Supervision
-
మొక్కవోని నిఘా!
వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.. అన్నదాతకు అండగా నిలిచేందుకు పకడ్బందీ కార్యాచరణ అమలు చేస్తోంది.. అందులో భాగంగా సాగుకు అనుబంధంగా సాగుతున్న నర్సరీలపై ప్రత్యేక దృష్టి సారించింది.. రైతుకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసేలా కట్టుదిట్టంగా చర్యలు చేపడుతోంది.. విత్తు నాటింది మొలకెత్తించే విధానం.. మొక్క ఎదుగుదల మొదలు దిగుబడి వచ్చేవరకు అన్ని దశలపై నిఘా పెట్టి నిశితంగా పరిశీలిస్తోంది.. నాసిరకం నారుతో ఒక్క రైతు కూడా నష్టాలపాలు కాకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకుంటోంది.. ఇందుకో సం రిజి్రస్టేషన్ సమయంలోనే నర్సరీ యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెంచుతోంది. సాక్షి, చిత్తూరు : వ్యవసాయంలో కాలక్రమేణా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు రైతులు తమ పొలాల్లోనే నారు పోసుకునేవారు. అనంతరం మొక్క నాటుకుని సాగు చేసేవారు. ఈ క్రమంలో ఒక్కోసారి నాసిరకం విత్తనాలు విత్తడం, నారు పెంపకంలో చిన్న చిన్న పొరబాట్లు, సక్రమంగా యాజమాన్య పద్ధతులు పాటించకపపోవడం కారణంగా పంట నష్టపోయేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇబ్బడిముబ్బడిగా నర్సరీలు పుట్టుకొచ్చాయి. రైతులు తమకు కావాల్సిన పంటకు సంబంధించి మొక్కలను నేరుగా నర్సరీల్లోనే కొనుగోలు చేసుకుంటున్నారు. ఈ విధానం ముందుగా పువ్వులు, పండ్లు, కూరగాయల పంటల్లో ప్రారంభమైంది. మలిదశలో వరి, చెరుకు తదితర పంటలకు కూడా వ్యాప్తి చెందింది. ఆధునిక పద్ధతులు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా నర్సరీలు ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ కంపెనీలు సైతం తమ విత్తన వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు నర్సరీలకు శ్రీకారం చుట్టాయి. ప్రస్తుతం దాదాపు అన్ని పంటలకు సంబంధించిన మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. వరి, చెరుకు, టమాట, వంగ, బీర ,కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మామిడి, సపోటా, నిమ్మ, చీనీ, జామ, దానిమ్మతోపాటు అన్ని రకాల పువ్వుల మొక్కలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే నర్సరీలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఒక్కోసారి ఈ నర్సరీలు సరఫరా చేసే మొక్కలు నాణ్యంగా లేకంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. నర్సరీ యజమాన్యాలు బాధ్యతాయుతంగా మొక్కలను పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. నాణ్యమైన విత్తనాలను సేకరించడం, వాటిని విత్తటం, మొలకెత్తించటం, మొక్కలను పొలంలో నాటే వరకు నిరంతరం పరిశీలించాలని స్పష్టం చేసింది. అన్నదాత నాసిరకం నారు కారణంగా నష్టపోకూడదని ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టంగా నిఘా పెట్టింది. పకడ్బందీగా రిజిస్ట్రేషన్ ఉద్యానవన చట్టం– 2010 ప్రకారం నర్సరీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ విభాగం పర్యవేక్షిస్తోంది. నర్సరీ ఏర్పాటు చేసిన ప్రదేశం, దానికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్, భూమి స్థితిగతులు, భూసార పరీక్షల రిపోర్టు డిజిటల్ ఫొటోలతో పాటు యజమాని ఆధార్ కార్డు వివరాలను పొందుపరుస్తూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే రైతులు ఏమాత్రం నష్టపోకుండా చూసే బాధ్యతను సైతం నర్సరీల యాజమాన్యంపైనే ఉంచుతున్నారు. పక్కాగా పర్యవేక్షణ నర్సరీల్లో మొక్కల సంరక్షణ పద్ధతులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది.విత్తనాల కొనుగోలు నుంచిమొక్కలను రైతులకు అప్పగించే వరకు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. ఒకవేళ రైతు నష్టపోతే నర్సరీల యాజమాన్యాలు, విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలే బాధ్యత వహించేలా సర్కారు చర్యలు చేపట్టింది. సేవకు గుర్తింపుగా అవార్డు నర్సరీ రంగంలో దాదాపు 20 ఏళ్లుగా ఉన్నా. మరోవైపు వ్యవసాయం చేస్తున్నా. సాగుకు చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టర్ వైఎస్సార్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తున్నాం. ఈ విధానం ద్వారా నర్సరీ యాజమాన్యాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి. – రాఘవేంద్ర, నర్సరీ యజమాని, శాంతిపురం ప్రభుత్వ నిర్ణయంతో న్యాయం వ్యవసాయంలో నష్టపోకుండా ఉండాలంటే ముందు నాణ్యమైన మొక్కలను నాటుకోవాలి. రూ.లక్షలు వెచ్చించే రైతు విషయంలో నర్సరీలవారిపై ప్రభుత్వం బాధ్యత పెట్టడం మంచి నిర్ణయం. దీంతో రైతులకు న్యాయం జరుగుతుంది. – అరుణ, రైతు, ఎంకే పురం, కుప్పం మండలం నిరంతర పర్యవేక్షణ రైతులు ఎక్కువగా ఉద్యా న పంటలు సాగు చేస్తున్నా రు. నాణ్యమైన మొక్కలను సరఫరా చేయకపోతే భారీగా నష్టపోయే ప్రమాదముంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నర్సరీ యజమాని బాధ్యతగా నాణ్యమైన మొక్కలను సరఫరా చేయాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – లక్ష్మీప్రసన్న, ఉద్యానశాఖాధికారి, పలమనేరు రైతు సంక్షేమం కోసమే.. రైతు సంక్షేమం కోసమే నర్సరీలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. నాణ్యమైన మొక్కలను అందిస్తే అన్నదాతలు చక్కటి ఉత్పత్తులు సాధిస్తా రు. తద్వారా గిట్టుబాటు ధర దక్కుతుంది. ఇందుకోసమే నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అలాగే నర్సరీ యాజమాన్యాలకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నాం. – మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖాధికారి -
రుణాలపై పర్యవేక్షణ కీలకం
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్‌లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్ చీఫ్‌లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. -
బ్యాంకింగ్ పర్యవేక్షణ మరింత పటిష్టం: షార్ట్‌లిస్ట్‌లో 7 గ్లోబల్ కంపెనీలు
ముంబై: బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) నియంత్రణను మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారీ డేటాబేస్‌ను విశ్లేషించేందుకు, పర్యవేక్షణకు కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్‌ను వినియోగించుకునే క్రమంలో ఏడు అంతర్జాతీయ కన్సల్టెన్సీలను షార్ట్‌లిస్ట్ చేసింది. ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్, మెకిన్సే, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (ఇండియా) తదితర సంస్థలు వీటిలో ఉన్నాయి. కన్సల్టెంట్ల నియామకం కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించింది. స్క్రూటినీ అనంతరం ప్రస్తుతం కొన్నింటిని షార్ట్‌లిస్ట్ చేసింది. బ్యాంకింగ్ రంగ పరిధిలోని సంస్థల ఆర్థిక స్థితిగతులు, అసెట్ క్వాలిటీ, లిక్విడిటీ తదితర అంశాలను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో ఏఐ, ఎంఎల్‌ను ఉపయోగిస్తోంది. వీటి వినియోగాన్ని మరింతగా విస్తరించేందుకు తాజా ప్రక్రియ చేపట్టింది. -
ఇన్‌స్ట్రాగామ్‌లో కొత్త ఫీచర్: చూశారా మీరు?
న్యూఢిల్లీ: ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాం ఇన్‌స్ట్రాగామ్ తాజాగా భారత్‌లో పేరెంటల్ పర్యవేక్షణ సాధనాలను ప్రవేశపెట్టింది. తమ టీనేజీ పిల్లల ఇన్స్ట్రా ఖాతాలను తల్లిదండ్రులు పర్యవేక్షించేందుకు ఇవి సహాయపడగలవని సంస్థ తెలిపింది. అలాగే ఈ విషయంలో సహాయం కోసం నిపుణులు అందించే వనరులతో ఫ్యామిలీ సెంటర్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్లు ఇన్‌స్ట్రాగామ్ పేర్కొంది. (ఇది చదవండి: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట) టీనేజీ పిల్లలను ఆన్లైన్లో సురక్షితంగా ఉంచేందుకు, తల్లిదండ్రులకు మరింతగా పర్యవేక్షణా అధికారాలను ఇచ్చేందుకు ఈ సాధనాలు, వనరులు ఉపయోగపడగలవని వివరించింది. (iPhone14: గుడ్ న్యూస్.. భారీ ఆఫర్ ఎక్కడంటే?) -
భవన నిర్మాణానికి సహకరించండి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో రూ.32 కోట్లతో నూతనంగా చేపట్టిన భవన నిర్మాణ పనులకు కాంట్రాక్టర్లు సహకరించాలని మేయర్ కోనేరు శ్రీధర్ కోరారు. ఆయన బుధవారం భవన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు పాక్షింకగా అడ్డంగా ఉన్న భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యాధునిక పరికరాలతో తొలగించాల్సిందిగా సూచించారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, ఈఈ బి.ఉదయ్‌కుమార్, డీఈ ఏఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల్లో పేచీ ఎన్టీఆర్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. మొదటి, రెండో అంతస్తు నిర్మాణానికి సంబంధించి ఇటుకలు, ఇసుక, ఐరన్, సెంట్రింగ్ సామాన్లను కింద వేసేందుకు వీల్లేదంటూ పార్కింగ్ కాంట్రాక్టర్ అడ్డు చెప్పడంతో నిర్మాణ పనులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో భవన నిర్మాణ కాంట్రాక్టర్ జనార్దన్ బుధవారం మేయర్ కోనేరు శ్రీధర్‌ను కలిసి సమస్య వివరించారు. మెటీరియల్ డంప్ చేసుకునేందుకు వీలుగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మేయర్ ఎస్టేట్స్ అధికారి కృష్ణమూర్తితో ఫోన్లో మాట్లాడారు. పార్కింగ్ కాంట్రాక్టర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డంప్ చేసిన మెటీరియల్‌ను ఎప్పటికప్పుడు పైకి తరలించుకోవాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. పర్యవేక్షణ బాధ్యతలను ఈఈ ధనుంజయకు అప్పగించారు. -
రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ
సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఘాట్‌రోడ్డు వద్ద క్యూలైన్లలో ఉన్న భక్తులతో మాట్లాడారు. నగరంలో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు గమనిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం, ఆంక్షలను సడలించడం చేస్తున్నామని సీపీ తెలిపారు. పోలీసు సిబ్బంది, వాలంటీర్ల సహకారంతో క్యూలైన్లలో భక్తులు త్వరగా ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టామని చెప్పారు. – విజయవాడ (ఇంద్రకీలాద్రి) -
పులిచింతల ఘనత వైఎస్సార్‌దే
సాక్షి, విజయవాడ : కృష్ణా డెల్టా రైతుల కష్టాలను తీర్చేందుకు పులిచింతల ప్రాజెక్టును నిర్మించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెకును గురువారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలోనే ప్రాజెక్టు 80 శాతం పూర్తయిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తిరిగి జాతికి అంకితం ఇస్తుందని జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు ప్రకటించడం హాస్యాస్పదమంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నల్గొండ జిల్లాలో రైతులకు ఇవ్వాల్సిన పూర్తి నష్టపరిహారాన్ని చెల్లించి, ప్రాజెక్టును పూర్తిగా ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
సజ్జ పంట పరిశీలన
కణేకల్లు : తుంబిగనూరు గ్రామంలో దెబ్బతిన్న సజ్జపంటను జేడీఏ శ్రీరామమూర్తి, రాయదుర్గం ఏడీఏ మద్దిలేటి, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జాన్‌సుధీర్, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుజాత, కణేకల్లు ఏఓ శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. బేయర్, హైటెక్ కంపెనీల సహకారంతో గ్రామంలో 500 ఎకరాల్లో సాగు చేసిన సజ్జ ఫౌండేషన్ సీడ్ దెబ్బతినడంపై పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో జేడీఏ స్పందించి స్వయంగా పంటను పరిశీలించారు. మగవిత్తనం 2282, ఆడ విత్తనం 2281 రకం సాగు చేశామని, మగ మొక్కకన్నా ముందే ఆడ మొక్కలో కంకిలొచ్చి పంటక్రాస్కు నోచుకోకపోవడంతో పంట మొత్తం సర్వనాశనమైందని బాధిత రైతులు జేడీఏ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
సర్వే కోసం జిల్లాకో సీనియర్ ఐఏఎస్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి సర్వే పర్యవేక్షణకు జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ అశోక్ ( ఆదిలాబాద్), సి.పార్థసారథి (కరీంనగర్), రాహుల్ బొజ్జా (వరంగల్), నీరబ్‌కుమార్ ప్రసాద్ (ఖమ్మం), వి. అనిల్‌కుమార్(నల్లగొండ), ఎం. జగదీశ్వర్ (మహ బూబ్‌నగర్), బీఆర్ మీనా (రంగారెడ్డి), సోమేష్‌కుమార్(హైదరాబాద్), బి.వెంకటేశం (మెదక్), బి.జనార్దన్‌రెడ్డి(నిజామాబాద్) ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. ఈనెల 14 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు వీరంతా సర్వేను పర్యవేక్షిస్తారు. 3.69 లక్షల మంది సిబ్బంది నియామకం సర్వే కోసం జిల్లాల్లో కలెక్టర్లు ఇప్పటికే 3.69 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సర్వే ఏర్పాట్లపై రాజీవ్‌శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్యలు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.