చూసొద్దాం రండి | pancharama tour package | Sakshi
Sakshi News home page

చూసొద్దాం రండి

Published Fri, Oct 17 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

చూసొద్దాం రండి

చూసొద్దాం రండి

పరమ పవిత్రమైన కార్తీకమాసాన పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్లి తరించాలని అందరూ ఆశ పడతారు. వనభోజనాలకు వెళ్లి కుంటుంబమంతా జాలీగా గడపాలనుకుంటారు. అందుకే.. ఈ మాసంలో పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ ప్రాంతాలు, సముద్రతీరాలు, నదీపాయలు, వాగులు, వంకలు, తోటలు, అడవులు అన్నీ పర్యాటకులతో కళకళలాడుతుంటారుు. యూత్రికుల ఈ ఆసక్తిని దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ కార్తీకమాసానికి వారం రోజుల ముందే పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. పంచారామాలతో పాటు పట్టిసీమ, శబరిమల యూత్రలకు ఈ బస్సులు నడుస్తారుు. గతంలో ఉన్న చార్జీల రేట్లలో ఏమాత్రం తేడా లేకుండా, ప్రయాణికుల సౌలభ్యం కోసమే ఆర్టీసీ ఈ చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జి.సుదేష్‌కుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిటీఎం (సిటీ) జి.నాగేంద్రప్రసాద్, రూరల్ సీటీఎం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మరెందుకు ఆలస్యం.. ఆ వివరాలు తెలుసుకుని పుణ్యక్షేత్ర దర్శనానికి ఇప్పటి నుంచే సిద్ధమవ్వండి
- విజయవాడ
 
పంచరామాలకు స్పెషల్ సర్వీసులు
 
అమరావతిలోని అమరారామం, భీమ వరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని దక్షారామం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరస్వామి వార్లను ఒక్కరోజులో దర్శించుకునేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రోజూ వేకువజామున 3 నుంచి 4 గంటల సమయంలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయల్దేరే ఈ బస్సులు అమరావతి నుంచి భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో దర్శనానంతరం తిరిగి రాత్రి 11 గంటల సమయంలో బస్టాండ్ చేరుకుంటుంది.  
 
ఎప్పుడెప్పుడు? టికెట్ల ధర ఎంత?
పంచరామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈనెల 26, 27 తేదీలు, నవంబరు 2, 3, 4, 6, 10, 16, 17,18, 20 తేదీల్లో బస్సులు నడుపుతారు. సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసులు ఏర్పాటుచేయగా, లగ్జరీలో పెద్దలకు రూ.770, చిన్నపిల్లలకు రూ.580, డీలక్స్ సర్వీసుల్లో పెద్దలకు రూ.650,  పిల్లలకు రూ.490 వసూలు చేస్తారు.
 
అసౌకర్యం కలగకుండా చర్యలు
ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ఆయా దేవస్థానాల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ ఆయా ఏరియాల సిబ్బంది భక్తుల దర్శనం కోసం, వారికి తగిన సమయపాలన కోసం ప్రత్యేక విధానం ఏర్పాటు చేస్తున్నారు. ఆరోజు ఎన్ని బస్సులు వస్తున్నారుు.. ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటారు.. వంటి వివనాలను ముందురోజు రాత్రే చర్చించుకుని తగిన ఏర్పాట్లు చేస్తారు.
 
శబరిమలకు స్పెషల్ బస్సులు

కార్తీకమాసంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేసింది. విజయవాడ నుంచి శ్రీరంగం, కుర్తాళం, ఎరిమేలి మీదుగా పంబ చేరుకుంటారు. శబరిమలలోని అయ్యప్ప దర్శనానంతరం తిరుగు ప్రయూణంలో మధురై, మేల్‌మరువత్తూరు మీదుగా బస్సు విజయ   వాడకు చేరుతుంది. ఈ టూర్ కేవలం ఐదు రోజుల్లోనే ముగుస్తుంది.
 
టికెట్ల వివరాలు

సూపర్ లగ్జరీ బస్సుల్లో పెద్దలకు రూ.4,300, చిన్నపిల్లలకు రూ.3,200 వసూలు చేస్తారు.
 
అద్దె ప్రాతిపదికన
అయ్యప్ప భక్తులు ఆర్టీసీ బస్సును అద్దె ప్రాతి  పదికన కూడా తీసుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఏర్పాటుచేశారు. రోజుకు 420 కిలోమీటర్ల అంచనాతో సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటరుకు రూ.42, డీలక్స్‌కు రూ.41, ఎక్స్‌ప్రెస్ రూ.45గా నిర్ణయించారు. పర్మిట్ ఫీజు, టోల్‌గేటు, పార్కింగ్ చార్జీలు అదనంగా వసూలు చేస్తారు. స్వాముల కోరిక మేరకు మార్గంమధ్యలో పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంది. ఇద్దరు వంటమేస్త్రీలు, ఇద్దరు చిన్నపిల్లలు, ఒక అటెండర్‌కు సీట్లు లేకుండా అనుమతించే అవకాశం ఉంది.
 
పట్టిసీమకు ప్రత్యేక బస్సులు
ప్రకృతి సోయగాల మేళవింపుతో   గోదావరి పరవళ్లు, పాపికొండల అందాలు తిలకించాలనుకునే ప్రయూణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. కార్తీకమాసంలో ప్రతి ఆదివారం వేకువజామున 3 గంటల సమయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బస్సు   బయల్దేరి అదేరోజు రాత్రి తిరిగి విజయవాడ వస్తుంది. రాజమండ్రి నుంచి బోటు షికారు ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బోటు షికారు చేసి సాయంత్రం బస్సు వద్దకు చేరుకుని తిరుగు ప్రయూణమవుతారు.
 
టికెట్ల వివరాలు
పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.400, బోటు షికారుకు పెద్దలకు రూ.550, చిన్నారులకు రూ.350.
 
భక్తులకు ఆర్టీసీ సౌకర్యాలు
అద్దె ప్రాతిపదికన, వ్యక్తిగత టికెట్లు కొన్న భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటుచేసింది. వాటి వివరాలు....
 
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వీడియో కోచ్ ఉన్న కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
 
రైలులో శబరిమలకు వెళ్లే భక్తులు పంబకు 150 కిలోమీటర్ల దూరంలో దిగాలి. అందుకు భిన్నంగా ఆర్టీసీ పంపానది వద్దకు బస్సు నడుపుతోంది.
 
ఆయా ప్రాంతాల అధికారులతో ఆర్టీసీ అధికారులు చర్చించి అన్ని వసతులతో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఆఫీసర్లు, సూపర్ వైజర్లు అన్నివేళలా భక్తులకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తారు.
 
హెల్ప్‌లైన్ నంబరు కూడా ఏర్పాటుచేశారు. ప్రత్యేక క్యాంపు ద్వారా ప్రయాణికులకు మరిన్ని సేవలందిస్తారు.
 
ఆర్టీసీ రిజర్వేషన్ ఆన్‌లైన్‌లో..
కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు పంచారామాలు, పట్టిసీమ, శబరిమలకు ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. టికెట్లను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. టికెట్లు ఆర్టీసీ  ఆథరైజ్‌డ్ బుకింగ్ ఏజెంట్ల వద్ద తీసుకోవాలి. మరిన్ని వివరాలకు మార్కెటింగ్ సెల్ నంబరు 9959225475లో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement