించాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120–బి ప్రకారం అడ్వాణీ తదితరులపై కొత్తగా అభియోగాలు మోపొచ్చని సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది. మరోవైపు ఈ కేసులో ఆరో నిందితుడు, శివసేన మాజీ ఎంపీ సతీశ్ ప్రధాన్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం బెయిలు మంజూరు చేసింది. -
సంక్రాంతికి అదనపు చార్జీలుండవు
మంత్రి శిద్ధా రాఘవరావు వెల్లడి సాక్షి, అమరా వతి: సంక్రాంతి పండక్కి ఆర్టీసీ ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసే ప్రసక్తే లేదని మంత్రి శిద్ధా రాఘవరావు తేల్చి చెప్పారు. ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకుల్ని పిలిచి మాట్లాడతామని, అధిక చార్జీలు ఎవరైనా వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా మన్నారు. శుక్రవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన రవాణాశాఖ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రవాణా శాఖలో సంస్క రణలు తెచ్చి 83 రకాల సేవల్ని ఆన్ లైన్ చేశామన్నారు. గతేడాది కంటే రవాణా శాఖకు విధించిన లక్ష్యంలో 20 శాతం వృద్ధి సాధించామన్నారు. -
చల్లగా జెల్ల
ప్రయాణికుల జేబులకు ఆర్టీసీ చిల్లు ‘సేఫ్టీ’ సెస్ పేరుతో టిక్కెట్టుపై రూ.1 వసూలు నెలకు రూ.36 లక్షల బాదుడు ఇప్పటికే రకరకాల సెస్సులతో మోతెక్కుతున్న చార్జీలు సాక్షి, రాజమహేంద్రవరం : అత్యధిక ప్రజల రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సు ప్రయాణం రోజురోజుకూ భారంగా మారుతోంది. రకరకాల సెస్సుల పేరిట ప్రభుత్వం ప్రయాణికులకు చల్లగా జెల్ల కొడుతోంది. నొప్పి తెలియకుండా నెత్తురు పీల్చే దోమలా అదనపు వసూళ్లతో వారి జేబులకు చిల్లులు పెడుతోంది. తాజాగా ‘రక్షణ పన్ను’ (సేఫ్టీ సెస్) పేరుతో దూరంతో సంబంధం లేకుండా ప్రతి టిక్కెట్టుపై అదనంగా ఒక రూపాయి వసూలు చేస్తోంది. పల్లెవెలుగు మినహా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, అమరావతి, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణించేవారి నుంచి ఈ పన్ను వసూలు చేస్తోంది. అదనపు వసూళ్లు ఇలా.. ఇప్పటికే టిక్కెట్టు ధరతోపాటు టోల్ ప్లాజా చార్జీలను కూడా ప్రయాణికుల నుంచే వసూలు చేస్తున్నారు. 2015 నుంచి పాసింజర్ సెస్ పేరిట ప్రతి టిక్కెట్టుపై 2 రూపాయల భారం వేస్తున్నారు. స్వచ్ఛభారత్ సెస్ పేరిట ఇందులో ఒక రూపాయి ప్రభుత్వం తీసుకుంటోంది. 2015 సెప్టెంబర్‌లో ఏ1 బస్టాండ్లయిన కాకినాడ, రాజమహేంద్రవరంలలో బస్సుల రాకపోకలు ఇతర సమాచారాన్ని ప్రయాణికులు తెలుసుకునేందుకు ఒక్కో కియోస్క్ ఏర్పాటు చేశారు. ఆ పేరుతో ‘ప్రయాణికుల సమాచార వ్యవస్థ’ (పిస్) పేరిట ప్రతి టిక్కెట్టుపై రూ.1 గుంజుతున్నారు. రోజుకు రూ.1.2 లక్షల ‘సేఫ్టీ’ సెస్ భారం... ఈ ఏడాది జూలై 5వ తేదీ నుంచి సేఫ్టీ ట్యాక్స్ విధిస్తున్నారు. జిల్లాలో 97 ఎక్స్‌ప్రెస్, 72 అల్ట్రా డీలక్స్, 124 సూపర్ లగ్జరీ, రెండు అమరావతి, 17 ఇంద్ర, 14 గరుడ, 2 గరుడ ప్లస్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ఈ సర్వీసుల్లో ప్రతి రోజూ సుమారు 1.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరి నుంచి సేఫ్టీ సెస్ పేరుతో ప్రతి రోజూ రూ.1.20 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే ఆమేరకు వారిపై భారం పడుతోంది. ఇలా నెలకు రూ.36 లక్షలు, ఏడాదికి రూ.4.32 కోట్లు ప్రయాణికుల నుంచి ఆర్టీసీ గుంజుతోంది. ఆర్టీసీని ఆదాయ వనరుగా మలచుకున్న ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ప్రయాణ వ్యవస్థ అయిన ఆర్టీసీని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడంతోనే ఈవిధంగా భారా లు మోపుతోందన్న విమర్శలు ఉన్నాయి. సామాన్యుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే దానికి ఆర్టీసీపై వేసిన పన్నులే ఉదాహరణ. ధనికులు ప్రయాణించే విమాన ఇంధన ధరపై ఒక శా తం, రైళ్లకు వినియోగిస్తున్న డీజిల్‌పై 4 శా తం చొప్పున కేంద్రం పన్ను విధిస్తుండగా.. అదే బస్సులు నడిపేందుకు ఆర్టీసీ వినియోగిస్తున్న డీజిల్‌పై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 27 శాతం పన్ను విధిస్తోంది. అలాగే టిక్కెట్టు ఆదాయంపై 7 శాతం పన్ను వసూలు చేస్తోంది. ఆర్టీసీ బస్టాండ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా సంస్థకు వచ్చే ఆదాయంపై 14.5 శాతం పన్ను విధిస్తోంది. ఈ పన్నులను కొంతమేర తగ్గిస్తే.. ప్రయాణికులపై భారాలు వేయకుండానే ఆర్టీసీ నష్టాలను చాలావరకూ పూడ్చుకోవచ్చని అధికారులే అంటున్నారు. -
స్పెషల్ బస్సుల్లో అదనపు వసూళ్లకు అనుమతి
హైదరాబాద్ : పత్యేక సందర్భాల్లో స్పెషల్ సర్వీసులు తిప్పినప్పుడు స్టేజి క్యారియర్లుగా తిరిగే బస్సులకు ఒకటిన్నర రెట్లు ఛార్జీలు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వారాంతంలో, వారంలో ఏ రోజైనా, పండుగల వేళ, జాతర్లకు ప్రయాణీకుల డిమాండ్ మేరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని, మోటారు వాహన చట్టం 67(1) ప్రకారం ఈ అవకాశం కల్పించి చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టేజి క్యారియర్లుగా ఆర్టీసీ బస్సులకు మాత్రమే అధికారికంగా అనుమతి ఉంది. అయితే ప్రైవేటు బస్సులు కూడా స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్నా.. రవాణా శాఖ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో ప్రైవేటు బస్సులు పండుగ సీజన్లో ఛార్జీల మోత మోగించనున్నాయి. -
పేదలకూ షాకే
- విద్యుత్ చార్జీల పెంపుపై అన్ని వర్గాల్లో ఆగ్రహం - జిల్లావాసులపై నెలకు రూ.15 కోట్ల మేర అదనపు భారం - సర్కారు నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ రాజమండ్రి: విద్యుత్ చార్జీలు పెంచినా పేదోడిపై భారం వేయలేదని, వంద యూనిట్ల లోపు వాడకానికి పెంపు వర్తించదని సర్కారు అంటోంది. అయితే ఎంత మంది వంద లోపు యూనిట్లు వాడతారు అని చూస్తే మాత్రం పెంపు భారం దాదాపు అందరిపై పడుతుందని తేలుతుంది. ప్రజలపై రాష్ట్రం మోపుతున్న వరుస భారాల్లో భాగంగా వచ్చే ఏప్రిల్ నుంచి కరెంటు చిర్జీలు పెంచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఆ మేరకు విద్యుత్తు నియంత్రణా మండలి(ఈఆర్సీ) అనుమతి కోసం పంపిణీ సంస్థలు(డిస్కంలు) ప్రతిపాదనలు పంపాయి. వాటిని ఈఆర్సీ ఆమోదించడడం లాంఛనమే. ప్రభుత్వ నిర్ణయంపై జిల్లాలో అన్నివర్గాలూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం విద్యుత్తు వినియోగ దారుల సంఖ్య 14,39,670. ఇందులో గృహ కనెక్షన్లు 12.44,626, వాణిజ్య కనెక్షన్లు 1,17,194, పరిశ్రమల కనెక్షన్లు 9520, చిన్నతరహా పరిశ్రమల కనెక్షన్లు 864 ఉన్నాయి. మిగిలినవి వ్యవసాయ, ప్రభుత్వం, ప్రజాప్రయోజనాల సర్వీసులు, హెచ్‌టీ సర్వీసులు. వీరిలో చార్జీల పెంపు పేదలకూ భారం కానుంది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 50 యూనిట్ల లోపు వినియోగదారులు 5.76 లక్షల మంది, 51 నుంచి 100 యూనిట్లలోపు వినియోగ దారులు 4.37 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య తాజా నెల బిల్లు ప్రకారం తేలింది. కాగా వీరి సంఖ్య నెల నెలా మారుతుంటుంది. వచ్చేది వేసవి కావడంతో ప్రతి ఇంటా వినియోగం భారీగా ఉంటుంది. ఒక ఫ్యాను వినియోగించే వారికి వంద యూనిట్లకుపైగా వినియోగం ఉంటుంది. అంటే ఏప్రిల్ తర్వాత లెక్కలు పూర్తిగా తారుమారవుతాయి. మార్చి నుంచి 51 నుంచి 100 యూనిట్లలోపు వాడే వారి సంఖ్య రెండు లక్షలకు తగ్గిపోతుంది. భారం ఇలా పడుతుంది.. వందకు పైగా వినియోగించే ఐదు లక్షల మందిలో రెండు లక్షల మంది 101 నుంచి 200 యూనిట్ల లోపు వినియోగిస్తారు. వీరి వినియోగంపై 100 వరకూ ఇప్పుడున్న యూనిట్ ధరకు 0.12 పైసలు పెరుగుతుంది(రూ.2.60 నుంచి రూ.2.76). అంటే బిల్లుపై రూ.12 అదనంగా చెల్లించాలి. 101 నుంచి 200 వాడితే అదనం గా యూనిట్‌కు 0.22 పైసలు వడ్డిస్తారు (రూ.3.60 నుంచి రూ. 3.82) అంటే 200 యూ నిట్లు వాడే బిల్లుకు అదనంగా రూ.22 భారం పెరుగుతుంది. సగటున రెండు లక్షల మంది 150 యూనిట్లు వినియోగిస్తారని అంచనా వేస్తే రెండు లక్షల మందిపై నెలకు రూ.66 లక్షల భారం పడుతుంది. 201కి పైగా వినియోగించే వారి సంఖ్య సుమారు రెండు లక్షలని అంచనా. 300 యూనిట్లు వాడే వారు అదనంగా నెలకు రూ.130, 500 యూనిట్లు వాడే వారు అదనంగా రూ. 235 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 200 యూనిట్లకు మించి వాడే మూడు లక్షల మంది సగటున నెలకు 30 0 యూనిట్లు వినియోగిస్తే నెలకు రూ.మూడు కోట్ల మేర భారం పడనుంది. చిన్న దుకాణాల వారు సగటున 500 యూనిట్లు వినియోగిస్తారనుకుంటే నెలకు రూ.260 అదనపు భారం పడనుంది. జిల్లాలో ఈ తరహా 1,17,194 మంది వినియోగదారులపై అదనపు భారం రూ.మూడు కోట్లకు పైగా ఉంటుంది. పరిశ్రమలపైనా పెనుభారం.. నెలకు 5,000 యూనిట్లు వినియోగించే కుటీర పరిశ్రమలపై నెలకు రూ.1200 అదనపు భారం పడుతుంది. జిల్లాలోని 864 పరిశ్రమలపై సుమారు రూ.10 లక్షలకు పైగా భారం పడుతోంది. కేటగిరీ-3 పరిశ్రమలపై నెలకు రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల భారం పడనుంది. పంచాయతీల వీధిదీపాలపై రూ.4 కోట్ల వరకూ, మంచినీటి పథకాలపై మరో మూడు కోట్ల వరకూ భారం పెరగనుంది. ఇతర వినియోగాలతో కలిపి చూస్తే చార్జీల పెరుగుదల వల్ల జిల్లా వాసులపై నెలకు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. ప్రజలు తట్టుకోలేరు.. టీడీపీ ప్రభుత్వం ఒకపక్క సంక్షేమ పథకాల్లో భారీగా కోత పెడుతూ, మరోపక్క అన్ని రకాల చార్జీలు పెంచుతోంది. ఈ వైఖరిని మేం ఖండిస్తున్నాం. ఇప్పటికే పెట్రోలు చార్జీలు పెంచేశారు. కొత్తగా కరెంటు బిల్లులు కూడా భారీగా పెరిగితే ప్రజలు తట్టుకోలేరు. - జ్యోతుల నెహ్రూ, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పేదలు ఫ్యాన్ వేసుకోకూడదా! విద్యుత్తు చార్జీలు సామాన్యుడి నడ్డి విరుస్తాయి. వందకు పైగా వినియోగించే వారిలో పేదలు కూడా ఉంటారు. వేసవిలో ఫ్యాను వాడితే చాలు వంద యూనిట్లు దాటిపోతుంది. అంటే పేదవాళ్లు వేసవిలో ఫ్యానులు కూడా వేసుకోకుండా ఉండాలని ప్రభుత్వ ఉద్దేశమా! - పి. సూర్యనారాయణరాజు, రిటైర్డు ఉద్యోగి, రాజమండ్రి -
ఓటుకు పోదాం చలో చలో
7న సీమాంధ్రలో పోలింగ్ రైళ్లు, బస్సులు కిటకిట వందల్లో వెయిటింగ్ లిస్ట్ సాక్షి, సిటీబ్యూరో: నగరం ఓటుకోసం సొంత ఊరు బాటపట్టింది. ఈనెల 7న సీమాంధ్రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ అనూహ్యంగా పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి రోజు నడిచే వెయ్యి బస్సులకు అదనంగా 200 బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేపట్టింది. ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ఆపరేటర్లు సైతం రెట్టింపు చార్జీలు విధిస్తున్నారు. దీంతో సొంత ఊళ్లో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు, తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా బయలుదేరుతున్న నగర వాసులకు ప్రయాణం భారంగా పరిణమించింది. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు కలిసి రావడంతో సీమాంధ్రకు వెళ్తున్న ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. సాధారణ రోజుల్లోనే అన్ని రైళ్లు, బస్సులు కిక్కిరిసి బయలుదేరుతుండగా, ఈనెల 5,6 తేదీల్లో లక్షలాది మంది తరలి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జంట నగరాల నుంచి విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్టణం, కాకినాడ, మచిలీపట్నం, చిత్తూరు, నెల్లూరు, కడప, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇప్పటి నుంచే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకున్నారు. అన్ని దూరప్రాంత ైరె ళ్లలో వెయిటింగ్‌లిస్ట్ బాగా పెరగడంతో మిగిలినవారు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు రూట్లలో రెగ్యులర్ బస్సులతో పాటు, 6న బయలుదేరేందుకు ఇప్పటికే 80 ప్రత్యేక బస్సులు బుక్కయ్యాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వందల్లో వెయిటింగ్ లిస్టు బస్సుల్లో డిమాండ్ ఇలా ఉండగా, నగరం నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలోనూ వెయిటింగ్‌లిస్ట్ బాగా పెరిగిపోయింది. విశాఖ, కాకినాడ, గోదావరి, చెన్నై, తిరుపతి, చిత్తూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ఫలక్‌నుమా, గౌతమి, నర్సాపూర్, చార్మినార్, వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి సహా అన్ని రైళ్లల్లో వెయిటింగ్‌లిస్ట్ చాంతాడంత పెరిగింది. ఈనెల 5,6 తేదీల్లో పలు రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఇలా ఉంది.. విడిపోయాక తొలి ఎన్నికలు.. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆ ప్రభుత్వంపైనే ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరం ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అందుకే నేను వెళ్తున్నాను. ఇంకా ఆగితే ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. - చిన్న, వైజాగ్ రద్దీ బాగా ఉంది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తే ఈ రోజు రిజర్వేషన్ దొరికింది. ఎట్టి పరిస్థితుల్లోను ఓటు హక్కును వినియోగించుకోవాలనే పట్టుదలతో వెళ్తున్నాను. రెండు రాష్ట్రాల్లోనూ మంచి ప్రభుత్వాలు రావాలంటే ప్రజా ప్రతినిధుల ఎన్నికే ముఖ్యం. - దినేష్, తిరుపతి -
జనం నెత్తిన గ్యాస్ బండ
నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఓవైపు చమురు కంపెనీలు ఎడాపెడా చమురు, గ్యాస్ ధరలు పెంచుతూ వినియోగదారుడిని బాదేస్తూ, బాధిస్తూ ఉంటే, స్థానికంగా తామేం తక్కువ తిన్నామన్న చందంగా గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలను అతిక్రమించి మరింత భారం మోపుతున్నాయి. రవాణా చార్జీల పేరుతో వినియోగదారులందరి నుంచి రుసుము వసూలు చేస్తూ అయినకాడికి దోచుకుంటున్నాయి. నిబంధనల ఉల్లంఘన : ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ ధర రూ. 402 ఉంది. సిలెండర్‌ను ఏజెన్సీ నుంచి ఐదు కిలోమీటర్ల లోపు వినియోగదారులకు అందజేస్తే ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అయితే గ్యాస్ ఏజెన్సీలు వీటిని ఖాతరు చేయడం లేదు. ఐదు కిలోమీటర్లకు లోబడి నివసిస్తున్న వారికి గ్యాస్ సరఫరా చేసినా ధరకు అదనంగా రూ. 22 వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి లెక్కిస్తే నర్సీపట్నంలో ఉన్న సుమారు 20 వేల మంది వినియోగదారుల నుంచి ప్రతి నెలా రూ. 4.5 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి నుంచి మరింత ఎక్కువ వసూలు చేస్తూ అదనపు బారం మోపుతున్నారు. కొత్త కనెక్షన్ కష్టాలు : వినియోగదారులెవరైనా కొత్తగా కనెక్షన్ తీసుకుంటే ఏజెన్సీ నిర్వాహకుల పంట పండినట్టే. తాము చెప్పే కంపెనీకి చెందిన స్టవ్‌ను, ఇతర సామగ్రిని కొంటేనే కనెక్షన్ ఇస్తామని షరతులు పెడుతున్నారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా నిర్వాహకులు విధించిన షరతులకు లోబడి వస్తువులు కొనుగోలు చేసి కనెక్షన్ పొందాల్సి వస్తోంది. వినియోగదారుల సమస్యలను ఏజెన్సీలు పట్టించుకోకపోవడంతో ప్రజలు నిత్యం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇలా వ్యవహరిస్తున్న ఓ గ్యాస్ ఏజెన్సీపై వినియోగదారుల సంఘం కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఇటీవల పెట్రోలియం సంస్థకు ఈ-మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు కూడా. మరి అధికారులు ఏ రీతిన స్పందించి సమస్యలు పరిష్కరిస్తారో చూడాలి. -
ఇదేం వసూలు..?
సాక్షి,సిటీబ్యూరో: ఇప్పటికే సర్వీసు చార్జీలు, అదనపు చార్జీల పేరుతో సగటు వినియోగదారుడి జేబు గుల్లచేస్తున్న సెంట్రల్ డిస్కం అధికారులు వినాయకులనూ వదలడం లేదు. విద్యుత్ కనెక్షన్, వినియోగించేలోడ్తో సంబంధం లేకుండా గణేష్ మండపాలన్నింటికీ ఒకే తరహా చార్జీలను వర్తింపజేస్తున్నారు. కనెక్షన్ల పేరుతో భక్తులను భారీగా దోచుకుంటున్నారు. మరో రెండురోజుల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అనేకమంది మండపాల నిర్వాహకులు విద్యుత్తు కనెక్షన్ కోసం అధికారులకు దరఖాస్తు చేశారు. నిబంధనల ప్రకారం 500 వాట్స్కు రూ.500, ఒక కిలోవాట్స్‌కు రూ.1750, ఆపై ప్రతి అదనపు కిలోవాట్‌కు ఒక్కో ధర నిర్ణయించారు. కానీ మండప అవసరాలతో సంబంధం లేకుండా, చిన్నవి పెద్దవని లేకుండా..నిర్వహకులందరినీ ఒకే గాడిన కట్టి, వారి నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు. బిల్లు చెల్లించినా..కనెక్షన్ ఇవ్వరు : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ పరిధిలో అధికారికంగా ఏటా ఎనిమిది నుంచి తొమ్మిదివేల విగ్రహాలను ప్రతిష్టిస్తుండగా, అనధికారికంగా వీటి సంఖ్య 25వేలకుపైనే ఉంటున్నట్లు సమాచారం. అపార్ట్మెంట్లు, కమ్యూనిటీహాళ్లు, కాలనీల్లో మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరిలో చాలామంది నిర్వాహకులు రెండు లైట్లు, ఒక మైకు మినహా విద్యుత్‌ను ఖర్చుచేసే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం లేదు కానీ, అది ఇదీ అనే తేడా లేకుండా అందరి నుంచి ఒకే తరహాచార్జీలు వసూలు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడిగినంత బిల్లు చెల్లించినా సిబ్బంది కనెక్షన్ ఇవ్వడం లేదు. దీంతో పోల్ నుంచి నిర్వహకులే నేరుగా కనెక్షన్ తీసుకుంటున్నారు. విద్యుత్ లైన్స్, సరఫరా వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు లేకపోలేదు. చిన్న మండపానికి రూ.1750 చెల్లించాలా..? మండపాలకు ప్రభుత్వమే ఉచిత కరెంటు ఇవ్వాలని గతంలోనే విన్నవించాం. అయినా ఇప్పటివరకు పట్టించుకోలేదు. చిన్న మండపాలకు కూడా రూ.1750 మొత్తాన్ని ఎలా వసూలు చేస్తారు. ఇప్పటికైనా దోపిడీ ఆపి వెంటనే ఉచిత విద్యుత్తు ఇవ్వాలి. -కె.గోవర్దన్‌రెడ్డి, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సరూర్‌నగర్ మండల శాఖాధ్యక్షుడు