సాక్షి, తాడేపల్లి: తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎనిమిది మంది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈరోజు(సోమవారం) తుపాను ప్రభావం ఉండే పలు జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో పలు శాఖలకు చెందిన అధికారులు సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే..
- తుపాను సందర్బంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి
- హుద్‌హుద్ లాంటి పెద్ద పెద్ద తుపాన్లను చూసిన అనుభవం మనకు ఉంది
- తుపాన్లను ఎదుర్కోవడంలో మన యంత్రాంగానికి మంచి అనుభవం ఉంది:
- తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉంటూ యంత్రాంగం సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది:
- బాపట్ల సమీపంలో రేపు సాయంత్రం తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు
- గంటకు 110 కి.మీ. వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు
- ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదలచేశాం
- అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం
- ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నాం:
- వీరంతాకూడా జిల్లాల యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు:
- ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది:
- పశువులకూ ఎలాంటి ప్రాణనష్టం రాకూడదు:
- ఆ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలి:
- కోతకు వచ్చిన ఖరీఫ్ పంటను కాపాడుకోవడం అన్నది చాలా ముఖ్యమైనది
- నిన్న ఒక్కరోజే 97 వేల టన్నలు ధాన్యాన్ని సేకరించాం
- 6.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం:
- పంటకోయని ప్రాంతాల్లో వీలైనంత మేర కోయకుండా వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు చెప్తున్నారు
- దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి
- కోసిన ధాన్యాన్ని వెంటనే సేకరించడంపై అధికారులు దృష్టిపెట్టాలి
- యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి:
- తేమ, రంగు లాంటి అంశాలను పట్టించుకోకుండా రైతులకు అండగా నిలవండి:
- తుపాను దృష్ట్యా రైతులకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది:
- అన్నిరకాలుగా రైతులకు తోడుగా నిలవడం అన్నది అత్యంత ప్రాధాన్యతాంశం
- తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాలనుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి:
- 308 శిబిరాల ఏర్పాటుకు గుర్తించామని, అప్పటివరకూ 181 తెరిచామని చెప్తున్నారు:
- అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి:
- ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్స్ 5, ఎస్డీఆర్‌ఎఫ్ టీమ్స్ 5 కూడా ఉన్నాయి:
- ఇతర రాష్ట్రాలకు లేని, మనకు మాత్రమే ఉన్న మరో బలం ఏంటంటే గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ
- విలేజ్ క్లినిక్స్, ఆర్బీకేలు కూడా మనకు ఉన్నాయి:
- ఇది మనకు ఉన్న పటిష్టమైన బలం
- ఇతర రాష్ట్రాలకు ఇలాంటి వ్యవస్థ లేదు
- ఈ యంత్రాంగాన్ని బాగా వినియోగించుకోవాలి
- ఈ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలి
- ప్రజల ప్రాణాలను రక్షించడంలో, తపాను వల్ల, భారీవర్షాల వల్ల దెబ్బతినే అవకాశాలున్న ప్రాంతాల్లో వీరి సేవలను వినియోగించుకోవాలి
- సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి
- మనం ఉంటే ఎలాంటి సదుపాయాలు కోరుకుంటామో, అలాంటి సదుపాయాలు ఉండాలి
- మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి:
- కాస్త డబ్బు ఖర్చైనా పర్వాలేదు, సదుపాయాలు విషయంలో ఎలాంటి లోటూ రాకూడదు:
- క్యాంపునుంచి ఇంటికి వెళ్లేటన్పుడు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్లాలి:
- ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500ఇవ్వాలి:
- క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి
- ఈ రేషన్‌ను వారికి సకాలంలో సక్రమంగా అందించాలి
- గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి
- బాధితుల పట్ల దయతో, సానుభూతితో అందించాలి
- పరిహారాన్ని సకాలంలో అందించాలి
- తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి
- గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వ్యవస్థను వినియోగించుకుని బాధితులను గుర్తించి వెంటనే వారికి ఇవ్వాల్సినవి ఇవ్వాలి
- ఎమర్జెన్సీ సర్వీసుల నిర్వహణపై దృష్టిపెట్టాలి
- జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి
- గర్భిణీలను ఆస్పత్రులకు తరలించాలి
- తుపాను వల్ల వచ్చే వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి
- పారిశుద్ధ్య కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికిన నిర్వహించాలి
- విద్యుత్, రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడితే వెంటనే యుద్ధ ప్రాతిపదికిన వాటిని సరిచేయాలి
- సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాలి
- తుపాను, వర్షాలు తగ్గాక పంటలకు జరిగిన నష్టంపై వెంటనే ఎన్యుమరేషన్ పూర్తిచేయాలి
- నేను కూడా ప్రజల దగ్గరకు వెళ్లి.. కలెక్టర్లు బాగా చేశారా? లేదా? అడుగుతాను
- బాగానే చేశారని ప్రజలు సంతోషంగా నాకు చెప్పాలి
- తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతాను, ప్రభుత్వం యంత్రాంగం పనితీరుపై అడిగి తెలుసుకుంటాను
- సహాయం అందలేదని, బాగా చూసుకోలేదన్న మాట బాధితులనుంచి వినిపించకూడదు
- సంతృప్తకర స్థాయిలో బాధితులందరికీ సహాయం అందాలి
- ఈ సాయంత్రం నుంచి ప్రత్యేకాధికారులు జిల్లాల్లో పర్యవేక్షణ ప్రారంభిస్తారు
- డబ్బులు ఇంకా అవసరమైతే..వెంటనే పంపించడానికి అన్నిరకాలుగా ఏర్పాట్లు చేశాను
- ఒక ఫోన్ కాల్ దూరంలో మేం ఉంటాం. ఏం కావాలన్నా వెంటనే అడగండి
- సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికిన నడవాలి
Comments
Please login to add a commentAdd a comment