
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రవితేజతో మరోసారి జతకట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజాగా హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే అదే సమయంలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శ్రీలీలను అప్యాయంగా పలకరించారు. సరదాగా ఆమె బుగ్గలు గిల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీతమందించారు.
திருப்பதியில் நடிகை ஸ்ரீலீலா..கூட்டத்தில் சிக்கிய நடிகை..பதறி போன பௌன்சர்ஸ்..!
#thirupathi #sreeleela #thanthitv pic.twitter.com/SoCnn3jCE8— Thanthi TV (@ThanthiTV) June 25, 2024