Nalgonda municipality
-
నీలగిరి మున్సిపల్ కమిషనర్ రాజీనామా.. కేసీఆర్ మనిషిగా ముద్ర!
నల్లగొండ టూటౌన్: నీలగిరి మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి గురువారం రాజీనామా చేశారు. గత సీఎం కేసీఆర్ సిద్దిపేటలో మున్సిపల్ కమిషనర్‌గా, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగి రమణాచారిని నీలగిరి పట్టణ అభివృద్ధి, సుందరీకరణ కోసం మున్సిపల్ కమిషనర్‌గా నియమించిన విషయం తెలిసిందే. 2022 జనవరి 5న రమణాచారి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నీలగిరి పట్టణంలో జరిగిన రహదారుల విస్తరణ, పట్టణ సుందరీకరణ పనుల్లో కీలక పాత్ర పోషించారు. రోడ్ల విస్తరణకు చాలా మంది వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా కూల్చుకొని మున్సిపాలిటీకి సహకరించారు. కేసీఆర్ మనిషిగా మద్ర పడిన రమణాచారి నీలగిరి మున్సిపల్ కమిషనర్‌గా దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. మున్సిపల్ ఉద్యోగులను విధి నిర్వహణలో ఉరుకులు, పరుగులు పెట్టించారు. మొదట్లో ఒక సంవత్సరం మాత్రమే ఉంటారని భావించిన మున్సిపల్ ఉద్యోగులు మొదట్లో ఆయన చెప్పిన సమయం ప్రకారం విధులు నిర్వహించారు. ఉదయం 8 గంటలకే విధులకు హాజరైన ఉద్యోగులు రాత్రి 8 గంటల వరకు కూడా కార్యాలయంలోనే ఉండే వారు. దాంతో రాను, రాను ఉద్యోగుల్లో సమయ పాలనపై అసంతృప్తి నెలకొంది. కేసీఆర్ పంపిన కమిషనర్ కావడం, పట్టణ అభివృద్ధికి పని గంటలు ఎక్కువ చేయాలని మొదట్లోనే రమణాచారి ఉద్యోగులకు వివరించడం కారణంగా ఉద్యోగులు మిన్నకుండిపోయారు. ఐదారు నెలల నుంచి ఇంకా ఎన్నాళ్లు ఎక్కువ పనిగంటలు.. అనే చర్చ ఉద్యోగుల్లో మొదలైంది. ఇటీవల ఉద్యోగులు కూడా ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకే ఉండడం మొదలు పెట్టారు. ఇంతలోనే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఉద్యోగుల్లో కూడా మార్పు వచ్చింది. కమిషనర్ కూడా మరో సంవత్సరం ఉండాలని కోరుకున్నా ప్రస్తుత అధికార పార్టీ నేత నుంచి హామీ దొరకలేదని తెలుస్తోంది. దాంతో మున్సిపల్ కమిషనర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. నూతన కమిషనర్‌గా వెంకటేశ్వర్లు నీలగిరి మున్సిపల్ కమిషనర్‌గా కందుకూరి వెంకటేశ్వర్లును నియమిస్తూ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాఆరోగ్య శాఖ ఎస్ఈగా పనిచేస్తున్న ఆయన గురువారం మున్సిపల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశ్వర్లు గతంలో నీలగిరి మున్సిపాలిటీ డీఈ, ఈఈ, ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. -
దశాబ్దాల దరిద్రం పోవాలె
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని, సరిపడా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ సహా ఉన్నతాధికారులను ఆదేశించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం అణువణువూ పరిశీలించాలని, అందుకు పాదయాత్ర చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి బుధవారం నల్లగొండలో పర్యటించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తండ్రి గాదరి మారయ్య దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కిశోర్‌తో పాటు ఆయన తల్లి సుజాత, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. మారయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో నల్లగొండ అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంఏయూడీ నుంచి ప్రత్యేక నిధులు ‘పట్టణ సమగ్రాభివృద్ధికి మున్సిపల్ శాఖ నుంచి (ఎంఏయూడీ) రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు మంజూరు చేస్తాం. ఈ ఏడాది, వచ్చే ఏడాది 2 విడతలుగా నిధులు ఇస్తాం. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల అభివృద్ధికి గతంలోనే హామీ ఇచ్చిన నేపథ్యంలో, నల్లగొండ పట్టణంతో పాటు ఆ మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలి..’అని సీఎం ఆదేశించారు. తాను 15 రోజుల్లో మళ్లీ వస్తానని చెప్పారు. 31న కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డిల పర్యటన ‘నల్లగొండ అభివృద్ధి కోసం పట్టణంలో పర్యటించి, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈనెల 31వ తేదీన నల్లగొండలో పర్యటించాలి. పాదయాత్రలు చేపట్టి అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాలి. రూ.110 కోట్లతో ఐటీ హబ్ వస్తోంది. రూ.36 కోట్లతో ఎన్జీ కాలేజీకి కొత్త భవన నిర్మాణం చేపట్టాలి..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకు అవసరమైన ఉత్తర్వులు రెండురోజుల్లోగా విడుదల చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ‘పట్టణ భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేయాలి. రోడ్లు వెడల్పు పనులు చేపట్టాలి. ప్రస్తుత బీట్మార్కెట్లో మోడల్ మార్కెట్ నిర్మించాలి..’అని సూచించారు. ఉదయ సముద్రం ట్యాంక్‌బండ్ అభివృద్ధి చేయాలి ‘లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు సబ్స్టేషన్లు నిర్మించాలి. ఉదయసముద్రం అద్భుతమైన నీటి వసతితో కళకళలాడుతున్న నేపథ్యంలో ట్యాంక్ బండ్‌ను అభివృద్ధి చేయాలి. ఆహ్లాదకరమైనరీతిలో అర్బన్ పార్కును అందుబాటులోకి తేవాలి. సభలు, సమావేశాలకోసం అధునాతన సౌకర్యాలతో రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన టౌన్ హాల్ నిర్మించాలి..’అని కేసీఆర్ ఆదే శించారు. ఇందుకోసం నగరం నడిబొడ్డున అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యేను, కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ‘ఉప్పల్ భగాయత్ మాదిరిగా లాండ్ పూలింగ్ చేపట్టి, కాలనీల నిర్మాణానికి పూనుకోవాలి. నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారుల కోసం ఫుట్‌పాత్ లు నిర్మించాలి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు వేర్వేరుగా శ్మశానవాటికల నిర్మాణాన్ని చేపట్టాలి..’అని సూచించారు. ప్రాజెక్టు కాలనీల వాసులకు ఇళ్ల పట్టాలు ‘ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి, దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన కుటుంబాలకు క్వార్టర్లకు, స్థలాలకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణప్పుడు అక్కడే నివాసం ఏర్ప ర్చు కున్న కాలనీవాసులతోపాటు, ఖమ్మం, నిజామా బాద్ జిల్లాల్లోని ప్రాజెక్టుల కింద కూడా ఈ సమస్యలున్నాయి. అక్కడ కూడా అర్హులైనవారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నవారికి శాశ్వతపట్టాలు కల్పించాలి. ఆ దిశ గా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి’అని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఫోన్లో ఆదేశించారు. టౌన్ హాల్ నిర్మాణానికి స్థల పరిశీలన సమీక్ష సమావేశం అనంతరం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న ఇరిగేషన్, ఆర్ అండ్ బీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ సందర్శించారు. ఆ స్థలం టౌన్ హాల్ నిర్మాణానికి అనువుగా ఉంటుందా అనే విషయాన్ని పరిశీలించారు. నీటిపారుదల శాఖ కార్యాలయాలను ఒకే చోటకు తరలించి టౌన్ హాల్ నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండకు సిద్దిపేట కమిషనర్ నల్లగొండ పట్టణం అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే మున్సిపల్ కమిషనర్‌ను వెంటనే నియమిస్తామని సీఎం చెప్పారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాల్సిందిగా అప్పటికప్పుడు ఫోన్లో ఆదేశించారు. నల్లగొండను అభివృద్ధి చేసేదాకా నిద్రపోవద్దని, సిద్దిపేట మాదిరిగా నల్లగొండనూ తీర్చిదిద్దా లని సూచించారు. ఆరు నెలల ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న ఆయనకు మూడేళ్లు ఎక్స్టెన్షన్ ఇస్తా మని తెలిపారు. ఆయన్ను వెంటనే పంపించాలని పక్కనే ఉన్న మంత్రి హరీశ్‌రావుకు చెప్పారు. ఏం నాయక్ బాగున్నావా? నల్లగొండ క్రైం: ఎమ్మెల్యే కిశోర్ నివాసం వద్ద నల్లగొండ జైలు సూపరింటెండెంట్ దేవ్లానాయక్ను.. ‘ఏం నాయక్ బాగున్నావా..’అంటూ సీఎం పలకరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. అప్పుడు దేవ్లానాయక్ ఆ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఆనాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఏదైనా అవసర పడితే కలవాలని సూచించారు. -
నల్గొండ మున్సిపాలిటీలో నిధుల స్వాహా
-
కమలం ‘చెయ్యి’స్తే.. గులాబీ ముల్లు గుచ్చింది..!
సాక్షి, నల్గొండ : నల్గొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కమలనాథులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్ఎస్తో చేసుకున్న లోపాయి కారి ఒప్పందం అమలుకాక పోగా.. బీజేపీ నవ్వులపాలైంది. అధికార పార్టీ వైస్ చైర్మన్ ఇవ్వకుండా బీజేపీకి మొండిచేయి చూపింది. దాంతో ముందుగా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కాషాయ నేతలకు ఇప్పుడు ‘గులాబీ’ నేతలు ముల్లు గుచ్చారు. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా టీఆర్ఎస్కు చెందిన అబ్బగోని రమేష్ గౌడ్‌ను సభ్యులు సోమవారం ఎనుకున్నారు. టీఆర్ఎస్-బీజేపీ ఓ వైస్ చైర్మన్..! నల్గొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం ఇక్కడ 48 వార్డులుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో 20 స్థానాల్లో గెలవగా, బీజేపీ 6 స్థానాలు, ఇండిపెండెంట్ ఒక స్థానం, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే బీజేపీ కీలకమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌కు చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ పదవి అని ఒప్పందం జరిగినట్టు తెలిసింది. అయితే, వైస్ చైర్మన్ పదవిని తామే ఇస్తామన్న టీఆర్ఎస్ బీజేపీని తమవైపునకు తిప్పుకోవడంలో సఫలం అయింది. టీఆర్ఎస్ హామీతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజున బీజేపీ తటస్థంగా వ్యవహరించింది. ఒక ఎంఐఎం, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో టీఆర్ఎస్ బలం బలం 22కు చేరగా.. ఎక్స్ అఫీషియో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఓటుతో పాటు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపు రెడ్డి ఓట్లతో టీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చివరికి వైఎస్ చైర్మన్ పదవిని కూడా అధికార పార్టీ దక్కించుకోవడంతో బీజేపీకి మొండి చేయ్యి మిగిలింది. వైస్ చైర్మన్ పదవికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు పల్లారాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపినా వారు అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మొత్తంగా కాషాయ నేతల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాం.. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగా వెళ్లామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నల్గొండలో బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఇక్కడికి కేసీఆర్ వస్తారని తెలిపారు. సెక్యులర్ పార్టీగా టీఆర్ఎస్ ఒక రాజకీయ విధానంతో ముందుకు వెళ్తోందని అన్నారు. నల్గొండలో మంచి పాలన చూపిస్తామని పేర్కొన్నారు. -
బీజేపీకి ఝలక్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి విషయంలో బీజేపీకి అధికార టీఆర్ఎస్ పార్టీ ఝలక్ ఇవ్వనుంది. వైస్ చైర్మన్ పదవిపై ఆశపడిన బీజేపీకి భంగపాటు తప్పేలాలేదు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్నిక సందర్భంలో తటస్థంగా ఉన్న బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని అనుకున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ఆ పదవిని కూడా దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా తమ పార్టీ కౌన్సిలర్లను నాగార్జునసాగర్ క్యాంపునకు తరలించింది. వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరిని ఎన్నిక చేయాలనే విషయాన్ని చర్చించనున్నారు. సోమవారం జరగనున్న వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్‌కే వైస్ చైర్మన్ పదవి దక్కించుకునే విధంగా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మారిన పరిణామాలు.. మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా.. చైర్మన్ ఎన్నిక విషయంలో సహకరిస్తారని.. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో బరిలోకి దిగింది. టీడీపీ, సీపీఎం ఒంటరిగానే పోటీచేశాయి. కాగా మొత్తం వార్డుల్లో 20 వార్డులు అధికార టీఆర్ఎస్ పార్టీ దక్కించుకోగా, కాంగ్రెస్ 20, బీజేపీ 6 వార్డులో విజయం సాధించగా, ఒక వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం సాధించగా, మరో వార్డులో ఎంఐఎం అభ్యర్థి విజయం గెలుపొందారు. టీఆర్ఎస్ రెబల్ కౌన్సిలర్‌తోపాటు ఎంఐఎం కౌన్సిలర్ కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలంటే బీజేపీ కౌన్సిలర్లు కీలకమయ్యారు. ముందస్తు ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి చైర్మన్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ఇరు పార్టీలు క్యాంపులు నిర్వహించాయి. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎక్స్అఫీషియో సభ్యులతో చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిపింది. కాగా అటు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు కలిపి, ఇటు టీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యుల సంఖ్య సమానం అయ్యే పరిస్థితులు కనిపించాయి. అయితే బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు కాకుండా టీఆర్ఎస్కే మద్దతు ఇచ్చే విధంగా ఆ పార్టీ నేతలు పావులు కదిపారు. రాష్ట్రస్థాయిలోనే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో బీజేపీ కౌన్సిలర్లు తటస్థంగా ఉండేలా చూశారు. అయితే కాంగ్రెస్ ఇచ్చే వైస్ చైర్మన్ పదవిని తామే ఇస్తామంటూ స్థానిక బీజేపీ నాయత్వాన్ని ఒప్పించారు. దీంతో చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు తటస్థంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎక్స్అఫీషియో సభ్యుల బలంతో చైర్మన్ స్థానాన్ని దక్కించున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ప్రస్తుతం బీజేపీకి వైస్ చైర్మన్ పదవి ఇస్తేపార్టీకి నష్టం జరుగుతుందని టీఆర్ఎస్లోని కొందరు.. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీకి వైస్ చైర్మన్ పదవిని ఇవ్వాలని మరికొందరు వాదన వినిపించారు. ఈ పరిస్థితిలో బీజేపీ వైస్ చైర్మన్ పదవి తీసుకునేందుకు సుముఖంగా లేదని ఆ పార్టీకి చెందిన నేతలే పేర్కొంటున్నారు. ఇటు టీఆర్ఎస్ బీజేపీకి ఇవ్వడం లేదని చెప్పుకుంటుండగా, బీజేపీ జిల్లాస్థాయి నేతలు కొందరు తమ పార్టీకి అవసరం లేదని పేర్కొంటూ వస్తున్నారు. టీఆర్ఎస్లోనూ వైస్ చైర్మన్‌కు పోటీ టీఆర్ఎస్ పార్టీలోనూ వైస్ చైర్మన్ పదవికి పోటీ పెరిగింది. చైర్మన్ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో వైస్ చైర్మన్ పదవిని బీసీల్లోని పలువురు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీజేపీకి మొండిచెయ్యి...? మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పని రెంటికీ చెడ్డ రేవడయ్యింది. అటు కాంగ్రెస్‌తో కలిసిపోయి వైస్ చైర్మన్ దక్కించుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ అగ్రనాయకత్వం బీజేపీకి ఇవ్వకూడదని సూచించినట్లుగా జిల్లా నేతలు పేర్కొంటున్నారు. దీంతో వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఆశగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: ఆ మాటలకు చాలా బాధపడ్డాను: కేజ్రీవాల్ -
బీజేపీకి నల్లగొండ వైస్ చైర్మన్ పోస్టు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పుర ఎన్నికల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. సోమవారం ముగిసిన మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఆ పార్టీ తన పట్టును నిరూపించుకుంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో ఆరు చోట్ల మున్సిపల్ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీ మాత్రమే కాంగ్రెస్ పరం కాగా నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఆ పార్టీ గెలుచుకుంది. కాగా, నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రం మంగళవారానికి వాయిదా పడింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం జరిగిన ఎన్నికలు ఉత్కంఠకు తెరలేపగా, మూడు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్కు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లే ఆధారమయ్యాయి. దీంతో మరీ ఎక్కువ నాటకీయ పరిణామాలేం లేకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆయా మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక, నల్లగొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రమే మిగిలి ఉంది. గండం గట్టెక్కించిన ఎక్స్ అఫీషియో ఓట్లు మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ మిర్యాలగూడ, నందికొండ, దేవరకొండలో మాత్రమే స్పష్టమైన మెజారిటీ సాధించింది. హాలియా, నల్గొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో సరిపడా మెజారిటీ రాలేదు. చండూరులో టీఆర్ఎస్కు అసలు అవకాశమే లేకుండా పోయింది. కాగా, మూడు మున్సిపాలిటీల్లో హాలియాలో స్వతంత్ర అభ్యర్ధి (టీఆర్ఎస్ తిరుగుబాటు) మద్దతు కూడగట్టడంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఓటుతో బయట పడింది. చిట్యాల మున్సిపాలిటీలో సైతం ఆరు స్థానాలకు గెలుచుకుని యాభై శాతం మెజారిటీ సాధించిన ఆ పార్టీకి ఒక్క ఓటు అవసరం పడింది. స్థానిక ఎమ్మెల్యే ఓటుతో ఆ మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ తన వశం చేసుకుంది. నల్లగొండలో ఐదు ఎక్స్ అఫీషియో ఓట్ల వినియోగం నల్లగొండ మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో టీఆర్ఎస్ 20, కాంగ్రెస్ 20 వార్డులు గెలుచుకుని సమానంగా నిలిచాయి. ఆరు స్థానాలున్న బీజేపీ మద్దతు ఏ పార్టీకైనా కీలకం అయ్యింది. టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థి ఓటు, ఎంఐఎం ఓటును టీఆర్ఎస్ కూడగట్టింది. ఈ పరిస్థితిలో మున్సిపాలిటీని దక్కించుకోవాలంటే బీజేపీ మద్దతు లేకుండా బయటపడాలంటే మరో ఐదు ఓట్లు అవసరం పడ్డాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే ఓటుకు తోడు మరో నలుగురు ఎమ్మెల్సీల ఓట్లను టీఆర్ఎస్ ఇక్కడ కేటాయించింది. దీంతో టీఆర్ఎస్కు 27 ఓట్లు సమకూరడంతో ఎన్నికల్లో సమస్యలేకుండా అయ్యింది. కాగా, చైర్మన్ పదవికి కాంగ్రెస్ నుంచి 32వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పోటీ పడగా, టీఆర్ఎస్ నుంచి 17వ వార్డు కౌన్సిలర్ మందడి సైదిరెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ సభ్యులంతా బుర్రి శ్రీనివాస్ రెడ్డికి అనుకూలంగా చేతులు ఎత్తి తమ మద్దతు తెలపగా.. టీఆర్ఎస్ అభ్యర్థి మందడి సైదిరెడ్డి అనుకూలంగా 22 మంది సభ్యులతోపాటు ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు చేతులు ఎత్తడంతో 27 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా చైర్మన్ ఎన్నిక సమయంలో బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీలో తమ ఓటును వినియోగించుకున్నారు. రాత్రికి రాత్రి ప్లేటు మార్చిన బీజేపీ నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, టికెట్ల కేటాయింపు దశ నుంచే కాంగ్రెస్, బీజేపీ అవగాహనతో కలిసి పనిచేశాయి. ఈ మేరకు కొన్ని వార్డుల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను కూడా పోటీకి పెట్టలేదు. మరికొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టింది. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి ఉమ్మడిగా మున్సిపల్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం జరిగింది. దీంతో టీఆర్ఎస్ జాగ్రత్త పడి ఎక్స్ అఫీషియో ఓట్లతో బయటపడేలా ప్లాన్ చేసుకుంది. అయితే.. చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీజేపీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా చేతులు ఎత్తలేదు. అలా అని టీఆర్ఎస్ అభ్యర్థికీ అనుకూలంగా ఎత్తలేదు. ఇలా తటస్థంగా ఉండేందుకు బీజేపీ సభ్యులు కొందరు టీఆర్ఎస్తో ఒప్పందం చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పెద్దమొత్తంలోనే డబ్బు చేతులు మారడంతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ పోస్టును బీజేపీ కేటాయించేలా ఒప్పందం కూడా జరిగిందని సమాచారం. మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యర్థిగా 36వ వార్డు కౌన్సిలర్ బండారు ప్రసాద్ పేరు ప్రచారంలోకి కూడా వచ్చింది. కేవలం కొన్ని సాంకేతిక కారణాలతో వైస్ చైర్మన్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేయించారని అంటున్నారు. రాత్రికి రాత్రి బీజేపీ ప్లేటు ఫిరాయించి టీఆర్ఎస్ చంకలో చేరడంతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. మొత్తంగా జిల్లాలో నల్లగొండలో ఈ పరిణామం మినహా ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండా ముగిశాయి. ► నీలగిరి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అభ్యర్థి మందడి సైదిరెడ్డికి అనుకూలంగా 22 మంది సభ్యులతోపాటు ఐదుగురు ఎక్స్ అఫీషియో సభ్యులవి కలిపి 27 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి శ్రీనివాస్‌రెడ్డికి అనుకూలంగా 20 ఓట్లు వచ్చాయి. దీంతో మందడి సైదిరెడ్డిని చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. కాగా చైర్మన్ ఎన్నిక సమయంలో బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంది. -మందడి సైదిరెడ్డి, చైర్మన్ (టీఆర్ఎస్) ► హాలియా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీకి 6 ఓట్ల(ఒకరు టీఆర్ఎస్ రెబెల్)తో పాటు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఓటుతో కలిసి ఏడు రాగా, కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆరు ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి వెంపటి పార్వతమ్మశంకరయ్యను మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. - వెంపటి పార్వతమ్మ, చైర్మన్ (టీఆర్ఎస్) ► మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్‌గా తిరునగరు భార్గవ్‌కు 27మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు ఒక బీజేపీ అభ్యర్థిని, ఎక్స్అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే భాస్కర్‌రావు మొత్తం 29మంది చేతులెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డికి 18 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒక సీపీఎం, ఒక స్వతంత్ర అభ్యర్థి మొత్తం 20 మంది చేతులెత్తారు. దీంతో భార్గవ్‌ను చైర్మన్‌గా ఎన్నికైనట్లుగా ప్రకటించారు. - తిరునగరు భార్గవ్, చైర్మన్ (టీఆర్ఎస్) ► నందికొండ (నాగార్జున సాగర్) మున్సిపాలిటీ తొలి చైర్మన్‌గా కర్ణ అనుషారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్‌పర్సన్‌గా కర్ణ అనూషారెడ్డిని బిన్ని ప్రతిపాదించారు. హిరేకార్ రమేష్‌జీ బలపర్చారు. ఒకటే నామినేషన్ రావడంతో అనూషారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. - కర్ణ అనూష, చైర్మన్ (టీఆర్ఎస్) ► దేవరకొండ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి 16వ వార్డుకు చెందిన కౌన్సిలర్ ఆలంపల్లి నర్సింహ పేరును మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 5వ వార్డు కౌన్సిలర్ వడ్త్య దేవేందర్ ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్ చిత్రం శ్రీవాణి బలపర్చింది. చైర్మన్ అభ్యర్థిగా నర్సింహ ఒక్కడే పోటీలో ఉండడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. - ఆలంపల్లి నర్సింహ, చైర్మన్ (టీఆర్ఎస్) ► చిట్యాల మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు హాజరయ్యారు. కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేసిన ఆనంతరం బయటికి వెళ్లి తిరిగి రాలేదు. టీఆర్ఎస్ సభ్యుల బలం ఏడుగురికి చేరడంతో కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. - కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి చైర్మన్ (టీఆర్ఎస్) ► చండూరు మున్సిపాలిటీలో పది మంది సభ్యులకుగాను ఏడు కాంగ్రెస్, ఒక్కటి బీజేపీ, 2 టీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ సభ్యులతో బీజేపీ జత కలవడంతో వీరి బలం 8కి చేరుకుంది. వీరందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా చేతులెత్తడంతో చైర్మన్, వైస్చైర్మన్లను గెలుచుకుంది. - తోకల చంద్రకళ, చైర్మన్ (కాంగ్రెస్) -
మున్సిపాలిటీ పేరిట నకిలీ సర్టిఫికెట్లు
నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపాలిటీని నకిలీ రశీదులు, నకిలీ సర్టిఫికెట్లు వెంటాడుతున్నాయి. గతంలో నకిలీ ఆస్తి పన్ను రశీదులు సృష్టించి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన అవినీతి ఆనకొండలపై వేటు పడిన విషయం తెలిసిందే. ఆస్తి పన్ను కాజేసిన ఘటనపై అప్పట్లో 23 మంది మున్సిపల్ ఉద్యోగులు సస్పెన్షన్ అయి రెండేళ్ల పాటు విధులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి నీలగిరి మున్సిపాలిటీ పేర నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు నీతిని బోధించే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారా లేక మున్సిపాలిటీ కార్యాలయంలోని ఇంటి దొంగల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సంబంధిత పాఠశాల వారు అనుమతుల కోసం విద్యాశాఖకు సమర్పించే సర్టిఫికెట్లు నకిలీవా, ఒరిజినల్‌వా అని చూడకపోవడంతో నకిలీ సర్టిఫికెట్లు చలామని అవుతున్నట్లు తెలిసింది. నీలగిరి పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వారు మున్సిపాలిటీ నుంచి శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టిఫికెట్లు పొందలేదు. దాంతో మున్సిపాలిటీ పేరు మీద సంబం«ధిత ప్రైవేట్ పాఠశాలకు నిరభ్యంతర సర్టిఫికెట్, శానిటరీ సర్టిఫికెట్ ఇచ్చి పాఠశాల అనుమతి కోసం సమర్పించారు. రెండు రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సంబంధిత పాఠశాలకు తాము ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదని మున్సిపల్ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారికి లేఖ రాశారు. మున్సిపల్ కార్యాల యం నుంచి పొందకుంగా సంబంధిత పాఠశాల యాజమాన్యం వారు విద్యాశాఖకు సమర్పించిన శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టి ఫికెట్ల ఎవరు సృష్టించారో తేలాల్సి ఉంది. వెయ్యి రూపాయల కోసం నకిలీవెందుకో...? ప్రైవేట్ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ నుంచి అన్ని అనుమతులు రావాలంటే మున్సిపల్ కార్యాలయం నుంచి శానిటరీ సర్టిఫికెట్, నిరభ్యంతర సర్టిఫికెట్ తీసుకొని వారికి సమర్పించాలి. సంబంధిత పాఠశాల సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ సిబ్బంది వెళ్లి పాఠశాలలో మౌలిక వసతులు, తాగు నీరు, మూత్రశాలలు, మరుగు దొడ్లు ఉండాలి. అదే విధంగా కాలనీలో నెలకొల్పిన పాఠశాలపై కాలనీవాసులు అభ్యంతరం తెలపకుండా ఉండాలి. దాని కోసమే నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్లకు కేవలం ఒక్కో దానికి రూ. 1000 మాత్రమే చెల్లించాల్సి ఉంది. ఒక పాఠశాల స్థాపించే వారు వెయ్యి, రెండు వేలకు భయపడతారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నకిలీపై నజర్ ... మున్సిపాలిటీ పేరు మీద నకిలీ సర్టిఫికెట్లు వెలుగు చూడడంతో వీటిపై నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉంది. ఈ నకిలీ బెడద కేవలం శానిటరీ సర్టిఫికెట్లు, నిరభ్యంతర సర్టిఫికెట్ల వరకే పరిమితం అయ్యాయా లేక ఇతర విభాగాలకు సంబంధించి కూడా ఏమైనా చలామణి అవుతున్నాయా అనే అనుమానాలు లేకపోలేదు. నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ రశీదు పుస్తకాల వ్యవహారం మున్సిపాలిటీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాంటి నకిలీ వ్యవహారాల వలన ఇటు మున్సిపాలిటీకి చెడ్డ పేరు రావడంతో పాటు పట్టణ ప్రజల్లోనూ అనేక అనుమానాలు రేకెత్తిస్తాయి. నకిలీ సర్టిఫికెట్లపై మున్సిపల్ అధికారులు నజర్ పెట్టి సూత్రదారులు, పాత్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు. -
నీలగిరి మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది?
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీ కమిషనర్ పోస్టు.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దశాబ్ద కాలంలో 20మందికి పైగా కమిషనర్లు మారారు. వచ్చిన వారు చాలావరకు తరచు లాంగ్లీవ్లు ఎందుకు పెడుతున్నారో అంతుచిక్కడం లేదు. అయితే అధికారులు స్వతంత్రంగా, రాజకీయాలకతీతంగా వ్యవహరించకపోవడం ఓ కారణంగా తెలుస్తోంది. దీనికితోడు స్థానికంగా ఉండే కీలకమైన ప్రజా ప్రతినిధులతోపాటు ఆయా పార్టీలలో ఉన్న ముఖ్య నాయకులను గమనంలోకి తీసుకోకుండా ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కొంతమంది రాజకీయ నాయకుల వ్యవహారశైలి, అధికారుల అత్యుత్సాహం ఇందుకు తోడవుతోంది. ఇక్కడ పనిచేయాలంటే కత్తి మీద సామే అనే స్థాయికి ప్రచారం తీసుకువచ్చారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే మున్సిపాలిటీలో ఉద్యోగంలోకి ఎక్కి ఇక్కడే రిటైర్డ్ అయిన వారు సైతం ఉన్నారు. కమిషనర్ లేని సమయంలో ఇన్‌చార్జ్‌ల పాలనలోనూ దాదాపు ఎటువంటి ఇబ్బందులూ లేవు. ఉద్యోగులు కూడ అవకాశాలను బట్టి నాయకుల రాజకీయ నాయకుల చంకన చేరడం, నాయకులు సైతం వారిని వెనకేసుకురావడం ఇక్కడి మున్సిపాలిటీలో సర్వ సాధారణంగా కనిపిస్తుంటుంది. ఆగిన ఫైల్స్ ... ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌కుమార్ గత మే నెలలో బాధ్యతలు స్వీకరించారు. గత నెల 7వ తేదీనుంచి 28వ తేదీ వరకు సెలవులో పెట్టారు. దానిని నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించుకున్నారు. విధుల్లో చేరిన ఆయన కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేసి మళ్లీ సెలవుపై వెళ్లారు. ప్రస్తుత కమిషనర్ ఈనెల 10వ తేదీ వరకు సెలవు పెట్టుకున్నా..తన సెలవును పొడిగించుకునే అవకాశం ఉంది. ఆయన డిజిటల్ సంతకం కూడా ఇంకా మారలేదు. వారం రోజులుగా కమిషనర్ లేక అనేక ఫైల్స్ ఆగిపోతున్నాయి. సంతకాల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం కమిషనర్ లేకపోవడం, ఎవరికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించకపోవడంతో పాలనకు అంతరాయం కలుగుతోంది. మున్సిపాలిటీ చుట్టూ రాజకీయాలు ... కొంతకాలంగా నీలగిరి మున్సిపాలిటీ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు ఇక్కడే ఉండడంతో మున్సిపాలిటీపై ఆధిపత్యంలో తమదే పైచేయిగా ఉండాలనే తాపత్రయం దశాబ్ధం నుంచి నడుస్తుంది. ఇటు ప్రతిపక్షం, అటు అధికారపక్షం వారు మున్సిపాలిటీ రాజకీయాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. రాష్ట్రంలో ఎవరి పార్టీ అధికారంలో ఉంటే వారికి నచ్చిన అధికారులను ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. దాంతో అధికారులు కూడా ఆదే పార్టీ వారికి కొంత సానుకూలంగా ఉండడం, వారి పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలాంటి సమస్యల తలెత్తి వివాదాస్పదంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య రగడ జరగడం, ఉద్యోగుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు వెళ్లడం తదితర కారణాలతో ఇక్కడికి వస్తున్న కమిషనర్లు ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు. -
అవినీతిపరులపై సర్కారు కొరడా
* నల్లగొండ మున్సిపాలిటీలో 21 మంది సస్పెన్షన్ * అవినీతి ‘పుర' కథనంపై సర్కారు స్పందన సాక్షి, హైదరాబాద్: పురపాలికల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సోమవారం ‘సాక్షి’లో అవినీతి ‘పుర’ం శీర్షికతో ప్రచురితమైన కథనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జల మండలి మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్‌పై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం.. తాజాగా ఆస్తి పన్నులను దారిమళ్లించిన ఇంటి దొంగల ఆటకట్టించింది. నల్లగొండ మున్సిపాలిటీలో ఏళ్ల తరబడిగా ఆస్తిపన్నుల మొత్తాలను దుర్వినియోగం చేస్తున్న 21 మంది ఉద్యోగులను మూకుమ్మడిగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకుడు బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలో ఆస్తి పన్నుల వసూళ్లలో తీవ్ర అక్రమాలను గుర్తించిన పురపాలక శాఖ.. కొన్ని నెలల కింద స్టేట్ ఆడిట్ విభాగంతో ప్రత్యేక ఆడిట్ జరిపించింది. 2011-15 మధ్యకాలంలో జరిగిన లావాదేవీల్లో రూ.3,32,59,133 దుర్వినియోగమైనట్లు స్టేట్ ఆడిట్ విభాగం నివేదిక ఇచ్చింది. ఆస్తి పన్నుల డిమాండ్లు, రసీదులతో పాటు ఖజానాలో జమ చేసిన బిల్లులకు ఏ మాత్రం పొంతన లేకపోవడం, రికార్డులను అడ్డగోలుగా దిద్ది లెక్కలను తారుమారు చేయడం తదితర లోపాల ఆధారంగా ఈ మేరకు అక్రమాలను నిర్ధారించారు. ఈ నివేదిక వచ్చిన వెంటనే అప్పట్లో అకౌంటెంట్ అరుణ కుమారితో పాటు మరో బిల్ కలెక్టర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టారు. మిగిలిన వారిపై చర్యలను పెండింగ్‌లో ఉంచి ఆడిట్ నివేదికపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీతో పునర్విచారణ జరిపించారు. తాజాగా సాక్షిలో వచ్చిన కథనం నల్లగొండతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో జరిగిన అక్రమాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. దీంతో తక్షణమే స్పందించిన పురపాలక శాఖ.. అక్రమాలకు బాధ్యులైన 21 మందిని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. సస్పెండ్ అయిన వారిలో నలుగురు బిల్ కలెక్టర్లు, 16 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఒక క్లర్కు ఉన్నారు. -
సర్కారీ ఉద్యోగులకూ ‘ఆసరా’!
ప్రభుత్వ ఉద్యోగులు, వారి తల్లిదండ్రులకు పింఛన్లు భర్త బతికే వున్నా, అసలు పెళ్లే కాకున్నా వితంతు పింఛన్లు నల్లగొండ మునిసిపాలిటీలో భారీ గోల్మాల్ ఒకే వార్డులో 13 ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు పింఛన్లు మున్సిపాలిటీ విచారణలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లు... సామాజిక, ఆర్థిక సమస్యలకు తోడు వృద్ధాప్యం, వైకల్యం, వైధవ్యంతో దీనస్థితిలో బతుకీడుస్తున్న అభాగ్యులకు కొద్దిపాటి ఊరట కలిగించే సాధనం. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ పథకం పక్కదారి పడుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంఛన్‌గా ఐదంకెల జీతాలు అందుకునే ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పింఛన్లు బొక్కేస్తున్నారు. ఐదొందలు, వెయ్యి రూపాయలకు కక్కుర్తిపడి అభ్యాగుల ‘ఆసరా’ను లాక్కుంటున్నారు. వడ్డించే వాడు మనోడే అని.. నల్లగొండ పురపాలక సంఘం పరిధిలో ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి భార్యలు, తల్లిదండ్రులు, సర్వీసు పెన్షన్‌దారులు సైతం ఆసరా పింఛన్లను అందుకుంటున్నారు. ఓ ఫిర్యాదు ఆధారంగా పురపాలక శాఖ జరిపిన ప్రత్యేక విచారణలో ఇలాంటి అక్రమాలు బహిర్గతమయ్యాయి. నల్లగొండ పట్టణంలోని 15వ వార్డులో ఆసరా పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల ఓ వ్యక్తి పురపాలక శాఖ రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు డీఈఈతో దీనిపై విచారణ చేపట్టగా నివ్వెరబోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ ఒక్క వార్డులోనే 13 పింఛన్లను ప్రభుత్వ ఉద్యోగులు, వారి భార్యలు, తల్లిదండ్రులు దిగమింగుతున్న విషయం వెల్లడైంది. నల్లగొండ పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల తల్లులు సైతం ఇందులో ఉన్నారు. భర్త బతికే వున్నా ఓ మహిళ వితంతు పింఛన్ అందుకుంటుండగా.. అసలు పెళ్లే కాని ఓ మహిళ సైతం వితంతు పింఛన్ పొందుతోంది. 65 ఏళ్ల వయసు లేని వారు సైతం వృద్ధ్యాప్య పెన్షన్లు తీసుకుంటున్నారు. స్థానిక మునిసిపల్ కమిషనర్ నుంచి పురపాలక శాఖకు చేరిన విచారణ నివేదికను ‘సాక్షి’ సంపాదించింది. వెంటనే ఈ పింఛన్లను రద్దు చేసి వీరి స్థానంలో అర్హులైన లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఉన్నతాధికారులు మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. బోగస్ లబ్ధిదారుల నుంచి పింఛన్ల సొమ్మును రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పారు. నల్లగొండలోని 15వ వార్డులో ‘ఆసరా’ అక్రమాల చిట్టా.. క్ర.సం లబ్ధిదారుడు భర్త/తండ్రి వివరం 1. జి. రాములమ్మ సాయిలు ఈమె ప్రభుత్వ ఉద్యోగి 2. కత్తుల ఆడివమ్మ నర్సయ్య ఈమె కుమారుడు విద్యుత్ శాఖ ఉద్యోగి 3. కత్తుల మల్లయ్య దుర్గయ్య కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు 4. కత్తుల యల్లయ్య వెంకయ్య ఇతనికి 65 ఏళ్లు లేకున్నా వృద్ధాప్య పింఛన్ 5. కత్తుల సత్తమ్మ చిత్తారి భర్త విద్యాశాఖ రిటైర్డు ఉద్యోగి. సర్వీసు పెన్షన్ లభిస్తోంది. 6. కత్తుల ముత్తమ్మ లింగయ్య భర్త ప్రభుత్వ ఉద్యోగి 7. మైనం లక్ష్మీ ఆదం భర్త చనిపోలేదు (వితంతువుగా అనర్హురాలు) 8. బి. హరిబాయమ్మ యల్లయ్య కొడుకు పోలీసు శాఖలో ఉద్యోగి 9. తీగల లచ్చయ్య లింగయ్య కొడుకు విద్యాశాఖలో ఉద్యోగి 10. కత్తుల రాములమ్మ లచ్చయ్య కొడుకు సమాచార, ప్రచార శాఖలో ఉద్యోగి 11. సముద్రాల భద్రమ్మ పెద్దయ్య భర్తకూ పెన్షన్ వస్తోంది. ఈమె వయసు 65 ఏళ్ల లోపే. 12. సముద్రాల భద్రమ్మ వెంకటేశ్వర్లు ఈమె కుమారుడు ప్రభుత్వ వైద్యాధికారి 13. బత్తుల లక్ష్మమ్మ యల్లమ్మ ఈమె కుమారుడు నల్లగొండ మునిసిపాలిటీలో ఉద్యోగి 14. కత్తుల పిచ్చమ్మ లింగయ్య ఈమె కుమారుడు నల్లగొండ మునిసిపాలిటీలో ఉద్యోగి 15. తగుళ్ల లక్ష్మి - ఈమెకు పెళ్లి కాలేదు. వితంతు పింఛన్‌కు అనర్హురాలు 16. రడంపల్లి చంద్రమ్మ భిక్షమయ్య ఈమె కుమారుడు రైల్వే శాఖలో ఉద్యోగి -
ఆధార్.. ఆహారభద్రతకుకుదరని లింకు..!
⇒ ఆహారభద్రత కార్డులకు పొంతన లేని 5.80లక్షల కుటుంబాల వివరాలు ⇒ మరో 4లక్షల మందికి ఆధార్ లేకుండానే... ⇒ 90వేల కుటుంబాలకు తాత్కాలిక అనుమతి ⇒ గ్రామాలు, మున్సిపాలిటీల్లో రెండు చోట్ల ఆహారభద్రత దరఖాస్తులు ⇒ బోగస్ కార్డుల ఏరివేతకు ఆధార్ తప్పనిసరి నల్లగొండ: ‘నల్లగొండ పట్టణం 9 వార్డులో నివాసముంటున్న లంగిశెట్టి రాధకు ఆధార్ కార్డులో ఆమె భర్త పేరు రమేష్ అనే ఉంది. ఆధార్ కార్డు వివరాలు ఆధారంగానే ఆహారభద్రత కార్డుకు దరఖాస్తు చేశారు. వార్డుల వారీగా ప్రకటించిన ఆహారభద్రత కార్డుల అర్హుల జాబితాలో కూడా ఆమె పేరు సరిగానే ఉంది. తీరా రేషన్ కోసం డీలర్ వద్దకు వెళ్లినప్పుడు మాత్రం ఆ జాబితాలో రాధకు బదులు సుగుణ అనే పేరు ఉంది. ఆధార్ నంబరు, చిరునామా అన్ని సరిగానే ఉన్నా పేరు మారింది. దీంతో డీలరు రేషన్ ఇవ్వకుండా నిలిపేశాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే ఈ తప్పు ఏ విధంగా జరిగింది.. అనే దానిపై మాత్రం అధికారులు నోరుమెదపలేదు’. ఇదొక్కొటే కాదు...ఇలాంటి సమస్యలు జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. పొంతనలేని వివరాలు... జిల్లా వ్యాప్తంగా 9.38 లక్షల ఆహారభద్రత కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి గాను 29లక్షల 17వేల కుటుంబాలు అర్హులుగా తేల్చారు. దీంట్లో 18,65,000వేల మంది ఆధార్ నంబర్లు ఇచ్చారు. ఇవిగాక మరో నాలుగు లక్షల మందికి ఆధార్ నంబరు లేకున్నప్పటికీ తహసీల్దార్లు రేషన్ ఇచ్చేందుకు అనుమతిచ్చారు. 90వేల మందికి తాత్కాలిక అనుమతులు జారీచేశారు. ఆధార్‌నంబర్ ఆహారభద్రత కార్డులకు జతచేసే ప్రక్రియ పూర్తికాకపోవడంతో తహసీల్దార్లు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 5.80లక్షల కుటుంబాలకు చెందిన చిరునామాల విషయంలోనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డు నంబరు ప్రకారం ఆన్లైన్లో ఆహారభద్రత దరఖాస్తుల వివరాలను పోల్చి చూసిన ప్పుడు అసలు సమస్య ఎదురైంది. ఆధార్ వివరాలకు, ఆహారభద్రత దరఖాస్తుల వివరాలకు పొంతన కుదరడం లేదు. ఆధార్ కార్డులో పేర్కొన్న చిరునామా, పేర్లకు, ఆహారభద్రత దరఖాస్తుల్లో నమోదైన వివరాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆహారభద్రత దరఖాస్తులను సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి సమగ్ర విచారణ చేశాయి. రెండు, మూడు స్టేజీల్లో వాటన్నింటినీ విచారణ జరిపిన తర్వాతే అర్హులుగా గుర్తించి జాబితా విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ వివరాలను, ఆధార్ యూఐడీ నంబరుతో ఆన్లైన్లో పరిశీలించినప్పుడు మాత్రం ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆహారభద్రతకు ఆధార్ కార్డు అర్హులు కాకపోయినప్పటికీ బోగస్ కార్డులు ఏరివేయాలంటే ఆధార్ కార్డుల్లో ఉన్న ఫొటోనే కీలకం. దీంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాష్ర్ట స్థాయిలోనే దీనికి పరిష్కారం దొరుకుతుందన్న దృ క్పథంతో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య చిక్కుముడి వీడేదాకా అర్హులుగా ఎంపికైన 9.38లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయక తప్పదు. వెలుగులోకి బోగస్ కార్డులు.. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండానే ఆహారభద్రతకు అర్హులైన వారిందరికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు. కానీ ఆ హారభద్రత కార్డుల జారీకి అవసరమయ్యే ఫోటోగుర్తింపు, బోగస్ కార్డుల ఏరివేతకు ఆధార్ కార్డు తప్పనిసరి. దీని ఆధారంగానే అనర్హులను ఏరివేసేందుకు వీలుంటుంది. ఇప్పటికప్పుడు బోగస్ ఏరివేతలపై దృష్టిసారించకున్నా కొత్త కార్డులు జారీ అయ్యే నాటికి ఆ వ్యవహారం కూడా పూర్తిచేస్తారు. తాజాగా నల్లగొండ మున్సిపాలిటీలో బోగ స్ కార్డులు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆధార్ కార్డు వివరాల ఆ ధారంగా ఆహారభద్రత కార్డుల దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో పోల్చి చూసినప్పుడు 3వేల బోగస్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. పట్టణానికి సంబంధంలే ని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొం దరు నల్లగొండ మున్సిపాలిటీలో కూడా దరఖాస్తు చేశారు. దీంతో గ్రామాలతో పాటు, మున్సిపాలిటీలో కూడా డబుల్ ఎంట్రీలు ఉండటంతో వాటిన్నింటినీ తిరస్కరించారు. -
సంఘటితం చేస్తా
* మహిళా సంఘాలకు మెప్మా పీడీ సర్వేశ్వర్‌రెడ్డి భరోసా విఐపి రిపోర్టర్,విట్టా సర్వేశ్వరరెడ్డి నల్లగొండ మున్సిపాలిటీలో స్వయం సహాయక సంఘాలు మొత్తం 21 వేలు ఉన్నాయి. దీంట్లో కేవలం పట్టణ ప్రాంతంలోనే 1626 సంఘాలు ఉన్నాయి. మండల పరిధిలోని గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత గ్రామీణ సంఘాలు కూడా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోకి వచ్చాయి. అయితే గ్రామాలు విలీనం కాకముందు నల్లగొండ పట్టణంలో ఉన్న సంఘాలు పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. పావలా వడ్డీ రుణాలు, బుక్కీపింగ్, స్వయం ఉపాధి కల్పన వంటి అనేక సమస్యలు వారు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతంలోని సంఘాల సమస్యలు, వారికి కావాల్సిన అవసరాలు, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వారికి అందుతున్నాయా..? లేదా?. బ్యాంకర్లు, మెప్మా సిబ్బంది నుంచి వారికి సహాయ,సహకారాలు అందుతున్నాయా..? లేదా ఇబ్బందులు ఏమైన పడుతున్నారా..? అనే విషయాలను తెలుసుకునేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్టు డెరైక్టర్ వి.సర్వేశ్వరరెడ్డి ఆదివారం ‘సాక్షి ప్రతినిధి’గా మారారు. నల్లగొండ పట్టణంలోని 34 వ వార్డులో సంఘాలతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నల్లగొండ పట్టణంలోని 34వ వార్డునుంచి సర్వేశ్వరెడ్డి వీఐపీ రిపోర్ట్. సర్వేశ్వర్‌రెడ్డి : అందరికీ నమస్కారం..? బాగున్నారా..? మహిళా సంఘాల సభ్యులు : నమస్కారం సార్..? బాగున్నాం. సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాలు ఏవిధంగా పనిచేస్తున్నాయ్..? మహిళలు : సంఘాల నిర్వహణ బేషుగ్గానే ఉంది. సభ్యులందరం కలిసిగట్టుగానే పనిచేస్తున్నాం. (అందులో లక్ష్మి అనే సభ్యురాలి దగ్గరికి వెళ్లి మాట్లాడారు.) సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాల్లో ఎప్పటినుంచి సభ్యురాలిగా ఉన్నారు..? లక్ష్మి : 14 సంవత్సరాల నుంచి సంఘంలో కొనసాగుతున్నాను. గతంలో రూరల్ సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. ఇప్పుడు అర్బన్‌లో మారాను. సర్వేశ్వర్‌రెడ్డి : సంఘాల్లో చేరిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నారు..? లక్ష్మి : మా సంఘంలో సభ్యులు తలోపని చేసుకుంటున్నాం. సభ్యులందరు స్వయం ఉపాధి పొందుతున్నారు. (అక్కడే ఉన్న మరో సభ్యురాలు సరస్వతితో మాట్లాడారు) సర్వేశ్వర్‌రెడ్డి : బ్యాంక ర్ల నుంచి, మెప్మా సిబ్బంది నుంచి ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా...? సరస్వతి : బ్యాంకులు దశలవారీగా రుణాలు ఇస్తున్నారు. మెప్మా నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. సర్వేశ్వర్‌రెడ్డి : మీ సంఘం అభివృద్ధి పరంగా ఏ స్థానంలో ఉంది? సరస్వతి : మా సంఘం ‘ఏ’గ్రేడ్‌లో ఉంది. పుస్తకాల నిర్వహణ, కంప్యూటర్ శిక్షణ పొందుతున్నాం. బుక్కీపింగ్ ఏ విధంగా చేయాలనే దా నిపై శిక్షణలు తీసుకున్నాం. సభ్యులు తీసుకున్న రుణాలు కూడా తిరిగి చెల్లింపులు జరిగేలా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. (అక్కడే ఉన్న మరో మహిళా సభ్యురాలు రశీదను పలకరించారు) సర్వేశ్వర్‌రెడ్డి : ముస్లిం మహిళలు సాధారణంగా బయటకు వచ్చి వ్యాపారులు చేసేందుకు ఆసక్తి చూపరు..అలాంటిది సంఘాల ద్వారా ఏ విధంగా లబ్ధిపొందుతున్నారు..? రశీద : మొదట్లో మేం చాలా పేదవాళ్లం. కానీ ఇప్పుడు సంఘాల్లో చేరిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నాం. ఇండ్లీ బండి, మటన్, చికెన్, పాల వ్యాపారం పెట్టుకుంటున్నాం. సంఘం ఏర్పడిన మొదట్లో రూ.30 వేలు మాత్రమే రుణం తీసుకున్నాం. ప్రస్తుతం రూ.5 లక్షల వరకు రుణం తీసుకునే స్థితికి మేం ఎదిగాం. సర్వేశ్వర్‌రెడ్డి : బ్యాంకర్లు లింకేజీలు ఇవ్వడంలో ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి..? (ధనమ్మ అనే మహిళతో) ధనమ్మ : బ్యాంకర్ల నుంచి మొదట్లో ఇబ్బంది ఉంది. వార్డుల వారీగా సంఘాలు విభజన జరిగిన తర్వాత నుంచి ఎలాంటి ఇబ్బందులూ లేవు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సహకరిస్తున్నారు. సర్వేశ్వర్‌రెడ్డి : మెప్మా నుంచి అమలవుతున్న పథకాలు మీకు ఏవిధంగా ఉపయోగపతున్నాయి...? (మరో మహిళ యాదమ్మతో) యాదమ్మ : జనశ్రీయోజన బీమా మా కుటుంబాన్ని కాపాడింది. మాకుటుంబంలో అనారోగ్య సమస్య వచ్చినప్పుడు బీమా పథకం నుంచి రూ.30 వేలు సాయం పొందాం. (గుంపులో ఉన్న మరో మహిళ దగ్గరికి వెళ్లారు. విజయారాణి అనే మహిళను పలకరిస్తూ..) సర్వేశ్వర్‌రెడ్డి : మగవాళ్ల దాడుల నుంచి మహిళలను కాపాడేందుకు ఏమైన కమిటీలు ఏర్పాటు చేశారా..? విజయారాణి : టీవీల్లో చూస్తున్నాం. అలాంటి కమిటీలు ఏర్పాటు చేస్తే మంచిది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక సెల్ ఏర్పాటు చేయాలి. మా సమస్యలపై అక్కడ చర్చించుకుని పరిష్కరించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తే బాగుటుంది. సర్వేశ్వర్‌రెడ్డి : త్వరలో సోషల్ యాక్షన్ కమిటీ ఏర్పాటు కాబోతుంది. దానిపై మీ స్పందన..? (మహిళలందరినీ కలిపి) మహిళలు : కమిటీలో మహిళలు సభ్యులుగా ఉండాలి. మగవాళ్ల దాడుల నుంచి కాపాడుకునేందుకు అవసరమైన రక్షణ చర్యలను పోలీస్ శాఖ కల్పిస్తే బాగుంటుంది. నాటుసారాకు అలవాటు పడి 60 ఏళ్లు బతకాల్సిన మగవాళ్లు 40 ఏళ్లకే చనిపోతున్నారు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలి. సర్వేశ్వర్‌రెడ్డి : అంగన్ వాడీ కేంద్రాలకు శనగపప్పు, కందిపప్పు సప్లయ్ చేశారు కదా..? సంఘాలకు ఏమైన ప్రయోజనం కలిగిందా..? మహిళలు : అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేయడం వల్ల మాకు కొంతమేర కమీషన్ వచ్చింది. అన్ని పట్టణాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. వాటిన్నింటికీ ప్రయోజనం కలిగేలా అంగన్వాడీ కేంద్రాలతో పాటు, హాస్టల్స్‌కు సరఫరా చేసే నిత్యావసరాలు, విద్యార్థులకు దుస్తులు కుట్టించే కార్యక్రమాన్ని కూడా పట్టణ సంఘాలకు అప్పగిస్తే బాగుంటుంది. తద్వారా మేం ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది. సర్వేశ్వర్‌రెడ్డి : స్వయం ఉపాధి శిక్షణలు ఇప్పిస్తే నేర్చుకుంటారా..? మహిళలు : సంఘాల్లో చదువుకున్న సభ్యులు ఉన్నారు. వారికి సెల్‌ఫోన్ రిపేరింగ్, అల్లికలు, టైలరింగ్, పూల అలంకరణ వంటి వాటిపై శిక్షణ ఇప్పిస్తే నేర్చుకుంటారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తే స్వయంగా ఉపాధి పొందుతాం. సర్వేశ్వర్‌రెడ్డి : గతంలో సంఘాలకు సీఐఎఫ్ రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. వాటిని సక్రమంగా వినియోగంచుకోలేదని ఫిర్యాదులొచ్చాయి..? మహిళలు : సీఐఎఫ్ ఫండ్‌ను సంఘాలు వివిధ అవసరాలకు ఉపయోగించుకున్నారు. సంఘాలకు తిరిగి చెల్లించడంతోపాటు వాటిని రుణాల రూపంలో మిగతావాటికి అందజేస్తున్నాం. మెప్మా పీడీ హామీలు.. * నల్లగొండ పట్టణంలో ఇప్పటివరకు ఒక్కటే పట్టణ సమైక్య ఉంది. కొత్తగా మరో సమైక్యను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. * పట్టణాల్లో సంఘాలను విస్తరింపజేస్తాం. * సంఘాల బలోపేతానికి ప్రత్యేక శిక్షణలు, ఉపాధి కల్పనకు కృషి. * పట్టణాల్లో వీధి వ్యాపారులకు చేయూత. * సంఘాలకు పెండింగ్‌లో ఉన్న వడ్డీ రాయితీ, ఉపకారవేతనాలు వీలైనంత త్వరలో విడుదల. * జాతీయ జీవనోపాధుల మిషన్ కింద నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట మున్సిపాల్టీలు ఎంపికయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. -
గలీజు దందా!
- నల్లగొండ మున్సిపల్ ఆస్తుల కిరికిరి - షాపులు ఖాళీ చేయించని అధికారులు - లీజుదారులకు రాజకీయ అండదండలు - హైకోర్టు స్టేఎత్తివేసి రెండు నెలలపైనే - నోరు మెదపని ఉన్నతాధికారులు సాక్షిప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ మున్సిపాలిటీలో పెద్ద మంత్రాంగమే నడుస్తోంది. పట్టణం నడిబొడ్డున ఉన్న వందలాది మున్సిపల్ షాపుల లీజు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఫలితంగా నెలనెలా మున్సిపాలిటీకి రావాల్సిన సుమారు రూ. 3.20 కోట్ల ఆదాయం రాకుండా పోతోంది. నెలకు రూ.10వేల నుంచి రూ.20 వేల దాకా అద్దె (బహిరంగ మార్కెట్ మేరకు..) రావాల్సిన షాపులకు కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తున్న వారున్నారు. అదికూడా 2008 నుంచి ఒక్కరూ చెల్లించడం లేదు. కొందరు లీజుదారుల అద్దె మూడు వందల రూపాయల కంటే కూడా తక్కువగానే ఉంది. ఇక, మున్సిపాలిటీ నుంచి 25ఏళ్ల లీజు తీసుకున్న వారిలో అత్యధికులు ఇతర వ్యాపారులకు వేలాది రూపాయల అద్దెకు ఇచ్చుకున్నారు. కాగా 234 మంది లీజుదారుల్లో మాజీ చైర్మన్ వెంకటనారాయణగౌడ్కు చెందిన పీవీఎన్ సినీ మ్యాక్స్ (సినిమా థియేటర్) కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయం విదితమే. మిగిలిన 233 మంది లీజుదారుల్లో కేవలం 137మందే కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. కాగా ఈ ఏడాది జూన్ 26వ తేదీనే ఈ స్టేను తొలగిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. చీఫ్ జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ రెండు నెలలుపైగా దాటిపోయినా, మున్సిపల్ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. కేవలం నోటీసులు మాత్రం ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. రాజకీయజోక్యంతో, లీజుదారులు సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేంత గడువు ఇచ్చేలా సాయం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి, పాతికేళ్ల లీజు పూర్తయిన మున్సిపల్ ఆస్తులన్నింటికీ తిరిగి వేలం నిర్వహించాలని 2009, ఆగస్టు25వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, కొత్తగా వేలం నిర్వహించలేదు. హైకోర్టు ఈఏడాది జూన్‌లో స్టే ఎత్తివేశాక, దుకాణ లీజుదారుల నుంచి ఒక్కొక్కరి నుంచి కనీసం రూ. 10వేల చొప్పున డబ్బులు వసూలు చేశారని సమాచారం. ఇలా వసూలు మొత్తం రూ.23.40లక్షల దాకా అయ్యింది. ఈ డబ్బును వెదజల్లే దుకాణాలకు కొత్తవేలం నిర్వహించకుండా అటు అధికారులు, ఇటు మున్సిపల్ పాలకవర్గాన్ని మేనేజ్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లోని దుకాణాలు కావడంతో వీటి అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ, మున్సిపల్ అధికారులు మాత్రం అతితక్కువ అద్దెకు లీజుకు ఇచ్చారు. నిధులలేమిని సాకుగా చూపెడుతూ పట్టణంలోని సమస్యలను పెండింగులో పెడుతున్న వీరు, మున్సిపాలిటికీ రావాల్సిన ఆదాయంపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. తక్షణం దుకాణాలకు కొత్త వే లంపాటకు నోటిఫికేషన్ జారీ చేసి, వేలం పూర్తి చేస్తే, లీజు అద్దెల రూపంలో రూ.కోట్లు మున్సిపల్ ఖజానాకు చేరే అవకాశం ఉంది. ఇక, దృష్టి సారించాల్సింది మాత్రం, రాష్ట్ర స్థాయిలోని మున్సిపల్ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్‌పాలక వర్గమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పూర్వ కమిషనర్‌పై చర్యలు
నల్లగొండ టుటౌన్ :ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నల్లగొండ మున్సిపాలిటీ పూర్వ కమిషనర్‌పై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. అయిన వారి కోసం నిబంధన లు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. 2010 వరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పని చేసిన ఎం.వెంకటేశ్వర్లు ప్రకాశం బజారులోని కూరగాయల మార్కెట్ కోసం నిర్మించిన దుకాణ సముదాయాన్ని వ్యాపారులకు కేటాయించడంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగం ఎదర్కొంటున్నారు. అర్హులైన తమకు దుకాణాలు కేటాయించకుండా కమిషనర్ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఇద్దరు వ్యాపారులు లోకాయుక్తను ఆశ్రయిం చారు. దీంతో ఆరు నెలల క్రితం మున్సిపల్ రీజినల్ డెరైక్టర్ విచారణ జరిపి నివేదికను కోర్టుకు అందజేశారు. పూర్తి వివరాలను పరిశీలించిన కోర్టు వెంకటేశ్వర్లుపై చర్యలకు ఆదే శించింది. 140 దుకాణాల్లో 15 దుకాణాలను ఒకే కుటుం బంలో నలుగురికి, ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించినట్లు విచారణలో తేలింది. గతంలో న్యూప్రేంటాకీస్ స్థలం విషయంలోనూ హైకోర్టు ఈయనపై మొట్టికాయలు వేసిన విషయం తెలి సిందే. వెంకటేశ్వర్లు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో పని చేస్తున్నట్లు తెలిసింది. దుకాణాల కేటాయింపే విరుద్ధం ప్రకాశం బజారులో కూరగాయల వ్యాపారుల కోసం మున్సిపాల్టీ ఆధ్వర్యంలో దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. వీటి కేటాయింపులో అర్హులైన చిరు వ్యాపారులకు కాకుండా బడా వ్యాపారులకు పెద్ద పీట వేశారు. మొత్తం 140 దుకాణాలలో అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని పలువురు వ్యాపారులు అప్పట్లో ఆందోళన కూడా చేశారు. ఓ బడా వ్యాపారి తన కుటుంబ సభ్యుల పేరు మీద నాలుగు దుకాణాలను దక్కించుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం కేటాయించడంతో దుకాణాలు దక్కని వారు లోకాయుక్తను ఆశ్రయించారు. కొంత మంది మూడు నాలుగు దుకాణాల మధ్య ఉన్న గోడలను కూల గొట్టి ఒకే దుకాణంగా నిర్వహిస్తున్నా అధికారులు నోరుమెదపడం లేదు. దుకాణా ల కేటాయింపు కూడా బహిరంగ వేలం ద్వారా కాకుండా అప్పటి అధికార పార్టీకి చెందిన వారు చెప్పిన విధంగా చేశారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. వేలానికి ఏర్పాట్లు ప్రకాశం బజారులో ఉన్న కూరగాయల మార్కెట్ సముదాయాన్ని బహిరంగ వేలం ద్వారా వ్యాపారులకు కేటాయించేందుకు మున్సిపల్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల గుత్తాధి పత్యానికి చెక్ పెట్టడానికి కోర్టు తీర్పు మున్సిపాల్టీకి అనుకూలంగా మారింది. -
హోరెత్తిన పురపోరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీల్లో మట్టి కరిపించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా ఆయా పార్టీలు జట్టు కట్టాయి. ఒక్క హుజూర్నగర్ నగర పంచాయతీలో మినహా కాంగ్రెస్ ఎక్కడా ఎవరితో స్థానిక అవగాహనకు పోలేదు. ఇక్కడ కాంగ్రెస్ సీపీఐతో అవగాహన కుదుర్చుకుంది. కోదాడలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దాదాపు అన్ని పార్టీలూ ఏకమయ్యాయి. సూర్యాపేటలో టీఆర్ఎస్, సీపీఐలు కలిసి పోటీ చేస్తున్నాయి. మిర్యాలగూడలో సీపీఎం, టీడీపీలు జట్టుగా ఉన్నాయి. భువనగిరిలో పార్టీలన్నీ వేర్వేరుగానే పోటీలో ఉన్నాయి. కాగా, జిల్లా కేంద్రమైన నల్లగొండలో మాత్రం కొన్ని వార్డుల్లో బీజేపీ, టీడీపీలు అవగాహనకు వచ్చాయి. ఇంకోవైపు టీఆర్ఎస్ మున్సిపాలి టీల్లో తమ ముద్ర వేసేందుకు పూర్తి స్థాయిలో కాకున్నా, మెజారిటీ వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. నల్లగొండ నల్లగొండ మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. వీటిల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఒంటిరిగానే తలపడుతోంది. పలుచోట్ల సీపీఎం, టీఆర్ఎస్ అవగాహన కుదుర్చుకున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం పలు వార్డుల్లో ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ 30 వార్డుల్లో సొంతంగా పోటీ చేస్తూ మిగిలిన స్థానాల్లో బీజేపీకి, బీజేపీఅభ్యర్థులు లేని వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపింది. బీజేపీ 18 వార్డుల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ పోటీ చేస్తున్న వార్డుల్లో ఆ పార్టీకి, మిగిలిన వార్డుల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతోంది. ఎంఐఎం, టీఆర్ఎస్ కూడా కొన్ని వార్డుల్లో అవగాహనతో పోటీలో ఉన్నాయి. అయితే, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇతర పార్టీలు ఛైర్పర్సన్ పీఠం దక్కించుకోవాలంటే ఫలితాల తర్వాత కచ్చితంగా తిరిగి అవగాహనకు వచ్చి ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాగా, కాంగ్రెస్ గుమ్మల జానకిని తమ ఛైర్పర్సన్ అభ్యర్థినిగా ప్రచారంలోకి తెచ్చింది. భువనగిరి భువనగిరి మున్సిపాలిటీలో 30 వార్డులు ఉండగా 20వ వార్డును టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. దీంతో 29 వార్డుల్లోనే ఇక్కడ ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్- 27 , టీడీపీ- 27, టీఆర్ఎస్- 22, బీజేపీ- 18, సీపీఎం- 5, ఆర్ఎల్డీ-2, ఎంఐఎం- 2, సీపీఐ- 1 వార్డులో పోటీలో ఉన్నాయి. 3 వార్డులో కాంగ్రెస్, ఇండిపెండెంట్ మధ్యన హోరాహోరీ పోరు జరుగుతోంది. 1నుంచి 10 వార్డుల వరకు కాంగ్రెస్, టీడీపీల మధ్యన ప్రధాన పోటీ జరుగుతోంది. 4వ వార్డులో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల మధ్యన పోటీ ఉంది. 5 వార్డులో కాంగ్రెస్, ఇండిపెండెంట్ (కాంగ్రెస్ రెబల్) టీడీపీ మధ్య పోటీనెలకొంది. ఇకపోతే 11 నుంచి 20 వార్డుల వరకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీల మధ్య గట్టి పోటీ ఉంది. 21 నుంచి 30 వార్డులకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య పోటీ నెలకొంది. 4, 30. 29 వార్డులలో టీఆర్ఎస్, 25వ వార్డులో సీపీఎం గట్టిపోటీ ఇస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లవరకు ముందంజలో ఉంది. టీడీపీ 5నుంచి 8 వార్డుల్లో , టీఆర్ఎస్ 2 నుంచి 4 వార్డుల్లో , బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మిర్యాలగూడ మిర్యాలగూడ మున్సిపాలిటీలో 36 వార్డులకుగాను 13వ వార్డును కాంగ్రెస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. దీంతో 35 వార్డులకు ఎన్నిక జరుగుతోంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ బరిలో ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులు 29 వార్డుల్లో, సీపీఎం 25 వార్డుల్లో, టీడీపీ 23, బీజేపీ 11, వైఎస్ఆర్ సీపీ ఒక వార్డులో పోటీ ఉంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక టీడీపీ - సీపీఎం మధ్య అవగాహన కుదిరింది. ఇరు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ తమ ఛైర్పర్సన్ అభ్యర్థినిగా పోకల పద్మను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ వారు ఎవరినీ ప్రకటించలేదు. అత్యధిక వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. టీడీపీ, సీపీఎంలకు చెందిన అభ్యర్థులు ఒక్కో వార్డులో ఇద్దరిద్దరు చొప్పున బరిలో ఉండడం తమకు లాభిస్తుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. సూర్యాపేట సూర్యాపేటలో ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు పూర్తిస్థాయిలో మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. టీఆర్ఎస్.. సీపీఐతో పొత్తు పెట్టుకుంది. టీడీపీ.. సీపీఎంతో పొత్తు కుదుర్చుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పది వార్డుల్లో పోటీ పడుతోంది. పోటీ తీవ్రంగా ఉండడంతో అత్యధిక స్థానాలు గెలుచుకుని ఛైర్పర్సన్ పోటీలో ఒంటరిగా నిలిచే అవకాశం ఎవరికీ కనిపించడంలేదు. ఏ పార్టీ సింగిల్‌గా పది వార్డులు మించి గెలుపొందే అవకాశాలు లేవు. కోదాడ కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే మొత్తం 30వార్డుల్లో పోటీలో ఉంది. రియల్ఎస్టేట్ వ్యాపారి వంటిపులి గోపయ్య కోడలికి చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ ప్రకటించింది. టీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీ చేస్తున్నాయి. వీటి ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్, సీపీయం, బీజేపీ, టీడీపీలు స్థానిక అవసరాల రీత్యా అవగాహనకు వచ్చి పోటీలోకి దిగాయి. ఈ నాలుగు పార్టీలు కలిసి దాదాపు 18 వార్డుల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 10వార్డుల్లో, ఇండిపెండెంట్లు రెండు వార్డుల్లో గట్టిపోటీని ఇస్తున్నారు.