shortlist
-
ఫుడ్ ఫోటోగ్రఫీ పోటీ, అద్భుతమైన పోటోలు
-
స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి ఓయో
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టెక్ సంస్థ ఓయో తాజాగా స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. భారీ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె సహా 12 కీలక నగరాల్లో 100 హోటల్స్‌ను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు వసతి సదుపాయం కలి్పంచేందుకు ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. స్పోర్ట్స్ టీమ్‌లు, పెద్ద బృందాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు, గ్రూప్ బుకింగ్ ఆప్షన్స్ ఇస్తామని ఓయో వివరించింది. అలాగే క్రీడాకారులు, ఈవెంట్లను వీక్షించేందుకు వచ్చే వారి ఆహార, రవాణా అవసరాలను తీర్చే థర్డ్–పార్టీ ఏజెన్సీల సేవలను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. -
బిక్షాటన రహిత భారత్‌గా..! ఇక ఆ నగరాల్లో బిచ్చగాళ్లు ఉండరు!
నగరాల్లోనూ ట్రాఫిక్ల వద్ద బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. అందులోనూ చారిత్రక ప్రదేశాల వద్ద, ఆలయాల వద్ద మరి ఎక్కువగా కనిపిస్తుంటారు. ఎందుకంటే ఆయా ప్రదేశాల్లో మనుషుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బిచ్చగాళ్లకు కూడా యాచించడం ఈజీ అవుతుంది. దివ్యాంగులు, అనాథలుగా అవ్వడం, వృద్ధాప్యం తదితర కారణాలతో ఈ యాచక వృత్తిలోకి వస్తుంటారు. ఐతే దీని వెనుక పెద్ద మాఫియా కూడా ఉంది. ఇలా రోజంతా యాచించిన సొమ్మును తీసుకు రాకపోతే వాళ్లను చిత్రహింసలు పెట్టే ముఠా కూడా ఉన్నారు. వారి సమస్యలకు చెక్‌పెట్టేలా కేంద్రం ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే గాక బిచ్చగాళ్లు లేని దేశంగా మార్చనుంది. ఎలా చేస్తున్నారు? ఈ కార్యచరణ ముఖ్యోద్దేశం తదితరాల విశేషాలేంటో చూద్దామా! కేంద్రం బిచ్చగాళ్ల డేటాపై ఓ నివేదక రూపొందించింది. ముందుగా యాచకులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను సర్వే చేయించింది. ఆ తర్వాత దీనికి చెక్‌పెట్టేలా భారత్‌ను యాచక రహితంగా మార్చే ప్రణాళికతో ముందుకొచ్చింది. అందులో భాగంగా కీలక 30 నగరాలను ఎంపిక చేసింది. ఈ మేరకు ఉత్తరాదిలో అయోధ్య నుంచి తూర్పున గువహటి.. పశ్చిమాన త్రయంబకేశ్వరం నుంచి దక్షిణాన తిరువనంతపురం వరకూ 30 నగరాల్లో భిక్షాటన చేస్తున్నవారు ముఖ్యంగా మహిళలు, పిల్లల గురించి సర్వే చేయించి, వారందరికి పనరావసం కల్పించనున్నట్లు ప్రభుత్వ నివేదిక పేర్కొంది. ఈ నగరాల్లోని హాట్స్పాట్లు గుర్తించి 2022 నాటికి బిచ్చగాళ్ల రహిత నగరాలుగా మార్చడమే ధ్యేయంగా కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ పెట్టుకుంది. అందుకోసం సదరు జిల్లా మున్సిపల్ అధికారులు తోడ్పాటు అందించాలని పేర్కొంది ప్రభుత్వం. అంతేగాదు వచ్చే రెండేళ్ల మరిన్ని నగరాలు ఈ జాబితాలోకి చేరే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇలా మతపరమైన , చారిత్రక లేదా పర్యాట ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో స్వయం ఉపాధి పథకం అమలు చేసి, వాటికింద వారికి జీవనోపాధి కల్పించనుంది. అంతేగాదు 'భిక్షా-వృత్తి ముక్త్ భారత్' (భిక్షాటన రహిత భారతదేశం) లక్ష్యాన్ని చేరుకునేలా పూర్తి స్థాయిలో సర్వే చేయించి ఆయా నగరాల్లోనే వారందరికీ పునరావసం కల్పించనుంది. ఈ కార్యక్రమ మార్గదర్శకాల ప్రకారం బిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి రియల్‌టైమ్ అప్డేషన్ అయ్యేలా ఫిబ్రవరి నాటికల్లా జాతీయ పోర్టల్, మొబైల్ యాప్‌ని ప్రారంభించనుంది. అలాగే సర్వే, పునరావాసం కోసం ఎంపిక చేసిన నగరాల్లో కూడా అధికారులు మొబైల్ యాప్‌లో షెల్టర్లు, నైపుణ్యాలు, విద్య, పునరావాసాలు తదితర పురోగతి నివేదికను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ బిచ్చగాళ్లకు పునరావసం కల్పించనున్న 10 మతపరమైన ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాల్లో అయోధ్య, కాంగ్రా, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, సోమనాథ్, పావగఢ్, త్రయంబకేశ్వర్, బోధగయ, గౌహతి మధురై తదితరాలు ఉన్నాయి. అలాగే పర్యాటక ప్రదేశాలలో విజయవాడ, కెవాడియా, శ్రీ నగర్, నంసాయి, కుషినగర్, సాంచి, ఖజురహో, జైసల్మేర్, తిరువనంతపురం,పుదుచ్చేరి ఉండగా, అమృత్సర్, ఉదయ్‌పూర్, వరంగల్, కటక్, ఇండోర్, కోజికోడ్, మైసూరు, పంచకుల, సిమ్లా, తేజ్‌పూర్ వంటివి చారిత్రక నగరాల జాబితాలో ఉన్నాయి. ఈ బిచ్చగాళ్లకు పునరావాసం కల్పించడంలో నగర పాలక సంస్థ తోపాటు సంబంధిత మతపరమైన ట్రస్ట్ లేదా పుణ్యక్షేత్రం బోర్డు కూడా పాలుపంచుకుంటుంది. ఇక ఎంపిక చేసిన ఈ 30 నగరాల్లో దాదాపు 25 సిటీలు కార్యాచరణ ప్రణాళిక అందుకోగా..కాంగ్రా, కటక్, ఉదయ్‌పూర్, కుషినగర్ వంటి నగరాల అనుమతి కోసం వేచి ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ ప్రాంతంలో భిక్షాటన చేసే వ్యక్తులు ఎవరూ లేరని, అందువల్ల వేరే నగరాన్ని పరిగణించాలని సాంచి అధికారులు కేంద్రానికి తెలియజేశారు. కోజికోడ్, విజయవాడ, మదురై, మైసూరులో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ కార్యచరణ అమలు చేస్తున్న సదరు జిల్లా మున్సిపల్ అధికారుల కోసం కేంద్ర సామాజిక సాధికారికత మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుంది. ఎంపిక చేసిన నగరాల రోడ్ మ్యాప్‌లో సర్వే, సమీకరణ, రెస్క్యూ, నివాసం, విద్య ద్వారా సమగ్ర పునరావాసం, నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి ద్వారా జనజీవన స్రవంతితో ఏకీకరణ చేయడం, సమగ్ర పునరావాసం తదితరాలు ఉన్నాయి. (చదవండి: ప్రాణ ప్రతిష్టలో ఉపయోగించిన టన్నుల కొద్ది పువ్వులను ఏం చేస్తున్నారో తెలుసా!) -
Telangana: నెలాఖరుకు కాంగ్రెస్ జాబితా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ కానుంది. ఢిల్లీ వేదికగా బుధ, గురువారాల్లో ఈ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జర గనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థు లను ఖరారు చేయడంలో భాగంగా దరఖాస్తులను వడపోసి షార్ట్ లిస్ట్ తయారు చేయడమే ఎజెండాగా ఈ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పీసీసీ నుంచి రేవంత్‌రెడ్డి, భట్టి విక్ర మార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. ఇందులో ఉత్తమ్, రేవంత్‌లు పార్లమెంటు సమావే శాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలోనే ఉండగా, భట్టి మంగళవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. వీరితో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఠాక్రే, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు విష్ణునాథ్, రోహిత్‌చౌదరి, మన్సూర్ అలీ ఖాన్ కూడా స్క్రీనింగ్ కమిటీ భేటికి హాజరవుతారు. ఇటీవలే హైదరాబాద్ వేదికగా సమావేశ మైన స్క్రీనింగ్ కమిటీ ఏమీ తేల్చకుండానే సమా వేశాన్ని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో జరిగే మలిదశ భేటీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన షార్ట్‌లిస్ట్ రెడీ కానుంది. అనంతరం ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపుతారని, ఈ కమిటీ భేటీ అనంతరం ఈ నెలాఖరున లేదంటే అక్టోబర్ మొదటి వారంలో తొలి జాబితాను విడుదల చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
ఆస్కార్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్ఆర్ఆర్’
ఈ ఏడాది వచ్చి పాన్ ఇండియా చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఒకటి. ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ఇక ఈ చిత్రానికి ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. అంతేకాదు ఈ మూవీ ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచిన సంగతి తె లిసిందే. తాజాగా ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ మరింత ముందకు దూసుకేళ్లింది. ఇందులోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి షార్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే ఉత్తమ ఇంటర్నేషనల్ ఫ్యుచర్ ఫిలింగా లాస్ట్ ఫిలిం షో నిలిచింది. దీఇనితో పాటు బెస్ట్ డాక్యుమెంటరి ఫీచర్ అల్ థట్ బ్రీత్స్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా ది ఎలిఫెంటా విస్పర్స్ సినిమాలు ఈ షార్ట్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! శాంతనుకు శ్రుతి బ్రేకప్ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
బ్యాంకింగ్ పర్యవేక్షణ మరింత పటిష్టం: షార్ట్‌లిస్ట్‌లో 7 గ్లోబల్ కంపెనీలు
ముంబై: బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) నియంత్రణను మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, పర్యవేక్షణకు కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్‌ను వినియోగించుకునే క్రమంలో ఏడు అంతర్జాతీయ కన్సల్టెన్సీలను షార్ట్‌లిస్ట్ చేసింది. ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్, మెకిన్సే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (ఇండియా) తదితర సంస్థలు వీటిలో ఉన్నాయి. కన్సల్టెంట్ల నియామకం కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. స్క్రూటినీ అనంతరం ప్రస్తుతం కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసింది. బ్యాంకింగ్ రంగ పరిధిలోని సంస్థల ఆర్థిక స్థితిగతులు, అసెట్ క్వాలిటీ, లిక్విడిటీ తదితర అంశాలను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో ఏఐ, ఎంఎల్‌ను ఉపయోగిస్తోంది. వీటి వినియోగాన్ని మరింతగా విస్తరించేందుకు తాజా ప్రక్రియ చేపట్టింది. -
ఎల్ఐసీ మెగా ఐపీవోకి సన్నాహాలు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మెగా పబ్లిక్ ఇష్యూ కోసం సన్నాహాలు వేగం పుంజుకుంటున్నాయి. యాంకర్ ఇన్వెస్టర్లుగా 50–60 సంస్థలను కేంద్రం షార్ట్‌లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో బ్లాక్‌రాక్, శాండ్స్ క్యాపిటల్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, స్టాండర్డ్ లైఫ్, జేపీ మోర్గాన్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. త్వరలోనే యాంకర్ ఇన్వెస్టర్ల జాబితాను కేంద్రం ఖరారు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదిత ఇన్వెస్టర్ల నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుందని ఒక అధికారి తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట వేల్యుయేషన్ శ్రేణిని వారి ముందు ఉంచినట్లు వివరించారు. ఆయా ఇన్వెస్టర్ల అభిప్రాయాల మేరకు ఎల్ఐసీ వేల్యుయేషన్ దాదాపు రూ. 7 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. వేల్యుయేషన్ ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో మదుపు చేసేందుకు ఆసక్తి చూపే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతోందని అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో వేల్యుయేషన్‌పైనా సత్వరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 25 శాతం డ్రాపవుట్..: ఆసక్తిగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఎంత మేరకు పెట్టుబడులు పెడతాయో తెలుసుకునేందుకు అత్యున్నత స్థాయి కమిటీ.. వాటి నుంచి ప్రతిపాదనలు తీసు కున్నట్లు అధికారి చెప్పారు. ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసిన సంస్థల్లో దాదాపు 25% ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకునే (డ్రాపవుట్) అవకాశం ఉందని భావిస్తున్నట్లు వివరించారు. మరింత మంది ఇన్వెస్టర్లను భాగస్వాములను చేసేందుకు, సెబీ నిబంధనల మేరకు .. ఐపీవోలో విక్రయించే షేర్ల సంఖ్యను కూడా కేంద్రం పెంచవచ్చని తెలిపారు. సుమారు 12 యాంకర్ ఇన్వెస్టర్లు దాదాపు రూ. 18,000 కోట్ల పెట్టుబడులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ ద్వారా 31.6 కోట్ల షేర్ల (దాదాపు 5% వాటా) విక్రయం ద్వారా రూ. 63,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. మారిన పరిస్థితులతో 7% వరకు వాటాలను విక్రయించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మే 12 దాటితే మళ్లీ ఐపీవో ప్రతిపాదనలను సెబీకి సమర్పించాల్సి రానున్న నేపథ్యంలో ఏదేమైనా పబ్లిక్ ఇష్యూను ఏప్రిల్‌లోనే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
Oscar Nomination 2022: ఆస్కార్ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు
‘రైటింగ్ విత్ ఫైర్’.... ఆస్కార్ 2022 బరిలోమన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయిన బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్ లెహరియా’ న్యూస్‌పేపర్ (వీక్లీ) గురించి, దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ఇది. 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు ఉత్తర ప్రదేశ్, బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లలో గ్రామీణ వార్తలను స్త్రీ దృక్కోణంలో అందించడమే ఇక్కడున్న విశేషం. ఆస్కార్ సాధించే సత్తా ఈ డాక్యుమెంటరీకి ఉంది అని భావిస్తున్నారు. ‘మా ప్రాంతంలో దళిత మహిళలు జర్నలిజం గురించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. అసలు ఆ పని తాము కూడా చేయొచ్చని వాళ్లు అనుకోరు. కాని ఈ ఇరవై ఏళ్లలో వారిలోని ఆ న్యూనతను చాలా వరకు తీసేశాం’ అంటారు ‘ఖబర్ లహరియా’ మహిళా జర్నలిస్టులు. 2002లో ‘ఖబర్ లహరియా’ వారపత్రిక చిత్రకూట్ (బుందేల్ ఖండ్)లో మొదలైంది. అప్పుడు 6 మంది దళిత మహిళా జర్నలిస్టులు పని చేయడం మొదలెట్టారు. ఇవాళ 25 మంది పని చేస్తున్నారు. ఆ ఆరు మంది ఈ 25 మందిగా ఎలా మారారో... హిందీ, భోజ్‌పురి, బుందేలి, అవధి భాషల్లో వారపత్రికను ఎలా నడిపారో, ఆ తర్వాత సెల్ఫోన్లను కెమెరాలుగా వాడుతూ డిజిటల్ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించసాగారో ఇదంతా అద్భుతంగా చెప్పిన డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’. దర్శకురాలు రింతు థామస్ మరో దర్శకుడు సుస్మిత్ ఘోష్‌తో కలిసి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. వచ్చే మార్చి 27న లాస్ ఏంజలిస్‌లో జరిగే ఆస్కార్ వేడుకలో పోటీకి నిలవడానికి ఈ డాక్యుమెంటరీ అడుగు దూరంలో ఉంది. 2022 సంవత్సరానికి ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంటరీల షార్ట్‌లిస్ట్‌లోని 15 చిత్రాలలో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఒకటిగా ఎంపికైంది. ఈ షార్ట్‌లిస్ట్ కోసం ప్రపంచ దేశాల నుంచి 138 డాక్యుమెంటరీలు పోటీ పడ్డాయి. వాటి నుంచి 15 షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి. ఈ 15 నుంచి మూడో నాలుగో అంతిమ నామినేషన్స్‌గా నిలవడానికి జనవరి 27 నుంచి ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న అంతిమ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్‌లో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉంటే ఆస్కార్ వేడుకలో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ‘లగాన్’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రాల తర్వాత ఆస్కార్ వేడుకలో భారతీయుల పేర్లు వినిపించలేదు. ఈసారి ఫైనల్ నామినేషన్స్‌కు వెళుతుందని భావించిన తమిళ చిత్రం, భారతదేశ అఫీషియల్ ఎంట్రీ ‘కూడంగళ్’ షార్ట్‌లిస్ట్‌లో నిలువలేదు. కాని ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో నిలిచి ఆశలు రేపుతోంది. ఈ డాక్యుమెంటరీ దేని గురించి? ఢిల్లీలో ఉన్న ‘నిరంతర్‘ అనే ఎన్జిఓ ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ నుంచి ప్రయోగాత్మకంగా మొదలెట్టిన వారపత్రిక ‘ఖబర్ లహరియా’. పెద్దగా చదువు రాకపోయినా, జర్నలిజం తెలియకపోయినా దళిత మహిళలు తమ ప్రాంత వార్తలను ఎలా చూస్తారో, వాళ్లు చూసిన పద్ధతిలో అచ్చు వేసి పాఠకుల వద్దకు తీసుకువెళ్లడం ఈ పత్రిక ఉద్దేశం. అంతే కాదు... జర్నలిజంకు దూరంగా ఉన్న దళిత మహిళలు కూడా సమర్థంగా వార్తా పత్రికలను నడపగలరని చూపడమూ ఉద్దేశమే. ‘మాలో చాలామంది ఎలిమెంటరీ స్థాయి చదువు కూడా చదువుకోలేదు. ఇంగ్లిష్ అసలు రాదు. అయినా సరే పత్రికలో పని చేయడానికి రంగంలో దిగాం’ అంటుంది మీరా. ఈమె చీఫ్ రిపోర్టర్. ఈమె దృష్టికోణం నుంచే ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ ఉంటుంది. బుందేలి, అవధి వంటి స్థానిక భాషలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్... ఈ మూడు రాష్ట్రాలలో ఈ పత్రికను అందేలా ఈ దళిత మహిళలు కార్యాచరణ చేశారు. ఈ పత్రిక అచ్చు పని, డిస్ట్రిబ్యూషన్, సర్క్యులేషన్ అంతా మహిళల బాధ్యతే. సవాళ్లు ఎన్నో... దళిత మహిళలు రిపోర్టర్లుగా మారడం ఒక విశేషం అయితే అంటరానితనం ఉన్న ప్రాంతాలలో కూడా వీరు దూసుకుపోవాల్సి రావడం మరో విశేషం. ‘చాలాచోట్ల మొదటగా కులం అడుగుతారు. నేను ఆ ప్రశ్న వేసిన వారి కులం అడుగుతాను. వారు ఏ కులం చెప్తే నేను కూడా ఆ కులమే అంటాను. పని జరగాలి కదా’ అని నవ్వుతుంది ఒక రిపోర్టర్. ‘ఖబర్ లహరియా’ ఎంత జనంలోకి వెళ్లిందంటే చీఫ్ రిపోర్టర్ మీరా భర్త ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు. ‘నువ్వు బతకనిచ్చేలా లేవు’ అన్నాడు. దానికి కారణం ఆమె ఊళ్లోని గూండాల గురించి పత్రికలో రాయడమే. ‘ఇంకో సందర్భంలో అయితే స్త్రీలు పని మానేస్తారు. కాని నా వెనుక పత్రిక ఉందన్న ధైర్యం ఉంది. అందుకే నా భర్తతో నేనేం తప్పు చేయలేదు అని గట్టిగా వాదించాను’ అంటుంది మీరా. ఈ పత్రికకు పని చేస్తున్న దళిత మహిళా రిపోర్టర్లు ముఖ్యంగా పోలీసుల జులుం పైనా, దళితులపైన జరిగే దాష్టికాల పైనా, స్త్రీలపై పురుషుల పీడన పైన వార్తలు రాస్తుంటారు. ‘భయం వేయదా’ అని అడిగితే ‘భయంగానే ఉంటుంది. కాని అంతలోనే ధైర్యం చేస్తాం’ అంటారు వాళ్లు. సెల్ఫోన్లే కెమెరాలుగా పదిహేనేళ్ల పాటు ప్రింట్ ఎడిషన్‌ని నడిపిన ఈ మహిళలు మారిన కాలానికి తగినట్టుగా తాము మారాలని నిశ్చయించుకున్నారు. వార్తలను విజువల్ మీడియాగా జనానికి చూపాలనుకున్నారు. ‘మా అందరికీ ఫోన్లు ఎలా వాడాలో తెలియదు. కాని మారిన పరిస్థితులకు తగినట్టుగా మనం మారకపోతే ఆగిపోతాం’ అంటారు వాళ్లు. అందుకే సెల్‌ఫోన్‌ను కెమెరాగా ఎలా వాడాలో తెలుసుకున్నారు. వార్తలను ఫోన్లో బంధించి యూ ట్యూబ్‌లో బులెటిన్గా విడుదల చేయసాగారు. వారి యూ ట్యూబ్ చానల్‌కు ఐదున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ‘రైటింగ్ విత్ ఫైర్’కు ఆస్కార్ వస్తే ఈ దళిత మహిళలు ప్రపంచం అంతా చుట్టడం గ్యారంటీ. డాక్యుమెంటరీలోని ఓ దృశ్యం -
ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ అయిన మన సినిమాలివే..
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ అవార్డుల కోసం ప్రపంచ దేశాల నుంచి పలు విభాగాల్లో సినిమాలు పోటీపడే విషయం తెలిసిందే. ఈ ఏడాది ‘2022 బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీ’లో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. 15 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లదగ్గ సినిమాలను వీక్షించి, ఒక్క సినిమాను ఎంపిక చేస్తుంది. వచ్చిన ఎంట్రీల్లో 14 చిత్రాలు ఆస్కార్‌కి పంపించే స్థాయి ఉన్నవిగా జ్యూరీ భావించింది.వాటిలో హిందీ నుంచి ‘సర్దార్ ఉదమ్’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ కూడా ఉన్నాయి. మరి.. ఈ నాలుగింట్లో ఒక్కటా? లేక లిస్ట్‌లో ఉన్న వేరే భాషల చిత్రాల్లో ఒక్కటా? ఆస్కార్ వరకూ వెళ్లే ఆ ఒక్క చిత్రం ఏంటనేది చూడాలి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ ఉదమ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘సర్దార్ ఉదమ్’. జలియన్‌వాలా బాగ్ మారణకాండకు కారణమైన జనరల్ డయ్యర్‌ను హతమార్చడానికి లండన్‌లో సర్దార్ ఉదమ్ పడిన కష్టాలను ఈ చిత్రంలో చూపించారు చిత్రదర్శకుడు సూజిత్ సర్కార్. ఉదమ్ పాత్రను విక్కీ కౌశల్ చేశారు. షేర్నీ విషయానికొస్తే.. జనావాసంలోకి వచ్చిన ఓ ఆడపులి నుంచి కాపాడాలని అటవీ గ్రామీణుల అభ్యర్థన. పులిని చంపైనా ఓట్లు కూడగట్టుకోవాలన్నది రాజకీయ నేతల ఆకాంక్ష. ఆ ఆడపులిని కాపాడాలనుకుంటుంది ఫారెస్ట్ ఆఫీసర్. ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ లాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. విద్యాబాలన్ కథానాయికగా అమిత్ వి. మసూర్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యోగిబాబు టైటిల్ రోల్లో నటించిన పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘మండేలా’. ఓ క్షురకుడి ఓటు తమ గెలుపుకి కారణం అవుతుందని తెలిసి, అతన్ని మాయ చేయడానికి పంచాయతీ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీపడుతున్న ఇద్దరు అన్నదమ్ముల ప్రయత్నమే ‘మండేలా’. మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మార్టిన్ ప్రక్కట్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘నాయట్టు’. ఇందులో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన తారలుగా నటించారు. రాజకీయ నాయకుల చేతిలో వ్యవస్థలు ఎలా కీలుబొమ్మలుగా మారాయనే నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. -
నా పిల్లలే నా తొలి విద్యార్థులు – మేఘన మనోగతం
ఈ ఏడాది 1 మిలియన్ డాలర్ల గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు మన దేశం నుంచి ఇద్దరు టీచర్లు టాప్–50 షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు బీహార్‌వాసి సత్యం మిశ్రా కాగా మరొకరు హైదరాబాద్ టీచర్ మేఘనా ముసునూరి. ఈ సందర్భంగా ‘సాక్షి’ మేఘన ముసునూరితో ముచ్చటించింది. ‘‘వాస్తవాన్ని పిల్లలకు చిన్ననాటి నుంచే పరిచయం చేస్తే వారిలో జీవన నైపుణ్యాలు పెరిగి, కోరుకున్నదాంట్లో విజయం సాధిస్తారు’’ అంటూ తను నేర్చుకున్న విషయాలు, పిల్లలకు నేర్పుతున్న నైపుణ్యాల గురించి వివరించారు ఈ టీచర్. ‘‘మనది అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు పిల్లలకు పరిచయం చేయాల్సింది. మన దేశ చారిత్రక, సాంస్కృతిక గొప్పదనం అన్ని దేశాలకన్నా ఎంత ఘనమైనదో తెలియజేయాలి. దీనివల్ల పిల్లల్లో ఆత్మస్థైర్యం వృద్ధి చెందుతుంది. అదే నేను ఇప్పుడు చేస్తున్న పని. అందులో భాగంగా విద్యావిధానంలో నేను తీసుకు వచ్చిన మార్పులు, చేస్తున్న టీచింగ్ పద్ధతులు గ్లోబల్ టీచర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్‌కు ఎంపికయ్యేలా చేసింది. 121 దేశాల నుంచి వచ్చిన 8 వేల దరఖాస్తులలో నేను టాప్‌లిస్ట్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లా మాచవరం అనే పల్లెటూరులో. చిన్ననాటి నుంచి స్కూల్లో వచ్చిన రకరకాల సందేహాలకు సరైన సమాధాలు దొరికేవి కావు. సమాధానాలు వెతికే ఉద్దేశ్యంతోనే, పిల్లలంతా నాలాగే ఆలోచిస్తారు, వాటిని ఎప్పటికైనా నివృత్తి చేయాలంటే టీచర్ని అవాలనుకునేదాన్ని. నాదైన ప్రత్యేకత తో పిల్లలను తీర్చిదిద్దాలనుకునేదాన్ని. అందుకే, బీఈడీ చేశాను. ప్రత్యేక శిక్షణ పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా లండన్ వెళ్లిపోయాం. అక్కడ కూడా పిల్లల సైకాలజీకి సంబంధించిన రకరకాల కోర్సులు పూర్తి చేశాను. శిక్షణ తీసుకున్నాను. స్పెషల్ చిల్డ్రన్స్ని ఎలా చూసుకోవాలో తెలుసుకోవడానికి అందులోనూ శిక్షణ తీసుకున్నాను. పిల్లలకు తొలి గురువు తల్లే అవుతుంది. అందుకే, పిల్లలు చంటిబిడ్డలుగా ఉన్ననాటి నుంచే వారిని ఎలా పెంచాలో క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పిల్లలను కనాలనుకున్నాను. మా ఇద్దరు కూతుళ్లను పెంచడానికి తీసుకున్న శిక్షణ నన్ను తిరిగి ఇండియా వచ్చేలా చేసింది. 2007 లో కుటుంబంతో పాటు ఇండియాకు వచ్చి మియాపూర్‌లో ‘ఫౌంటెయిన్‌హెడ్ గ్లోబల్ స్కూల్’ పేరుతో ప్లే స్కూల్ ప్రారంభించాను. ప్రత్యేక సిలబస్.. మనమింకా ఎప్పటివో పాత బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాము. భవిష్యత్తు తరాలు చాలా ముందుండాలి. అందుకే, నేను నేర్చుకున్న శిక్షణతో పిల్లలకు నాకు నేనుగా ప్రత్యేక సిలబస్ రూపొందించాను. మొదట నా ఇద్దరు పిల్లలే నా స్కూల్లో విద్యార్థులు. ఆ తర్వాత ఒకరొకరుగా వచ్చి చేరారు. చాలా మంది తల్లిదండ్రులకు నా బోధనా పద్ధతులు నచ్చలేదు. తిరిగి వెళ్లిపోయారు కూడా. అయినా వెనకంజ వేయదలుచుకోలేదు. తీసుకున్న టీచర్లకు నేనకున్న విధంగా శిక్షణ ఇచ్చాను. వాస్తవం తప్పనిసరి ‘భయం ఎక్కడుండాలి, ఎక్కడ ఉండకూడదు’ అనేది కూడా నా సిలబస్‌లో భాగమే. స్కూల్లో ఒకే తరహా సిలబస్ కన్నా జీవన నైపుణ్యాలకే ప్రాధాన్యత ఎక్కువ. రోజువారీ జీవన విధానంలో ఉండే ప్రతీ అవసరం తెలియజేసేందుకు కృషి చేస్తాం. పిల్లల కమిటీల ద్వారా గ్రూప్ డిస్కషన్లు ఏర్పాటు చేస్తుంటాం. ఉదాహరణకు.. కూరగాయల సంతను స్కూల్లోనే ఏర్పాటు చేసి, వాటిద్వారా అమ్మడం కొనడమనే ప్రక్రియలు తెలియజేయడం, అలా సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించాలో చెప్పడం, వారు సంపాదించిన మొత్తానికి స్కూల్ నుంచి అంతే డబ్బును జత చేసి, అవసరమైన వారికి దానం చేయడం. ఇలాంటివన్నీ వాస్తవ పద్ధతులతో బోధన చేస్తుంటాం. మొదట ఇంగ్లిషు, గణితం చెప్పేదాన్ని. నాలుగేళ్ల క్రితం పిల్లలకు చైల్డ్ రైట్స్ గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు సోషల్ స్టడీస్ వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం మొదలుపెట్టాను. ఆ విధంగా ఇంగ్లిషు, గణితం, సోషల్ టీచర్ని నేనే. పిల్లలు బాగు చేసిన చెరువు... పర్యావరణం గురించి పరిచయం చేయాలనుకున్నప్పుడు కొంచెం కష్టమే అయ్యింది. మొక్కలు, పక్షులు, జంతుజాలమే కాదు. ఒక చెరువును కూడా చూపిస్తే బాగుంటుందనుకున్నాను. మేముండే ప్రాంతం మియాపూర్‌లో ‘మీదికుంట’ చెరువు ఏ మాత్రం అనువుగా లేదని, పిల్లలకు అర్థమయ్యేలా చెబితే, అంత చిన్నపిల్లలు చెరువును శుభ్రం చేయడానికి ముందుకొచ్చారు. అంత చిన్నపిల్లల్లో సమాజం పట్ల అవగాహన కలిగించడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ చెరువు శుభ్రతకు అందరం కలిసి పాటుపడిన సంఘటనలను ఎప్పటికీ మరవలేం. మా పెద్దమ్మాయి ఇంటర్మీడియెట్‌కు వచ్చే సమయానికి జూనియర్ కాలేజీ కూడా ఈ స్కూల్లోనే ఏర్పాటు చేశాను. ప్రతి యేటా దేశంలో 30 రాష్ట్రాల నుంచి సంవత్సరానికి ఒకసారి సమావేశాలు జరుగుతుంటాయి. వాటిలో బోధనా పద్ధతుల గురించి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే ప్రక్రియలపైనా చర్చలు జరుగుతుంటాయి. ఈ ప్రపంచంలో అత్యుత్తమమైనవాడు గురువు. భవిష్యత్తు తరాలను తీర్చేదిద్దాలన్న సంకల్పంతోనే ఈ వృత్తిలోకి వచ్చాను. ఇక ముందూ నా బోధనలో ఇదే విధానాన్ని కొనసాగిస్తాను’’ అని వివరించారు ఈ గ్లోబల్ టీచర్. – నిర్మలారెడ్డి -
ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో హైదరాబాదీ!
లండన్: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్‌లిస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మేఘనా ముసునూరితో పాటు బిహార్‌కు చెందిన టీచర్ సత్యం మిశ్రా ఈ ఏడాది ప్రైజ్ రేసులో ఉన్నారు. ప్రైజు విలువ రూ.7.35 కోట్లు. యూనెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్ ఈ బహుమతిని అందిస్తుంది. ఫౌంటేన్హెడ్ గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఛైర్ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు. -
నేడు వెబ్సైట్లో షార్ట్‌లిస్టులు
సాక్షి, అమరావతి : ‘సచివాలయ’ పరీక్షల్లో పాసైన వారి వివరాలతో జిల్లాల వారీగా షార్ట్‌లిస్టు జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు శనివారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వెయిటేజీ మార్కులతో కలిపి అభ్యర్థులకు రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లకు శుక్రవారం చేరాయి. జిల్లాల వారీగా పోస్టులు, రిజర్వేషన్ల మేరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ వాటిని పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలతో కూడిన షార్ట్‌లిస్టును శనివారం ఉ.11 గంటలకు వెబ్సైట్లో ఉంచనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. జాబితాలో పేరున్న వారికి జిల్లా సెలక్షన్ కమిటీ కాల్ లెటర్లను అభ్యర్థుల మెయిల్‌కు పంపిస్తారు. షార్ట్ లిస్టులో పేరున్న అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కాన్డ్ కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మరోవైపు.. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిమిత్తం ప్రతీ జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 23, 24, 25 తేదీల్లో జరిగే సరిఫ్టికెట్ల వెరిఫికేషన్‌లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు. ఇందులో అన్ని ధృవీకరణ పత్రాలు చూపించిన అభ్యర్థులకు ఆ రోజు సాయంత్రానికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే బాధ్యతను జిల్లా సెలక్షన్ కమిటీలకే అప్పగించారు. ఇవి అందుకున్న అభ్యర్థులు అక్టోబర్ 1, 2 తేదీల్లో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరై, రెండో తేదీనే విధుల్లో చేరాలి. (చదవండి: ఫలితాల్లోనూ రికార్డ్) -
17 స్థానాలకు 320 దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు 320 మంది ఆశావహులు దరఖా స్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభస్థానాలకు ఈ నెల 10 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం ముగిసింది. రిజర్వుడ్ నియోజకవర్గాలైన నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో భారీగా డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 25కిపైగా దరఖా స్తులు వచ్చినట్టు సమాచారం. వీటిని ఈ నెల 17న జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో పరిశీలించి ఆ తర్వాత స్క్రూటినీ కమిటీ షార్ట్‌లిస్టు చేయనుంది. ఈ నెల 20లోపు నియోజకవర్గానికి 1 లేదా 2, అనివార్యమైతే 3 పేర్లతో జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపనున్నట్లు సమాచారం. నేటి నుంచి సమీక్షలు..: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్షలను శుక్రవారం నుంచి మూడ్రోజులు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో తొలిరోజు ఆదిలాబాద్–పెద్దపల్లి, నిజామాబాద్–జహీరాబాద్, కరీంనగర్–వరంగల్, రెండోరోజు నాగర్‌కర్నూల్– మహబూబ్‌నగర్, ఖమ్మం– మహబూబాబాద్, నల్లగొండ–భువనగిరి నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి. అదేరోజు పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది. మూడోరోజు చేవెళ్ల–మల్కాజ్గిరి, హైదరాబాద్–సికింద్రాబాద్, మెదక్ స్థానాల సమీక్షతోపాటు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. భేటీలకు నేతలు ఆర్సీ కుంతియా, ఉత్తమ్, భట్టి హాజరు కానున్నారు. -
నాప్కిన్స్కి నామినేషన్
కథిఖేరా... ఢిల్లీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. హాపూర్ జిల్లా. కొన్నాళ్ల కిందట అక్కడ మహిళల పరిస్థితి దారుణం. దేశంలోని చాలా ఊళ్లలాగే ఇక్కడ రుతుచక్రం గురించి చాలా అపోహలు, అంధ విశ్వాసాలూనూ. రుతు సమయం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లోని ఆడవాళ్లు ఎవరికంటా పడకుండా ఊరవతలకు వెళ్లి ఉండేవారు. ఇక అమ్మాయిలు పెద్దమనిషి అయ్యారు అంటే పెళ్లికి, సంసారానికి ఇంకా చెప్పాలంటే రేప్‌కి లైసెన్స్ వచ్చినట్టుగా భావించేవారట ఆ ఊళ్లో మగవాళ్లు. ఇలాంటి సామాజిక పరిస్థితులు, నెలసరి పట్ల అవగాహన లేమి ఉండేదక్కడ. సిగ్గుతో ఆడపిల్లలు చదువు మానేసి ఇంటికే పరిమితమయ్యేవారు. అందుకే ఆ ఊళ్లో మొన్నమొన్నటి వరకు కూడా హైస్కూల్ పూర్తి చేసిన అమ్మాయి లేదు. రుతుసమయంలో శుభ్రత పాటించడం తెలియక ఎంతో మంది మహిళలు అనారోగ్యం పాలయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే రుతుచక్రం మొదలైన ఆడవాళ్లను అస్పృశ్యులుగా పరిగణించే సంప్రదాయం నెలకొందన్నమాట. అక్కడే విప్లవమూ మొదలైంది. అదీ మహిళల నుంచి! శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే మెషీన్ వచ్చింది. రుతుచక్రం, రుతు సమయం పట్ల ఉన్న అపోహలు పోయాయి. ఆడవాళ్లే నాప్కిన్స్ తయారు చేస్తూ మార్కెట్ కూడా వాళ్లే చేసుకుంటూ వాళ్ల ఆర్థిక పరిస్థితినీ మెరుగుపర్చుకున్నారు. ఆ నాప్కిన్స్కి ‘‘ఫ్లై’’ అనే పేరు పెట్టుకున్నారు. దాంతో ఆ ఊరి చిత్రమే మారిపోయింది. ఓ షార్ట్ డాక్యు మెంటరీగానూ రూపుదిద్దుకుంది.. అదే... ‘‘పీరియడ్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్’. ఆస్కార్ అవార్డ్స్ బరిలో డాక్యుమెంటరీ కేటగిరీలో షార్ట్‌లిస్ట్ అయింది. ఈ డాక్యుమెంటరీకి లాస్ఏంజెల్స్లోని ఓక్వుడ్ స్కూల్, ఫెమినిస్ట్ ఫౌండేషన్ రెండూ కలిసి ఫండింగ్ చేశాయి. దర్శకత్వం.. రేయ్‌కా జెహ్తాబ్చీ. రేయ్‌కా జెహ్తాబ్చీ.. అమెరికాలో పుట్టిన ఇరానీ వనిత. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి ఫిల్మ్ ప్రొడక్షన్ డిగ్రీ చేశారు. మొదటి నుంచీ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ అంటే ఆసక్తి ఉన్న రేయ్కాకు ఫిల్మ్ మేకర్స్ అస్ఘర్ ఫర్హాది, పాల్ గ్రీన్గ్రాస్లే స్ఫూర్తి. ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’. డాక్యుమెంటరీ తీయడానికి నిర్మాతలు ఒక యంగ్ ఫిల్మ్‌మేకర్ గురించి వెదుకుతుంటే వాళ్లకు రేయ్‌కా గురించి తెలిసింది. అలా ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ‘‘ఓక్వుడ్ స్కూల్లోని పదిహేను నుంచి పదహారేళ్ల మధ్య వయసున్న అమ్మాయిలంతా ఇండియాలోని కథిఖేరా విలేజ్ మహిళల కోసం శానిటరీ నాప్కిన్ మెషీన్ కోసం ఆర్థిక సహాయం అందించడం, ఈ మెషీన్‌తో అక్కడి మహిళలు ఆరోగ్యంతోపాటు ఆర్థిక స్వావలంబననే సాధించడం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాకు అవార్డ్ వస్తుందా రాదా.. అన్నది సెకండ్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్.. ఇది ఆస్కార్ డాక్యుమెంటరీ షార్ట్‌లిస్ట్‌లో ఉన్నందుకే చాలా గర్వంగా ఉంది’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు రేయ్‌కా జెహ్తాబ్చీ. ఈ సినిమా షూటింగ్ అంతా కథిఖేరాలోనే తీశారు. అందుకోసం రేయ్‌కా రెండుసార్లు ఇండియాను సందర్శించారు. శానిటరీ వెండింగ్ మెషీన్ రాకముందు ఊళ్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ ఊరివాళ్లను ఇంటర్వ్యూ చేయడానికి, తర్వాత షూటింగ్ కోసం. ఊళ్లోని చాలా మంది దీనిమీద మాట్లాడ్డానికి ఇష్టపడలేదట. ప్యాడ్స్ తయారు చేసే మెషీన్ నెలకొల్పడానికి, దాన్ని ఆడవాళ్లే నడుపుకునేలా చేయడానికి స్నేహా అనే అమ్మాయి చేసిన ప్రయత్నాన్ని తెలుసుకుని చలించి పోయిందట రేయ్‌కా. ఆ సంఘటననూ ఉన్నదున్నట్లే ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’లో పొందుపర్చారు రేయ్‌కా జెహ్తాబ్చీ. – శరాది -
మిస్త్రీ వారసుడి షార్ట్ లిస్ట్
సైరస్ మిస్త్రీ అనూహ్య తొలగింపు తర్వాత ఆయన వారసుల ఎంపికలో టాటా గ్రూపు బిజీబిజీగా ఉంది. టాటా అండ్ సన్స్ నూతన ఛైర్మన్ ఎంపికకు కసరత్తు అపుడే మొదలైంది. తాత్కాలికంగా రతన్ టాటా మధ్యంతర పదవీ బాధ్యతలు స్వీకరించినా కొత్త చైర్మన్ ఎంపికపై అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అత్యున్నత స్థాయి బృందం కొత్తఛైర్మన్ కోసం అన్వేషణ చేపట్టింది. ఈ నేపథ్యంలో పలువురు దిగ్గజాల పేర్లను సంస్థ పరిశీలిస్తోంది. సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత, టాటా గ్రూప్ తదుపరి చైర్మన్ అభ్యర్థుల జాబితాలో ముఖ్యంగా టీసీఎస్ సీఈవో ఎన్.చంద్రశేఖరన్, జాగ్వార్ లాండ్ రోవర్ అధినేత రాల్ఫ్స్పెత్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్, మిస్త్రీ బావ నోయెల్ టాటా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమిక జాబితా మారే అవకాశం ఉందని, ఈ నియామకాన్ని పూర్తి చేసేందుకు సెర్చ్ కమిటీకి నాలుగు నెలలు సమయం ఉన్నట్టు సమాచారం. అయితే ఈ అంచనాలపై టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్, స్పెత్ ఇద్దరూ స్పందించలేదు. అటు టాటా సన్స్ లిమిటెడ్ కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. నోయల్ కూడా అందుబాటులో లేరు. కాగా 2012 నుంచి టాటా అండ్ సన్స్‌కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సైరస్ మిస్త్రీని టాటా అండ్ సన్స్ తొలగించి మార్కెట్ వర్గాల్లో కలకలం రేపారు. ఇరువర్గాలు పరస్పర ఆరోపణలతో వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే. -
ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలు ఇవే..
-
అరుంధతి ఔట్!
న్యూఢిల్లీ: తదుపరి ఆర్బీఐ గవర్నర్ పదవికోసం అభ్యర్థి ఎంపికలో ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్యకు ప్రభుత్వం షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు గవర్నర్ రేసులో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం మరింత కుదించింది. ఈ షార్ట్ లిస్ట్ ను నాలుగు నుంచి రెండుకు కుదించిందని గురువారం నివేదికలు వెల్లడించాయి. అరుంధతి భట్టాచార్య, ఊర్జిత్ పటేల్ పక్కన పెట్టిన ప్రభుత్వం ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. డోజౌన్స్ వైర్ అంచనాల ప్రకారం అరుణ్ జైట్లీతో చర్చించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. జులై 15వ తేదీకల్లా ఈ నియామకం పూర్తి కావచ్చని చెబుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గట్టి ప్రధాన పోటీదారులుగా నిలిచారు. ప్రధానంగా ముందు ఆరుగురుతోనూ, ఇద్దరి తొలగించి ఆ తరువాత నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఎంపిక చేసిన ప్రభుత్వం మరో ఇద్దరిని కూడా ఈ జాబితా నుంచి తొలగించింది. ఎస్ బీఐ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య, ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను పక్కన పెట్టడంతో.. మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ ఫైనల్ రేసులో మిగిలారు. మరి వీరిలో ఎవర్ని ఆ పదవి వరించనుది అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. -
ఆ నలుగురిలో గెలిచేది ఎవరు?
న్యూఢిల్లీ : తదుపరి ఆర్బీఐ గవర్నర్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా అభ్యర్థుల జాబితాను కుదించడంతో భారీ ఉత్కంఠ నెలకొంది. రఘురామ్ రాజన్ గవర్నర్‌గా కొనసాగరని స్పష్టం కావడంతో రాజన్ వారసుడి ఎంపికపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అటు ప్రభుత్వం కూడా ఈ ఎంపికలో తన అభ్యర్థుల జాబితాను కుదించినట్టు సీనియర్ అధికారి రాయిటర్స్ కి చెప్పారు. కొత్త ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ)కూడా త్వరలో గవర్నర్ ను ఎంపిక చేస్తుందని తెలిపారు. ప్రధానంగా నలుగురు అభ్యర్థుతో కూడిన జాబితాను ఎంపిక చేశామన్నారు. వీరిలో ముగ్గురు కేంద్ర బ్యాంకు మాజీ, ప్రస్తుత ఉన్నతోద్యోగులు కాగా, మరొకరు స్టేట్ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య . ప్రస్తుత ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్, మాజీ డిప్యూటీ గవర్నర్లు రాకేష్ మోహన్, సుబీర్ గోకర్న్ గవర్నర్ రేసులో ఉన్నారు. ఒకవైపు ఎస్ బీఐ అధిపతి అరుంధతి భట్టాచార్య ఈ పదవికి ఎంపిక కావడం ఖాయమనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో కూడా ఈమె పేరు ప్రముఖంగా ఉండడంతో ఇవి మరింత ఊపందుకున్నాయి. మరోవైపు దేశ ఉన్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధిపతిగా అరుంధతి ఎంపిక పై వస్తున్న ఊహాగానాలపై నెటిజన్లు దాదాపు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఆమెకు అంత అర్హత లేదనీ, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితులలో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే దక్షత, నైపుణ్యంలేవని వాదిస్తున్నారు. ఒకవేళ ఆర్ బీఐ అత్యున్నత పదివికి అరుంధతి భట్టాచార్య ఎంపిక అయితే ..అరవింద సుబ్రమణియన్, శక్తికాంత్ దాస్లపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఎలా స్పందిస్తారు? ఈ నేపథ్యంలో గవర్నర్ రేసు పై అంతకంతకూ సస్పెన్స్ పెరుగుతోంది. మరి దీనికి తెరపడాలంటే తుది నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే.. కాగా ప్రస్తుత గవర్నర్ రఘురామ రాజన్ పదవీకాలం ఈ సెప్టెంబర్ లో ముగియనుండటం,అటాగే బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లను బలమైన సంకేతాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. అటు తను రెండవసారి ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగనని రాజన్ స్పష్టం చేయడంతో కేంద్ర బ్యాంకు ఉన్నత పదవిని అధిరోహించే అభ్యర్థుల రేస్ మొదలైంది. వీరిలో బలంగా వినిపించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్లను తొలగించడం విశేషంగా మారింది. -
ల్యాంకో పవర్ వాటాల రేసులో 4 సంస్థలు?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణ భారం తగ్గించుకునే దశగా విద్యుత్ వ్యాపార విభాగంలో వ్యూహాత్మక ఇన్వెస్టర్ల వేటలో ఉన్న ల్యాంకో గ్రూప్ తాజాగా నాలుగు సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. టాటా పవర్, పిరమాల్ ఎంటర్ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ మొదలైనవి ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 8,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో ఆరు థర్మల్ పవర్ ప్లాంట్లున్న ల్యాంకో విద్యుత్ వ్యాపార విభాగం విలువ సుమారు రూ. 45,000 కోట్ల మేర ఉంటుందని అంచనా. మెగావాట్‌కు రూ. 4.5 కోట్లు చొప్పున (సుమారు రూ. 36,000 కోట్లు) కంపెనీ కోరుతుండగా, బిడ్డర్లు సుమారు రూ. 3 కోట్లు (దాదాపు రూ. 24,000 కోట్లు) కోట్ చేస్తున్నట్లు సమాచారం. ల్యాంకోగ్రూప్నకు రుణాలిచ్చిన వాటిల్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి. మరోవైపు, వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా తాము వివిధ పెట్టుబడి అవకాశాలు పరిశీలిస్తుంటామని, ప్రస్తుతానికైతే ల్యాంకో పవర్ వాటాల కొనుగోలు ప్రతిపాదనేదీ తమ బోర్డు ముందుకు రాలేదని పిరమాల్ ఎంటర్ప్రైజెస్ వివరణనిచ్చింది. ఇవన్నీ పూర్తిగా ఊహాజనిత వార్తలేనని, తాము దీనిపై చర్చలేమీ జరపడం లేదంటూ అటు టాటా పవర్ కంపెనీ స్పష్టం చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ సైతం వాటాల కొనుగోలు వార్తలను తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని తెలిపింది. శుక్రవారం బీఎస్ఈలో ల్యాంకో ఇన్ఫ్రాటెక్ షేర్లు దాదాపు 12 శాతం ఎగిసి రూ. 4.92 వద్ద ముగిశాయి. -
పరివర్తనకు పాటుపడుతున్నమహిళలెవరు?
న్యూఢిల్లీః దేశాభివృద్ధికి తోడ్పడటంలోనూ, మానవీయతను ప్రదర్శించి జనంలో పరివర్తన కలిగించడంలోనూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలను గుర్తించేందుకు భారత ప్రభుత్వం 'ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా' పేరున ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వానికి అందిన వెయ్యి ఎంట్రీల్లో 25 మందిని ప్రజలు ప్రత్యక్షంగా ఎంపిక చేసేందుకు వీలుగా ఆన్ లైన్, ఎస్ఎంఎస్ పోల్ నిర్వహిస్తోంది. పదిమంది యాసిడ్ దాడి బాధితులకు ప్రత్యేక స్కాలర్షిప్ అందించడంతోపాటు, సంవత్సరానికి 400 మందికి ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ ను చైన్పైలోని ఓ విశ్వవిద్యాలయ డైరెక్టర్ అందిస్తోంది. అలాగే బెంగళూరుకు చెందిన ఓ బీపీఓ సంస్థ యజమాని తన సంస్థలో వికలాంగ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోంది. ఇలా జనంలో పరివర్తనను కలిగించే లక్షణాలు కలిగిన మహిళలను గుర్తించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనను.. మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా' పేరున ప్రారంభించారు. ఆరోజునుంచీ ప్రభుత్వానికి అందిన మొత్తం వెయ్యి ఎంట్రీల్లో దేశంలోని 25 మంది మహిళలను ప్రజలు ఎన్నుకునేందుకు వీలుగా ఆన్ లైన్ పోల్, ఎస్ఎంఎస్ పోల్ ను మే 14వ తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి అందిన మొత్తం వెయ్యిమంది ప్రత్యేక మహిళల జాబితాలో ఆన్ లైన్ పోల్ ద్వారా ఎంపికైన జాబితాను చివరి ఫలితాలను ప్రకటించేందుకు నీతి ఆయోగ్ ద్వారా ఏర్పాటైన జ్యూరీ ముందు ఉంచనున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా పోల్ లో ఇప్పటివరకూ చెన్నై సత్యభామా యూనివర్శిటీ డైరెక్టర్ డాక్టర్ మారియా జీనా జాన్సన్, వెస్ట్ బెంగాల్ వస్త్ర వ్యాపారవేత్త దిపాలీ ప్రమాణిక్, బెంగళూరు బీపీవో యజమాని పవిత్ర లు అత్యధిక ఓట్లను సాధించినట్లు తెలుస్తోంది. అత్యధిక ఓట్లు సంపాదించిన తదుపరి జాబితాలో మాజీ జర్నలిస్ట్ మంజీత్ కృపాలిని, దౌత్యవేత్త నీలమ్ డియోలు కూడ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో పరివర్తనకు పాటుపడటంతోపాటు.. ప్రత్యేకతలు సాధించిన మహిళల జీవిత కథలను ప్రపంచానికి తెలిసేట్లు చేయడంతో... ఇతర మహిళల్లో సాధికారతను పెంచడానికే కాక, సవాళ్ళను అధిగమించేందుకు సహకరిస్తాయన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. -
సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో ఇద్దరు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ పదవి రేసులో ఇద్దరు నిలిచారు. ఈ పదవి కోసం పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఈ జాబితాను పరిశీలించిన కమిటీ.. కుదించిన జాబితాలో సీనియర్లు శరత్ కుమార్, అనిల్ సిన్హా పేర్లను చేర్చింది. వీరిద్దరిలో ఒకరిని సీబీఐ డెరెక్టర్‌గా నియమించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కమిటీ ఎంపిక చేయనుంది. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ రంజిత్ సిన్హా పదవీకాలం ముగియడంతో కొత్త డెరెక్టర్ పేరును త్వరలోనే ప్రకటించనున్నారు.