మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నైతోపాటు శివారు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వర్షం తగ్గినా ఇంకా చాలా చోట్ల వరద ప్రభావం కొనసాగుతోంది. అక్కడ ప్రజల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. చాలా ప్రాంతంలో ఇంట్లోకి నీళ్లు రావడంతో నిత్యవసర అవసరాలకు చాలా ఇబ్బందలు పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల సహాయక సామగ్రిని హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం జారవిడుస్తున్నా కూడా సమస్య తీరడం లేదు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల సాధారణ ప్రజలు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు.
పునరావాస కేంద్రాల్లో వేలాదిగా తుపాను బాధితులు కనీస అవసరాలు తీరక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో పలువురు స్వచ్ఛంద సేవకులు, సినీ సెలబ్రిటీలు సాయం చేసేందకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విజయ్,సూర్య,విశాల్ ఫ్యాన్స్ తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రముఖ హీరోయిన్ నయనతార సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తన వ్యాపార సంస్థ అయిన ‘ఫెమీ 9’ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేసింది. దుస్తులు,ఆహారం, శానిటరీ న్యాప్‌కిన్లు, వాటర్ బాటిళ్లు, మెడిసిన్స్,పాలు వంటి వాటిని ఆమె అందించింది.
(ఇదీ చదవండి: తిరుపతిలో బిగ్ బాస్ బ్యూటీ 'వాసంతి' నిశ్చితార్థం)
దీంతో ఆమెకు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు అభినందనలు తెలిపారు. కానీ మరికొందరు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు. తన కంపెనీకి చెందిన ‘ఫెమీ 9’ అడ్వర్టైజ్‌మెంట్ బోర్డులతో ఉన్న వాహనంలో వరద బాధితులకు సహాయం అందించడం ఏంటి..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా కంపెనీని ప్రమోట్ చేసుకోవడం ఏంటి అంటూ నయనతారపై విమర్శలు చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం నయన్‌కు విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు.
ఆమె కంపెనీకి చెందిన కాస్మోటిక్స్‌ను ఆ వాహనాల ద్వారానే ట్రాన్స్‌పోర్టు చేస్తుంటారు. ప్రజలకు సాయం చేసేందుకు అందులోని సామాన్లను ఖాళీ చేసి ప్రజలకు అవసరమైన సామాగ్రిని తీసుకొని వచ్చినట్లు కొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తన కంపెనీకి ఉన్న డ్రైవర్లు అయితే ఈ పనిని కరెక్ట్ చేయగలుగుతారని భావించే నయన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాయంలో కూడా ఇలా నయన్‌ను తప్పుబట్టడం ఏంటి..? అని కొందరు తిప్పికొడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment