హైదరాబాద్‌లో సినీ నటి పెళ్లి సందడి ఫేమ్, ధమాకా హీరోయిన్ శ్రీలీల సందడి చేశారు. గచ్చిబౌలి ఖానాపూర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వజ్రా గ్రూప్స్ రిసార్ట్స్ పూజా కార్యక్రమంలో నటి పాల్గొన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లేస్ ఎంతగానో అనుగుణంగా రూపోందించారని శ్రీలీల అన్నారు. ఈ నెల 25న రిలీజ్ అయ్యే ధమాకా కచ్చితంగా రికార్డు సృష్టిస్తుందని అన్నారు.
ఈ రిసార్ట్స్ అతి పెద్ద లాన్, ఎసీ హాల్, పూల్ సైడ్ మినిలాన్, రిసార్ట్స్ విత్ 50 రూమ్స్ అందుబాటులో ఉంటాయని ఆహ్వానం ఎండీ అరుణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వజ్ర ఇవెంట్స్ మూవీ ఇండస్ట్రీస్‌లో సక్సెస్‌తో పాటు ఇప్పుడు హాస్పిటాలిటీ రంగంలో కూడా రాణిస్తూ ఆహ్వానం రిసార్ట్స్ ప్రారంభించామని ఎండీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీనటీ శ్రీలీలతో పాటు ఎండీ అరుణ్ కుమార్, కౌన్సిలర్ అమరేందర్ రెడ్డి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment