
కాన్సాస్‌లో డ్రగ్స్ మత్తులో హైస్పీడ్ డ్రైవింగ్ చేసి పోలీసుల చేతికి చిక్కిన యువకులు
కాన్సాస్ : సినిమాను తలపించే రేంజ్‌లో చేజ్ జరిగింది. అయితే, అదెదో దొంగలనో.. ఉగ్రవాదులనో కాదు.. డ్రగ్స్ మత్తులో తూలుతున్న ముగ్గురు యువకులను. కళ్లు చెదిరే హైస్పీడ్ డ్రైవింగ్‌తో ఏ వాహనాలను దాటవేసుకుంటూ వెళుతున్నామో అనే అంశాన్ని కూడా లెక్కచేయకుండా చూసేవారికి ఒళ్లు జలదరించేంత వేగంతో వెళుతున్న వారిని పోలీసులు తరిమారు. దాదాపు పన్నెండు నిమిషాలపాటు ఈ వేట కొనసాగింది. చివరకు పోలీసుల ధాటికి తట్టుకోలేక వారు లొంగిపోయారు.
ఎక్కడ తమవైపు బుల్లెట్లు దూసుకొని వస్తాయో అని వెంటనే కారు డోర్లు తీసి నేలపై పడుకున్నారు. దీంతో ఒకరు కాదు ఇద్దరు కాదు బృందాలుగా వచ్చిన పోలీసులు వారిని మొకాళ్లతో తొక్కిపట్టి చేతులు వెనక్కి విరిచి చేతులకు బేడీలు తగిలించారు. ఈ దృశ్యాలు కాన్సాస్‌లో రోడ్లపై నమోదయ్యాయి. పోలీసులు వివరాల ప్రకారం ఆ యువకులంతా కూడా ఫుల్లుగా మత్తులో ఉన్నారు. డ్రైవింగ్ చేసే క్రమంలో కొన్నివాహనాలను ఢీకొట్టారు. మధ్యలో మూడు చోట్ల డ్రగ్స్ ప్యాకెట్లు పడేశారు. చేజింగ్ ఎలా చేశారో ఈ వీడియోలో మీరే చూడండి.