సాక్షి,హైదరాబాద్: నగరంలో డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా ఐటీ ఏరియా గచ్చిబౌలిలో ఎస్‌ఓటీ పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఐటీ ఉద్యోగులే ఓ గెస్ట్‌హౌజ్‌లో రేవ్‌పార్టీని నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్టీలో పాల్గొన్నవారిలో 8 మంది అమ్మాయిలు,12 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి స్వల్పంగా గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పార్టీలో పాల్గొన్న వారిని ఎస్‌ఓటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. రేవ్ పార్టీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో రేవ్ పార్టీలను అడ్డుకుని కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి.. వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు
Comments
Please login to add a commentAdd a comment