
నగ్నంగా తిరుగుతూ విద్యార్థినులకు వేధింపులు
హైదరాబాద్ : నగ్నంగా తిరుగుతూ పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు రోడ్ నెం.10 అవర్ ప్లేస్ హోటల్ వైపు నుంచి పార్కు మీదగా నడిచి వస్తుంటారు.
ఇదే ప్రాంతంలో నివసిస్తున్న నేపాల్కు చెందిన దీపక్ తన ఇద్దరు అనుచరులతో కలిసి నిత్యం ఈ విద్యార్థినుల వెంటపడుతున్నాడు. తన దుస్తులు విప్పేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...దీపక్ను అరెస్ట్ చేశారు. అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.