hospitality sector
-
ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం
ముంబై: ఆతిథ్య పరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ రంగంలోని కంపెనీలకు (హోటళ్లు) ఒక్కో గది వారీ ఆదాయం 4.8 శాతం మేర అధికంగా సమకూరింది. రోజువారీ సగటు రూమ్ ధరల పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు ‘జేఎల్ఎల్ హోటల్ మూమెంటమ్ ఇండియా (2024 క్యూ2)’ నివేదిక వెల్లడించింది. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు, జూన్ క్వార్టర్లో ఆక్యుపెన్సీ (గదుల భర్తీ రేటు) స్వల్పంగా తగ్గినట్టు తెలిపింది. కార్పొరేట్ ప్రయాణాలు తగ్గడాన్ని కారణంగా పేర్కొంది. హోటళ్ల రోజువారీ సగటు రేటు (ఏడీఆర్) గోవాలో స్వల్పంగా క్షీణించగా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ మార్కెట్లలో ఏడీఆర్‌లో చెప్పుకోతగ్గ వృద్ధి కనిపించినట్టు, ముఖ్యంగా హైదరాబాద్ ఈ విషయంలో ముందున్నట్టు జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ హైదరాబాద్ ఆతిథ్య పరిశ్రమలో గదుల సగటు ఆదాయం మిగిలిన నగరాలతో పోలి్చతే మెరుగ్గా నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌లో 11.9 శాతం మేర ఆదాయం పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 11.8 శాతం, బెంగళూరులో 10.4 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఆక్యుపెన్సీ (గదుల భర్తీ) రేటు స్థిరంగా ఉంది. రోజువారీ సగటు ధరల పెరుగుదలే రూమ్ వారీ సగటు ఆదాయంలో వృద్ధికి తోడ్పడింది. ఇక కార్పొరేట్ ప్రయాణాలు తిరిగి ప్రారంభం కావడం, ఇతర కార్పొరేట్, సామాజిక సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలతో రానున్న త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్)నూ ఆతిథ్య పరిశ్రమలో మెరుగైన డిమాండ్ ఉండొచ్చని జేఎల్ఎల్ అంచనా వేసింది. -
ఆతిథ్య రంగంలో కొలువుల మేళా!
ముంబై: ఆతిథ్య రంగం నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీంతో వచ్చే కొన్నేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ఆతిథ్య పరిశ్రమలో డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సామర్థ్యాలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం నిపుణుల కొరతకు కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిశ్రమవ్యాప్తంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరాయం 55–60 శాతంగా ఉంటుందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా డైరెక్టర్ సంజయ్ శెట్టి తెలిపారు. కరోనా విపత్తు తర్వాత పరిశ్రమలో బూమ్ (అధిక డిమాండ్) నెలకొందని, వచ్చే కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆతిథ్య పరిశ్రమలో నియామకాలు 4 రెట్లు పెరిగిన ట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరంభ స్థాయి ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. నిపుణుల అంతరాన్ని అధిగమించేందుకు ఆతిథ్య కంపెనీలు తమ సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్టు నిపుణులు వెల్లడించారు. పోటీతో కూడిన వేతనాలు ఆఫర్ చేస్తూ ఉన్న సిబ్బందిని కాపాడుకోవడంతోపాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ‘‘2023లో పర్యాటకం, ఆతిథ్య రంగం 11.1 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. 2024 చివరికి 11.8 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. ఈ డిమాండ్ 2028 నాటికి 14.8 మిలియన్లకు పెరగొచ్చు. ఏటా 16.5 శాతం వృద్ధికి ఇది సమానం’’అని టీమ్‌లీజ్ బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత వివరించారు. ప్రస్తుత సిబ్బంది, భవిష్యత్ మానవ వనరుల అవసరాల మధ్య ఎంతో అంతరం కనిపిస్తున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్, స్టాఫింగ్ బిజినెస్ హెడ్ ఎ.బాలసుబ్రమణియన్ సైతం తెలిపారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అప్రెంటిస్షిప్ల ద్వారా నిపుణుల కొరతను తీర్చుకునేందుకు ఈ టాస్‌్కఫోర్స్ కృషి చేస్తోంది. -
ఈ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు
కోవిడ్ మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ పరిశ్రమ తీవ్ర ఎదురుదెబ్బను ఎదుర్కొంది. ఫలితంగా భారీగా తొలగింపులు జరిగాయి. అయితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలువడం, ప్రయాణాలు తిరిగి పుంజుకోవడంతో హోటల్స్ వ్యాపారంలో డిమాండ్ మళ్లీ పెరిగింది. దీంతో విస్తరణ ప్రణాళికలకు, గణనీయమైన నియామకాలకు దారితీసింది.రానున్న 18 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలుహోటళ్ల వ్యాపారం, హాలిడే ప్రయాణాలలో వృద్ధిని పొందేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆతిథ్య సంస్థలు తమ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్నాయి. టీమ్స్‌లీజ్ సర్వీసెస్ అంచనాల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్, పర్యాటక రంగం రాబోయే 12-18 నెలల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ ఉద్యోగ అవకాశాలలో దాదాపు సగం హోటల్ పరిశ్రమలోనే ఉంటాయని ఎకమిక్ టైమ్స్ నివేదించింది.దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుదలను సూచిస్తున్న అంచనాలతో, హోటల్ పరిశ్రమ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది. ఫార్చ్యూన్ హోటల్స్ ప్రతిష్టాత్మకమైన విస్తరణ ప్రణాళికల ద్వారా నియామకంలో 8-10 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. ఇక లెమన్ ట్రీ తమ ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు మద్దతుగా వేలాది మందిని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.డిమాండ్ వీరికే..ఫ్రంట్ డెస్క్ ఏజెంట్లు, గెస్ట్ రిలేషన్స్ మేనేజర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది డిమాండ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, చెఫ్‌లు వంటి నిపుణులకు కూడా అధిక డిమాండ్ ఉంది. ఆతిథ్య రంగంలోని అన్ని విభాగాల్లోనూ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్‌లో గణనీయమైన పెరుగుదల ఉన్నట్లు మ్యాన్‌పవర్ ఏజెన్సీలు నివేదించాయి. సేల్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ ఉద్యోగాలు, మానవ వనరులు ప్రత్యేకించి పరిశ్రమలో విస్తృత ఆధారిత పునరుద్ధరణను సూచిస్తున్నాయి.ఇక్రా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో హోటల్ పరిశ్రమ 7-9 శాతం స్థిరమైన ఆదాయ వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇది ఈ రంగం స్థితిస్థాపకత, పునరుద్ధరణ పథాన్ని నొక్కి చెబుతోంది. సాంప్రదాయ హోటల్ ఆపరేటర్లు మాత్రమే కాకుండా, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా హైరింగ్‌లో స్పీడ్ పెంచనున్నాయి. -
స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి ఓయో
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టెక్ సంస్థ ఓయో తాజాగా స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. భారీ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె సహా 12 కీలక నగరాల్లో 100 హోటల్స్‌ను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు వసతి సదుపాయం కలి్పంచేందుకు ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. స్పోర్ట్స్ టీమ్‌లు, పెద్ద బృందాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు, గ్రూప్ బుకింగ్ ఆప్షన్స్ ఇస్తామని ఓయో వివరించింది. అలాగే క్రీడాకారులు, ఈవెంట్లను వీక్షించేందుకు వచ్చే వారి ఆహార, రవాణా అవసరాలను తీర్చే థర్డ్–పార్టీ ఏజెన్సీల సేవలను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. -
నయా ఆతిథ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆతిథ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశ, విదేశీ పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఆతిథ్య’ మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకాభివృద్ధి సంస్థ హరిత హోటళ్లను ఆధునికీకరించేందుకు కార్యాచరణ రూపొందించింది. సుమారు రూ.140 కోట్లతో తొలి దశలో 16 హోటళ్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగంలో అనుభవజు్ఞలైన అర్కిటెక్చర్లతో హోటళ్లకు హంగులు అద్దుతోంది. విశాఖ నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఈ–టెండరింగ్ ప్రక్రియ ద్వారా హరిత హోటళ్ల అప్‌గ్రేడ్, పునర్నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 16 హోటళ్ల పనులకు పరిపాలన అనుమతులు వచ్చాయి. విశాఖలోని యాత్రీనివాస్ హోటల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. అరకులోని హరిత వ్యాలీ రిసార్టు, నెల్లూరు, ద్వారకాతిరుమలలోని హోటళ్ల పనులు చేపట్టేందుకు టెండర్లు ఖరారయ్యాయి. ఒకట్రెండు రోజుల్లో ఒప్పంద ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. మరో వారంలోగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని టైడా జంగిల్ బెల్స్ రిసార్టు, విజయపురిసౌత్, శ్రీశైలం, సూర్యలంక, కడప, అరకులోని మయూరి, హార్సిలీహిల్స్, కర్నూలు, గండికోట హోటళ్లతో పాటు నెల్లూరు మైపాడు బీచ్ రిసార్టు, దిండి కోకోనట్ రిసార్టు, అనంతగిరి హిల్ రిసార్టులకు టెండర్లు పిలవనుంది. అత్యాధునిక సౌకర్యాలతో.. ఆతిథ్య రంగంలోని ప్రైవేటు హోటళ్లకు దీటుగా ఏపీటీæడీసీ హరిత హోటళ్లను తీర్చిదిద్దుతోంది. ప్రతి హోటల్లో లగ్జరీ ఫర్నీచర్ నుంచి గోడలకు పెయింటింగ్, ఇంటీరియర్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. రెస్టారెంట్, స్పా, మోడ్రన్ జిమ్, స్విమ్మిగ్ పూల్, సావనీర్ షాపు, మినీ బ్యాంకెట్/సమా వేశ మందిరం, టెర్రాస్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, టీవీ యూనిట్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఉడెన్ ర్యాక్స్, టేబుల్ విత్ మిర్రర్, లైటింగ్, డ్రై–వెట్ ఏరియా ఉండేలా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది. పార్కింగ్ సౌకర్యం, ల్యాండ్ స్కేపింగ్, పచ్చదనాన్ని పెంచనుంది. పులివెందులలో 4స్టార్ హోటల్ పులివెందులలో రూ.23.50 కోట్లతో 4స్టార్ హోటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యలో నిర్మాణం నిలిచిపోయిన 1.71 ఎకరాల్లోని ఓ భవనాన్ని గుర్తించి కొనుగోలు చేసింది. ఇందులో వసతి గదులు, కన్వెన్షన్ సెంటర్ (క్లబ్ హౌస్), జిమ్, పిల్లల ఆటస్థలం, ఎలివేటర్స్, సరై్వలెన్స్ సిస్టమ్, సౌర విద్యుత్ స్టేషన్‌తో పాటు ఇతర ముఖ్యమైన మౌలిక సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. సౌకర్యాల కల్పనలో రాజీపడం పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తొలుత హరిత హోటళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. అత్యధిక పర్యాటకులు వచ్చే హోటళ్లను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తున్నాం. దశల వారీ అన్ని హోటళ్లలో మార్పులు చేస్తాం. నాణ్యమైన సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. స్టార్ హోటళ్లకు దీటుగానే మా రిసార్టులు, హోటళ్లను తీర్చిదిద్దుతాం – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్ణీత కాల వ్యవధిలో.. హోటళ్ల ఆధునికీకరణలో భాగంగా ఈ–టెండర్ల ద్వారా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు, అనుభవం కలిగిన ఆర్కిటెక్చర్ల సమన్వయంతో పని చేస్తున్నాం. సుదీర్ఘ అధ్యయనం తర్వాతే ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాం. పర్యాటక సీజన్ ప్రారంభమయ్యే లోగా పనులు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం. అనుకున్న కాల వ్యవధిలో పూర్తి స్థాయిలో హోటళ్లను అప్‌గ్రేడ్ చేసేలా పర్యవేక్షిస్తున్నాం. – మల్రెడ్డి, ఈడీ (ప్రాజెక్ట్స్), పర్యాటకాభివృద్ధి సంస్థ -
ఒమిక్రాన్: జస్ట్ క్యాన్సిలేషన్స్తోనే రూ.200 కోట్ల నష్టం!
కరోనా దెబ్బకు ఆర్థికంగా దాదాపు ప్రతీ రంగం కుదేలు అయ్యింది. ముఖ్యంగా ప్రయాణాలు, కొవిడ్ రూల్స్ కారణంగా భారీగా నష్టపోయిన వాటిల్లో ఒకటి హాస్పిటాలిటీ సెక్టార్(ఆతిథ్య రంగం). అయితే పూర్వవైభవం సంతరించుకుందని సంబురపడే లోపే.. ఈ రంగంపై మరో పిడుగు పడింది. అది ఒమిక్రాన్ రూపంలో. తాజాగా ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు ఆతిథ్య రంగాన్ని మంచి సీజన్లో చావు దెబ్బ తీస్తున్నాయి. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో ఆతిథ్య రంగానికి వాటిల్లిన నష్టం లక్షల కోట్ల రూపాయల్లోనే!. అందునా వారం రోజుల వ్యవధిలో సుమారు 200రూ. కోట్లు నష్టపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరో విశేషం ఏంటంటే.. ఈ నష్టం కేవలం బుకింగ్ క్యాన్సిలేషన్ ద్వారా వాటిల్లింది కావడం. యస్.. డిసెంబర్ 25 నుంచి జనవరి 31 మధ్య ఆతిథ్య రంగం ఈ మేర నష్టం చవిచూసింది. క్రిస్మస్, న్యూఇయర్‌తో పాటు వెడ్డింగ్స్, ఇతరత్ర ఈవెంట్స్ రద్దు ద్వారానే ఈ నష్టం వాటిల్లిందని ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మాంచి సీజన్ మీదే.. కరోనా సీజన్లో బుకింగ్‌లు లేక పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్స్ వెలవెలబోయాయి. నెలలపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో కోలుకోలేని దెబ్బ పడింది. 8 శాతం బిజినెస్ శాశ్వతంగా మూతపడింది కూడా!. తద్వారా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో భారీ నష్టమే వాటిల్లింది. అయితే రెండు వేవ్‌లు అన్-సీజన్లో రావడంతో ఆతిథ్య రంగంపై నష్టం మరీ ఘోరంగా అయితే లేదు. కానీ, ఇప్పుడు వేడుకల సమయం. పైగా పెళ్లిళ్ల సీజన్. వ్యాక్సినేషన్ కూడా నడుస్తుండడంతో వ్యాపారాలు గాడిన పడతాయని అంతా భావించారు. ఇప్పుడేమో ఒమిక్రాన్ వల్ల పరిస్థితి ఊహించిన విధంగా లేదు. మొత్తంగా ఎంత నష్టం వాటిల్లింది.. మునుముందు ఎంత నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న దానిపై లెక్కలు కట్టే పనిలో ఉంది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్. అందుకే నష్టస్థాయి ఊహించినదానికంటే ఘోరంగా ఉండొచ్చనే ఆందోళనలో ఆతిథ్య రంగం ఉందని ఎఫ్హెచ్ఆర్ఏఐ సెక్రటరీ ప్రదీప్ శెట్టి చెబుతున్నారు. ఒమిక్రాన్ వల్లే.. అక్టోబర్ 2021 నుంచి హోటల్స్, రెస్టారెంట్ల బుకింగ్‌లు పెరుగుతూ వస్తుండడంతో హాస్పిటాలిటీ రంగానికి మంచి రోజులు వచ్చినట్లు భావించారంతా. డిసెంబర్ రెండో వారం నాటికి ఈ బుకింగ్‌లు ఏకంగా 80-90 శాతానికి చేరాయి( కార్పొరేట్ హోటల్స్‌లో అయితే అది 50 శాతం మార్క్ దాటింది). కానీ, కొత్త వేరియెంట్ ప్రభావంతో పరిస్థితి తలకిందులైంది. డిసెంబర్ 25 నుంచి హోటల్స్ ఆక్యుపెన్సీ, రేట్లు గణనీయంగా పడిపోతూ వస్తున్నాయి. ఆంక్షలు-కర్ఫ్యూలు, ఆక్యుపెన్సీ నిబంధనలు, కస్టమర్ల భయాందోళనల నడుమ అప్పటికే అయిన బుకింగ్స్ దాదాపు 60 శాతం మేర రద్దయ్యాయి. కరోనా తొలినాళ్లలోలాగా ఇప్పుడు మళ్లీ పది నుంచి 15 శాతం ఆక్యుపెన్సీతో హోటల్స్ బిజినెస్ నడుస్తోంది. మునుముందు కఠిన ఆంక్షలు విధిస్తే.. ఈ కాస్త ఆక్యుపెన్సీ కూడా ఉండకపోవచ్చనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వ సాయం! ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందో అనే ఆందోళన ఆతిథ్య రంగంలో నెలకొంది. మరోవైపు రెస్టారెంట్లలోకి అడుగుపెట్టేవాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని, డిసెంబర్లో 50 శాతం ఉన్న అమ్మకాలు, ఆదాయాలు.. ఇప్పుడు కేవలం 10-20 శాతానికి పడిపోయాయని ఎఫ్హెచ్ఆర్ఏఐ అంటోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మద్దతు కోరుకుంటోంది ఆతిథ్య రంగం. భౌతిక దూరం ఇతరత్ర కొవిడ్ రూల్స్ పాటిస్తామని, ప్రతిగా తమకు ఊరట-మినహాయింపులు ఇవ్వాలని కోరుతోంది ఎఫ్హెచ్ఆర్ఏఐ. అదే విధంగా ఉద్యోగుల జీతభత్యాల భారంగా మారుతున్న తరుణంలో.. పన్నులు తగ్గింపులాంటి మినహాయింపులు ఆశిస్తోంది కూడా. సంబంధిత వార్త: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండవచ్చంటే.. -
ఉద్యోగుల ఎల్టీసీ విషయంలో కీలక సూచన?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ స్థానంలో లీవ్ ట్రావెల్ కన్సెషన్ వోచర్‌ను అనుమతించడాన్ని తిరిగి పరిశీలించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖను ఆతిథ్య పరిశ్రమ కోరింది. మరో 2 నెలల్లో కేంద్రం తదుపరి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తీసుకరానున్న నేపథ్యంలో పరిశ్రమ తన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన లేఖను హోట ల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా (ఎఫ్హెచ్ఆర్ఏఐ) వైస్ ప్రెసిడెంట్ గుర్‌బక్సి సింగ్ కోహ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపారు. 2020లో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించడంతో.. ఉద్యోగులు తమ ఎల్టీసీ (కుటుంబ సమేతంగా చేసే పర్యటనకు ఇచ్చే అలవెన్స్) ప్రయోజనాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన కేంద్రం ఎల్టీసీ వోచర్‌ను తీసుకొచ్చింది. ఎల్టీసీ ప్రయోజనం మేర ఉత్పత్తులు, సేవల కొనుగోలుకు చెల్లింపులు చేసుకునేందుకు అనుమతించింది. పరిశ్రమ పుంజుకునేందుకు వీలుగా దీన్ని సమీక్షించాలని ఎఫ్హెచ్ఆర్ఏఐ తాజాగా కోరింది. చదవండి:ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 12.73 లక్షల మంది -
Hotel Occupancy: హైదరాబాద్ తర్వాతే ముంబై, బెంగళూరు నగరాలు
Hotel Occupancy: కోవిడ్ సంక్షోభం తర్వాత హైదరాబాద్ నగరం వేగంగా కోలుకుంటోంది. ఇప్పటికే ఆఫీస్ స్పేస్, రియల్టీ రంగాల్లో కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటుండగా తాజాగా ఆతిధ్య రంగానికి సంబంధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. నంబర్ వన్ హైదరాబాద్ ఆతిధ్య రంగానికి సంబంధించి మూడో త్రైమాసికం (జులై, ఆగస్ట్, సెప్టెంబర్)లో యావరేజ్ అక్యుపెన్షీ రేషియో (ఏఓఆర్) విషయంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని జేఎల్ఎల్ రీసెర్చ్ తెలిపింది. దేశంలో ఉన్న ఆరు ప్రధాన నగరాల నుంచి డేటాను సేకరించి ఆ సంస్థ విశ్లేషించింది. హోటళ్లలో ఆక్యుపెన్షి లెవల్ రిజిస్ట్రరింగ్ విభాగంలో హైదరాబాద్ నగరం 33.60 శాతం వృద్ధిని నమోదు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత గోవా (29.8 శాతం), ముంబై (29.4 శాతం), బెంగళూరు (26.8శాతం), ఢిల్లీ (25.5 శాతం), చెన్నై (24.1 శాతం) వృద్ధిని నమోదు చేశాయి. రెవెన్యూలో గోవా హస్పిటాలిటీ సెక్టార్‌కి సంబంధించి గతేడాదితో పోల్చితే రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్ విభాగంలో మూడో త్రైమానికంలో మరోసారి గోవా ప్రథమ స్థానంలో నిలిచింది. రెవెన్యూ గ్రోత్ విషయంలో గోవాలో 389 శాతం వృద్ధి ఉండగా బెంగళూరు 213 శాతం హైదరాబాద్ 173 శాతం వృద్ధిని కనబరిచాయి. కోలుకుంటోంది కరోనా సంక్షోభం తీవ్రంగా నెలకొన్న 2020తో పోల్చితే 2021లో ఆతిధ్య రంగం పుంజుకుంటోందని జేఎల్ఎల్ తెలిపింది. దేశవ్యాప్తంగా మూడో త్రైమాసికంలో ఆతిధ్య రంగంలో 169 శాతం వృద్ధి నమోదైందన్నారు. రెండో త్రైమాసికంలో ఈ వృద్ధి 123 శాతంగా ఉంది. క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుందని చెప్పడానికి ఈ గణాంకాలు ఉదహరణలుగా నిలుస్తున్నాయి. చదవండి:గార్డెన్ సిటీ కిందికి నిజాం నగరం పైకి -
కంపెనీలకు ఊరటపై ఆర్బీఐ కసరత్తు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో తీవ్రంగా దెబ్బతిన్న నిర్దిష్ట రంగాల సంస్థలకు వన్ టైమ్ ప్రాతిపదికన రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని ప్రకటించడంపై రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో పాటు పలు వ్యాపార సంస్థల సమాఖ్యలు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్‌లకు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వివిధ వర్గాల సూచనలన్నీ పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ.. రుణాల పునర్వ్యవస్థీకరణకు అర్హత ఉన్న రంగాలకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించాయి. ఆగస్టు ఆఖరు నాటికి దీనిపై నిర్ణయం వెలువరించవచ్చని పేర్కొన్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఆరు నెలల మారటోరియం వ్యవధి అప్పటితో ముగిసిపోనుంది. (చైనా దిగుమతులు ఇప్పట్లో తగ్గవు!) ఆతిథ్య, టూరిజం, ఏవియేషన్, నిర్మాణం మొదలైన రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ స్కీమ్ వెసులుబాటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒత్తిడిలో ఉన్న కంపెనీలకు తోడ్పాటు అందించేలా వన్–టైమ్ ప్రాతిపదికన రుణాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ఆర్బీఐ, ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారమే వెల్లడించారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో సంక్షోభం నుంచి బైటపడేందుకు పలు రంగాల సంస్థలకు ఆర్బీఐ వన్–టైమ్ రుణ రీస్ట్రక్చరింగ్ అవకాశం కల్పించింది. అయితే, దాన్ని కార్పొరేట్లు దుర్వినియోగం చేయడంతో 2015లో నిబంధనలను కఠినతరం చేసింది. -
ఉపాధి అవకాశాలపై ఈపీఎఫ్ఓ నివేదిక
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రంగాలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలపై 2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) నివేదిక విడుదల చేసింది. కాగా 50 శాతం ఉపాధి అవకాశాలను ఆతిథ్య రంగం, ఆర్థిక సంస్థలు కల్పించినట్లు పేర్కొంది. (2019-20) ఆర్థిక సంవత్సరానికి సంఘటిత రంగం 28.6శాతం ఉపాధి అవకాశాలు అధికంగా కల్పించినట్లు తెలిపింది. కాగా, అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించేందుకు ప్రభుత్వ కీలక సంస్కరణలు, జీఎస్టీ అంశాలు తోడ్పడ్డాయని అభిప్రాయపడింది. అయితే ఎక్కువ శాతం ఉద్యోగులు సంఘటిత రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారని.. తక్కువ సంఖ్యలో అసంఘటిక రంగానికి ఉద్యోగులు మొగ్గు చూపుతున్నట్లు ఈపీఎఫ్ఓ అధికారి సునీల్ బర్తవాల్ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణల వల్ల వివిధ రంగాలలో ఉపాధి అవకాశాలు పెరిగినట్లు పేర్కొంది. నూతన సభ్యుల నమోదు గణాంకాలను ఈపీఎఫ్‌వో సంస్థ 2018 ఏప్రిల్ నుంచి ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు) -
‘ఆతిథ్యం’ ఇస్తే.. అవకాశాలెన్నో..
గతంలో ఆర్థికమాంద్యం ప్రభావంతో ఐటీ సహా ఎన్నో కీలక రంగాల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కాని ఆతిథ్య రంగంలో పనిచేసే వారిపై మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదురుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటక రంగం మరింత ఊపందుకుంది. వింతలు, విశేషాలకు నిలయమైన భారతావనిని సందర్శించడానికి విదేశీ పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందిన మన హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువే. దాంతో ఇటీవల కాలంలో భాగ్యనగరంలోని యువతకు ఆతిథ్య రంగం భారీ అవకాశాలతో ఆహ్వాన ం పలుకుతోంది. నగరంలోని పలు విద్యా సంస్థలు హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులువుగా సొంతం చేసుకోవచ్చు. సిటీలో హాస్పిటాలిటీ కోర్సులు, కెరీర్ స్కోప్‌పై ఫోకస్.. నగరం ప్రముఖ పర్యాటక కేంద్రం. ముత్యాలను రాసులుగా పోసి అమ్మిన భాగ్యనగరం ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఏనాడో గుర్తింపు పొందింది. కేవలం సంద ర్శనీయ ప్రాంతంగానే కాకుండా విభిన్న అవసరాలు, అవకాశాలకు నెలవుగా మారింది. మెడికల్ టూరిజం, లీజర్ టూరిజం, టెంపుల్ టూరిజం తదితర భిన్న రంగాల్లో తన ప్రాధాన్యతను చాటుకుంటోంది. ప్రయాణికులకు వీలుగా అంతర్జాతీయ విమానాశ్రయం నగరంలో ఏర్పాటైంది. ఇక్కడి నుంచి అన్ని ప్రధాన దేశాలకు రాకపోకలు సాగించే సౌకర్యం ఉంది. గతంలో నిర్వహించిన ప్రపంచ మిలటరీ గేమ్స్ నుంచి ఇటీవల జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వరకూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు నగరమే వేదిక. గతేడాది 2.5 లక్షల మంది నగరాన్ని సందర్శించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే స్టార్ హోటల్స్, బడ్జెట్ హోటల్స్ నగరంలో 1000 వరకూ ఉంటాయి. పర్యాటకుల తాకిడితో రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు యువతకు ఉద్యోగాలు లభించడం ఖాయం. ఉద్యోగాలు కోకొల్లలు హోటల్‌కు వచ్చే అతిథులను ఆహ్వానించడం నుంచి సకల సదుపాయాలు, సౌకర్యాలు అందజేసేందుకు పలు విభాగాలు పనిచేస్తుంటాయి. ఆయా విభాగాలకు అనుగుణంగా కోర్సులు పూర్తిచేస్తే లాబీ మేనేజర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ వరకూ ఎదిగే వీలున్న రంగం హాస్పిటాలిటీ అంటున్నారు నిపుణులు. హోటల్స్‌లో ఫ్రంట్ ఆఫీస్, రూం బుకింగ్, గెస్ట్ ఎంటర్టైన్మెంట్, లాబీ మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అకామిడేషన్ అండ్ బిల్లింగ్, హౌస్‌కీపింగ్, గెస్ట్ సప్లయిర్స్ వంటి విభాగాలు ఉంటాయి. ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగంలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడం, ఫుడ్ సర్వీసింగ్, మేనేజర్, కిచెన్ సర్వీసెస్(చెఫ్స్, హెడ్ చెఫ్స్) విభాగాలు.. ఇవికాకుండా సెక్యూరిటీ, హెచ్.ఆర్. విభాగం, స్టోర్స్ డిపార్ట్మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ, జిమ్, స్పా నిపుణులు.. ఇలా హాస్పిటాలిటీలో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కోర్సులనందిస్తున్న విద్యా సంస్థలు... హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు హాస్పిటాలిటీ కోర్సులను అందిస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ (ఐహెచ్ఎంసీటీ), డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (వైఎస్ఆర్ నిథమ్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రం-మాదాపూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లు హోటల్‌మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా దేశంలో వందల సంఖ్యలో విద్యాసంస్థలు హోటల్ మేనేజ్మెంట్లో వివిధ స్పెషలైజేషన్లలో కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులు.. అర్హతలు ఆయా విద్యా సంస్థలు అందించే హాస్పిటాలిటీ కోర్సుల్లో పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు చేరొచ్చు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. ఇంటర్మీడియెట్ అర్హతతో మూడేళ్ల వ్యవధి ఉన్న బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (బీహెచ్ఎం), ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సును, పదో తరగతి అర్హతతో ఆరు నెలల వ్యవధి ఉన్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ బేవరెజ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరెజ్ సర్వీస్, అకామిడేషన్ ఆపరేషన్స్ కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.braou.ac.in డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్.. మూడేళ్ల బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్).. నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ), రెండేళ్ల ఎంబీఏ (హాస్పిటాలిటీ), ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ)లతోపాటు వివిధ స్వల్పకాలిక శిక్షణా కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏలో చేరడానికి నిర్దేశిత మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. కోర్సును బట్టి ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: www.nithm.ac.in నగరంలోనే కొలువుదీరిన మరో సంస్థ.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్. ఈ సంస్థ.. రెండేళ్ల ఎంఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), మూడేళ్ల బీఎస్సీ( హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), ఏడాదిన్నర వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్ అకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్స్, ఫుడ్ అండ్ బేవరెజ్ సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్లో స్వల్పకాలిక శిక్షణ కోర్సులు నిర్వహిస్తోంది. వెబ్సైట్: www.ihmhyd.org ఇవేకాకుండా సిటీలో ఇగ్నో, సెట్విన్ లాంటివి కూడా హాస్పిటాలిటీలో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా సర్టిఫికెట్ కోర్సులకు పదో తరగతి/ఇంటర్మీడియెట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్, పీజీ కోర్సులకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇన్స్టిట్యూట్ను బట్టి వయోపరిమితి నిబంధనలు కూడా ఉంటాయి. వేతనాలు.. ఏడాదిలో రెట్టింపు హౌస్‌కీపింగ్ విభాగంలో ప్రారంభంలోనే నెలకు రూ.12,000; చెఫ్స్‌కు రూ.30 వేల వరకూ ఇస్తున్నారు. నిపుణులైన వారికి ఏడాది తర్వాత రెట్టింపు వేతనం చేతికి అందుతుంది. అతిథులు మెచ్చేలా సేవలు అందించే వారికి ఈ రంగంలో వేతనాలకు ఢోకా లేదు. మిగిలిన విభాగాల్లో కూడా ప్రారంభ వేతనం రూ.15,000 నుంచి ఉంటుంది. పనితీరు, అనుభవం ఆధారంగా మరింత ఆదాయం సంపాదించొచ్చు. సాధారణంగా నగరానికి టూరిస్టుల రాక అక్టోబరు నుంచి జనవరి వరకూ ఉంటుంది. ఆ సమయంలో చేతినిండా పనితోపాటు వేతనాలు కూడా 10-15 శాతం పెరుగుతాయి. మిగిలిన ఆఫ్ సీజన్లో ఫుడ్ ఫెస్టివల్స్, ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి 365 రోజులూ తీరిక లేకుండా ఉంటామంటున్నారు ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్న యూ.రమేశ్. హోటల్ మేనేజ్మెంట్.. ఎవర్గ్రీన్ ‘‘పర్యాటకంగా హైదరాబాద్ పురోగతి సాధిస్తున్న నగరం. ఇక్కడకు వచ్చే అతిథుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. వీరికి అవసరమైన వసతి సౌకర్యాలకు హోటల్స్ ఆధారం. పర్యాటకుల సంఖ్య పెరిగేకొద్దీ ఈ రంగం విస్తరిస్తుంది. అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా బాగుంది. ఉపాధి అవకాశాలు భారీగా లభించనున్నాయి. కేవలం హోటల్ రంగమే కాకుండా.. కార్పొరేట్ సంస్థలు హౌస్‌కీపింగ్, మేనేజ్మెంట్ విభాగాల్లో హాస్పిటాలిటీ పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. మెడికల్ టూరిజం హబ్‌గా సిటీ ఖ్యాతి గడిస్తోంది. దీంతో భ విష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాదు. వేతనాలు కూడా భారీగానే అందుకోవచ్చు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకోవాలి. గ్లోబలైజేషన్‌తో ఇంగ్లిష్ తప్పనిసరి. కష్టపడేతత్వమే కాకుండా, నేర్పు, ఓర్పు, ఎదుటివారిని గౌరవించే మనస్తత్వం ఉన్న యువతీ, యువకులకు ఇది అద్భుతమైన కెరీర్. ప్రారంభ వేతనం రూ.15 వేలు ఉంటుంది’’ - ఎస్.సుధాకుమార్, ప్రిన్సిపల్, స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ (వైఎస్ఆర్ నిథమ్).