youth arrest
-
పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. హత్యా? ఆత్మహత్యా?
లక్నో: పోలీస్ కస్టడీలో ఉన్న ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. నిందితుడి మరణాన్ని పోలీసులు ఆత్మహత్యగా చెబుతుంటే.. యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం అతనిది హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం(నవంబర్9) చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడిని సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన అల్తాఫ్ కుమారుడు చాంద్ మియాన్‌గా గుర్తించారు. వివారల్లోకి వెళితే.. యువతిని తీసుకొని పారిపోయిన కేసులో విచారించేందుకు యువకుడు అల్తఫ్‌ను పోలీసులు సోమవారం ఉదయం కస్గంజ్కు చెందిన సదర్ కొత్వాల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. చదవండి: పేదరికంతో అల్లాడిపోతున్న తల్లి.. మూడు రోజుల పసికందుని.. పోలీసులు యువకుడిని విచారణ చేస్తున్న క్రమంలో బాత్రుంకు వెళ్లాలని అడిగాడు. బాత్రూమ్ లోపలికి వెళ్లిన అతను లోపల నుంచి లాక్ వేసుకున్నాడు. కాసేపటి తరువాత ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు బాత్రూమ్ తలుపు తెరిచి చూడంతో నిందితుడు తన జాకెట్ హుడ్ను పైప్‌కు కట్టి గొంతు చుట్టూ బిగించుకొని ఉన్నాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. అయితే ప్రాథమిక విచారణలో నిర్లక్ష్యం వహించినందుకు అయిదుగురు పోలీసులను ఎస్పీ రోహన్ సస్పెండ్ చేశారు. వీరిలో కసన్‌గంజ్ స్టేషన్ అధికారి, ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉన్నారు. చదవండి: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్టు కాగా లాకప్‌లో ఉన్న తన కొడుకును పోలీసులే ఉరి తీశారని నిందితుడు అల్తాఫ్ తండ్రి చాహత్ మియా ఆరోపించారు. అల్తాఫ్ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం తన కొడుకును పోలీసులు తీసకెళ్లారని. తరువాత 24 గంటలకే అతను ఉరి వేసుకున్నాడని సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసులు కొడుకును జిల్లా ఆసుపత్రికి తరలించారని, అక్కడ వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారని ఆయన చెప్పారు. అంతేగాక యువకుడి లాకప్ మరణంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. आज दिनाँक 9.11.21 को जनपद के थाना कोतवाली कासगंज में बंदी की मृत्यु होने के संबंध में #SP @kasganjpolice द्वारा लापरवाही बरतने पर 5 पुलिसकर्मियों को निलंबित करने की कार्यवाही की गई है, प्रकरण में की जा रही अन्य कार्यवाही के संबंध में पुलिस अधीक्षक द्वारा दी गयी बाइट । pic.twitter.com/EvMnLA9ozG — KASGANJ POLICE (@kasganjpolice) November 9, 2021 -
బస్సులో యువకుల హంగామా.. మాస్క్‌లేకుండా.. ఉమ్ముతూ..
బెంగళూరు: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్ ఉధృతి మాత్రం ఇంకా తగ్గలేదు. అందుకే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన, కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. కాగా, చాలా చోట్ల.. ప్రజలు కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను మాస్క్ పెట్టుకొమ్మని అడిగినందుకు కండక్టర్‌ను చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచోసుకుంది. కెఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు గత గురువారం బెంగళూరు-హైద్రాబాద్ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో చదాలపూర్ గేట్ వద్ద ఇద్దరు యువకులు బస్సు ఎక్కారు. వీరిద్దరు మాస్క్‌ను పెట్టుకోలేదు. పైగా బస్సులో ఎక్కడంటే అక్కడ ఉమ్మివేయసాగారు. దీంతో తోటి ప్రయాణికులు కండక్టర్‌ను పిలిచి చెప్పారు. దీంతో కండక్టర్ వారిని మాస్క్ ధరించమని చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువకులిద్దరు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. ఇష్టం వచ్చినట్టు దూషించి, దాడికి కూడా తెగబడ్డారు. కాసేపు బస్సులో నానా హంగామా సృష్టించారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆ యువకులిద్దరిని పట్టుకుని, దేహశుద్ధి చేసి బస్సును నేరుగా చిక్కబల్లాపూర్‌లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులలో ఒకరిని కుప్పహల్లి గ్రామానికి చెందిన చిరంజీవిగా గుర్తించారు. మరో యువకుడు తప్పించుకున్నాడు. అయితే, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ కృష్ణయ్యను చిక్కబల్లాపూర్‌లోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసును నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. -
రచ్చ రచ్చ చేసి ఇలా దొరికిపోయారు
-
రచ్చ రచ్చ చేసి ఇలా దొరికిపోయారు
కాన్సాస్ : సినిమాను తలపించే రేంజ్లో చేజ్ జరిగింది. అయితే, అదెదో దొంగలనో.. ఉగ్రవాదులనో కాదు.. డ్రగ్స్ మత్తులో తూలుతున్న ముగ్గురు యువకులను. కళ్లు చెదిరే హైస్పీడ్ డ్రైవింగ్‌తో ఏ వాహనాలను దాటవేసుకుంటూ వెళుతున్నామో అనే అంశాన్ని కూడా లెక్కచేయకుండా చూసేవారికి ఒళ్లు జలదరించేంత వేగంతో వెళుతున్న వారిని పోలీసులు తరిమారు. దాదాపు పన్నెండు నిమిషాలపాటు ఈ వేట కొనసాగింది. చివరకు పోలీసుల ధాటికి తట్టుకోలేక వారు లొంగిపోయారు. ఎక్కడ తమవైపు బుల్లెట్లు దూసుకొని వస్తాయో అని వెంటనే కారు డోర్లు తీసి నేలపై పడుకున్నారు. దీంతో ఒకరు కాదు ఇద్దరు కాదు బృందాలుగా వచ్చిన పోలీసులు వారిని మొకాళ్లతో తొక్కిపట్టి చేతులు వెనక్కి విరిచి చేతులకు బేడీలు తగిలించారు. ఈ దృశ్యాలు కాన్సాస్‌లో రోడ్లపై నమోదయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం ఆ యువకులంతా కూడా ఫుల్లుగా మత్తులో ఉన్నారు. డ్రైవింగ్ చేసే క్రమంలో కొన్నివాహనాలను ఢీకొట్టారు. మధ్యలో మూడు చోట్ల డ్రగ్స్ ప్యాకెట్లు పడేశారు. చేజింగ్ ఎలా చేశారో ఈ వీడియోలో మీరే చూడండి. -
మెట్రో స్టేషన్‌కి గన్‌తో యువకుడు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఓ యువకుడు తుపాకీతో కనిపించి కలకలం రేపాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనిఖీలు చేసే సందర్భంలో అతడు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఢిల్లీలోని రద్దీగా ఉండే నెహ్రూ ప్లేస్‌లో మెట్రో రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ మెటల్ డిటెక్టర్ వద్ద మెట్రోలో ప్రయాణించే వాళ్లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందం ఉంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు చెక్ చేస్తుండగా వారిలో 21 ఏళ్ల సుమిత్ మిశ్రా యువకుడు కంగారుగా కనిపించాడు. దాంతో అతడిని ప్రత్యేకంగా తనిఖీ చేయగా తుపాకీ లభ్యం అయింది. దీంతో వెంటనే అధికారులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ యువకుడు ఎవరు, అతడి చేతుల్లోకి తుపాకీ ఎలా వచ్చింది? ఎందుకు అతడు తుపాకీతో మెట్రో స్టేషన్‌కు వచ్చాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రశ్నకు సంకెళ్లు!
► తల్లి లేని బిడ్డకు అన్యాయం జరిగిందని ప్రశ్నించడం నేరం.. ► హంతకులను శిక్షించమని డిమాండ్ చేయడం పాపం.. ► ఖాకీల కండకావరాన్ని ఎదిరించడం ద్రోహం.. ► చిన్నారిని చిదిమేసినోళ్లను అరెస్టు చేయమనడం ఘోరం.. అవును పోలీసుల తీరు జిల్లాలో అచ్చం ఇలాగే ఉంది. 13 ఏళ్ల బాలికను సొంత బావ లైంగిక దాడి చేసి చంపేస్తే ప్రశ్నించకూడదట.! మాట్లాడకూడదట!! ప్రశ్నించినోళ్లకు సంకెళ్లేశారు.. మాట్లాడినోళ్లకు నోటిసులిచ్చారు.. ప్రకాశం ఖాకీల ద్వంద్వ నీతిని ఎవరు ప్రశ్నించినా ఇంతేనేమో? పేర్నమిట్టపై అర్ధరాత్రి పోలీసుల దాడి తొమ్మిది మంది యువకుల బలవంతంగా అరెస్టు 41 మందికి నోటీసులిచ్చి వదిలేసిన పోలీసులు అనూరాధ హంతకులను శిక్షించమన్న ఫలితం.. సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్) : పేర్నమిట్టలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. సుమారు 60 మంది పోలీసులు ఒక్కసారిగా ఇళ్లపై పడి 9 మంది యువకులను అరెస్టు చేసి వాహనాల్లో కుక్కి ఒంగోలు రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించుకెళ్లారు. అర్ధరాత్రి ఏమి జరుగుతుందో తెలియక పేర్నమిట్ట వాసులు ఆందోళనకు గురయ్యారు. అనుమానాస్పదంగా మృతి చెందిన మాదాసు అనూరాధ కేసు ఘటన ముందు రోజు పేర్నమిట్టలోని కర్నూలు రోడ్డుపై జరిగిన రాస్తారోకోలో పాల్గొన్న వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారని ఆలస్యంగా తెలిసింది. ఒంగోలు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. అనూరాధ కేసులో ఆందోళన చేసిన మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అరెస్టయిన వారిలో రావూరి సుబ్బయ్య, కందుకూరి శ్రీనివాసరావు, కైలా వెంకట్రావు, పిడుగు రామకృష్ణారెడ్డి, కంభం బ్రహ్మయ్య, దాసరి కల్యాణ సుందరం అలియాస్ చినబాబు, జ్యేష్ట వెంకటేశ్వర్లు, అన్ను వెంకట సుబ్బారావు ఉన్నారు. వీరి అరెస్టులను నిరసిస్తూ సోమవారం ఉదయం పేర్నమిట్ట వాసులు దాదాపు 200 మంది కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. రాస్తారోకో చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న నెపంతో 41 మందికి నోటీస్‌లిచ్చారు. -
విద్యార్థిని కిడ్నాప్ చేసిన యువకుడు
హైదరాబాద్: పదో తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఎస్ ఐ వెంకట్ రెడ్డి కథనం ప్రకారం కుర్మగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి ఆంజనేయులు కుమార్తె(16) పదో తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (24) ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి పది రోజుల క్రితం ఇంటి నుంచి తీసుకెళ్లాడు. బాలిక ఆచూకీ కోసం గాలించిన కుటుంబసభ్యులు ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హలో.. నేను ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా
గుర్గావ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్నంటూ ఫోన్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల యువకుడు గుర్గావ్లోని ప్రముఖ హోటల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ముఖ్యమంత్రి సిఫారసు చేస్తున్నట్టుగా రెజ్యూమ్‌పై తప్పుగా పేర్కొన్నాడు. అంతేగాక రెండువారాల క్రితం ఆ యువకుడు సీఎం పేరుతో హోటల్ మేనేజ్మెంట్తో ఫోన్లో మాట్లాడి ఉద్యోగం కోసం దరఖాస్తు వ్యక్తిని (అతణ్నే) తీసుకోవాలని చెప్పాడు. అనుమానం రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్గావ్ పోలీసులు నిందితుడిని ఢిల్లీకి చెందిన అమిత్ కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేవారు. గురువారం కోర్టులో అమిత్ కుమార్‌ను హాజరపరచగా, ఒకరోజు పోలీస్ కస్టడీకి అప్పగించారు. అమిత్ హోటల్ మేనేజ్మెంట్లో కోర్సు చేశాడని, నగరంలోని క్రౌన్ ప్లాజాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడని, ఫోన్లో ముఖ్యమంత్రిగా మాట్లాడి మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. -
అడ్డదారిలో అమెరికా వెళ్లేందుకు యత్నించి..
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని భావించిన ఓ యువకుడు నకిలీ పత్రాలతో వీసా పొందేందుకు యత్నించి అమెరికా కాన్సులేట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బేగంపేట పోలీసులు శుక్రవారం ఇతడితో పాటు నకిలీ పత్రాలు సమకూర్చిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. అల్వాల్‌కు చెందిన బి.సాయివర్దన్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాలని భావించాడు. వీసా పొందేందుకు అవసరమైన పత్రాల కోసం కర్నూల్‌కు చెందిన డెంటిస్ట్ వెంకటేష్‌ను సంప్రదించగా... అతను రాజస్థాన్‌లోని సీజర్ యూనివర్సిటీలో చదివినట్లుగా నకిలీ విద్యార్హత పత్రాలు సృష్టించి ఇచ్చాడు. వీటితో సాయివర్దన్‌రెడ్డి బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో గత మార్చిలో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన అధికారులు అవి నకిలీవిగా గుర్తించారు. ఇదిలా ఉండగా... సాయివర్దన్‌రెడ్డి శుక్రవారం సర్టిఫికెట్ల కోసం యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి రాగా... అక్కడి అధికారుల సమాచారం మేరకు ఎస్ఐ నాగరాజు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. అలాగే, ఇతనికి నకిలీ పత్రాలు సమకూర్చిన వెంకటేష్‌ను సైతం పట్టుకున్నారు. ఇద్దరినీ శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
మహిళ పేరుతో ఫేస్బుక్ ఎకౌంట్ తెరిచి..
కోల్‌కతా: ఓ మహిళ పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఎకౌంట్ తెరిచి, ఆ పేజీలో నగ్న చిత్రాలు, అశ్లీల సాహిత్యాన్ని పోస్ట్ చేసిన నిందితుడి (23)ని పశ్చిమబెంగాల్లోని బుర్ద్వాన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. సయంతన్ సర్కార్ అనే యువకుడు కోల్‌కతాకు చెందిన ఓ మధ్య వయస్కురాలు పేరుతో ఫేస్బుక్లో నకీలీ ఎకౌంట్ తెరిచాడు. ప్రొఫైల్‌లో ఆమె ఫొటోలు ఉంచాడు. ఈ ఫేస్బుక్ పేజీలో నగ్నచిత్రాలు, అశ్లీల సాహితాన్ని, పోర్న్ వెబ్సైట్ల లింక్‌లను పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై 354, 509 సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. -
ఫేస్బుక్లో అమ్మాయిలకు వల.. బ్లాక్మెయిల్
హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని అమ్మాయిలను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న మజీద్ అనే వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్లు తెరిచి.. దాదాపు 200 అమ్మాయిలను మానసికంగా వేధించినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 18 నెలల నుంచి మజీద్ ఈ ఆగడాలు సాగిస్తున్నాడు. అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్లు ఓపెన్ చేసి కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న టీనేజ్ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునేవాడు. అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వారి వ్యక్తిగత సమాచారం రాబట్టేవాడు. వారి నగ్న ఫొటోలు పంపమనేవాడు. అనంతరం డబ్బులు ఇవ్వకుంటే ఈ ఫొటోలను పోర్న్సైట్లో పెడతానంటూ వారిని బెదిరించాడు. ఫోన్ నెంబర్లు తీసుకుని అమ్మాయిల తల్లిదండ్రులను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. మీ అమ్మాయి నగ్న చిత్రాలు తన దగ్గర ఉన్నాయని, వీటిని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించేవాడు. ఇలా ఓ అమ్మాయి నుంచి 86 వేల రూపాయలు వసూలు చేశాడు. తనను వెంకటేశ్వరరెడ్డిగా పరిచయం చేసుకున్న మజీద్ ఓ అమ్మాయిని ఇదేవిధంగా బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సైబరాబాద్ కమిషనర్ ను ఆశ్రయించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగు చూసింది. సైబరాబాద్ పోలీసులు నిందితుడు మజీద్‌ను అరెస్ట్ చేశారు. మజీద్ చర్యల వల్ల ఎందరో అమ్మాయిలు మానసిక క్షోభ అనుభవించారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోషల్ మీడియా వాడకం గురించి పిల్లలకు పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచించారు. -
పబ్‌లపై దాడి, యువతీ, యువకుల అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పలు పబ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పబ్ నిర్వహకులతో పాటు పలువురు యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు. సమయం మించి పబ్‌లు నిర్వహిస్తున్న సందర్భంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా పబ్‌లకు ఒంటిగంట వరకే అనుమతి ఇవ్వగా, నిర్వాహకులు మాత్రం తెల్లవారుజాము వరకూ పబ్‌లను నిర్వహించటం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో కూడా డ్రంకన్ డ్రైవ్ తప్పలేదు. హైదరాబాద్‌లో అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. 400మందిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో నిబందనలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మద్యం తాగి ఎవ్వరూ డ్రైవింగ్ చేయరాదని, ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడినా దండన తప్పదని హెచ్చరించారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు ఒంటిగంట తర్వాత డ్రైంకన్ డ్రైవ్ చేపట్టారు. -
బాప్‘రేవ్’!
శివారులో రేవ్ పార్టీల జోరు * ఈవెంట్స్ పేరిట యువతకు ఎర * అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు * నిద్రావస్థలో పోలీసులు మేడ్చల్: నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా గడిపే నగరవాసులు వీకెండ్లో సేదదీరేం దుకు.. జాలీగా గడిపేందుకు ఏర్పాటైన రిసార్టుల స్వరూపం మారుతోంది. యువతనే లక్ష్యంగా చేసుకుని ‘రేవ్ పార్టీల’ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చేస్తున్నారు నిర్వాహకులు. అర్థనగ్న నృత్యాలు, అశ్లీల కార్యక్రమాలు, మద్యం పార్టీలు నిర్వహిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్నారు. మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల్లో పదుల సంఖ్యలో రిసార్ట్లు వెలిశాయి. కాస్త ఆర్థిక స్థోమత ఉన్నవారు వారంలో ఏదో ఒకరోజు రిసార్ట్‌కు వచ్చి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడపడం వీటి ప్రధాన ఉద్దేశం. వీటిలో ముందుగా సభ్యత్వం తీసుకుని ఉండాలి. రిసార్ట్‌లో సభ్యులకే అనుమతి ఉంటుంది. అయితే యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని నిర్వాహకులు రేవ్ పార్టీలంటూ ఎరవేస్తున్నారు. నగరంలో నిఘా పెరగడంతో.. * నగరంలో పబ్‌లు, లాడ్జీలపై పోలీసుల నిఘా పెరగడంతో నగర శివారులోని రిసార్ట్‌లను క్లబ్బులుగా మార్చేశారు. ఇతర నగరాల నుంచి డ్యాన్సర్లను రప్పించి అందమైన షోలు నిర్వహిస్తూ యువకులను ఆకర్షిస్తున్నారు. రేవ్ పార్టీల పేరుతో అర్థనగ్న నృత్యాలు చేయిస్తూ దండుకుంటున్నారు. కొన్ని సంఘటనలు.. * 2011 సెప్టెంబర్ 6న శామీర్‌పేట్ రాజీవ్హ్రదారిపై మేడ్చల్ మండలం మురహరిపల్లిలోని ఓ రిసార్ట్‌పై పోలీసులు దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న 40మందికిపైగా యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. * 2011 నవంబర్ 14న మేడ్చల్ మండలంలోని మునీరాబాద్ శివారులో ఉన్న ఓ రిసార్ట్‌పై దాడులు నిర్వహించగా 30మంది యువతీయువకులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. పెద్దమొత్తంలో నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. * ఇటీవల మేడ్చల్ మండలంలోని రిసార్ట్ పరిధిలో ఉన్న ఓ భవనంలో రాసలీలలు సాగిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. 30మంది యువతీయువకులను అరెస్టు చేశారు. * మండల పరిధిలోని తుర్కపల్లిలో ఉన్న ఓ పాత పౌల్ట్రీఫాంలో ఇలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది. * తాజాగా మేడ్చల్ మండలం యాడారం సమీపంలోని ఓ రిసార్టలో అశ్లీల నృత్యాలు చేస్తూ పలువురు యువతీయువకులు పట్టుబడ్డారు. పథకం ప్రకారమే.. రిసార్ట నిర్వాహకులు పథకం ప్రకారమే అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నగరంలో ఉండే యువతను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు పన్నుతున్నారు. ఆర్థికస్థోమత ఉన్న యువతను టార్గెట్ చేసి రేవ్ పార్టీల పేరుతో వల వేస్తున్నారు. మద్యం, జూదం, హుక్కాలతో జల్సాలకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించి పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. నగరంలో నలుగురైదుగురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా కార్యకలాపాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు తెలిసినా మామూళ్ల మత్తు లో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. -
రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరిగింది: డీసీపీ
మేడ్చల్ : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనీబర్గ్ రిసార్ట్స్‌లో గతరాత్రి రేవ్ పార్టీ జరిగిందని బాలనగర్ డీసీపీ శ్రీనివాస్ ధ్రువీకరించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఏడుగురు నైజీరియర్లతో పాటు మరో ఏడుగురు బౌన్సర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న రిసార్ట్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పారు. పోలీసుల దాడుల నేపథ్యంలో పలువురు యువతులు తప్పించుకున్నారని ఆయన తెలిపారు. -
రేవ్ పార్టీపై పోలీసులు దాడి
హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మురారిపల్లిలోని హనిబర్గ్ రిసార్ట్స్‌లో యువతులకు అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఈ దాడులు చేశారు. రిసార్ట్స్ మేనేజర్‌తో పాటు పదిమంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు పోలీసులపై ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్ చేసినవారిలో ఏడుగురు నైజీరియన్లు ఉన్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు వారిని తరలించారు. కాగా రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరగలేదని, కేవలం గెట్ టు గెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని వారు పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు దాడి చేస్తున్న సమయంలో మరికొంతమంది యువతీ యువకులు రిసార్ట్స్ నుంచి పరారీ అయినట్లు సమాచారం. -
దెయ్యాలంటూ.. అర్ధరాత్రి హల్చల్
హైదరాబాద్ : 'ఇది బూత్బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి' అంటూ అర్ధరాత్రి సమయంలో ఓ బంగ్లా వద్దకు వచ్చి హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంత మంది యువకులు సోమాజిగూడ కుందన్‌బాగ్‌లోని ఓ పురాతన భవనం వద్దకు ఫొటోలు తీసుకున్నారు. వాటిని ఫేస్బుక్, వికీపీడియా యూట్యూబ్‌ల్లో పెట్టారు. 'ఇది బూత్బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి. ఎవరికైనా దమ్ముంటే అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లోకి వెళ్లాలి' అంటూ సవాల్ విసురుతున్నారు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లోకి వెళ్లి బిగ్గరగా అరవడం, రాళ్లతో కొట్టడం, బాటిల్స్ విసరడం వంటివి చేస్తున్నారు. మరో ఇంట్లో ఉంటున్న ఆ ఇంటి యజమాని శారద ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి అక్కడ హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు సోమవారం వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మళ్లీ ఇంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని ఆ యువకులతో ప్రమాణం చేయిం చారు. కాగా, ఆ బంగ్లాలో ఎలాంటి దుష్టశక్తులు లేవని, భయాందోళనకు గురికావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. -
నగ్నంగా తిరుగుతూ విద్యార్థినులకు వేధింపులు
హైదరాబాద్ : నగ్నంగా తిరుగుతూ పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు రోడ్ నెం.10 అవర్ ప్లేస్ హోటల్ వైపు నుంచి పార్కు మీదగా నడిచి వస్తుంటారు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న నేపాల్‌కు చెందిన దీపక్ తన ఇద్దరు అనుచరులతో కలిసి నిత్యం ఈ విద్యార్థినుల వెంటపడుతున్నాడు. తన దుస్తులు విప్పేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...దీపక్‌ను అరెస్ట్ చేశారు. అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)