న్యూఢిల్లీ: సీఆర్‌పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్‌ఐఏ డీజీగా ఉన్న వైసీ మోదీ సోమవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శనివారం కుల్దీప్‌సింగ్‌కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ అదేశాలు వెలువడ్డాయి.
కుల్దీప్ సింగ్ 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. ప్రస్తుతం ఆయన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కు డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తదుపరి చీఫ్ నియామకం వరకు కుల్దీప్ ఎన్‌ఐఏ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని హోంశాఖ స్పష్టం చేసింది. పదవీ విరమణ చేయనున్న మోదీ 1984 ఐపీఎస్ బ్యాచ్ అస్సాం–మేఘాలయ కేడర్ అధికారి.
(చదవండి: MK Stalin: అనాథ బాలలకు రూ.5 లక్షల సాయం)
సీఆర్‌పీఎఫ్ డీజీకి ఎన్‌ఐఏ బాధ్యతలు
Published Sun, May 30 2021 10:19 AM | Last Updated on Sun, May 30 2021 10:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment