SS Rajamouli RRR Movie Oscar 2022 Journey Begins, Submitted In 15 Categories - Sakshi
Sakshi News home page

RRR Movie-Oscar Award: అఫీషియల్‌: ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్‌, 15 విభాగాల్లో క్యాంపెయిన్

Published Thu, Oct 6 2022 1:39 PM | Last Updated on Thu, Oct 6 2022 3:40 PM

SS Rajamouli RRR Movie Oscar Journey Begins Campaigns in 15 Categories - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే థీమ్‌తో జక్కన్న రూపొందించి ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. వరల్డ్‌ వైడ్‌గా ఈ మూవీ రూ. రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ చిత్రం భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులకు ఎంపిక అవుతుంది అని అందరూ భావించారు. హాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఆస్కార్‌ బరిలో నిలవాలని కోరుకు​న్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా గుజరాతీ మూవీ ఛైల్లో షోను ఆస్కార్స్‌కు నామినేట్ చేసింది.

చదవండి: ‘ఆదిపురుష్‌ సినిమాను బ్యాన్‌ చేయాల్సిందే’.. అయోధ్య ప్రధాన పూజారి ఆగ్రహం

దీంతో అంతా షాకయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్కార్‌ నామినేషన్స్‌కు పంపకపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమయ్యింది. దీంతో అమెరికాలో ఆర్‌ఆర్‌ఆర్‌ను డిస్ట్రిబ్యూట్‌ చేసిన వేరియల్స్‌ ఫిలిం సంస్థ ఆర్‌ఆర్‌ఆర్‌ను ఆస్కార్‌ నామినేషన్స్‌కు పరిశీలించాలని అకాడెమీని కోరింది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఆర్‌ఆర్‌ఆర్‌ లాస్‌ ఎంజెల్స్‌లో వారం రోజుల పాటు ప్రదర్శించబడిన సంగతి తెలిసిందే. అయితే ఆస్కార్ అకాడమీ రూల్స్ ప్రకారం.. ఏ సినిమా అయినా ‘లాస్ ఏంజెల్స్’లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో వారం పాటు ప్రదర్శించబడితే ఆస్కార్ అవార్డుల పోటీలో నిలవొచ్చు. ఈ క్రమంలో ‘ఫర్ యువర్ కన్సిడరేషన్’ (For Your Consideration) కింద 15 విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్‌’ను చిత్ర బృందం క్యాంపెయిన్‌ చేస్తోంది.

చదవండి: యూట్యూబ్‌ ద్వారా బిగ్‌బాస్‌ గంగవ్వ నెల సంపాదన ఎంతంటే

ఈ విషయాన్ని రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆయన ట్వీట్‌ చేస్తూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ 15 విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్‌ కోసం క్యాంపెయినింగ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. బెస్ట్ మోషన్ పిక్చర్: డివివి దానయ్య, బెస్ట్ డైరెక్టర్ : ఎస్ఎస్ రాజమౌళి, బెస్ట్ యాక్టర్ : జూ. ఎన్టీఆర్ , రాంచరణ్ .. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : అజయ్ దేవగన్ , బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు , బెస్ట్ ఒరిజినల్ స్కోర్ : కీరవాణి, బెస్ట్ ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ , బెస్ట్ సౌండ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని విభాగాల్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ బరిలో క్యాంపెయిన్‌ చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement