రేవ్ పార్టీపై పోలీసులు దాడి | another rave party Busted in Hyderabad, youth arrested | Sakshi
Sakshi News home page

రేవ్ పార్టీపై పోలీసులు దాడి

Published Fri, Oct 24 2014 8:09 AM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM

రేవ్ పార్టీపై పోలీసులు దాడి - Sakshi

రేవ్ పార్టీపై పోలీసులు దాడి

హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి  చేశారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మురారిపల్లిలోని  హనిబర్గ్‌  రిసార్ట్స్లో యువతులకు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఈ దాడులు చేశారు.  రిసార్ట్స్ మేనేజర్తో పాటు పదిమంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది.  

పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ఏడుగురు నైజీరియన్లు ఉన్నారు.  మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వారిని తరలించారు. కాగా రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరగలేదని, కేవలం గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని వారు పేర్కొన్నారు.  మరోవైపు పోలీసులు దాడి చేస్తున్న సమయంలో మరికొంతమంది యువతీ యువకులు రిసార్ట్స్ నుంచి పరారీ అయినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement