Tiago
-
పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!
Tata CNG Cars: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పండుగ సీజన్ సందడిని స్టార్ట్ చేసింది. కొత్త కార్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమై పోయింది. టాటా ఒకటి కాదు ఏకంగా మూడు సీఎన్జీ కార్లను లాంచ్ చేసింది. పంచ్ i-CNG లాంచ్తోపాటు, ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టిగోర్, టియాగో సీఎన్జీని కూడా అప్డేట్ చేసింది. టాటా పంచ్ ఐ-సీఎన్జీ మైక్రో ఎస్యూవీ పంచ్ సీఎన్జీ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.7,09,900 మొదలకుని రూ.9,67,900 వరకు ఉంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో 1.2 లీటర్ రివొట్రాన్ సీఎన్జీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. పెట్రోల్, సీఎన్జీతో నడుస్తుంది. 37 లీటర్ల పెట్రోల్, 60 లీటర్ల సీఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ ఏర్పాటు ఉంది. సీఎన్జీ కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్, 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. కొత్త టాటా సీఎన్జీ కార్లు టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టియాగో ఐ-సీఎన్జీని విడుదల చేసింది. ధరల వారీగా, కొత్త టియాగో సిఎన్జి రూ. 7.46 లక్షలలు- రూ. 9.32 లక్షల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరంగా, టాటా మునుపటి సీఎన్జీ మోడల్‌తో పోలిస్తే కేవలం 5వేలు మాత్రమే ధరను పెంచింది. -
IPL 2023: ఆ క్రికెటర్‌కు లక్కీ చాన్స్, టియోగో ఈవీ ఓనర్లకు బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: ఐపీఎల్ 2023 సమరానికి నేడు (మార్చి 31) తెరలేవనుంది. నరేంద మోదీ స్టేడియంలో 4 సార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ (CSK), డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జరిగే తొలి మ్యాచ్‌తో పోరు షురూకానుంది. ఈ మేజర్ టోర్నమెంట్‌కు అధికారిక భాగస్వామిగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)తో వరుసగా ఆరవ సంవత్సరం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఈవీలపై అవగాహన పెంచనుంది. గో ఈవీ అనేందుకు 100 కారణాలు అంటూ టాటా టియాగో ఈవీతో వినూత్న ప్రచారాన్ని చేపట్టింది. వరుసగా ఆరోసారి ఆఫీషియల్ పార్టనర్‌గా టాటా మోటార్స్ ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్‌కు అధికారిక భాగస్వామిగా టియాగో ఈవీని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ వివేక్ శ్రీవత్స ప్రకటించారు.ఈవీ సెగ్మెంట్లో తాము టాప్‌లో ఉన్నామని ఎఫ్సిబి ఉల్కా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుల్విందర్ అహ్లువాలియా తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 స్టేడియంలలో కొత్త Tiago.evని ప్రదర్శించడమే అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న క్రికెటర్‌కు ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్ టాటా టియాగో ఈవీని గిఫ్ట్‌గా ఇవ్వనుంది. దీంతోపాటు పాటు లక్షరూపాయల నగదు బహుమతిని కూడా అందివ్వనుంది. బంతి తగిలితే రూ. 5 లక్షల విరాళం అంతేకాదు డిప్ప్లేలో ఉన్న Tiago.ev కారుకు బంతి తగిలిన ప్రతిసారీ టాటా మోటార్స్ రూ. 5 లక్షలు విరాళంగా అందజేస్తుంది. కర్ణాటకలోని కాఫీ తోటల జీవవైవిధ్యాన్ని పెంపొందించేలా మొక్కల్ని పంపిణీ చేయనుంది. మరో బంపర్ ఆఫర్ ఏంటంటే టాటా టియోగో కొనుగోలు చేసిన వారికి ఎంపిక చేసిన మ్యాచ్‌లకు టిక్కెట్లను అందించనుంది. అలాగే టాటా ఈవీ ఓనర్లు ఆన్-గ్రౌండ్లో కొన్ని ఉత్తేజకరమైన ఎంగేజ్మెంట్ కార్యకలాపాలలో భాగం పంచుకోవచ్చు. అంతేనా కొంతమంది లక్కీ ఓనర్స్ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో కొందరికి అవార్డును అందించే అద్బుత అవకాశాన్ని గెలుచుకోవచ్చు. కాగా టాటా మోటార్స్ 2018 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో నిమగ్నమై ఉంది, నెక్సాన్, హారియర్, ఆల్ట్రోజ్, సఫారి , పంచ్ లాంటి తన పాపులర్ కార్లను ప్రదర్శిస్తోంది. -
టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ దారు టాటా మోటార్స్ కూడా తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరిలో ఎంపిక చేసిన మోడల్స్, సఫారి, హారియర్, ఆల్ట్రోజ్, టిగోర్ ,టియాగోపై రూ. 75,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఇప్పటికే మారుతి సుజుకి కూడా తగ్గింపు ధరలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023 ఫిబ్రవరి నెలకు సంబందించిన తగ్గింపులో హారియర్, సఫారి మోడల్‌కార్లపై భారీ తగ్గింపును అందిస్తోంది . ముఖ్యంగా 2022, 2023 మోడల్స్‌పై ఈ బెనిఫిట్స్‌ను అందించడం విశేషం. టాటా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారి 2023 అన్ని వేరియంట్లలో మొత్తం రూ. 35,000 తగ్గింపు లభ్యం. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు రూ. 25,000 విలువైన ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉన్నాయి. మరోవైపు, అమ్ముడుపోని ఎంపిక చేసిన 2022 సఫారీపై మొత్తం రూ. 75,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. దాదాపు టాటా హారియర్ కార్‌పై కూడా అదే ఆఫర్ లభిస్తోంది. టాటా హారియర్: 2023 మోడళ్లపై రూ. 35,000, 2022 మోడల్స్‌పై 75,000 వరకు తగ్గింపు టాటా టిగోర్: కొత్త స్టాక్ 25,000 వరకు తగ్గింపు , 2022 స్టాక్ పై 35,000 వరకు తగ్గింపు టాటా టియాగో: కొత్త స్టాక్‌పై 25,000 వరకు తగ్గింపు, 2022 స్టాక్‌పై 40,000 వరకు తగ్గింపు -
టాటా టియాగో ఈవీ వచ్చేసింది: వావ్...తక్కువ ధరలో!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అత్యంత సరసమైన టియాగో ఈవీని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. ఈ సందర్భంగా తమ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 10వేల మంది వినియోగదారులకు 8.49 (ఎక్స్-షోరూమ్, ఇండియా) లక్షలకు అందించనుంది. XE, XT, XZ+ XZ+ టెక్ అనే నాలుగు ట్రిమ్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది. టాటా టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్ బుకింగ్‌లు అక్టోబర్ 1 నుండి అందుబాటులో ఉంటాయి. డెలివరీలు జనవరిలో ప్రారంభమవుతాయి. ఈ పండుగ సీజన్లో దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో EVని టాటా మోటార్స్ సంక్రాంతి కానుకగా వినియోగ దారులకు అందించనుండటం మరో విశేషం. -
టాటా టియాగో కొత్త వెర్షన్ వచ్చేసింది! ధర చూస్తే...
సాక్షి, ముంబై: టాటామోటార్స్ టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ కారును బుధవారం లాంచ్ చేసింది. ఎన్ఆర్జీ తొలివార్షికోత్సవాన్ని పురస్కరించు కుని, క్రాస్ఓవర్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. 6.42 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఊహించినట్టుగానే ఎక్స్‌టీ వేరియంట్‌తో పోలిస్తేకొత్త ఫీచర్లను జోడించిమరీ 41వేల రూపాయల ధర తగ్గించింది. ఇంజీన్, ఫీచర్లు టాటా కొత్త ఎంట్రీ-లెవల్ కారు టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ వేరియంట్ 2 ట్రిమ్‌లలో లభిస్తుంది. మాన్యుల్ గేర్ బాక్స్ 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజీన్‌ను పొందుపర్చింది. 14-అంగుళాల హైపర్‌స్టైల్ వీల్స్, హర్మాన్ 3.5-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ లాంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. అలాగే రిథమ్ ప్యాక్ కావాలంటే అదనంగా 30వేలు చెల్లించాలి. మిడ్నైట్ ప్లమ్ కలర్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఒపల్ వైట్, డేటోనా గ్రే, అరిజోనా బ్లూ ఫ్లేమ్ రెడ్ కలర్స్‌లో ఇది లభ్యం. The wait is finally over! Introducing the all-new Tiago XT NRG, built for the ones who dare to #LiveDifferent. Get, Set, and #DoMoreWithXTraNRG in your all-new #TiagoXTNRG. Visit https://t.co/Hq2GY0aoPI to book your #Tiago.#TiagoNRG #UrbanToughroader #SeriouslyFun pic.twitter.com/8CNPaaGOV1 — Tata Motors Cars (@TataMotors_Cars) August 3, 2022 -
టాటా టియోగో కొత్త వెర్షన్ కమింగ్ సూన్, అందుబాటు ధరలో
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ టియాగో ఎన్ఆర్జీ మోడల్లో త్వరలోనే కొత్త వేరియంట్‌ను లాంచ్‌చేయనుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో టాటా మోటార్స్ హ్యుందాయ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి ఎంట్రీ-లెవల్ వేరియంట్‌గా, అందుబాటులో ధరలో కొత్త ‘‘టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టి ట్రిమ్’’ టీజర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈ కారుకు సంబంధించిన ధర ఫీచర్ల వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది. టాటా మోటార్స్ పాపులర్ మోడల్ టియాగో కొనసాగింపుగా ఎక్స్జెడ్ ప్లస్ కాకుండా ఎక్స్‌టీ వేరియంట్‌గా ఉంటుందని కొత్త కారు ఉండనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాత టియాగో కంటే తక్కువ ధరకే కస్టమర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం.అలాగే ధరకు తగ్గట్టుగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు ఆడియో సిస్టమ్, టాటా కనెక్ట్ నెక్స్ట్ యాప్, రియర్, ఫ్రంట్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్క్ అసిస్ట్‌లతో డిస్ప్లే, ఆటో డోర్ లాక్ ఫాలోమి లాంటి కొన్ని ఫీచర్లు కూడా మిస్ అవుతాయట. కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి ఎక్స్‌టి వేరియంట్ ఫీచర్ల అంచనాలను పరిశీలిస్తే బ్లాక్-అవుట్ బి-పిల్లర్, వెనుక పార్శిల్ షెల్ఫ్, ప్యాసింజర్ వైపు వానిటీ మిర్రర్ , హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీటును అందించవచ్చు. అయితే ఇంజన్ లో ఎలాంటి లేకుండా 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజనే అమర్చింది. ఇది 86PS పవర్ , 113Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. 5-స్పీడ్ మాన్యువల్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఏరియంట్లలో ఉంటుంది. టాటా టియాగో ఎన్ఆర్జీ ఎక్స్‌టీ ధర దాదాపు రూ. 6.3 లక్షల నుండి రూ. 6.8 లక్షల వరకు ఉండవచ్చు. టియాగో ఎక్స్జెడ్ హ్యాచ్‌బ్యాక్ మాన్యువల్ ధర రూ. 6 లక్షలు, ఏఎంటీ వెర్షన్ ధర రూ. 6.55 లక్షలుగా ఉన్న సంగతి తెలిసిందే. Do you chase the XTraordinary? Get ready for a dose of XTra eNeRGy coming your way! Stay tuned!#Tiago #TiagoNRG #SeriouslyFun #LiveDifferent #TataMotorsPassengerVehicles #CarsDaily #Cargram #CarsOfInstagram #Hatchback pic.twitter.com/OmonEJMpAf — Tata Motors Cars (@TataMotors_Cars) July 31, 2022 -
టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!
ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శించేందుకు సిద్దం అవుతుంది. ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల్లో ఎంతో ఆసక్తి రేపి ఆ తర్వాత వివాదాల్లో చిక్కుకున్న నెక్సాన్ మోడల్‌కి సంబంధించి టాటా తీపి కబురు చెప్పబోతుంది. ఈ మోడల్‌కి సంబంధించిన రేంజ్ విషయంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంతర్జాతీయ ఈవీలకు దీటుగా ఈ నెక్సాన్ కారును రూపొందిస్తుంది. రేంజ్ వినియోగదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని బ్యాటరీ సామర్థ్యం పెంచాలని టాటా నిర్ణయించింది. ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో 30.2 కిలోవాట్ల బ్యాటరీని 40 కిలోవాట్లకు పెంచాలని నిర్ణయించారు. దీంతో కనీసం ప్రయాణ రేంజ్ కనీసం 30 శాతం పెరుగుతుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ సామర్థ్యం పెంచిన తర్వాత టాటా మోటార్స్ చేపట్టిన ఇంటర్నల్ టెస్ట్‌లో కారు సింగిల్ రేంజ్ కెపాసిటీ 400 కిలోమీటర్ల వరకు ఉన్నట్టు అంచనా. అయితే రియల్‌టైంలో ఆన్‌రోడ్ మీద కనీసం 300 కిలోమీటర్ల నుంచి 320 కిలోమీటర్ల వరకు రేంజ్ రావచ్చని తెలుస్తోంది. ఈ మార్పులు చేసిన కొత్త కారు ఈ ఏడాది ద్వితియార్థంలో మార్కెట్లోకి రావచ్చని అంచనా. సేల్స్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని సంస్థ యోచిస్తోంది. కంపెనీ తన ఈవీ కార్ల ఉత్పత్తిని రాబోయే రెండు సంవత్సరాలలో వార్షికంగా 1,25,000-150,000 యూనిట్లకు పెంచుకోవాలని చూస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష్య కార్లను విక్రయించగలిగితే కంపెనీ మొత్తం రూ.5,000 కోట్ల ఆదాయాన్ని సంపాదించనుంది. అలాగే, రాబోయే కాలంలో టాటా మోటార్స్ దేశంలో మరో మూడు సరసమైనఎలక్ట్రిక్ కార్లను ప్రారంభించాలని యోచిస్తుంది. రూ.10 లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కార్లను తీసుకొని రావాలని చూస్తున్నట్లు సమాచారం. టియాగో ఈవీ, పంచ్ స్మాల్ ఎస్యువీ, ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ కార్లు రూ.10 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. అలాగే, ఈ ఎలక్ట్రిక్ కార్ల కనీస రియల్ రేంజ్ అనేది 200 కిలోమీటర్ల మార్కుకు తగ్గకుండా ఉండాలని చూస్తోంది. ఏడాదికి కనీసం 1 లేదా 2 కార్లను లాంచ్ చేయలని చూస్తోన్నట్లు సంస్థ పేర్కొంది. (చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!) -
పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్.. అదిరిపోయిన టాటా మోటార్స్ సీఎన్జీ కార్స్!
Tata Motors Company: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సీఎన్జీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. టియాగో, టిగోర్ మోడల్స్‌లో ఐసీఎన్జీ వేరియంట్స్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6.09 లక్షల నుంచి రూ.8.29 లక్షల వరకు ఉంది. టాటా టిగోర్ సీఎన్జీ ధర రూ.7.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టియాగో, టిగోర్ అమ్మకాల్లో 30-35 శాతం సీఎన్జీ విభాగం కైవసం చేసుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. భారత్‌లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) కార్ల అమ్మకాల్లో 2019-20లో 60 శాతం, గత ఆర్థిక సంవత్సరంలో 97 శాతం వృద్ధి నమోదైంది. సీఎన్జీ వాహనాలకు కస్టమర్ల నుంచి ఆసక్తి పెరుగుతుండగా, బీఎస్-6 ప్రమాణాల రాకతో డీజిల్ హ్యాచ్బ్యాక్స్, కాంపాక్ట్ సెడాన్స్‌కు డిమాండ్ పూర్తిగా కనుమరుగైందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ ఈ విభాగంలో కార్లను విక్రయిస్తున్నాయి. టియాగో సీఎన్జీ, టిగోర్ సీఎన్జీ రెండూ పూర్తి ట్యాంక్ చేస్తే 300 కిలోమీటర్లు వరకు వెళ్లనున్నాయి. టాటా టియాగో సీఎన్జీ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పాటు పనిచేసే హ్యాచ్ బ్యాక్ కు అమర్చిన సీఎన్జీ కిట్‌తో వస్తుంది. ఇంజిన్ 73 పీఎస్ పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మి.మీగా ఉంది. టియాగో సీఎన్జీ మాదిరిగానే టిగోర్ సీఎన్జీ కూడా 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ఇంజిన్ కూడా 73 పీఎస్ పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది. (చదవండి: SEBI Saa₹thi App: ఇన్వెస్టర్లకు అండగా సెబీ ‘సారథి’ యాప్..!) -
టాటా మోటార్స్ నుంచి మైక్రో ఎస్యూవీ
ఆటోమొబైల్ రంగంలో నంబర్ స్థానం కోసం గట్టిగా ప్రయత్నిస్తోన్న టాటా మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఎస్‌యూవీకి డిమాండ్ ఇండియన్ మార్కెట్లో గత కొంత కాలంగా ఎస్యూవీ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. సెడాన్లకు ధీటుగా ఎస్యూవీ వెహికల్స్ అమ్మకాలు సాగుతున్నారు. ఎలాంటి రోడ్లపైనా అయినా ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు స్టైలింగ్ డిఫరెంట్‌గా ఉండటమే ఇందుకు కారణం. పోటీలో టాటా టాటా నుంచి ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా నెక్సాన్ కారు ఉంది. అయితే దీని సగటు ధర పది లక్షలకు దగ్గర ఉంది. ఇంత కంటే తక్కువ ధరలో మరిన్నీ ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎస్యూవీ అందించేందుకు టాటా సిద్ధమైంది. మైక్రో ఎస్యూవీ పేరుతో టాటా హెచ్బీఎక్స్ను మార్కెట్లోకి తేనుంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఇప్పటికే ఈ మైక్రో ఎస్‌యూవీకి సంబంధించి టాటా గ్రూపు నుంచి అధికారిక ప్రకటన ట్విట్టర్లో వెలువడింది. ఎంట్రీ లెవల్లో పోటీ టాటాలో టాప్ ఎండ్ ఎస్‌యూవీగా ఉన్న హారియర్, సఫారీ తరహా ఎక్స్టీరియర్, ఆల్ట్రోజ్ తరహా ఇంటీరియర్‌తో హెచ్బీఎక్స్ ఉండవచ్చని అంచనా. టియాగోలో ఉపయోగించే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చతారని సమచారం. మొత్తంగా కారు తయారీకి సంబంధించి ఆల్ఫా ఆర్కిటెక్చర్ మోడల్ ఆధారంగా ఈ కారు రూపుదిద్దుకుంటోంది. మారుతి ఇగ్నీస్, మహీంద్రా కేయూ 100లతో పాటు త్వరలో మార్కెట్లోకి రాబోతున్న హ్యుందాయ్ క్యాస్పర్లకు టాటా హెచ్బీఎక్స్ పోటీ విసరనుంది. It's Showtime! The most awaited SUV now has a name. Stay tuned.#TataMotors #HBX #ComingSoon pic.twitter.com/tI0bZL5ngI — Tata Motors Cars (@TataMotors_Cars) August 21, 2021 చదవండి: Hyderabad: ఐటీ కంపెనీల నయా ట్రెండ్..! -
ఫీచర్స్ అదిరే, టాటా మోటార్స్ నుంచి న్యూ మోడల్ కార్
ముంబై: టాటా మోటార్స్ తన టియాగో శ్రేణిలో ‘‘టియాగో ఎన్ఆర్జీ’’ పేరుతో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధర రూ.6.57 లక్షలుగా ఉంది. ఎస్యూవీ తరహాలో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద టైర్లు, విశాలమైన, ధృడమైన బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ ట్రాన్స్మిషన్ వెర్షన్లలో లభిస్తుంది. పుష్ బటన్ స్టార్ట్, రేర్ పార్కింగ్ కెమెరా, ఆటోఫోల్డ్ ఓఆర్వీఎం, బ్లాక్ ఇంటీరియన్స్, ఏబీఎస్ ఈబీడీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ వైపర్ వంటి అధునాతన సదుపాయాలు ఇందులో ఉన్నాయి. అత్యుత్తమ భద్రత ప్రమాణాలను కలిగి ఉంది. టియాగోలానే కొత్త కారు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుందని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా ఆశాభావం వ్యక్తంచేశారు. -
Tata Motors: టాటా మోటార్స్ ప్రియులకు బ్యాడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఇన్ పుట్ ఖర్చులు పెరగడం వల్ల తన ప్యాసింజర్ వాహన శ్రేణి ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్ సోమవారం తెలిపింది. ఎప్పటి నుంచి పెరగనున్నయో స్పష్టంగా చెప్పకున్నప్పటికి "త్వరలో" పెరగనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాహన తయారీలో ఉపయోగించే ఉక్కు, విలువైన లోహాలతో సహా ఆవశ్యక ముడి పదార్థాల ఖర్చులు పెరగడం వల్ల వాహన ధరలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపింది. ధరల పెరుగుదల ఎంత అనేది రాబోయే రోజులు, వారాల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో టియాగో, నెక్సాన్, హారియర్ వంటి మోడల్స్ ను విక్రయిస్తుంది. ఆదివారం, హోండా కార్స్ ఆగస్టు నుంచి తన అన్నీ వాహన ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. గత కొన్ని నెలలుగా దేశంలో ఉక్కు ధరలు గణనీయంగా పెరిగాయి. జూన్ ల, ప్రముఖ దేశీయ ఉక్కు తయారీదారులు హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్ఆర్ సీ), కోల్డ్ రోల్డ్ కాయిల్(సీఆర్ సీ) ధరలను వరుసగా టన్నుకు రూ.4,000, రూ.4,900 వరకు పెంచారు. హెచ్ఆర్ సీ, సీఆర్ సీ అనేవి ఆటో, ఉపకరణాలు, నిర్మాణం వంటి పరిశ్రమల్లో ఉపయోగించే ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులు. అందువల్ల, ఉక్కు ధరల పెరుగుదల వాహనాలు, వినియోగదారు వస్తువుల, నిర్మాణ ఖర్చుల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాకుండా, రోడియం, పల్లాడియం వంటి విలువైన లోహాల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి, ఇది ఉత్పత్తి ఖర్చును ప్రభావితం చేసింది. రోడియం, పల్లాడియంలను ఉత్ప్రేరకాలలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కఠినమైన ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల వాటికి డిమాండ్ అనేక రెట్లు పెరిగింది. -
సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..!
ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ టియాగో కొత్త వర్షన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టాటా మోటార్స్ హ్యచ్‌బ్యాక్ కార్లలో భాగంగా కొత్త టియాగో ఎక్స్‌టీ(ఓ) వేరియంట్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5. 48 లక్షలుగా నిర్ణయించారు. కొత్త ఎక్స్‌టీ(ఓ), ట్రిమ్ బేస్ ఎక్స్ ఈ, మిడ్ ఎక్స్‌టీ టియాగో కార్ల శ్రేణిలో నిలవనుంది. కొత్త ఎక్స్‌టి (ఓ) ట్రిమ్ ధర టియాగో ఎక్స్‌టి ట్రిమ్ కంటే కేవలం రూ .15,000 తక్కువ. ఎక్స్ఇ ట్రిమ్ కంటే రూ .47,900 ఎక్కువ. ఎక్స్ఇ ట్రిమ్‌తో పోల్చినప్పుడు, ఎక్స్‌టీ(ఓ) 14-అంగుళాల స్టీల్ రిమ్స్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో ఔట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్‌తో పాటు(ఓఆర్వీఎమ్)తో పాటు వీల్ క్యాప్స్‌ను అందిస్తోంది. ఇంటీరియర్ విషయానికి వస్తే ... స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, ఐఆర్విఎం, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రికలి అడ్జస్ట్ చేయగల ఓఆర్వీఎమ్లు, నాలుగు స్పీకర్లు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లను కలిగి ఉంది. స్టీరింగ్ వీల్‌పై ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. కొత్త ఎక్స్‌టి (ఓ) ట్రిమ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇంజన్ 84 బిహెచ్పి సామర్ధ్యంతో 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బ్యాక్స్ సిస్టమ్‌ను కారులో అమర్చారు. చదవండి: కరోనా కట్టడిలో టాటా గ్రూపు -
కార్ లవర్స్‌కు టాటా మోటార్స్ తీపికబురు
సాక్షి, ముంబై: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కార్ లవర్స్‌కు తీపి కబురు అందించింది. వివిధ మోడల్ కార్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నంలో టాటా మోటార్స్ మార్చి నెలలో తగ్గింపులను వెల్లడించింది. తన అధికారిక వెబ్సైట్లో అందించిన వివరాల ప్రకారం టియాగో, టైగోర్, నెక్సాన్ , 5-సీట్ల హారియర్‌తో సహా ఎంపిక చేసిన కార్లపై 65 వేల రూపాయల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి 31, 2021 వరకు అందుబాటులో ఉంటాయి. కన్జ్యూమర్ స్కీమ్, ఎక్స్ఛేంజి ఆఫర్, కార్పొరేట్ స్కీమ్‌ల రూపంలో వీటిని అందిస్తోంది. టాటా టియాగో మోడల్‌పై రూ.25వేలను తగ్గింపు అందుబాటులో ఉండనుంది. వీటిల్లో కన్జ్యూమర్ స్కీమ్ రూ.15వేలు, ఎక్స్ఛేంజి ఆఫర్ రూ.10 వేలు ఉన్నాయి. టిగారో సెడాన్‌పై మొత్తం 30వేలుతగ్గింపు. ఇందులో కన్జ్యూమర్ స్కీమ్‌లో రూ. 15వేలు, ఎక్స్ఛేంజి ఆఫర్లో రూ.15 వేలు డిస్కౌంట్ భాగం. నెక్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ.15వేలు డిస్కౌంట్ లభిస్తోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమంటే ఈకారు డీజిల్ వెర్షన్‌పై ఎక్స్ఛేంజి ఆఫర్‌తో మాత్రమే ఈ ఆఫర్ లభ్యం. ఇక హారియర్ 5సీట్ల మోడల్ క్యామో వేరియంట్‌పై మాత్రం రూ.40వేలు లభిస్తోంది. హారియర్‌లో పరిమిత వేరియంట్లకే ఆఫర్‌ను అందిస్తోంది. సాధారణ హారియర్‌పై రూ.65 వేల వరకు తగ్గింపు ఉంది. ఆల్ట్రోజ్ , ఫ్లాగ్షిప్ సఫారి ఎస్యూవీ కొనుగోళ్లపై ఈ ఆఫర్లు వర్తించవు. -
టియాగో.. కొత్త వేరియంట్
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ తన హ్యాచ్‌బ్యాక్ ఎంట్రీ లెవల్ టియాగో లైన్–అప్‌లో ‘‘టాటా టియాగో ఎక్స్‌టీఏ’’ పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. కారు ఎక్స్ షోరూం ధర రూ.5.99 లక్షలుగా ఉంది. కొత్త వేరియంట్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెర్షన్(ఏఎంటీ)లో వస్తుంది. ‘‘భారత్‌లో ఆటోమేటిక్ టాన్స్‌మిషన్(ఏటీ) సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోంది, అందుకే ఏటీఎస్ ప్రాధాన్యతను గుర్తించిన కంపెనీ టియాగో ఎక్స్‌టీఏ వెర్షన్ శ్రేణిని మార్కెట్‌కు పరిచయం చేసింది’’ అని టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాస్తవ తెలిపారు. కొత్త వేరియంట్ మిడ్–హ్యాచ్‌బ్యాక్ విభాగంలో పోటీనివ్వడమే కాకుండా, కస్టమర్లు చెల్లించే ధరకు తగిన సదుపాయాల్ని ఇస్తుందని శ్రీవాస్తవ విశ్వాసం వ్యక్తం చేశారు. -
కార్లపై భారీ ఆఫర్లు, రూ. 1.5 లక్షల డిస్కౌంట్
సాక్షి, ముంబై: దేశీ ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వాహన ప్రియులకు మంచి వార్త అందించింది. అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. టాటా మోటార్స్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్ కారు హారియర్‌తో పాటు వివిధ కార్లపై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. నెక్సన్, హెక్సా, టియాగో, టియాగో ఎన్ఆర్జీ, టిగోర్, హారియర్ కార్ల కొనుగోళ్లపై ఏకంగా రూ.1.5 లక్షల భారీ తగ్గింపు అందిస్తోంది. కార్ల పండుగ పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో పాత, కొత్త వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు అందివ్వనుంది. ఎక్స్చేంజ్ ద్వారా తమ కార్లు కొనుగోలు చేసేవారికి కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు కస్టమర్లకు ఆర్థిక మద్దతు అందించేందుకు 100శాతం ఆన్ రోడ్ ఫైనాన్స్, లోకాస్ట్ ఈఎంఐ సదుపాయాన్నికూడా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. టాటా మోటార్స్ ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్స్ కోసం ప్రత్యేకమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా మోటార్స్ వివిధ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు టాటా హెక్సా మోడల్‌పై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు టాటా నెక్సన్ కారుపై రూ.85,000 వరకు డిస్కౌంట్ టాటా టియాగో మోడల్‌పై రూ.70,000 తగ్గింపు ఆఫర్ టాటా టియాగో ఎన్ఆర్జీ కారుపై రూ.70,000 వరకు డిస్కౌంట్ టాటా టిగోర్ మోడల్‌పై రూ.1.15 లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశం హారియర్ కారుపై రూ.50 వేల వరకు తగ్గింపు ఓనం , గణేష్ చతుర్థి సందర్భంగా కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభించిందనీ టాటా మోటార్స్ సేల్స్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ బార్మాన్ తెలిపారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో ఉత్సాహం నింపేందుకు, 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' ప్రచారం చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో భారీ ప్రోత్సాహం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కస్టమర్లు, భాగస్వాములందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. -
టియాగో.. ఎక్స్జెడ్ ప్లస్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన పాపులర్ వాహనం టియాగోలో కొత్త వేరియంట్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘టియాగో ఎక్స్జెడ్ ప్లస్’ పేరుతో విడుదలైన ఈ కారు పెట్రోల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.5.57– 5.64 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.6.31– 6.38 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్యాసింజర్ వాహన విభాగ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్) ఎస్.ఎన్.బర్మన్ మాట్లాడుతూ.. ‘ఈ కారును కస్టమర్లు ఎంతో ఇష్టపడతారని భావిస్తున్నాం. ప్యాసింజర్ వాహన వ్యాపారంలో అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఈ వేరియంట్ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం.’ అని అన్నారయన. -
టాటా, జయేం రేసింగ్ కార్లు వచ్చేసాయ్!
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ నాల్గవ అతిపెద్ద వాహన తయారీదారు టాటా మోటార్స్ కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా రేసింగ్ కార్ల సెగ్మెంట్లోకి దూసుకువచ్చింది. ప్రధానంగా జేటీపీ బ్రాండ్ కింద టాటా మోటార్స్.. దాని ‘టియాగో జేటీపీ’, ‘ టిగోర్ జేటీపీ’ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త మోడల్ కార్లు, బుకింగ్స్ ఈ రోజునుంచే అందుబాటులోకి వచ్చాయి. వచ్చే నెలలో డెలివరీ ప్రారంభం కానుంది. హ్యాచ్‌బ్యాక్ టియాగో జేటీపీ ధర రూ. 6.39 లక్షలు, సెడాన్ టిగోర్ జేటీపీ ధర రూ. 7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది. ఇవి పరిచయ ధరలని కంపెనీ తెలిపింది. టాటామోటార్స్, కోయంబత్తూరుకు చెందిన జయేం మోటార్స్ సమ భాగస్వామ్యంతో లాంచ్ అయిన మొట్టమొదటి కార్లు ఇవి కావడం విశేషం ఈ రెండు కార్లు మూడు-సిలిండర్ల 1.2 లీటర్ టర్బోచార్జెడ్ న్యూ జనరేషన్ రివోట్రోన్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. 114 బిహెచ్పీ పీక్ పవర్‌ని అందిస్తుంది. 8 -స్పీకర్ హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, అల్యూమినియం పెడల్స్, 5000 ఆర్పీఎంతో , 5స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇతర ఫీచర్లుగగా ఉన్నాయి. -
టాటా టియాగో ఎన్ఆర్జీ @రూ.5.49 లక్షలు
న్యూఢిల్లీ: టియాగో హచ్‌బ్యాక్ అధునాతన వెర్షన్‌ను టాటా మోటార్స్ బుధవారం విడుదల చేసింది. ‘టియాగో ఎన్ఆర్జీ’ పేరిట విడుదలైన ఈ ఎస్‌యూవీలో మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, ట్యూన్డ్ సస్పెన్షన్ వంటి ఫ్యూచర్లతో పాటు యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు ఎయిర్ బ్యాగ్‌లు ఉండడంతో భద్రతా వ్యవస్థ మునుపటి వెర్షన్ల కంటే ఎక్కువని టాటా మోటార్స్ సీఈఓ, ఎండీ గుంటెర్ బుషెక్ వివరించారు. 5–స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగిన ఎన్ఆర్జీని ‘అర్బన్ టఫ్రోడ్డర్’గా అభివర్ణించారు. 1.2 పెట్రోల్ ఇంజిన్ వేరియంట్ ధర రూ.5.49 లక్షలు, 1.05 లీటర్ల డీజిల్ ఇంజిన్ వేరియంట్ ధర రూ.6.31 లక్షలుగా ప్రకటించారు. -
టాటా ‘టియాగో’ బుకింగ్స్ @ 1 లక్ష
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ హ్యాచ్‌బ్యాక్ ‘టియాగో’ తాజాగా దేశీ మార్కెట్లో లక్ష బుకింగ్స్మైలురాయిని అధిగమించింది. టాటా మోటార్స్ ‘ఇంపాక్ట్ డిజైన్’ థీమ్‌తో గతేడాది ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చిన తొలి కారు టియాగో. డిజైన్, పనితీరు, డ్రైవ్ డైనమిక్స్ వంటి పలు అంశాల్లో టియాగో కారు కంపెనీ పరివర్తనలో కీలక పాత్ర పోషించిందని, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఇది కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసిందని కంపెనీ ప్రెసిడెంట్ (ప్యాసెంజర్ వెహికల్స్ బిజినెస్ విభాగం) మయాంక్ పరేఖ్ తెలిపారు. టాటా మోటార్స్ ఇప్పటికే దేశీ మార్కెట్లో 65,000 యూనిట్ల టియాగో కార్లను విక్రయించింది. -
టాటా మోటార్స్ ‘టియాగో’ ధర పెరిగింది!!
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ కారు ‘టియాగో’ ధరను రూ. 6,000 వరకూ పెంచింది. కంపెనీ రూ.3.2 లక్షలు-రూ.5.6 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) పరిచయ ధరతో టియాగోను ఏప్రిల్‌లో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 1.05 లీటర్ రెవోటార్క్ డీజిల్ ఇంజిన్ అనే రెండు ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. టియాగోకు 30,000కు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది. కాగా రూపాయి విలువ క్షీణత, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వంటి పలు అంశాల కారణంగా ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు వాటి వాహన ధరలను రూ.20,000 వరకూ పెంచాయి. ఇక ఫోర్డ్ కంపెనీ మాత్రం తన ‘ఆస్పైర్’, ‘ఫిగో’ కార్ల ధరలను రూ.91,000 వరకూ తగ్గించింది. -
‘టియాగో’తో మార్కెట్ వాటా పెరుగుతుంది
టాటా మోటార్స్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ బర్మన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల మార్కెట్లో ఒకానొక దశలో దాదాపు 17 శాతం వాటా దక్కించుకున్న టాటా మోటార్స్... 2016 ఫిబ్రవరి నాటికి 6.5 శాతం వాటాతో సరిపెట్టుకుంది. మూడేళ్లు శ్రమించి మార్కెట్లోకి తెచ్చిన ‘టియాగో’తో సంస్థ పూర్వ వైభవం సంతరించుకుంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ బిజినెస్ యూనిట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.బర్మన్ చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో గురువారం టియాగో విడుదల చేసిన సందర్భంగా కస్టమర్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ భాసిన్, వెహికిల్ ఇంజనీరింగ్ హెడ్ అనంద్ విజయ్ కులకర్ణితో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 60 వేల మందికిపైగా టియాగో పట్ల ఆసక్తి కనబరిచారని తెలిపారు. దశలవారీగా నూతన మోడళ్లతో ర్యాంకు మెరుగు పర్చుకుంటామన్నారు. ఆటో ఎక్స్‌పోలో 20 కొత్త మోడళ్లను టాటా మోటార్స్ ప్రదర్శించడం తెలిసిందే. వీటిలో కొద్దిరోజుల్లో హెక్సా క్రాస్ ఓవర్‌ను కంపెనీ ప్రవేశపెడుతోంది. ఆ తర్వాత కాంపాక్ట్ సెడాన్ కైట్-5(కోడ్ నేమ్), సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ నెక్సన్ రానున్నాయని బర్మన్ చెప్పారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో టియాగో కారు ధర వేరియంట్‌నుబట్టి రూ.3.32-5.69 లక్షలుంది. -
జికా కాదు టియాగో
కొత్త కారు పేరు మార్చిన టాటా మోటార్స్ న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ తన కొత్త హ్యాచ్‌బాక్ జికా పేరును ‘టియాగో’ గా మార్చింది. ఇటీవల జికా వైరస్ ప్రబలడంతో ఈ హ్యాచ్‌బాక్‌కు అంతకు ముందు నిర్ణయించిన జికా పేరును మార్చాలని టాటా మోటార్స్ ప్రకటించడం తెలిసిందే. ఫెంటాస్టికో నేమ్ హంట్ పేరుతో కొత్త పేర్లను కంపెనీ నెటిజన్ల నుంచి ఆహ్వానించింది. టియాగో, సివెట్, అడోర్ పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి, ఓటింగ్ ద్వారా టియాగో పేరును ఖరారు చేశామని పేర్కొంది. పేరు మార్పుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే నెల చివరికల్లా టియాగోను మార్కెట్లోకి తెస్తామని తెలిపింది.