అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన 'మిచాంగ్ తుఫాన్' (Michaung Cyclone) ప్రజలను మాత్రమే కాకుండా.. వాహనాలను కూడా ప్రభావితం చేసింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనాల్లో అనేక సమస్యలు తలెత్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి వాహన తయారీ సంస్థలు కొన్ని ప్రత్యేక సర్వీసులను అందించడానికి ముందుకు వచ్చాయి. ఏ కంపెనీలు స్పెషల్ సర్వీసులను అందించనున్నాయి, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా మోటార్స్ (Tata Motors)
దేశీయ వాహన తయారీ దిగటం టాటా మోటార్స్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా నష్టపోయిన తన వినియోగదారులకు సంఘీభావంగా తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ వాహనాల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి స్టాండర్డ్ వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ టైమ్ పొడిగించడమనే కాకుండా.. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఫ్రీ సర్వీస్ వంటి వాటిని కూడా పొడిగిస్తున్నట్లు తెలిపింది.
2023 డిసెంబర్ 1 నుంచి 15 లోపు ముగిసే ఒప్పందాలను కూడా డిసెంబర్ 31 వరకు పెంచారు. ఎమర్జెన్సీ రోడ్ అసిస్టెన్స్ టీమ్ ఏర్పాటు చేసి.. 24 X 7 హెల్ప్‌డెస్క్ ప్రారంభించింది. తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అవసరమైన సర్వీస్ అందించడానికి ఫ్రీ టోయింగ్ సహాయాన్ని కూడా అందిస్తోంది.
టయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar)
మిచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లో తమ కస్టమర్లకు ప్రత్యేక సహాయక చర్యలను అందించడానికి డీలర్ భాగస్వాములతో కలిసి ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్‌లను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కస్టమర్‌లకు తక్షణ సహాయం అందించడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. కస్టమర్ల వెహికల్ పికప్ అండ్ డ్రాప్ సేవలను వారి ఇంటి వద్దకే పరిమితం చేసి మరింత సులభతరం చేసింది.
మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra)
మహీంద్రా కంపెనీ కూడా తన కస్టమర్లకు కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, నో-కాస్ట్ ఇన్‌స్పెక్షన్, డ్యామేజ్ అసెస్‌మెంట్, ప్రత్యేక తగ్గింపుల ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. ఈ సర్వీసులన్నీ కూడా డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి.
ఇదీ చదవండి: షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా?
మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కంపెనీలు మాత్రమే కాకుండా హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకి ఇండియా, ఆడి, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా తమ కస్టమర్లకు సర్వీసులను అందించడానికి తగిన ఏర్పాట్లను చేశాయి. వినియోగదారులు కూడా ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment