బ్యాంకింగ్‌ పర్యవేక్షణ మరింత పటిష్టం: షార్ట్‌లిస్ట్‌లో 7 గ్లోబల్‌ కంపెనీలు | RBI shortlists 7 global consultancy firms to use AI ML improve supervision | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ పర్యవేక్షణ మరింత పటిష్టం: షార్ట్‌లిస్ట్‌లో 7 గ్లోబల్‌ కంపెనీలు 

Dec 12 2022 10:58 AM | Updated on Dec 12 2022 11:12 AM

RBI shortlists 7 global consultancy firms to use AI ML improve supervision - Sakshi

ముంబై: బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై  (ఎన్‌బీఎఫ్‌సీ) నియంత్రణను మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, పర్యవేక్షణకు  కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌ను వినియోగించుకునే క్రమంలో ఏడు అంతర్జాతీయ కన్సల్టెన్సీలను షార్ట్‌లిస్ట్‌ చేసింది. ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్స్, మెకిన్సే, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (ఇండియా) తదితర సంస్థలు వీటిలో ఉన్నాయి.

కన్సల్టెంట్ల నియామకం కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. స్క్రూటినీ అనంతరం ప్రస్తుతం కొన్నింటిని షార్ట్‌లిస్ట్‌ చేసింది. బ్యాంకింగ్‌ రంగ పరిధిలోని సంస్థల ఆర్థిక స్థితిగతులు, అసెట్‌ క్వాలిటీ, లిక్విడిటీ తదితర అంశాలను ఆర్‌బీఐ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో ఏఐ, ఎంఎల్‌ను ఉపయోగిస్తోంది. వీటి వినియోగాన్ని మరింతగా విస్తరించేందుకు తాజా ప్రక్రియ చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement