Special Services
-
ఏపీలో దసరాకు 6,100 స్పెషల్ బస్సులు
విజయవాడ, సాక్షి: దసరాకు APSRTC ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అక్టోబర్ 4 నుంచి 20వ తేదీ మధ్య 6,100 సర్వీసులు నడపనుంది. సాధారణ ఛార్జీలతోనే దసరా స్పెషల్ బస్సులు నడపనున్నట్లు.. అలాగే ముందస్తుగా రాను,పోను రిజర్వేషన్లు చేసుకున్న వారికి 10 శాతం రాయితీ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. -
తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు
అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన 'మిచాంగ్ తుఫాన్' (Michaung Cyclone) ప్రజలను మాత్రమే కాకుండా.. వాహనాలను కూడా ప్రభావితం చేసింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనాల్లో అనేక సమస్యలు తలెత్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి వాహన తయారీ సంస్థలు కొన్ని ప్రత్యేక సర్వీసులను అందించడానికి ముందుకు వచ్చాయి. ఏ కంపెనీలు స్పెషల్ సర్వీసులను అందించనున్నాయి, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ వాహన తయారీ దిగటం టాటా మోటార్స్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా నష్టపోయిన తన వినియోగదారులకు సంఘీభావంగా తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ వాహనాల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి స్టాండర్డ్ వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ టైమ్ పొడిగించడమనే కాకుండా.. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఫ్రీ సర్వీస్ వంటి వాటిని కూడా పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2023 డిసెంబర్ 1 నుంచి 15 లోపు ముగిసే ఒప్పందాలను కూడా డిసెంబర్ 31 వరకు పెంచారు. ఎమర్జెన్సీ రోడ్ అసిస్టెన్స్ టీమ్ ఏర్పాటు చేసి.. 24 X 7 హెల్ప్‌డెస్క్ ప్రారంభించింది. తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అవసరమైన సర్వీస్ అందించడానికి ఫ్రీ టోయింగ్ సహాయాన్ని కూడా అందిస్తోంది. టయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar) మిచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లో తమ కస్టమర్లకు ప్రత్యేక సహాయక చర్యలను అందించడానికి డీలర్ భాగస్వాములతో కలిసి ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కస్టమర్లకు తక్షణ సహాయం అందించడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. కస్టమర్ల వెహికల్ పికప్ అండ్ డ్రాప్ సేవలను వారి ఇంటి వద్దకే పరిమితం చేసి మరింత సులభతరం చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మహీంద్రా కంపెనీ కూడా తన కస్టమర్లకు కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, నో-కాస్ట్ ఇన్స్పెక్షన్, డ్యామేజ్ అసెస్మెంట్, ప్రత్యేక తగ్గింపుల ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. ఈ సర్వీసులన్నీ కూడా డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా? మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కంపెనీలు మాత్రమే కాకుండా హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకి ఇండియా, ఆడి, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా తమ కస్టమర్లకు సర్వీసులను అందించడానికి తగిన ఏర్పాట్లను చేశాయి. వినియోగదారులు కూడా ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. -
దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్ సర్వీసులు
సాక్షి, విజయవాడ: పండగపూట ప్రయాణాలు చేసేవారికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈసారి విజయదశమి(దసరా) 5,500 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 26వ దాకా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అంతేకాదు.. సాధారణ ఛార్జీలతోనే ఈ సర్వీసులను నడిపించనున్నట్లు స్పష్టం చేసింది APSRTC. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున కర్ణాటక ప్రజలు జరుపుకునే పండుగ దసరా. ప్రత్యేకించి విజయవాడ దుర్గమ్మ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. పండుగ నేపథ్యం.. సెలవుల్లో ప్రయాణాల దృష్ట్యా ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసుల్ని నడిపించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణ.. ప్రత్యేకించి హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, చెన్నై లాంటి అంతరాష్ట్ర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా APSRTC ఏర్పాట్లు చేస్తోంది. అలాగే విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకు బస్సుల్ని నడిపించనున్నట్లు తెలిపింది. ఎప్పుడు.. ఎక్కడి నుంచంటే.. 13 నుంచి 22 దాకా.. దసరా ముందు రోజులలో 2,700బస్సుల్ని, అలాగే.. పండుగ దినాలైన 23వ తేదీ నుంచి 26 దాకా(పండుగ ముగిశాక కూడా) 2,800 బస్సుల్ని నడిపించనుంది. హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు,చెన్నై నుండి 153 బస్సులువివిధపట్టణాలకు నడపబడతాయి.విశాఖపట్నం నుండి 480బస్సులు,రాజమండ్రి నుండి 355బస్సులు, విజయవాడ నుండి 885బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోనిఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపింది. ఆన్లైన్ పేమెంట్స్.. చిల్లర సమస్యలకు చెక్ అంతేకాకుండా ఆన్లైన్ పేమెంట్స్‌తో ప్రయాణికులు ఏ బాధా లేకుండా ప్రయాణించొచ్చని.. తద్వారా ఆర్టీసీకి చిల్లర సమస్యలు ఉండబోవని ఏపీఎస్సార్టీసీ చెబుతోంది. ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే కోడ్ స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలు కల్పిస్తోంది. రిజర్వేషన్లకు కూడా అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు.. అడ్వాన్స్ రిజర్వేషన్‌తో ఛార్జిలో 10% రాయితీ సౌకర్యము ఉంటుందని తెలిపింది. బస్సుల ట్రాకింగ్ మరియు 24/7 సమాచారం.. సమస్యలకై కాల్ సెంటర్ నెంబర్ 149 & 08662570005 అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే తమ ధ్యేయమంటూ.. ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. -
సంక్రాంతికి ఆర్టీసీ చార్జీల బాదుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ పండగ బాదుడుకు సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ నడిపే ప్రత్యేక సర్వీసులకు టికెట్ ధరపై 50% అదనపు మొత్తాన్ని వసూలు చేయాలని అధికారులు ఆదివారం నిర్ణయించారు. దూరప్రాంతాలకు తిరిగే అన్ని ప్రత్యేక బస్సుల్లో ఈ అదనపు రేట్లు అమల్లో ఉంటాయి. రాష్ట్రం పరిధిలో..తక్కువ దూరంలోని ప్రాంతాల మధ్య తిరిగే ప్రత్యేక బస్సుల విషయంలో మాత్రం స్థానిక అధికారులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించారు. వీటిల్లో కూడా చాలా ప్రాంతాల్లో 50% అదనపు మొత్తం వసూలుకే స్థానిక అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవలే బస్సు చార్జీలు పెరిగిన నేపథ్యంలో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకుంటే మాత్రం... 50% అదనపు రుసుము కాకుండా, సాధారణ టికెట్ ధర కంటే కొంత మొత్తం పెంచి దాన్ని సమీప పెద్ద సంఖ్యకు రౌండాఫ్ చేసి వసూలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికి 4,779 అదనపు సర్వీసులు తిప్పాలని అధికారులు ప్రణా ళిక సిద్ధం చేశారు. 10వ తేదీ నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఒకేసారి ఇన్ని సర్వీసులు రోడ్డెక్కుతున్నందున బస్టాండ్లు, ఇతర పాయింట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. -
వేసవి చోరీల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు
అనకాపల్లి టౌన్: వేసవిలో జరిగే దొంగతనాలకు అడ్డు కట్టవేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అడిషినల్ క్రైం ఎస్పీఎన్.జె.రాజ్‌కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో తీర్థయాత్రలకు వెళ్లే కుటుంబాలు దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేస్తే ఒక రోజు ముందుగా వారికి గృహాలకు ఉచితంగా లాక్డ్ హౌసింగ్ మానిటర్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.గృహాలకు తాళాలు వేసి మేడపై నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనకాపల్లి పట్టణ పరిధిలో రాత్రి వేళ గస్తీకి ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నర్సీపట్నం, చోడవరం, యలమంచిలి, పాయకరావుపేట, బుచ్చియ్యపేట మండలాల్లో ప్రత్యేకంగా రెండు బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూరల్ ప్రాంతంలో రెండు బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన చోరీ కేసులో ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా ఆరు నిమిషాల్లో దొంగను పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై కరపత్రాలు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రధాన రహదారులు, బ్యాంక్‌లు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమోరాల ద్వారా నిఘా కట్టుదిట్టం చేసినట్టు చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాలు తగ్గించేందకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో క్రైం డీఎస్పీ అలియాస్ సాగర్, డీఎస్పీ కె.వెంకటరమణ, పట్టణ సీఐ మురళీరావు, రూరల్ సీఐ రామచంద్రరావు, ఎస్ఐలు వి.శ్రీనివా సరావు, అల్లు వెం కటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గూగూడు బ్రహ్సోత్సవాలకు ప్రత్యేక బస్సులు
అనంతపురం న్యూసిటీ : గూగూడు బ్రహోత్సవాలకు ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భట్టు చిట్టిబాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే ఉత్సవాలకు అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం నుంచి 260 బస్సులు తిప్పుతామన్నారు. ఈ నెల 10న చిన్న సరిగెత్తు సందర్భంగా అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నామన్నారు. 11వ తేదీ 42 సర్వీసులు, 12న 90 సర్వీసులు, 13న 90 సర్వీసులు వివిధ ప్రాంతాల నుంచి గూగూడు నడుపుతున్నామన్నారు. గూగూడులోనే ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామనీ, అక్కడ డివిజినల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు డీఎంలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తారన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం గూగూడు దేవస్థానం పరిసర ప్రాంతంలో టెంట్లు వేస్తామన్నారు. అనంతపురం నుంచి గూగూడుకు రూ. 47, తాడిపత్రి నుంచి గూగూడుకు రూ.66, ధర్మవరం నుంచి గూగుడుకు రూ.66 టికెట్ ధర ఉంటుందన్నారు. -
‘హనుమాన్ దర్శన్’కు ప్రత్యేక బస్సు సర్వీసులు
హిందూపురం అర్బన్ : శ్రావణమాసం శనివారాలను పురస్కరించుకుని హనుమన్ దర్శన్ స్పెషల్ బస్సులను హిందూపురం డిపో నుంచి ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ గోపినాథ్ తెలిపారు. ఈ మేరకు ఉదయం హనుమాన్ దర్శన్ స్పెషల్ బస్సు నడిపించారు. వ్యాసరాయ మహర్షి ఒకే నక్షత్రంలో మూడు క్షేత్రాల్లోని మూలవిరాట్ ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించారని ప్రతీతి. శ్రావణ శనివారాల్లో మూడు ఆలయాలను దర్శిస్తే శుభం కలుగుతుందని భక్తులు నమ్మకం. -
కంట్రోల్ రూమ్‌కు అదనపు సిబ్బంది
విజయవాడ : విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్‌ను అంచెలంచెలుగా బలోపేతం చేస్తున్నారు. పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ పోలీస్ వ్యవస్థను పరోక్షంగా నడుపుతున్న కంట్రోల్ రూమ్ బలోపేతంపై నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తాజాగా దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. తద్వారా మరికొన్ని ప్రత్యేక సేవలు అందించాలని భావిస్తున్నారు. అదనంగా 53 మంది కేటాయింపు కమిషనరేట్ బలోపేతంలో భాగంగా కొత్త వింగ్‌లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి కోసం 471 మంది సిబ్బందిని కేటాయించారు. వారితో పాటు మరో 378 మంది కానిస్టేబుళ్లను డిప్యుటేషన్‌పై తీసుకురానున్నారు. వారిలో 53 మంది కానిస్టేబుళ్లను కంట్రోల్ రూమ్‌కు కేటాయించనున్నారు. మాస్టర్ కంట్రోల్ రూమ్‌గా సేవలు విజయవాడ నగరంలో ల్యాండ్ మార్క్‌గా నిలిచే పోలీస్ కంట్రోల్ రూమ్ కమిషనరేట్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మారింది. కమిషనరేట్‌లో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం వస్తుంది. ఆ వెంటనే సిబ్బంది దానిని ఏసీపీ స్థాయి అధికారి నుంచి కమిషనర్ వరకు చేరవేస్తారు. దీంతో పాటు సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇచ్చి గంట తర్వాత అప్డేట్ సమాచారం కూడా తీసుకుంటారు. వీటితోపాటు ఇతర సేవలను కూడా కంట్రోల్ రూమ్ సిబ్బంది కొనసాగిస్తున్నారు. వాస్తవానికి కంట్రోల్ రూమ్‌ను గతేడాదే కొంత అభివృద్ధి చేసి, దానికి మరమ్మతులు నిర్వహించారు. ప్రత్యేక చాంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అదనంగా సిబ్బందిని మాత్రం నియమించలేదు. దీంతో సీఐతో కలిపి 45 మంది సిబ్బంది రోజూ మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. కంట్రోల్ రూమ్ కార్యకలాపాల్ని సీఐ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుండగా నలుగురు ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లు 24 గంటలూ షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నగరంలో బ్లూకోట్స్ వాహనాల సంచారం, రక్షక్ వాహనాల కదలికలను మానిటరింగ్ చేసి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సూచనలు కంట్రోల్ రూమ్ ద్వారా చేస్తుంటారు. నైట్ రౌండ్స్, పెట్రోలింగ్, వివిధ సందర్భాల్లో స్టేషన్లను అప్రమత్తం చేయటం తదితర పనులు కంట్రోల్ రూమ్ ద్వారా జరుగుతున్నాయి. ఫిర్యాదుల వెల్లువ రెగ్యులర్ విధులతో పాటు కంట్రోల్ రూమ్‌లోనే డయల్ 100ను మానిటరింగ్ చేస్తారు. నెలకు సగటున 3500కు పైగా వివిధ రకాల ఫిర్యాదులు అందుతున్నాయి. కమిషనరేట్ పోలీసులు నిర్వహిస్తున్న ఫోర్త్ లయన్ యాప్ ద్వారా నెలకు 150 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని పూర్తిగా కంట్రోల్ రూమ్ పోలీసులే పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలో పని భారం పెరగటంతో పోలీసులు కొంత ఇబ్బంది పడుతున్నారు. దీంతో అదనంగా 53 మంది సిబ్బందిని కేటాయించి సీఐతో పాటు ఒక ఏసీపీ స్థాయి అధికారి పూర్తిగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
స్పెషల్ బస్సుల్లో అదనపు వసూళ్లకు అనుమతి
హైదరాబాద్ : పత్యేక సందర్భాల్లో స్పెషల్ సర్వీసులు తిప్పినప్పుడు స్టేజి క్యారియర్లుగా తిరిగే బస్సులకు ఒకటిన్నర రెట్లు ఛార్జీలు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వారాంతంలో, వారంలో ఏ రోజైనా, పండుగల వేళ, జాతర్లకు ప్రయాణీకుల డిమాండ్ మేరకు అదనంగా వసూలు చేసుకోవచ్చని, మోటారు వాహన చట్టం 67(1) ప్రకారం ఈ అవకాశం కల్పించి చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టేజి క్యారియర్లుగా ఆర్టీసీ బస్సులకు మాత్రమే అధికారికంగా అనుమతి ఉంది. అయితే ప్రైవేటు బస్సులు కూడా స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్నా.. రవాణా శాఖ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఒకటిన్నర రెట్లు అదనంగా ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో ప్రైవేటు బస్సులు పండుగ సీజన్లో ఛార్జీల మోత మోగించనున్నాయి. -
పల్లె కళ కళ
పల్లెలకు తరలిన నగర వాసులు రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు పయనం భోగి మంటలు, పతంగులతో గ్రామాల్లో సంబరాలు బోసిపోయిన విశాఖ వీధులు, కార్యాలయాలు ఏ పల్లె చూసినా ఇప్పుడు కళకళలాడుతోంది. ఎప్పుడూ నిండుగా ఉండే విశాఖ వెలవెలబోతోంది. నగరంలోని సగానికి పైగా ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. పెద్ద పండగ సంక్రాంతికి వారంతా పల్లె బాట పట్టడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పలచగా కనిపించే గ్రామాలు నిండుగా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే నగరం నిర్మానుష్యంగా మారింది. విశాఖపట్నం: ఉరుకులు పరుగుల నగరాలు పల్లెబాట పట్టాయి. పట్టణాల్లో గజిబిజిగా.. బిజీ బిజీగా గడిపే జనంతో గ్రామాలు నిండిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు చేరారు. ఇప్పుడవన్నీ సందడిని సంతరించుకున్నాయి. పల్లెల్లో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. బంధువులతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం కూడా మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో అధికారులు సైతం సొంత ఊళ్లకు వెళ్లారు. ఆర్టీసీ 600 రెగ్యులర్, ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రైళ్లకు ఆ శాఖ అదనపు బోగీలు ఏర్పాటు చేసింది. బస్సుల్లో సుమారు 4లక్షల మంది, రైళ్లల్లో సుమారు 3 లక్షల మంది ప్రయాణీకులు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లినట్లు అంచనా. దీంతో ఇటు నగరం, అటు ప్రభుత్వ, ప్రై వేట్ కార్యాలయాలు బోసిపోయాయి. సంక్రాంతి ఎవరికి వారు తమ స్వగ్రామల్లో జరుపుకోవాలనుకుంటుంటారు. బంధు మిత్రులతో, పిండి వంటలతో అత్యంత శోభాయమానంగా ఉండే పల్లె లోగిళ్లలో సంబరాలు చేసుకోవాలనుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే బస్సులు, రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతుంటాయి. నగర జీవులు పండుగకు గ్రామాలకు వెళ్లకుండా ఉండలేరు. విశాఖ నగరానికి జిల్లా నలుమూల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా విద్య, ఉపాధి, ఉద్యోగ అవసరాల కోసం వస్తుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు పలు కళాశాలల్లో ఇతర ప్రాంతాల విద్యార్ధులే ఎక్కువగా ఉంటారు. వారంతా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిపోయారు. ఉపాధి కోసం కూడా విశాఖకు ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. ప్రైవేటు సంస్థలు కూడా సిబ్బందికి సెలవులు ఇవ్వడంతో వారు సొంత వారితో సంతోషాలు పంచుకోవడానికి వెళ్లారు. విశాఖలో ఈ సారి పండుగ ఆఫర్లు హోరెత్తడంతో కొత్త దుస్తులు, గృహోపకరణలు, కానుకలు కొనుగోలు చేసి తమ వారికి తీసుకుని వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ఈ సారి ప్రభుత్వం మూడు రోజు ల పాటు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. దీంతో జిల్లా కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారులు పండుగ సంబరాలకు వెళ్లిపోయారు. పండుగ ముందే ముఖ్యమంత్రి వచ్చి వెళ్లడంతో పాటు పండుగ తర్వాత మళ్లీ వస్తుండటంతో దొరికిన ఈ కొద్ది రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అధికారులు తమ తర్వాత స్థానంలో ఉన్న అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి ఊరు వెళ్లిపోయారు. ఇన్‌చార్జ్‌లు ఉన్నప్పటికీ అధికారిక సెలవులు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం నుంచి మూత పడ్డాయి. ఇక నగర వాసులు మాత్రం భోగి మంటలు,పతంగులతో సంబరాలు చేసుకుంటున్నారు. పల్లెలకు దీటుగా సంక్రాంతి జరుపుకుం టున్నారు. ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. ప్రైవే టు సంస్థలు కూడా సిబ్బందికి సెలవులు ఇవ్వడంతో వారు సొంత వారితో సంతోషాలు పంచుకోవడానికి వెళ్లారు. విశాఖలో ఈ సారి పండుగ ఆఫర్లు హోరెత్తడంతో కొత్త దుస్తులు, గృహోపకరణలు, కానుకలు కొనుగోలు చేసి తమ వారికి తీసుకుని వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రభుత్వం మూడు రోజుల పాటు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. దీం తో జిల్లా కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారు లు పండుగ సంబరాలకు వెళ్లిపోయారు. పండుగ ముందే ముఖ్యమంత్రి వచ్చి వెళ్లడంతో పాటు పండుగ తర్వాత మళ్లీ వస్తుండటంతో దొరికిన ఈ కొద్ది రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అధికారులు తమ తర్వాత స్థానంలో ఉన్న అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి ఊరు వెళ్లిపోయారు. ఇన్‌చార్జ్‌లు ఉన్నప్పటికీ అధికారిక సెలవులు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం నుంచి మూత పడ్డాయి. ఇక నగర వాసులు మాత్రం భోగి మంటలు,పతంగులతో సంబరాలు చేసుకుంటున్నారు. -
ఇది ‘ప్రగతి’ డిస్కౌంట్
సామాన్యులకు అందుబాటులో ఉండి..సురక్షిత ప్రయాణాన్ని అందించే ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా చార్జీల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రమాద బీమా కూడా అందించడం ఈ పథకాల ముఖ్య ఉద్దేశం. నిత్యం దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఆర్థికంగా కాస్త వెసులు బాటు క లుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వికలాంగులకు ప్రత్యేక సేవలున్నాయి. -అద్దంకి వనితా కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ కార్డు పొందేందుకు అర్హులు. కార్డు జెరాక్స్ కాపీ, పాస్‌పోర్టుసైజు ఫొటోలు అవసరమవుతాయి. రూ. 100 చెల్లించాలి. కార్డు పొందిన రోజు నుంచి రెండు సంవత్సరాల పాటు టికెట్ ధరలో 10 శాతం రాయితీ లభిస్తుంది. ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. లక్ష ప్రమాద బీమా లభిస్తుంది. యాద్ఆన్.. కుటుంబంలో ఉన్నవారు గరిష్టంగా నలుగురు కూడా ఈ కార్డు తీసుకోవచ్చు. ఒక్కొక్కరు రూ. 20 చొప్పున రూ. 80 చెల్లిస్తే నాలుగు వనితా కార్డులిస్తారు. వీటిని యాద్ఆన్ కార్డులంటారు. వీరంతా కలిసి ప్రయాణిస్తన్న సమయంలో ప్రతి టికెట్లో పది శాతం రాయితీ లభిస్తుంది. కార్డు పొందే సమయంలో కుటుంబ సభ్యులంతా పాస్ పోర్టు ఫొటో ఇవ్వాల్సి ఉంటుంది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాయితీ పొందవచ్చు. నవ్యా క్యాట్ కార్డు ఈ కార్డు తీసుకున్నవారికి ఏడాదిపాటు ప్రయాణంలో పది శాతం రాయితీ ఇస్తారు. అయితే దీనికి రూ. 250 చెల్లించాలి. ఏసీ బస్సులు మినహా అన్ని రకాల బస్సుల్లో ఈ కార్డుపై రాయితీ లభిస్తుంది. నలుగురు కుటుంబ సభ్యులు తీసుకోవాలంటే ఒక్కొక్కరు రూ. 100 చెల్లిస్తే కార్డు మంజూరు చేస్తారు. పది శాతం రాయితీ లభిస్తుంది. ప్రమాద వశాత్తు మరణిస్తే రూ. 1.70 లక్షల ప్రమాద బీమా పొందవచ్చు. ఏడాది తర్వాత రూ. 150 చెల్లిస్తే రెన్యువల్ అవుతుంది. రెన్యువల్ అనంతరం ప్రమాదంలో మరణిస్తే రూ. 2 లక్షల బీమా సౌకర్యం ఉంటుంది. బీహారీ కార్డు ఇది టూర్ ప్యాకేజీగా చెప్పవచ్చు. ఏసీ బస్సు మినహా రాష్ర్టంలోని ఏ ప్రాంతానికైనా అన్ని రకాల బస్సుల్లో ఏడు రోజుల ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. టికెట్‌పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ పొందేందుకు అర్హత ఉంటుంది. వికలాంగుల కోసం వైకల్యంతో ఉన్నవారికి ప్రత్యేక కార్డు లభిస్తుంది. ప్రయాణ ధరలో ఏడాది కాలం పాటు యాభై శాతం రాయితీ పొందవచ్చు. ఇది పొందేందుకు రూ. 15 చెల్లిస్తే సరిపోతుంది. వికలత్వ ధ్రువీకరణ పత్రంతోపాటు, వికలత్వం కనిపించేలా ఉన్న రెండు ఫొటోలు డిపోలో అందించాల్సి ఉంటుంది. మంత్లీ సీజన్ కావాలా? నెల రోజుల ప్రయాణం కోసం 20 రోజుల చార్జీని ముందుగానే చెల్లిస్తే సీజన్ పాస్ లభిస్తుంది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. శుభకార్యాలకు బస్సులు తీసుకెళ్లవచ్చు వివాహాలకు కోసం అవసరమైన బస్సులను ఆర్టీసీ నుంచి అద్దెకు తీసుకోవచ్చు. పల్లె వెలుగు బస్సుకైతే కిలోమీటరుకు రూ. 35, ఎక్స్‌ప్రెస్ బస్సుకైతే రూ. 41, డీలక్స్ బస్సుకైతే రూ. 37, సూపర్ లగ్జరీ బస్సుకైతే రూ. 38 చార్జి వేస్తారు. 330 కిలోమీటర్లు కనీస దూరంగా లెక్కిస్తారు. అంత కన్నా తక్కువ దూరమైనా ధర చెల్లించాల్సిందే! విద్యార్థులకు ఉచిత పాస్.. విద్యాభ్యాసం చేస్తున్న 18 ఏళ్లలోపు బాలికలకు, 12 ఏళ్ల లోపు బాలురకు 35 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోంది. ఈ పాస్‌ను ప్రతి సంవత్సరం సెప్టంబర్ నెలలో ఇస్తారు. 65 శాతం రాయితీతో స్టూడెంట్స్‌కు.. గమ్యం ఆధారంగా 65 శాతం రాయితీ లభిస్తుంది. 5 కిలోమీటర్లకు 85 రూపాయలు. 10 కిలోమీటర్లకు రూ.105.. పదిహేను కి.మీకు రూ. 135.. ఇరవై కిలోమీటర్లకు రూ. 180.. ఇరవై ఐదు కి.మీలకు రూ. 205..ముప్పై కిలోమీటర్లయితే రూ. 250 చెల్లించాలి. ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒక సారి రెన్యువల్ చేసుకోవచ్చు. -
బస్సుల పరుగు!
దీపావళి ప్రత్యేక బస్సులు రోడ్డెక్కాయి. శుక్రవారం నుంచి ఆయా నగరాలు, జిల్లా కేంద్రాలకు పరుగులు తీశాయి. కోయంబేడులో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీని క్రమ బద్ధీకరించే విధంగా చర్యలు తీసుకున్నారు. * రోడ్డెక్కిన ప్రత్యేక సర్వీసులు * కోయంబేడులో పార్కింగ్ ఏర్పాట్లు సాక్షి, చెన్నై: వెలుగుల పండుగ దీపావళిని ఇంటిల్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం అవుతున్నారు. స్వగ్రామాలకు తరలి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో, సోమ, మంగళ వారాలు సెలవులు పెట్టుకున్న ఉద్యోగులు తమ స్వగ్రామాలకు బయలు దేరారు. రైళ్లు ఇప్పటికే హౌస్‌ఫుల్ కాగా, బస్సుల మీద దృష్టి పెట్టక తప్పలేదు. ఓ వైపు ఆమ్నీ బస్సులు, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు చెన్నై నుంచి దక్షిణాదిలోని జిల్లాలకు పరుగులు తీయడానికి రెడీ అయ్యాయి. ప్రభుత్వ ప్రత్యేక బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి. చర్యలు: దీపావళిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 8 వేలకు పైగా ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, కొంగు మండాలనికి, డెల్టా జిల్లాలకు 4 వేల బస్సులు పరుగులు తీసే విధంగా ఏర్పాట్లు చేశారు. కోయంబేడులోని ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించే విధంగా శుక్రవారం నుంచి బస్సులు రోడ్డెక్కించారు. తొలి రోజు 500 బస్సులు నడిచాయి. శనివారం మరో 500, ఆదివారం 700, సోమవారం 2100, మంగళవారం 1652 బస్సుల్ని నడిపేందుకు సర్వం సిద్ధం చేశారు. అలాగే, కోయంబేడు మార్కెట్ పరిసరాల్ని ప్రత్యేక బస్సులకు పార్కింగ్ స్టాండ్‌గా నిర్ణయించారు. అలాగే, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికుల కోసం టెర్మినల్ ముందు భాగంలో 21 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు : కోయంబేడు టెర్మినల్‌లో తొమ్మిది అతి పెద్ద ఫ్లాట్ ఫారాలు ఉన్నాయి. ఒక్క ఫ్లాట్ ఫాంలో 50కు పైగా బస్సుల్ని నిలబెట్టేందుకు వీలుంది. ఈ ఫ్లాట్ ఫారాలను దీపావళిని పురస్కరించుకుని విభజించారు. ఒకటి, రెండు ఫ్లాట్ ఫారాలను అన్ రిజర్వుడ్‌తో నడిచే బస్సుల కోసం సిద్ధం చేశారు. ఇక్కడ 200 కి. మీ దూరంలోపు ప్రయాణించే బస్సులు, వేలూరు, కాంచీపురం, విల్లుపురం వరకు నడిచే బస్సులు ఉంటాయని బోర్డుల్ని ఏర్పాటు చేశారు. 3, 4, 5, 6 ఫ్లాట్ ఫారాల్లో మదురై, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర దక్షిణాది జిల్లాలకు వెళ్లే బస్సులు ఉంటాయి. 7, 8, 9ఫ్లాట్ ఫారాల్ని సుదూర ప్రాంతాలకు వెళ్లే అన్‌రిజర్వుడ్ బస్సులకు కేటాయించారు. అలాగే, మహిళలు, పిల్లలతో వెళ్లే వారి కోసం ఈ ఫ్లాట్ ఫారాల వద్ద ఉన్న కౌంటర్లలో ప్రత్యేక టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ఆధారంగా బస్సుల్లో సీట్లు సులభంగా చిక్కుతాయి. -
చూసొద్దాం రండి
పరమ పవిత్రమైన కార్తీకమాసాన పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లి తరించాలని అందరూ ఆశ పడతారు. వనభోజనాలకు వెళ్లి కుంటుంబమంతా జాలీగా గడపాలనుకుంటారు. అందుకే.. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ ప్రాంతాలు, సముద్రతీరాలు, నదీపాయలు, వాగులు, వంకలు, తోటలు, అడవులు అన్నీ పర్యాటకులతో కళకళలాడుతుంటారుు. యూత్రికుల ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ కార్తీకమాసానికి వారం రోజుల ముందే పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. పంచారామాలతో పాటు పట్టిసీమ, శబరిమల యూత్రలకు ఈ బస్సులు నడుస్తారుు. గతంలో ఉన్న చార్జీల రేట్లలో ఏమాత్రం తేడా లేకుండా, ప్రయాణికుల సౌలభ్యం కోసమే ఆర్టీసీ ఈ చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సుదేష్కుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిటీఎం (సిటీ) జి.నాగేంద్రప్రసాద్, రూరల్ సీటీఎం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మరెందుకు ఆలస్యం.. ఆ వివరాలు తెలుసుకుని పుణ్యక్షేత్ర దర్శనానికి ఇప్పటి నుంచే సిద్ధమవ్వండి - విజయవాడ పంచరామాలకు స్పెషల్ సర్వీసులు అమరావతిలోని అమరారామం, భీమ వరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని దక్షారామం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరస్వామి వార్లను ఒక్కరోజులో దర్శించుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రోజూ వేకువజామున 3 నుంచి 4 గంటల సమయంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయల్దేరే ఈ బస్సులు అమరావతి నుంచి భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో దర్శనానంతరం తిరిగి రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ చేరుకుంటుంది. ఎప్పుడెప్పుడు? టికెట్ల ధర ఎంత? పంచరామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈనెల 26, 27 తేదీలు, నవంబరు 2, 3, 4, 6, 10, 16, 17,18, 20 తేదీల్లో బస్సులు నడుపుతారు. సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసులు ఏర్పాటుచేయగా, లగ్జరీలో పెద్దలకు రూ.770, చిన్నపిల్లలకు రూ.580, డీలక్స్ సర్వీసుల్లో పెద్దలకు రూ.650, పిల్లలకు రూ.490 వసూలు చేస్తారు. అసౌకర్యం కలగకుండా చర్యలు ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ఆయా దేవస్థానాల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ ఆయా ఏరియాల సిబ్బంది భక్తుల దర్శనం కోసం, వారికి తగిన సమయపాలన కోసం ప్రత్యేక విధానం ఏర్పాటు చేస్తున్నారు. ఆరోజు ఎన్ని బస్సులు వస్తున్నారుు.. ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటారు.. వంటి వివనాలను ముందురోజు రాత్రే చర్చించుకుని తగిన ఏర్పాట్లు చేస్తారు. శబరిమలకు స్పెషల్ బస్సులు కార్తీకమాసంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేసింది. విజయవాడ నుంచి శ్రీరంగం, కుర్తాళం, ఎరిమేలి మీదుగా పంబ చేరుకుంటారు. శబరిమలలోని అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయూణంలో మధురై, మేల్మరువత్తూరు మీదుగా బస్సు విజయ వాడకు చేరుతుంది. ఈ టూర్ కేవలం ఐదు రోజుల్లోనే ముగుస్తుంది. టికెట్ల వివరాలు సూపర్ లగ్జరీ బస్సుల్లో పెద్దలకు రూ.4,300, చిన్నపిల్లలకు రూ.3,200 వసూలు చేస్తారు. అద్దె ప్రాతిపదికన అయ్యప్ప భక్తులు ఆర్టీసీ బస్సును అద్దె ప్రాతి పదికన కూడా తీసుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుచేశారు. రోజుకు 420 కిలోమీటర్ల అంచనాతో సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.42, డీలక్స్‌కు రూ.41, ఎక్స్‌ప్రెస్ రూ.45గా నిర్ణయించారు. పర్మిట్ ఫీజు, టోల్‌గేటు, పార్కింగ్ చార్జీలు అదనంగా వసూలు చేస్తారు. స్వాముల కోరిక మేరకు మార్గంమధ్యలో పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. ఇద్దరు వంటమేస్త్రీలు, ఇద్దరు చిన్నపిల్లలు, ఒక అటెండర్‌కు సీట్లు లేకుండా అనుమతించే అవకాశం ఉంది. పట్టిసీమకు ప్రత్యేక బస్సులు ప్రకృతి సోయగాల మేళవింపుతో గోదావరి పరవళ్లు, పాపికొండల అందాలు తిలకించాలనుకునే ప్రయూణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కార్తీకమాసంలో ప్రతి ఆదివారం వేకువజామున 3 గంటల సమయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరి అదేరోజు రాత్రి తిరిగి విజయవాడ వస్తుంది. రాజమండ్రి నుంచి బోటు షికారు ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోటు షికారు చేసి సాయంత్రం బస్సు వద్దకు చేరుకుని తిరుగు ప్రయూణమవుతారు. టికెట్ల వివరాలు పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.400, బోటు షికారుకు పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.350. భక్తులకు ఆర్టీసీ సౌకర్యాలు అద్దె ప్రాతిపదికన, వ్యక్తిగత టికెట్లు కొన్న భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటుచేసింది. వాటి వివరాలు.... భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వీడియో కోచ్ ఉన్న కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. రైలులో శబరిమలకు వెళ్లే భక్తులు పంబకు 150 కిలోమీటర్ల దూరంలో దిగాలి. అందుకు భిన్నంగా ఆర్టీసీ పంపానది వద్దకు బస్సు నడుపుతోంది. ఆయా ప్రాంతాల అధికారులతో ఆర్టీసీ అధికారులు చర్చించి అన్ని వసతులతో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఆఫీసర్లు, సూపర్ వైజర్లు అన్నివేళలా భక్తులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తారు. హెల్ప్‌లైన్ నంబరు కూడా ఏర్పాటుచేశారు. ప్రత్యేక క్యాంపు ద్వారా ప్రయాణికులకు మరిన్ని సేవలందిస్తారు. ఆర్టీసీ రిజర్వేషన్ ఆన్లైన్లో.. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు పంచారామాలు, పట్టిసీమ, శబరిమలకు ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. టికెట్లను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. టికెట్లు ఆర్టీసీ ఆథరైజ్డ్ బుకింగ్ ఏజెంట్ల వద్ద తీసుకోవాలి. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ సెల్ నంబరు 9959225475లో సంప్రదించవచ్చు. -
ఇదో రకం ‘దారి’దోపిడీ
అమలాపురం, న్యూస్‌లైన్ :ఒకేగాడిలో.. రుచీ, పసా లేకుండా రసహీనంగా, యాంత్రికంగా సాగే జీవితాలకు కాసింత రంగూరుచీ అద్దే సందర్భాల్లో పండగలు ముఖ్యమైనవి. అందునా తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతిది మరీ పెద్దపీట. బతుకుతెరువు కోసం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా దూరమైనా, భారమైనా.. తల్లి ఒడిలాంటి తమ సొంత ఊళ్లకు విధిగా వచ్చి, మనవైన పిండివంటలతో పాటు మనవారు అనుకున్న వారి మమతలనూ మనసారా చవి చూసే పండగ ఇది. ఇదిగో.. సరిగ్గా.. ఈ రద్దీనే ఆసరాగా చేసుకుని పంట పండించుకుంటున్నాయి వాహన సంస్థలు. జనానికి జాతర ఉల్లాసం.. జేబులు కొట్టేవాడి కత్తెరకు అవకాశం’ అన్నట్టు.. టిక్కెట్టు ధరలను ఇష్టారాజ్యంగా పెంచేసి, ప్రయాణికుల జేబులకు ఇష్టానుసారం చిల్లులు పెడుతున్నాయి. ‘ఆవే చేలో మేస్తుంటే.. దూడ గట్టునుంటుందా?’ అన్నట్టు.. ఆర్టీసీయే నిలువుదోపిడీ సాగిస్తున్న వేళ.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల సంగతి వేరే చెప్పేదేముంది.. పండగ నాలుగురోజులూ పొందిన సంతోషం.. భోగిమంటలో వేసిన నెయ్యి మాదిరి కరిగిపోయేలా రిమ్మ తిరిగే రేట్లు వసూలు చేస్తున్నారు. పండగకు అయిన మొత్తం ఖర్చులో కొత్త దుస్తులు, పిండివంటలు, ఇతర సరదాలకు వెచ్చించిన దాని కన్నా బస్సు టిక్కెట్లకయ్యే వ్యయమే ఎక్కువగా ఉందని సొంత ఊళ్ల నుంచి ఉద్యోగాలు చేసే చోట్లకు తిరుగు ముఖం పట్టిన ప్రయాణికులు వాపోతున్నారు. ప్రత్యేక రైళ్లు వేసినా తగ్గని రద్దీ సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు కనుమ పండగ ముగియడంతో గురువారం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు వేసినా ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. రైళ్లలో రిజర్వేషన్ దొరక ని వారు, తమ ప్రాంతాలకు రైళ్ల సదుపాయం లేని వారు బస్సులపైనే ఆధారపడ్డారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం అంటూ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న ఆర్టీసీ సాధారణ టిక్కెట్ ధరకన్నా 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. జిల్లాలోని వివిధ డిపోల నుంచి హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు సుమారు 160 వరకు అదనపు బస్సులు తిప్పుతున్నారు. వీటిలో ఎక్కువ రాజధాని హైదరాబాద్‌కే నడుపుతున్నారు. రాజమండ్రి నుంచి 42 బస్సు సర్వీసులుండగా, అదనంగా 35 సర్వీసులు నడుపుతున్నారు. అమలాపురం నుంచి 10 రెగ్యులర్ బస్సులు ఉండగా, అదనంగా 14, కాకినాడ నుంచి 10 రెగ్యులర్ బస్సులుండగా, అదనంగా మరో ఐదు నడుపుతున్నారు. బస్సు నిర్వాహకులు కాదు.. ‘బకాసురులు’ ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టీసీయే పండగ రద్దీని అడ్డం పెట్టుకుని ఆబగా లాభాలవేటలో పడినప్పుడు.. తాము అంతకన్నా బకాసురులమే అని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు నిరూపిస్తున్నారు. టిక్కెట్లను బ్లాక్ చేసి మరీ అమ్మకాలు సాగిస్తున్నారు. సాధారణంగా అమలాపురం నుంచి హైదరాబాద్ టిక్కెట్ ధర రూ.540 కాగా, గురువారం నుంచి శనివారం వరకు రూ.880 చొప్పున టిక్కెట్ ధరగా నిర్ణయించారు. ఆదివారం అయితే ఇప్పటికే రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. చాలా ట్రావెల్స్ యజమానులు ‘ఆదివారం నాటి సర్వీసులకు టిక్కెట్లు అయిపోయాయి’ అంటూ అమ్మకాలు నిలిపివేశారు. వాస్తవానికి టిక్కెట్లు ఉన్నా ఆదివారం ఉదయం గిరాకీని బట్టి రూ.1,500 వరకు అమ్ముకునేందుకే ఈ ఎత్తుగడ. కాగా పాలెం బస్సు దుర్ఘటన తరువాత రవాణా శాఖ దాడుల నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యజమానులు ఎక్కువ సర్వీసులను నడిపేందుకు వెనుకడుగు వేయడంతో వల్ల బస్సుల సంఖ్య తగ్గి టిక్కెట్ ధరలు పెరిగాయని ట్రావెల్స్ యజమానులు సమర్థించుకుంటున్నారు. ఇంటిల్లిపాదీ ఇంటికి తాళం వేసుకుని ఊరెళితే.. అదే అదనుగా దొంగలు ఏ రాత్రో కొంప కొల్లగొడతారని, పిల్లాపాపలతో పండగకు వచ్చిన పాపానికి అటు ఆర్టీసీ, ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు పట్టపగలే నిలువుదోపిడీ చేస్తున్నాయని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. వారి గోడు ఆలకించి, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసే పూనిక ప్రభుత్వ యంత్రాంగంలో కలికానికి కూడా కానరావడం లేదు. ఎక్కడ నుంచి.. రెగ్యులర్ బస్సు చార్జి ప్రత్యేక బస్సుచార్జి (హైదరాబాద్‌కు రూ.లలో) (హైదరాబాద్‌కు రూ.లలో) అమలాపురం 494.00 741.00 రాజమండ్రి 474.00 711.00 కాకినాడ 508.00 762.00