తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి సర్వే పర్యవేక్షణకు జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి సర్వే పర్యవేక్షణకు జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ అశోక్ ( ఆదిలాబాద్), సి.పార్థసారథి (కరీంనగర్), రాహుల్ బొజ్జా (వరంగల్), నీరబ్‌కుమార్ ప్రసాద్ (ఖమ్మం), వి. అనిల్‌కుమార్(నల్లగొండ), ఎం. జగదీశ్వర్ (మహ బూబ్‌నగర్), బీఆర్ మీనా (రంగారెడ్డి), సోమేష్‌కుమార్(హైదరాబాద్), బి.వెంకటేశం (మెదక్), బి.జనార్దన్‌రెడ్డి(నిజామాబాద్) ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. ఈనెల 14 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు వీరంతా సర్వేను పర్యవేక్షిస్తారు.
3.69 లక్షల మంది సిబ్బంది నియామకం
సర్వే కోసం జిల్లాల్లో కలెక్టర్లు ఇప్పటికే 3.69 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సర్వే ఏర్పాట్లపై రాజీవ్‌శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్యలు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.