
అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు: శిద్ధా
హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండగకు రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 2,600 ప్రత్యేక బస్సు సర్వీసులు కల్పించనున్నట్లు చెప్పారు. ఎవరైనా రవాణా కోసం ప్రయాణికుల నుంచి టిక్కెట్లపై అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.