పల్లె కళ కళ
పల్లెలకు తరలిన నగర వాసులు
రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు పయనం
భోగి మంటలు, పతంగులతో గ్రామాల్లో సంబరాలు
బోసిపోయిన విశాఖ వీధులు, కార్యాలయాలు
ఏ పల్లె చూసినా ఇప్పుడు కళకళలాడుతోంది. ఎప్పుడూ నిండుగా ఉండే విశాఖ వెలవెలబోతోంది. నగరంలోని సగానికి పైగా ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. పెద్ద పండగ సంక్రాంతికి వారంతా పల్లె బాట పట్టడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పలచగా కనిపించే గ్రామాలు నిండుగా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే నగరం నిర్మానుష్యంగా మారింది.
విశాఖపట్నం: ఉరుకులు పరుగుల నగరాలు పల్లెబాట పట్టాయి. పట్టణాల్లో గజిబిజిగా.. బిజీ బిజీగా గడిపే జనంతో గ్రామాలు నిండిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో రైళ్లు, బస్సుల్లో స్వస్థలాలకు చేరారు. ఇప్పుడవన్నీ సందడిని సంతరించుకున్నాయి. పల్లెల్లో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. బంధువులతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వం కూడా మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో అధికారులు సైతం సొంత ఊళ్లకు వెళ్లారు. ఆర్టీసీ 600 రెగ్యులర్, ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రైళ్లకు ఆ శాఖ అదనపు బోగీలు ఏర్పాటు చేసింది. బస్సుల్లో సుమారు 4లక్షల మంది, రైళ్లల్లో సుమారు 3 లక్షల మంది ప్రయాణీకులు నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లినట్లు అంచనా. దీంతో ఇటు నగరం, అటు ప్రభుత్వ, ప్రై వేట్ కార్యాలయాలు బోసిపోయాయి.
సంక్రాంతి ఎవరికి వారు తమ స్వగ్రామల్లో జరుపుకోవాలనుకుంటుంటారు. బంధు మిత్రులతో, పిండి వంటలతో అత్యంత శోభాయమానంగా ఉండే పల్లె లోగిళ్లలో సంబరాలు చేసుకోవాలనుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటే బస్సులు, రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతుంటాయి. నగర జీవులు పండుగకు గ్రామాలకు వెళ్లకుండా ఉండలేరు. విశాఖ నగరానికి జిల్లా నలుమూల నుంచే కాకుండా పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా విద్య, ఉపాధి, ఉద్యోగ అవసరాల కోసం వస్తుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు పలు కళాశాలల్లో ఇతర ప్రాంతాల విద్యార్ధులే ఎక్కువగా ఉంటారు. వారంతా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిపోయారు. ఉపాధి కోసం కూడా విశాఖకు ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. ప్రైవేటు సంస్థలు కూడా సిబ్బందికి సెలవులు ఇవ్వడంతో వారు సొంత వారితో సంతోషాలు పంచుకోవడానికి వెళ్లారు. విశాఖలో ఈ సారి పండుగ ఆఫర్లు హోరెత్తడంతో కొత్త దుస్తులు, గృహోపకరణలు, కానుకలు కొనుగోలు చేసి తమ వారికి తీసుకుని వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ఈ సారి ప్రభుత్వం మూడు రోజు ల పాటు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. దీంతో జిల్లా కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారులు పండుగ సంబరాలకు వెళ్లిపోయారు. పండుగ ముందే ముఖ్యమంత్రి వచ్చి వెళ్లడంతో పాటు పండుగ తర్వాత మళ్లీ వస్తుండటంతో దొరికిన ఈ కొద్ది రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అధికారులు తమ తర్వాత స్థానంలో ఉన్న అధికారికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి ఊరు వెళ్లిపోయారు.
ఇన్‌చార్జ్‌లు ఉన్నప్పటికీ అధికారిక సెలవులు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం నుంచి మూత పడ్డాయి. ఇక నగర వాసులు మాత్రం భోగి మంటలు,పతంగులతో సంబరాలు చేసుకుంటున్నారు. పల్లెలకు దీటుగా సంక్రాంతి జరుపుకుం టున్నారు. ప్రాంతాల నుంచి లక్షలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. ప్రైవే టు సంస్థలు కూడా సిబ్బందికి సెలవులు ఇవ్వడంతో వారు సొంత వారితో సంతోషాలు పంచుకోవడానికి వెళ్లారు. విశాఖలో ఈ సారి పండుగ ఆఫర్లు హోరెత్తడంతో కొత్త దుస్తులు, గృహోపకరణలు, కానుకలు కొనుగోలు చేసి తమ వారికి తీసుకుని వెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రభుత్వం మూడు రోజుల పాటు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. దీం తో జిల్లా కలెక్టర్‌తో సహా ఉన్నతాధికారు లు పండుగ సంబరాలకు వెళ్లిపోయారు. పండుగ ముందే ముఖ్యమంత్రి వచ్చి వెళ్లడంతో పాటు పండుగ తర్వాత మళ్లీ వస్తుండటంతో దొరికిన ఈ కొద్ది రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అధికారులు తమ తర్వాత స్థానంలో ఉన్న అధికారికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి ఊరు వెళ్లిపోయారు. ఇన్‌చార్జ్‌లు ఉన్నప్పటికీ అధికారిక సెలవులు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు బుధవారం నుంచి మూత పడ్డాయి. ఇక నగర వాసులు మాత్రం భోగి మంటలు,పతంగులతో సంబరాలు చేసుకుంటున్నారు.