జికా కాదు టియాగో
కొత్త కారు పేరు మార్చిన టాటా మోటార్స్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ తన కొత్త హ్యాచ్‌బాక్ జికా పేరును ‘టియాగో’ గా మార్చింది. ఇటీవల జికా వైరస్ ప్రబలడంతో ఈ హ్యాచ్‌బాక్‌కు అంతకు ముందు నిర్ణయించిన జికా పేరును మార్చాలని టాటా మోటార్స్ ప్రకటించడం తెలిసిందే. ఫెంటాస్టికో నేమ్ హంట్ పేరుతో కొత్త పేర్లను కంపెనీ నెటిజన్ల నుంచి ఆహ్వానించింది. టియాగో, సివెట్, అడోర్ పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి, ఓటింగ్ ద్వారా టియాగో పేరును ఖరారు చేశామని పేర్కొంది. పేరు మార్పుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే నెల చివరికల్లా టియాగోను మార్కెట్లోకి తెస్తామని తెలిపింది.