michaung cyclone
-
హీరో విజయ్ మంచి మనసు..800 కుటుంబాలకు సాయం
డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నై ప్రజలు అల్లాడిపోయారు. తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ సమయంలో వారి జీవనం అస్తవ్యస్తంగా మారింది. తుపాను వల్ల చెన్నై నగరంలో చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిపోయి చెరువులను తలపించాయి. సాధారణ ప్రజలు ఆహారానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హీరో విజయ్ తన ఎక్స్ పేజీలో మాట్లాడుతూ.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతూ సోషల్ మీడియాలో అభిమానులను కోరారు. చేయి చేయి కలుపుదాం, దుఃఖాన్ని దూరం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అప్పట్లో వర్షాల వల్ల ఇబ్బందులు పడిని వారిని గుర్తించి.. వారికి కనీస అవసరాలు అయిన దుస్తులు, ఆహారం వంటి వాటిని తన ఫ్యాన్స్ ద్వారా విజయ్ అందించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు హీరో విజయ్ తాజాగా మళ్లీ సాయం అందించారు. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలలో ఎక్కువగా నష్టపోయిన కుటుంబాలను గుర్తించి ఆయన సాయం అందించారు. వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన సుమారు 800 కుటుంబాలకు ఆయన తాజాగా సాయం చేశారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడిన ప్రజలను చూసి ఆయన చలించిపోయారు. బాధితులకు తన అభిమానుల సంఘం (విజయ్ మక్కల్ ఇయక్కం) ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు. ఆపై ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 50 వేల వరకు డబ్బు అందించారు. ఆ సమయంలో ఆయనతో ఫోటోలు దిగేందకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.. అడిగిన వారందరికీ ఆయన సెల్ఫీలు ఇచ్చి వారిలో సంతోషం నింపారు. గతంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆయన సాయం చేశారు. ఈ ఏడాదిలో పది, ఇంటర్లో ఎక్కువ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు డబ్బు సాయం చేశారు. ఇలా సాయం చేయడంలో ఎప్పుడూ ఆయన ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. The way he smiles, it’s just so chilling and adorable❤️#NellaiWelcomesTHALAPATHY #ThalapathyVijay pic.twitter.com/3SJJVxVBID — Antony (@Antonytweets1) December 30, 2023 This is the best video for me, the innocent lady fails to recognize @actorvijay, and Vijay, ever humble, verbally reassures her, confirming his identity with a kind gesture. ❤️ #VijayMakkalIyakkam#ThalapathyVijaypic.twitter.com/iSTjluJ1SJ — My conscience/என் மனசாட்சி (@machanae1) December 30, 2023 His respect towards fans ❤❤❤#ThalapathyVijay pic.twitter.com/saxG6oAD9W — Vaathi T V A (@mangathadaww) December 30, 2023 His respect towards fans ❤❤❤#ThalapathyVijay pic.twitter.com/saxG6oAD9W — Vaathi T V A (@mangathadaww) December 30, 2023 -
సీఎం జగన్‌తో కేంద్ర బృందం భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తుపాను నష్టం, కరువు అంచనాలపై ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీపై తీవ్ర ప్రభావం చూపిన మిచౌంగ్ తుపాను, కరువు పరిస్థితులపై రెండు అధికారుల బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర బృందం చర్చించింది. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం.. తాము చూసిన పరిస్థితులను సీఎం జగన్‌కు వివరించారు. ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ఈ సందర్భంగా కేంద్రం బృందం పేర్కొంది. విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు మెరుగ్గా ఉన్నాయని సదరు బృందం తెలిపింది. ఏపీలో అమలవుతున్న ఈ- క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని తెలిపిన కేంద్ర బృందం.. ఇవి ఇతర రాష్ట్రాల్లో అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు తెలియజేస్తామని పేర్కొంది. మిచౌంగ్ తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించింది. తాము పరిశీలించిన అంశాలను సీఎం జగన్‌కు వివరించిన కేంద్ర బృందం అధికారులు అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై మొత్తంగా ఏడు జిల్లాల్లో తిరిగామని వెల్లడి. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశామన్న కేంద్ర బృందం. అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామన్న సభ్యులు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామlr, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామన్న కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువులు, తాగునీరు తదితర అంశాలపై చర్చ. జలవనరులు పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూశామని వెల్లడి. అలాగే ఉపాధిహామీ పథకంపైనా పరిశీలన చేశామన్న కేంద్ర బృందం. ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, డీబీటీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ, కంటిజెన్సీ కింద విత్తనాలు పంపిణీ, అమూల్ పాలవెల్లువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ఇవన్నీకూడా తాము స్వయంగా చూశామని, ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని వెల్లడి. కౌలు రైతులకు కూడా ఎక్కడా లేని విధంగా రైతు భరోసా అందించడం అభినందనీయంగా పేర్కొన్న కేంద్ర బృందం. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని కేంద్ర బృందం సూచన. పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటలవైపు మళ్లేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచన. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించిన అధికారులు. ఉపాధిహామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైనా కేంద్ర బృందానికి వివరాలు తెలిపిన రాష్ట్రాధికారులు. పెండింగులో ఉన్న ఉపాధిహామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. తుపాను కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని కోరిన అధికారులు. తుపాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను వివరించిన సీఎం జగన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించమే కాకుండా వారికి తక్షణ సహాయాలను కూడా అందించామని తెలిపిన సీఎం తుపాను ఏదో ఒక ఒక ప్రాంతంలో సహజంగా తీరం దాటుతుందని, కాని ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైందన్న సీఎం దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించిన సీఎం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోందని తెలిపిన అధికారులు తమ రాష్ట్రంలో ఈ- క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతామన్న సీఎం ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తున్నామన్న సీఎం రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయన్న సీఎం దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా రైతులకు చేరుతుందన్న సీఎం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆమేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని కోరిన సీఎం -
నిబంధనలు సడలించి న్యాయం చేస్తాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మిచౌంగ్ తుపాను కారణంగా ఏపీలో దెబ్బతిన్న పంటలపై, రంగుమారిన వరి ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అలాగే ప్రభుత్వం అన్నిరకాలుగా ఆదుకుంటుందన్న భరోసా వాళ్లకు కల్పించాలని ఈ సందర్భంగా ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం జగన్ అన్నారు. అవసరమైతే కొన్ని నిబంధనలు సడలించైనా రైతులకు న్యాయం చేయాలని సూచించారాయన. ‘‘రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేసి, వారిలో భరోసాను నింపాలి. ధాన్యం కొనుగోలు విషయంలో లిబరల్గా ఉండాలి. కొన్ని నిబంధనలు సడలించి అయినా రైతులకు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్ అన్నారు. రైతుల వద్దనున్న ధాన్యాన్ని కొనుగోలుచేసి మిల్లులకు పంపే బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా ఈ కొనుగోళ్లు జరుగుతాయి అని అన్నారాయన. ఆ సమయంలో ‘రాష్ట్రవ్యాప్తంగా ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించారా?’ అని అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. ఈ నెల 11 నుంచి 18 వరకు ఎన్యూమరేషన్ జరుగుతోందని, 19 నుంచి 22 వరకు సోషల్ ఆడిట్ కోసం ఆర్బీకేలలో లిస్ట్‌లు అందుబాటులో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు నివేదించారు. -
విపత్తులోనూ విత్తనాలు సిద్ధం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80 శాతం సబ్సిడీపై అవసరమైన విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 16 జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం 85,885 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వరి విత్తనాలు పంపిణీకి శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో బాధిత రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా అందిన సమాచారం మేరకు 85,885 క్వింటాళ్ల విత్తనాల కోసం అధికారులు ఇండెంట్ పంపారు. వాటిలో ప్రధానంగా 48,913 క్వింటాళ్ల శనగ, 21,064 క్వింటాళ్ల వరి, 12,407 క్వింటాళ్ల మినుము, 2,445 క్వింటాళ్ల వేరుశనగ, 894 క్వింటాళ్ల పెసర విత్తనాలతోపాటు 98 క్వింటాళ్ల నువ్వులు, 51 క్వింటాళ్ల పచ్చిరొట్ట, 14 క్వింటాళ్ల రాగులు, ఉలవలు, జొన్న విత్తనాల కోసం ఇండెంట్లు వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా బాపట్ల జిల్లాలో 20,850 క్వింటాళ్లు, గుంటూరులో 16,040 క్వింటాళ్లు, నెల్లూరు జిల్లాలో 14,384 క్వింటాళ్లు, పల్నాడులో 10,280 క్వింటాళ్లు, కృష్ణాలో 8,456, తిరుపతిలో 6,377, ప్రకాశంలో 5,005, ఏలూరు జిల్లాలో 1,096 క్వింటాళ్ల చొప్పున, మిగిలిన జిల్లాల్లో వెయ్యి క్వింటాళ్లలోపు విత్తనాలు అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు ఆర్బీకేల్లో విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. విత్తనాలపై సబ్సిడీ రూపంలో రూ.64.45 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదలైన పంపిణీ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో నారుమళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా మళ్లీ నారుమళ్లు పోసుకునేందుకు వీలుగా రైతులకు 80 శాతం సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేయాలని సంకల్పించారు. నెల్లూరులో 80 శాతం సబ్సిడీపై వరి విత్తన పంపిణీని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. తిరుపతి జిల్లాలో కూడా వరి విత్తన పంపిణీ చేపట్టారు. ఆందోళన వద్దు తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు 80 శాతం సబ్సిడీపై విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేశాం. తుపాను ప్రభావిత జిల్లాల్లో నారుమళ్లు, నాట్లు దెబ్బతిన్న రైతులకు ఏ విత్తనం కావాలన్నా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
వారికి ఉచితం.. వరద బాధితులకు సుజుకీ ఆఫర్
మిచాంగ్ (Michaung) తుపాన్ ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక వర్షపు నీటితో వాహనాలన్నీ పాడైపోయాయి. ఈ క్రమంలో వీరికి అండగా జపనీస్ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు భారతీయ అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటర్‌సైకిల్ ముందుకు వచ్చింది. చెన్నైతోపాటు పొరుగు జిల్లాల్లో వరద ప్రభావిత వినియోగదారులకు ఉచిత సర్వీస్‌ను ప్రారంభించినట్లు సుజుకీ మోటర్‌సైకిల్ సంస్థ శనివారం తెలిపింది. వరద బాధితులపై వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులో డీలర్ నెట్‌వర్క్‌లను యాక్టివేట్ చేసి వినియోగదారులకు ఉచిత సమగ్ర చెకప్‌లతో సర్వీస్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతోపాటు డిసెంబర్ చివరి వరకు ఇంజిన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్లను ఉచితంగా రీప్లేస్మెంట్ చేస్తున్నట్లు తెలిపింది. మిచాంగ్ తుఫాను పలు నగరాల్లోని ప్రజల జీవితాలు, వారి వస్తువులపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. దీని కింద వాహనాల సర్వీస్‌తో పాటు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చొరవ వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా తమ కస్టమర్ల కోసం మొబిలిటీని త్వరగా పునరుద్ధరించడాన్ని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు! -
వరద బాధితులకు నయనతార సాయం.. అయినా తప్పని విమర్శలు
మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షం తగ్గినా ఇంకా చాలా చోట్ల వరద ప్రభావం కొనసాగుతోంది. అక్కడ ప్రజల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. చాలా ప్రాంతంలో ఇంట్లోకి నీళ్లు రావడంతో నిత్యవసర అవసరాలకు చాలా ఇబ్బందలు పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం జారవిడుస్తున్నా కూడా సమస్య తీరడం లేదు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల సాధారణ ప్రజలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో వేలాదిగా తుపాను బాధితులు కనీస అవసరాలు తీరక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పలువురు స్వచ్ఛంద సేవకులు, సినీ సెలబ్రిటీలు సాయం చేసేందకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విజయ్,సూర్య,విశాల్ ఫ్యాన్స్ తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ హీరోయిన్ నయనతార సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తన వ్యాపార సంస్థ అయిన ‘ఫెమీ 9’ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. దుస్తులు,ఆహారం, శానిటరీ న్యాప్కిన్లు, వాటర్ బాటిళ్లు, మెడిసిన్స్,పాలు వంటి వాటిని ఆమె అందించింది. (ఇదీ చదవండి: తిరుపతిలో బిగ్ బాస్ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం) దీంతో ఆమెకు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు అభినందనలు తెలిపారు. కానీ మరికొందరు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు. తన కంపెనీకి చెందిన ‘ఫెమీ 9’ అడ్వర్టైజ్మెంట్ బోర్డులతో ఉన్న వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడం ఏంటి..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా కంపెనీని ప్రమోట్ చేసుకోవడం ఏంటి అంటూ నయనతారపై విమర్శలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం నయన్‌కు విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఆమె కంపెనీకి చెందిన కాస్మోటిక్స్‌ను ఆ వాహనాల ద్వారానే ట్రాన్స్‌పోర్టు చేస్తుంటారు. ప్రజలకు సాయం చేసేందుకు అందులోని సామాన్లను ఖాళీ చేసి ప్రజలకు అవసరమైన సామాగ్రిని తీసుకొని వచ్చినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తన కంపెనీకి ఉన్న డ్రైవర్లు అయితే ఈ పనిని కరెక్ట్ చేయగలుగుతారని భావించే నయన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయంలో కూడా ఇలా నయన్‌ను తప్పుబట్టడం ఏంటి..? అని కొందరు తిప్పికొడుతున్నారు. View this post on Instagram A post shared by F E M I 9 (@femi9official) -
తుఫాన్ ప్రభావం.. కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టిన ఆటోమొబైల్ కంపెనీలు
అటు తమిళనాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించిన 'మిచాంగ్ తుఫాన్' (Michaung Cyclone) ప్రజలను మాత్రమే కాకుండా.. వాహనాలను కూడా ప్రభావితం చేసింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనాల్లో అనేక సమస్యలు తలెత్తాయి. వీటన్నింటిని పరిష్కరించడానికి వాహన తయారీ సంస్థలు కొన్ని ప్రత్యేక సర్వీసులను అందించడానికి ముందుకు వచ్చాయి. ఏ కంపెనీలు స్పెషల్ సర్వీసులను అందించనున్నాయి, వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ వాహన తయారీ దిగటం టాటా మోటార్స్ తుఫాన్ కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా నష్టపోయిన తన వినియోగదారులకు సంఘీభావంగా తెలిపింది. ఇందులో భాగంగానే కంపెనీ వాహనాల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి స్టాండర్డ్ వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ టైమ్ పొడిగించడమనే కాకుండా.. యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, ఫ్రీ సర్వీస్ వంటి వాటిని కూడా పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2023 డిసెంబర్ 1 నుంచి 15 లోపు ముగిసే ఒప్పందాలను కూడా డిసెంబర్ 31 వరకు పెంచారు. ఎమర్జెన్సీ రోడ్ అసిస్టెన్స్ టీమ్ ఏర్పాటు చేసి.. 24 X 7 హెల్ప్‌డెస్క్ ప్రారంభించింది. తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు అవసరమైన సర్వీస్ అందించడానికి ఫ్రీ టోయింగ్ సహాయాన్ని కూడా అందిస్తోంది. టయోటా కిర్లోస్కర్ (Toyota Kirloskar) మిచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లో తమ కస్టమర్లకు ప్రత్యేక సహాయక చర్యలను అందించడానికి డీలర్ భాగస్వాములతో కలిసి ప్రత్యేక ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అంతే కాకుండా కస్టమర్లకు తక్షణ సహాయం అందించడానికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది. కస్టమర్ల వెహికల్ పికప్ అండ్ డ్రాప్ సేవలను వారి ఇంటి వద్దకే పరిమితం చేసి మరింత సులభతరం చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మహీంద్రా కంపెనీ కూడా తన కస్టమర్లకు కాంప్లిమెంటరీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, నో-కాస్ట్ ఇన్స్పెక్షన్, డ్యామేజ్ అసెస్మెంట్, ప్రత్యేక తగ్గింపుల ద్వారా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. ఈ సర్వీసులన్నీ కూడా డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా? మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కంపెనీలు మాత్రమే కాకుండా హ్యుందాయ్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకి ఇండియా, ఆడి, టీవీఎస్ వంటి కంపెనీలు కూడా తమ కస్టమర్లకు సర్వీసులను అందించడానికి తగిన ఏర్పాట్లను చేశాయి. వినియోగదారులు కూడా ఈ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. -
గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు..
ఇటీవలి మిచౌంగ్ తుపాను.. దేశంలోని దక్షిణాదిని అతలాకుతలం చేసింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు పలు సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలోనే ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కడంబత్తూర్‌కు చెందిన మునుస్వామి(40) మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. ల్యాబ్ టెక్నీషియన్ అయిన మునుస్వామి.. క్యాన్సర్‌తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. ఈదురు గాలులు, భారీ వర్షం, వరదలతో నిండిన రోడ్లను సైతం లెక్కచేయక దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. మునుసామి.. దేశంలోని ప్రముఖ రక్త స్టెమ్ సెల్ దాతల ప్రభుత్వేతర సంస్థ డెట్రాయ్(డీఏటీఆర్ఐ)లో పని చేస్తున్నారు. ఈ సంస్థ రక్త రుగ్మతలతో బాధపడుతున్నవారికి సహాయం అందిస్తుంది. క్యాన్సర్ బాధితల శిశువుకు చికిత్సలో మూలకణాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన దాతకు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్‌ను అందించడానికి మునుస్వామి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ దాత బాధిత చిన్నారికి తన ఎముక మజ్జను దానం చేయడానికి అండమాన్ నుండి వచ్చి, చెన్నై నగరంలోని పాత పెరుంగులత్తూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా డెట్రాయ్ ఇన్‌ఛార్జి సుమతి మిశ్రా మీడియాతో మాట్లాడుతూ బోన్ మ్యారో డొనేషన్ రెండు విధాలుగా చేయవచ్చు. బాధిత కుటుంబంలో వారి లేదా జన్యుపరమైన పోలిక కలిగిన వారి నుంచి దీనిని సేకించవచ్చు. అయితే ఆ రెండేళ్ల బాధిత చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. తన బోన్ మ్యారోను దానం చేసేందుకు ఒక వ్యక్తి ముందుకు వచ్చారన్నారు. వైద్య ప్రక్రియలో తాము రక్త కణాలను వెలికితీసేందుకు, ఐదు రోజుల పాటు దాతకు గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చేటప్పుడు గ్యాప్ ఉండకూడదు. అప్పుడే బాధితులకు అవసరమైన మూలకణాలను సేకరించగలమని అన్నారు. ఇలా సంగ్రహించిన స్టెమ్ సెల్ ప్రాసెస్ చేశాక, దానిని బాధితులకు ఉపయోగిస్తామన్నారు. తుఫానుకు ముందు రోజున దాతకు మొదటి డోస్ ఇచ్చాం. తుపాను కారణంగా రెండవ డోస్ ఇవ్వడంపై ఆందోళన చెందాం. దాత ఉంటున్న ప్రాంతంలోని వైద్య నిపుణుల సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మునుసామి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మునుసామి మాట్లాడుతూ చిన్నారికి చికిత్స ఆలస్యమైతే ఏమి జరుగుతుందో నాకు తెలుసు. దానిని గుర్తించినంతనే ఈ సాహసానికి దిగాను. మోటార్ సైకిల్‌పై ఇంటి నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరాను. జాతీయ రహదారులు ఎక్కడికక్కడ జలమయమంగా ఉన్నాయి. రోడ్లు కనిపించడం లేదు. పెరంబక్కం వైపు వెళ్ళాను. చెన్నైకి వెళ్లే హైవేలను కనెక్ట్ అయ్యేందుకు ఒక అండర్ పాస్ దాటాలి. ఇది జలమయంగా ఉండటంతో మరో మార్గంలో వెళ్లాను. శ్రీపెరంబుత్తూరు నుండి పూనమల్లి రోడ్డు మీదుగా చెన్నై ఔటర్ రింగ్ రోడ్డులోకి ప్రవేశించానని మునుసామి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా పాత పెరుంగళూరు రహదారిని కలిపే వంతెన జలమయం కావడంతో పోలీసులు అటువైపు వెళ్లడాన్ని అడ్డుకోవడంతో బైక్‌ని వంతెనపై ఆపి నడిచానని, అలా మూడు కిలోమీటర్ల నడిచి, తరువాత ఈదుకుంటూ చివరికి దాత ఇంటికి చేరుకుని, దాతకు ఇంజిక్షన్ ఇచ్చానని తెలిపారు. తరువాత దాత కుటుంబ సభ్యులు వర్షం తగ్గేవరకూ ఇంటిలోనే ఉండాలని కోరినప్పటికీ, మునుస్వామి తన ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఆ మరుసటి కూడా రోజు దాతకు మునుస్వామి ఇంజెక్షన్ ఇచ్చాడు. కదంబత్తూర్లోని మునుస్వామి ఇంటి నుండి దాత ఇల్లు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా చదవండి: రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం -
సాయం చేయాలంటూ ఫ్యాన్స్‌ను కోరిన విజయ్
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో నివశిస్తున్న ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తుపాను తీరాన్ని తాకినప్పటికీ, వర్షం కారణంగా చెన్నైని వరదలు ముంచెత్తాయి. చాలా చోట్ల క్రమంగా అక్కడి పరిస్థితులు చక్కబడుతున్నాయి. అయితే, వేలచ్చేరి, మడిపాక్కం, పల్లికరణై, పెరుంబాక్కం, దురైపాక్కం వంటి ప్రాంతాల్లో నీరు చేరిపోయి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్ కోత ఏర్పడింది. సాధారణ ప్రజలు ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో తమిళనాడులోని ఇతర జిల్లాల నుంచి వాలంటీర్లు చెన్నైకి వెళ్లి సహాయం చేయడం ప్రారంభించారు. అక్కడ కూడా చాలా మంది ఫుడ్, వాటర్ బాటిళ్లు అందజేస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన సూర్య, కార్తి తమిళ ప్రజలకు సాయం చేసేందుకు అందరి కంటే ముందుగా రియాక్ట్ అయ్యారు. ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం రూ. 10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ తర్వాత వర్ధమాన నటుడు హరీష్ కళ్యాణ్ లక్ష 10 రూపాయలు ఇచ్చారు. ఇందులో విజయ్ ఏం చేయబోతున్నాడా అని చాలా మంది ఎదురు చూశారు. కానీ అతను ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. దీంతో ఆయన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. విజయ్ మౌనం వీడాడు ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ పేజీలో మాట్లాడుతూ.. చెన్నైతోపాటు శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. వేలాది మంది ప్రజలు తాగునీరు, ఆహారం లేకుండా, తగిన మౌలిక వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతూ సోషల్ మీడియాలో ఇంకా అనేక స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో, బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో ప్రజా ఉద్యమ నిర్వాహకులందరూ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. చేయి చేయి కలుపుదాం, దుఃఖాన్ని దూరం చేద్దాం.' అని విజయ్ తెలిపాడు. అంతే కాకుండా ప్రభుత్వానికి సాయం చేయడానికి వలంటీరులుగా రావాలని తమ ఫ్యాన్స్‌ను సాయం కోరాడు. -
తుపానుపై ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం
-
Michaung Cyclone: భారీ వర్షాలతో నీట మునిగిన వరి పంట
-
బాపట్లలో అత్యధికంగా వర్షపాతం నమోదు
-
తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు
-
తెలంగాణలో రెండ్రోజులు అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మిచౌంగ్ Cyclone Michaung ప్రభావంతో తెలంగాణలో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను కదలిక ఆధారంగా తాజాగా ఈ అప్డేట్ను అందించింది. దీంతో ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోని పలు జిల్లాలో రెండ్రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. మరోవైపు తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం పడుతోంది. వర్షం కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. మంగళ(నేడు), బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మిచౌంగ్ ప్రభావ దృష్ట్యా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎస్ శాంతికుమారి సూచించారు. భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు. ఇదీ చదవండి: తీవ్ర తుపాను మిచౌంగ్ ముంచేసింది -
'మిచౌంగ్' తుపాను.. ఆవేదనతో ఫైర్ అయిన విశాల్
'మిచౌంగ్' తుపానుతో తమిళనాడు రాజధాని చెన్నైలోని రోడ్లన్నీ చెరువును తలపిస్తున్నాయి. అన్ని ప్రాంతాలను వర్షపు నీరు చుట్టుముట్టింది. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితిపై హీరో విశాల్ స్పందించారు. విపత్తు సమయంలో తగిన చర్యలు తీసుకోవడంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) విఫలమైందంటూ విశాల్ ఆరోపించారు. 'డియర్ ప్రియా రాజన్ (చెన్నై మేయర్), జీసీసీ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులకు నేను చెప్ప దలుచుకున్నది ఏమిటంటే... మీ కుటుంబాలతో మీరు క్షేమంగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వరదల వల్ల వచ్చే నీరు మీ ఇళ్లలోకి రాదనుకుంటున్నా. ఇలాంటి సమయంలో మీకు మాత్రం నిరంతర విద్యుత్తు, ఆహారం ఉంటుంది. కానీ ఒక ఓటరుగా ఇదే నగరంలో నివసిస్తున్న మేమంతా అలాంటి పరిస్థితిలో లేము. 2015లో చెన్నైలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అప్పుడు వారందరికీ మేము సాయం చేశాం. కానీ ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇప్పుడు అంతకు మించిన దారుణమైన పరిస్థితి కనిపించడం చాలా భాదగా ఉంది. అయినప్పటికీ ఈ సమయంలో కూడా మేము కచ్చితంగా ఆహారం, తాగునీరు, కనీస వసతి కల్పిస్తాము. ఇలాంటి సాయం చేస్తూనే ఉంటాం. ప్రతి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బయటకు రండి. బయటకు వచ్చి అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.' అని పేర్కొన్నారు. Dear Ms Priya Rajan (Mayor of Chennai) and to one & all other officers of Greater Chennai Corporation including the Commissioner. Hope you all are safe & sound with your families & water especially drainage water not entering your houses & most importantly hope you have… pic.twitter.com/pqkiaAo6va — Vishal (@VishalKOfficial) December 4, 2023 చదవండి: చెన్నైలో జలప్రళయం -
Vedio: మిచౌంగ్ ధాటికి కుంగిన రోడ్లు
చెన్నై: తమిళనాడులో మిచౌంగ్ తుపాను ప్రజలను వణికిస్తోంది. భారీ వర్షాలతో ముఖ్యంగా చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయ మయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతాయం ఏర్పడింది. రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోవడంతో చెన్నై ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిపోయింది. దీంతో నగర వాసుల ఇబ్బందులు అన్ని ఇన్నీకావు. దక్షిణ చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఓ రహదారి కృంగిపోయింది. ఆ గుంటలోనే విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఈ దృశ్యాలు చూపరులను భయభ్రాంతులకు గురిచేశాయి. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివసించేది. Hang tight for another day everyone🙏 Even if the rain stops, recovery is going to take a while. #ChennaiRains2023 #Michaung pic.twitter.com/QsnkuxuXx3 — Ashwin 🇮🇳 (@ashwinravi99) December 4, 2023 చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముగ్గురు వ్యక్తులు మరణించారు. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాల్లో రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించారు. బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది. అర్ధరాత్రి సమయంలో తుపాను నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణుల అంచనా. ఇదీ చదవండి: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..! కేంద్రం కీలక నిర్ణయం -
తుఫాను ప్రభావంతో రెండు జిల్లాల్లో కూడా విద్యాసంస్థలకు సెలవులు
-
తరుముకొస్తున్న తుఫాన్..!
-
నెల్లూరు, తిరుపతిపై తీవ్ర ప్రభావం.
-
ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం
-
మిచౌంగ్ బీభత్సం: కొట్టుకుపోయిన కార్లు, రన్‌వే పైకి వరద నీరు..
చెన్నై: మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై కాకావికలమైతోంది. భారీ వర్షాలకు చెన్నైలో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రభావంతో కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. వర్షాల ప్రభావంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Deeply concerned about the impact of the Cyclone Michaung on Chennai city. I wish and pray for safety and well-being of the people. Stay strong, Chennai. We're with you. Prayers🙏🏼 #TakeCareChennai pic.twitter.com/cerOJbIAjf — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 4, 2023 చెన్నై నగరంలో భారీ వార్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై మోకాలు వరకు నీరు చేరుకుంది. దీంతో రోడ్లపై రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెంగల్పట్టు సమీపంలోని సముద్రతీర ప్రాంతం నుంచి వేగవంతమైన గాలులు వీస్తున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. Understand this is Chennai airport today. The sea seems to have taken it over. And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez — Tarun Shukla (@shukla_tarun) December 4, 2023 చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు కాలువలా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నిలిచి ఉన్న కార్లు వాన నీటిలో కొట్టుకుపోతున్నాయి. 🌀 Michaung CYCLONE Police in action. Man fell down in a deep construction site was rescued by police. #ChennaiRain #Update@SandeepRRathore@R_Sudhakar_Ips@ChennaiTraffic pic.twitter.com/gsqeUUFZXk — GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) December 4, 2023 -
మిచౌంగ్ తుపాను.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈరోజు(సోమవారం) తుపాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి హుద్‌హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది: తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది: బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం: వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు: ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది: పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు: ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి: కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం: పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి: తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది: అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు: అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి: ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 5, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ 5 కూడా ఉన్నాయి: ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి: ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి: కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు: క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి: ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి: క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి పరిహారాన్ని సకాలంలో అందించాలి తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేయాలి నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను ఒక ఫోన్ కాల్ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి