పరివర్తనకు పాటుపడుతున్నమహిళలెవరు? | Govt to shortlist motivating stories of 'Women transforming India' | Sakshi
Sakshi News home page

పరివర్తనకు పాటుపడుతున్నమహిళలెవరు?

Published Fri, May 13 2016 3:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

పరివర్తనకు పాటుపడుతున్నమహిళలెవరు?

పరివర్తనకు పాటుపడుతున్నమహిళలెవరు?

న్యూఢిల్లీః దేశాభివృద్ధికి తోడ్పడటంలోనూ, మానవీయతను ప్రదర్శించి జనంలో పరివర్తన కలిగించడంలోనూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలను గుర్తించేందుకు భారత ప్రభుత్వం 'ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా' పేరున ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వానికి అందిన వెయ్యి ఎంట్రీల్లో 25 మందిని ప్రజలు ప్రత్యక్షంగా ఎంపిక చేసేందుకు వీలుగా ఆన్ లైన్, ఎస్ఎంఎస్ పోల్ నిర్వహిస్తోంది.

పదిమంది యాసిడ్ దాడి బాధితులకు ప్రత్యేక స్కాలర్షిప్ అందించడంతోపాటు, సంవత్సరానికి 400 మందికి ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ ను చైన్పైలోని ఓ విశ్వవిద్యాలయ డైరెక్టర్ అందిస్తోంది. అలాగే బెంగళూరుకు చెందిన ఓ బీపీఓ సంస్థ యజమాని తన సంస్థలో వికలాంగ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోంది. ఇలా జనంలో పరివర్తనను కలిగించే లక్షణాలు కలిగిన మహిళలను గుర్తించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనను.. మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  'ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా' పేరున ప్రారంభించారు. ఆరోజునుంచీ ప్రభుత్వానికి అందిన మొత్తం వెయ్యి ఎంట్రీల్లో దేశంలోని 25 మంది మహిళలను ప్రజలు ఎన్నుకునేందుకు వీలుగా ఆన్ లైన్ పోల్, ఎస్ఎంఎస్ పోల్ ను మే 14వ తేదీ వరకూ  నిర్వహిస్తున్నారు.  

ప్రభుత్వానికి అందిన మొత్తం వెయ్యిమంది ప్రత్యేక మహిళల జాబితాలో ఆన్ లైన్ పోల్ ద్వారా ఎంపికైన జాబితాను చివరి ఫలితాలను ప్రకటించేందుకు నీతి ఆయోగ్ ద్వారా ఏర్పాటైన జ్యూరీ ముందు ఉంచనున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా పోల్ లో ఇప్పటివరకూ చెన్నై సత్యభామా యూనివర్శిటీ డైరెక్టర్ డాక్టర్ మారియా జీనా జాన్సన్, వెస్ట్ బెంగాల్ వస్త్ర వ్యాపారవేత్త దిపాలీ ప్రమాణిక్, బెంగళూరు బీపీవో యజమాని పవిత్ర లు అత్యధిక ఓట్లను సాధించినట్లు తెలుస్తోంది. అత్యధిక ఓట్లు సంపాదించిన తదుపరి జాబితాలో  మాజీ జర్నలిస్ట్ మంజీత్ కృపాలిని, దౌత్యవేత్త నీలమ్ డియోలు కూడ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో పరివర్తనకు పాటుపడటంతోపాటు..  ప్రత్యేకతలు సాధించిన మహిళల జీవిత కథలను ప్రపంచానికి తెలిసేట్లు చేయడంతో... ఇతర మహిళల్లో సాధికారతను పెంచడానికే కాక, సవాళ్ళను అధిగమించేందుకు సహకరిస్తాయన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement