Tata CNG Cars: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పండుగ సీజన్ సందడిని స్టార్ట్ చేసింది. కొత్త కార్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమై పోయింది. టాటా ఒకటి కాదు ఏకంగా మూడు సీఎన్‌జీ కార్లను లాంచ్ చేసింది. పంచ్ i-CNG లాంచ్‌తోపాటు, ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టిగోర్, టియాగో సీఎన్‌జీని కూడా అప్‌డేట్ చేసింది.
టాటా పంచ్ ఐ-సీఎన్‌జీ
మైక్రో ఎస్‌యూవీ పంచ్ సీఎన్‌జీ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.7,09,900 మొదలకుని రూ.9,67,900 వరకు ఉంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో 1.2 లీటర్ రివొట్రాన్ సీఎన్‌జీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుపరిచారు. పెట్రోల్, సీఎన్‌జీతో నడుస్తుంది. 37 లీటర్ల పెట్రోల్, 60 లీటర్ల సీఎన్‌జీ ఫ్యూయల్ ట్యాంక్ ఏర్పాటు ఉంది. సీఎన్‌జీ కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్, 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి.
కొత్త టాటా సీఎన్‌జీ కార్లు
టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టియాగో ఐ-సీఎన్‌జీని విడుదల చేసింది. ధరల వారీగా, కొత్త టియాగో సిఎన్‌జి రూ. 7.46 లక్షలలు- రూ. 9.32 లక్షల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరంగా, టాటా మునుపటి సీఎన్‌జీ మోడల్‌తో పోలిస్తే కేవలం 5వేలు మాత్రమే ధరను పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment