![OYO enters sports hospitality, shortlists 100 hotels in 12 cities - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/16/OYO.jpg.webp?itok=vgNijOqO)
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టెక్ సంస్థ ఓయో తాజాగా స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. భారీ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె సహా 12 కీలక నగరాల్లో 100 హోటల్స్‌ను షార్ట్‌లిస్ట్ చేసింది.
వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు వసతి సదుపాయం కలి్పంచేందుకు ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. స్పోర్ట్స్ టీమ్‌లు, పెద్ద బృందాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు, గ్రూప్ బుకింగ్ ఆప్షన్స్ ఇస్తామని ఓయో వివరించింది. అలాగే క్రీడాకారులు, ఈవెంట్లను వీక్షించేందుకు వచ్చే వారి ఆహార, రవాణా అవసరాలను తీర్చే థర్డ్–పార్టీ ఏజెన్సీల సేవలను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment