హీరో విజయ్‌ మంచి మనసు..800 కుటుంబాలకు సాయం | Actor Vijay Helps Michaung Cyclone Affected People In Tamil Nadu | Sakshi
Sakshi News home page

హీరో విజయ్‌ మంచి మనసు..800 కుటుంబాలకు సాయం.. ఎంత డబ్బు ఇచ్చారంటే

Published Sat, Dec 30 2023 7:01 PM | Last Updated on Sat, Dec 30 2023 7:13 PM

Actor Vijay Helped Michaung Cyclone Affected People In Tamil Nadu - Sakshi

డిసెంబర్‌ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను కారణంగా చెన్నై ప్రజలు అల్లాడిపోయారు. తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ సమయంలో వారి జీవనం అస్తవ్యస్తంగా మారింది. తుపాను వల్ల చెన్నై నగరంలో చాలా  ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిపోయి చెరువులను తలపించాయి. సాధారణ ప్రజలు ఆహారానికి కూడా ఇబ్బంది పడ్డారు.

ఆ సమయంలో​ హీరో విజయ్‌ తన ఎక్స్‌ పేజీలో మాట్లాడుతూ..  వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించాలని కోరుతూ సోషల్ మీడియాలో అభిమానులను కోరారు. చేయి చేయి కలుపుదాం, దుఃఖాన్ని దూరం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అప్పట్లో వర్షాల వల్ల ఇబ్బందులు పడిని వారిని గుర్తించి.. వారికి కనీస అవసరాలు అయిన దుస్తులు, ఆహారం వంటి వాటిని తన ఫ్యాన్స్‌ ద్వారా విజయ్‌ అందించారు.

భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు హీరో విజయ్‌ తాజాగా మళ్లీ సాయం అందించారు. తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలలో ఎక్కువగా నష్టపోయిన కుటుంబాలను గుర్తించి ఆయన సాయం అందించారు. వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన సుమారు 800 కుటుంబాలకు ఆయన తాజాగా సాయం చేశారు. వర్షాల వల్ల ఇబ్బందులు పడిన ప్రజలను చూసి ఆయన చలించిపోయారు. బాధితులకు తన అభిమానుల సంఘం (విజయ్ మక్కల్ ఇయక్కం) ద్వారా  నిత్యావసర సరుకులు అందజేశారు.

ఆపై ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 50 వేల వరకు డబ్బు అందించారు. ఆ సమయంలో ఆయనతో ఫోటోలు దిగేందకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు.. అడిగిన వారందరికీ ఆయన సెల్ఫీలు ఇచ్చి వారిలో సంతోషం నింపారు. గతంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆయన సాయం చేశారు. ఈ ఏడాదిలో పది, ఇంటర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన పేద విద్యార్థులకు డబ్బు సాయం చేశారు. ఇలా సాయం చేయడంలో ఎప్పుడూ ఆయన ముందు వరుసలో ఉంటారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement