RRR Movie Naatu Naatu Song Shortlisted For Oscar 2023 - Sakshi
Sakshi News home page

RRR Movie-Oscar 2023: ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌.. అవార్డుకు మరింత చేరువ

Published Thu, Dec 22 2022 8:41 AM | Last Updated on Thu, Dec 22 2022 1:11 PM

RRR Movie Naatu Naatu Song Shortlisted For Oscar 2023 - Sakshi

ఈ ఏడాది వచ్చి పాన్‌ ఇండియా చిత్రాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ ఒకటి. ఈ చిత్రంతో మరోసారి టాలీవుడ్‌ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు చేసింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు సాధించి రికార్డ్‌ సృష్టించింది. ఇక ఈ చిత్రానికి ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.

అంతేకాదు ఈ మూవీ ప్రస్తుతం ఆస్కార్‌ నామినేషన్‌ బరిలో నిలిచిన సంగతి తె లిసిందే. తాజాగా ఆస్కార్‌ రేసులో ఆర్‌ఆర్‌ఆర్‌ మరింత ముందకు దూసుకేళ్లింది. ఇందులోని నాటు నాటు సాంగ్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరి షార్ట్‌ లిస్టులో చోటు దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే ఉత్తమ ఇంటర్‌నేషనల్‌ ఫ్యుచర్‌ ఫిలింగా లాస్ట్‌ ఫిలిం షో నిలిచింది. దీఇనితో పాటు బెస్ట్‌ డాక్యుమెంటరి ఫీచర్‌ అల్‌ థట్‌ బ్రీత్స్‌, బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలింగా ది ఎలిఫెంటా విస్పర్స్‌ సినిమాలు ఈ షార్ట్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి. 

చదవండి: 
పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌? ఆమెతోనే ఏడడుగులు!
శాంతనుకు శ్రుతి బ్రేకప్‌ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement