క్రిప్టో కరెన్సీ ఆర్థిక స్థిరత్వానికి భారీ నష్టం కలిగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వెల్లడించారు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అనే థింక్-ట్యాంక్ కార్యక్రమంలో 'శక్తికాంత దాస్' ఈ వ్యాఖ్యలు చేశారు.
క్రిప్టో కరెన్సీ ద్రవ్య స్థిరత్వానికి మాత్రమే కాకుండా.. బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఆర్ధిక వ్యవస్థపైన క్రిప్టోల ఆధిపత్యం ఉండకూడదని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సరఫరాపై సెంట్రల్ బ్యాంక్ నియంత్రణ కోల్పోయే పరిస్థితిని కూడా ఇది సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
క్రిప్టో కరెన్సీ వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకోవాలి. ఈ సమస్య మీద అందరికి అవగాహన ఉండాలి. క్రిప్టోకరెన్సీల వల్ల కలిగే నష్టాల గురించి ప్రభుత్వాలు కూడా తెలుసుకుంటున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీల గురించి ప్రశ్నించిన మొదటి దేశం భారత్ అని ఆయన అన్నారు.
భారతదేశ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో క్రిప్టో అంశం మీద అవగాహన పెంపొందించడానికి ఒక ఒప్పందం జరిగింది. అప్పట్లో దీనిపైన తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేసిన మొదటి సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ కావడం గమనార్హం. ఈ విషయంలో ఇప్పటికే కొంత పురోగతి సాధించాము. దీనిపై ఇంకా పనిచేయాల్సి ఉందని శాంతికాంత దాస్ అన్నారు. క్రిప్టోల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment