న్యూఢిల్లీ: మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి సారించింది. వచ్చే మూడేళ్లలో రూ. 1,500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రిసార్ట్స్ కొనుగోలు, కొత్తగా మరిన్ని గదులు నిర్మించడం మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీ ఎండీ, సీఈవో కవీందర్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. గత రెండున్నరేళ్లలో గదుల సంఖ్యను 1,000 పైగా పెంచుకున్నట్లు ఆయన చెప్పారు. (ఎన్‌డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్‌నకు 2 సీట్లు ఆఫర్)
ప్రస్తుతం మహీంద్రా హాలిడేస్‌కు దేశీయంగా 74, అంతర్జాతీయంగా 12 రిసార్టులు ఉండగా, 4,700 గదులు ఉన్నాయని వివరించారు. కొత్త ప్రాజెక్టుల కింద హిమాచల్ ప్రదేశ్‌లోని కందఘాట్ రిసార్ట్‌లో సుమారు రూ. 200 కోట్లతో 185 గదులు జోడిస్తున్నామని, అలాగే పుదుచ్చేరి రిసార్టులో రూ. 60–70 కోట్లతో 60 గదులు నిర్మిస్తున్నాని సింగ్ చెప్పారు. అలాగే గణపతిపులే ప్రాంతం (మహారాష్ట్ర)లో రూ. 250 కోట్లతో 240 గదుల రిసార్టును అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. (భారత్‌కు చమురు సరఫరాలో రష్యానే టాప్)
Comments
Please login to add a commentAdd a comment