హైదరాబాద్ : పత్యేక సందర్భాల్లో స్పెషల్ సర్వీసులు తిప్పినప్పుడు స్టేజి క్యారియర్లుగా తిరిగే బస్సులకు ఒకటిన్నర రెట్లు ఛార్జీలు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వారాంతంలో, వారంలో ఏ రోజైనా, పండుగల వేళ, జాతర్లకు ప్రయాణీకుల డిమాండ్ మేరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని, మోటారు వాహన చట్టం 67(1) ప్రకారం ఈ అవకాశం కల్పించి చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు ఉత్తర్వులిచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం స్టేజి క్యారియర్లుగా ఆర్టీసీ బస్సులకు మాత్రమే అధికారికంగా అనుమతి ఉంది. అయితే ప్రైవేటు బస్సులు కూడా స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్నా.. రవాణా శాఖ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో ప్రైవేటు బస్సులు పండుగ సీజన్‌లో ఛార్జీల మోత మోగించనున్నాయి.
స్పెషల్ బస్సుల్లో అదనపు వసూళ్లకు అనుమతి
Published Sat, Dec 26 2015 7:49 PM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM
Advertisement