
పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీలీల. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల పుష్ప-2లో కిస్సిక్ సాంగ్‌తో అభిమానులను కట్టిపడేసిన భామ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ కార్తీక్ ఆర్యన్ సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల.
అయితే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. పల్లీల పొడిని కారంలో కలుపుకుని తింటున్న వీడీయోను శ్రీలీల టీమ్ ట్విటర్‌లో షేర్ చేసింది. ఇందులో పీనట్ పొడిలో కారం కలుపుకుని ప్రతి రోజు తింటానంటోంది ముద్దుగుమ్మ. అంతేకాకుండా కారం పొడిని ఇంగ్లీషులో ఏమంటారని క్యూట్‌గా అడిగింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. శ్రీలీలీ బాలీవుడ్‌లోనూ ఎంట్రీకి సిద్ధమైంది. కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించనుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను ఇటీవలే మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మిస్తున్నారు.
Cutest video on internet ❤️❤️🥹@sreeleela14 #Sreeleela pic.twitter.com/o8xckGmsor
— Team Sreeleela™️ (@Teamsreeleela) February 19, 2025
Comments
Please login to add a commentAdd a comment