Tata Tigor
-
టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్
Tata Nexon EV and Tigor EV: మార్కెట్ లీడర్ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతి నెలా వివిధ కార్ల తయారీదారుల నుండి కార్లపై ప్రయోజనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ టిగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీలపై 80వేల దాకా తగ్గింపు లభిస్తోంది. టిగోర్ ఈవీ దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి టిగోర్ ఈవీ. టాటా మోటార్స్ దీని మీద రూ. 80,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు,ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు, అదనపు వారంటీ లేదా ఉపకరణాలు ఉండవచ్చు. దీని ధర రూ. 12.49-13.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. నెక్సాన్ ఈవీ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీ. టాటా మోటార్స్ దీనిని వివిధ బ్యాటరీ పరిమాణాలతో ప్రైమ్ , మ్యాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. మాక్స్ , ప్రైమ్ వేరియంట్లపై రూ. 61,000 56,000 తగ్గించింది. వీటి ధర రూ. 14.49-17.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. -
పండగ సందడి షురూ: టాటా సీఎన్జీ కార్లు వచ్చేశాయ్!
Tata CNG Cars: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ పండుగ సీజన్ సందడిని స్టార్ట్ చేసింది. కొత్త కార్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమై పోయింది. టాటా ఒకటి కాదు ఏకంగా మూడు సీఎన్జీ కార్లను లాంచ్ చేసింది. పంచ్ i-CNG లాంచ్తోపాటు, ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టిగోర్, టియాగో సీఎన్జీని కూడా అప్డేట్ చేసింది. టాటా పంచ్ ఐ-సీఎన్జీ మైక్రో ఎస్యూవీ పంచ్ సీఎన్జీ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.7,09,900 మొదలకుని రూ.9,67,900 వరకు ఉంది. ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో 1.2 లీటర్ రివొట్రాన్ సీఎన్జీ ఇంజన్‌తో రూపుదిద్దుకుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. పెట్రోల్, సీఎన్జీతో నడుస్తుంది. 37 లీటర్ల పెట్రోల్, 60 లీటర్ల సీఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్ ఏర్పాటు ఉంది. సీఎన్జీ కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 7 అంగుళాల హర్మాన్ ఇన్ఫోటైన్మెంట్, 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. కొత్త టాటా సీఎన్జీ కార్లు టాటా ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో టియాగో ఐ-సీఎన్జీని విడుదల చేసింది. ధరల వారీగా, కొత్త టియాగో సిఎన్జి రూ. 7.46 లక్షలలు- రూ. 9.32 లక్షల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరంగా, టాటా మునుపటి సీఎన్జీ మోడల్‌తో పోలిస్తే కేవలం 5వేలు మాత్రమే ధరను పెంచింది. -
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ రికార్డు
ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈవీ అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. మన దేశంలో 10 వేల ఎలక్ట్రిక్ కార్లను అమ్మిన సంస్థగా టాటా మోటార్స్ నిలిచింది. 10,000వ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసిన వినియోగదారుడికి నేడు (సెప్టెంబర్ 24) అందజేసింది. ఈవీ మార్కెట్లో 70 శాతం వాటాను టాటా మోటార్స్ ఆక్రమించింది. 2021 ఆగస్టులో 1,000 పైగా యూనిట్లను సేల్ చేసింది. ముంబైకి చెందిన ఆటోమేకర్ భారతదేశంలోని 120 నగరాల్లో 700కి పైగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందించడం వల్ల ఇంత త్వరగా ఈ మైలు రాయిని చేరుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.(చదవండి: నవంబర్ 10న.. ఏం జరగబోతోంది?) టాటా మోటార్స్ తన ఈ-మొబిలిటీ ఎకోసిస్టమ్ టాటా పవర్, టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా కెమికల్స్, టాటా ఆటోకాంప్, క్రోమాల సహాయంతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తుంది. టాటా బ్రాండ్ పై నమ్మకం ఉంచిన ప్రతి వినియోగదారుడికి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర ధన్యవాదాలు తెలిపారు. టాటా మోటార్స్ ఇటీవల వ్యక్తిగత వాహన విభాగంలో తన రెండవ ఈవీ టాటా టిగోర్ కారును విడుదల చేసింది. ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్ జెడ్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో ఈ టిగోర్ ఈవీ లభిస్తుంది. టాటా టిగోర్ ఎక్స్ఈ వేరియంట్ ధర రూ.11.45 లక్షలుగా ఉంది. ఎక్స్ఎం వేరియంట్ ధర రూ.12.49 లక్షలు కాగా, ఎక్స్ జెడ్ ప్లస్ వేరియంట్ ధరను రూ. 12.99 లక్షలుగా నిర్ణయించింది. భద్రత పరంగా ఇచ్చే గ్లోబల్ ఎన్సీఏపీ.. ఈ వాహనానికి 4 స్టార్స్ రేటింగ్ ఇచ్చింది. ఈ వాహనం రేంజ్ 306 కిలోమీటర్ల వరకు ఉంటుంది. -
ఫెస్టివ్ సీజన్ ఆఫర్ : టాటా టైగోర్ గెల్చుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కస్టమర్లకు పండగసీజన్లో వివిధ ఆఫర్లను ప్రకటించింది. టాటా మోటార్స్ ప్రతి ఫోర్‌వీలర్ కొనుగోలుపై ఫెస్టివల్ గిఫ్ట్‌లను ఆఫర్ చేస్తోంది. తమకార్ల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే వారానికి ఒకటాటా టైగోర్ను గెలుచుకునే అవకాశాన్ని కూడాకల్పిస్తోంది. ప్రతి వారం టాటా టైగోర్ను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అక్టోబర్ 31 వరకు 'ఫెస్టివల్ ఆఫ్ గిఫ్ట్స్’ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. టాటా కార్ల కొనుగోలుపై అందిస్తున్న డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి. టాటా టియాగో - రూ. 40,000 టాటా టైగోర్ - రూ.73,000 టాటా జెస్ట్ - రూ. 83,000 టాటా నెక్సన్ - రూ. 57,000 టాటా సఫారి స్టార్మ్ - రూ. 87,000 టాటా హెక్సా - రూ. 98,000 టాటా మోటార్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సపోర్ట్, ప్యాసింజర్ వాహనాల డివిజన్ ఎస్ఎన్ బార్మన్ మాట్లాడుతూ, ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా,తమ కస్టమర్ల ఆనంద వేడుకల్లో భాగమయ్యేందుకు ఇది అద్భుతమైన సమయమన్నారు. -
స్టయిలిష్‌గా టాటా కొత్త టైగోర్
సాక్షి,న్యూఢిల్లీ : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా సరికొత్త కాంపాక్ట్ సెడాన్ న్యూలుక్‌తో రీలాంచ్ చేసింది. దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని టైగోర్ ఫేస్‌లిప్ట్‌ను లాంచ్ చేసింది. లుక్స్, ఫీచర్స్, డిజైన్‌లో మార్పులు చేసి స్టయిలిష్లుక్లో కొత్త టైగోర్ను విడుదల చేసింది. 15 అంగుళాల డ్యుయల్ టోన్ అల్లోయ్ వీల్స్, క్రిస్టల్ ఎ ల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు, ఇంటీరియర్ లుక్స్‌లో కూడా అప్డేట్ చేసింది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7-అంగుళాల ఇన్పోటేన్మెంట్ టచ్ స్క్రీన్ విత్, 4 స్పీకర్లు, 4 ట్వీటర్స్ను జోడించింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఆరు రంగుల్లో ఇది లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ కార్ల ధరను 5.20-6.65 లక్షల రూపాయిలు మధ్య నిర్ణయించింది. అలాగే డీజిల్ వెర్షన్ కార్ల ధరలను రూ.6.09 -7.38లక్షలుగా ఉంచింది. -
టిగోర్ తొలి వార్షికోత్సవం, కొత్త ఎడిషన్
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ గతేడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తన కొత్త తరం కాంపాక్ట్ సెడాన్ టిగోర్ తొలి వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా టాటా మోటార్స్ బుధవారం లాంచ్ చేసింది. టిగోర్ బుజ్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో ఇది మార్కెట్లోకి వచ్చింది. పెట్రోల్ ఎడిషన్ ధర ఎక్స్‌షోరూం ఢిల్లీలో రూ.5.68 లక్షలు కాగ, డీజిల్ వెర్షన్ ధర రూ.6.57 లక్షలుగా ఉంది. ఎక్స్‌టీ ట్రిమ్ ఆధారితంగా ఈ వార్షికోత్సవ మోడల్ రూపొందింది. ఫైవ్-స్పీడు మాన్యువల్ ట్రాన్సమిషన్ను ఇది కలిగి ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో కొన్ని అదనపు ఫీచర్లున్నాయి. గ్లాసీ బ్లాక్ పేయింటెడ్ రూఫ్, పియానో బ్లాక్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, డ్యూయల్-టోన్ వీల్ కవర్, ఫ్రంట్ గ్రిల్ విత్ కలర్డ్ ఇన్సర్ట్, లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్, ప్రీమియం ఫుల్ ఫ్యాబ్రిక్ సీట్స్ దీనిలో అదనపు ఫీచర్లు. స్టాండర్డ్ టిగోర్ ఎక్స్‌టీ వేరియంట్ కంటే ఇది 12 వేల రూపాయలు అధికం. నేటి నుంచి కంపెనీకి చెందిన అన్ని డీలర్‌షిప్‌ల వద్ద ఈ టాటా టిగోర్ బుజ్ ఎడిషన్ లభ్యం కానుంది. గతేడాది కంపెనీ లాంచ్ చేసిన టాటా టిగోర్ కంపెనీ కొత్త జనరేషన్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీలో మార్కెట్లోకి వచ్చింది. 1.2 లీటరు పెట్రోల్, 1.0 లీటరు డీజిల్ ఆప్షన్లను అది కలిగి ఉంది. మల్టి డ్రైవ్ మోడ్స్(ఎకో, సిటీ) రెండింటిన్నీ ఆఫర్ చేస్తుంది. ఆ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్క్ అసిస్ట్ విత్ కెమెరా ఉన్నాయి. టాటా టిగోర్, మారుతీ సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఎక్స్‌సెంట్, ఫోర్డ్ ఆస్పైర్, హోండా అమేజ్, ఫోక్స్‌వాగన్ అమియోలకు గట్టి పోటీగా ఉంది. -
టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం విడుదల
ముంబై : టాటా మోటార్స్ నుంచి టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లోకి విడుదలైంది. ఈ వాహనాన్ని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్‌టాటాలు ఆవిష్కరించారు. గుజరాత్‌లోని సనంద్ ఫ్యాక్టరీ నుంచి ఈ వాహనాన్ని టాటా మోటార్స్ విడుదల చేసింది. 2017 సెప్టెంబర్‌లో టాటా మోటార్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి 10వేల ఎలక్ట్రిక్ కార్ల టెండర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా 250 టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాలను టాటా మోటార్స్ డెలివరీ చేస్తోంది. టాటా మోటార్స్‌కు ఇది ఎంతో కీలకమైన మైలురాయి అని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. టీమ్ మొత్తానికి ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్‌లో ఈ-మొబిలిటీని అభివృద్ధి చేయడానికి తామంతా కలిసి పనిచేస్తామన్నారు. ఈ ఎలక్ట్రిక్ మోడల్‌కు తమ కస్టమర్లు సానుకూలంగా స్పందిస్తారని తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు టాటా మోటార్స్ అంకిత భావంతో ఉందని, ఎలక్ట్రిక్ వాహనాలను చాలా వేగవంతంగా అందించడానికి సహకార పద్ధతిలో పనిచేస్తామని కంపెనీ తెలిపింది. ఈ-మొబిలిటీని అభివృద్ధి చేయడానికి టిగోర్ ఈవీతో తమ ప్రయాణం ప్రారంభించామని టాటా మోటార్స్ సీఈవో, ఎండీ గుంటెర్ బుట్చేక్ తెలిపారు. భారత కస్టమర్లకు ఫుల్ రేంజ్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఆఫర్ చేస్తామన్నారు. -
మార్కెట్లోకి టాటా ‘టిగోర్’ ఎంట్రీ..
ప్రారంభ ధర రూ.4.7 లక్షలు ముంబై: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు ‘టిగోర్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.4.7 లక్షలుగా ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యంకానుంది. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ నాలుగు వెర్షన్లలో కస్టమర్లకు చేరువకానుంది. వీటి ధర రూ.4.7 లక్షలు–రూ.6.19 లక్షల శ్రేణిలో ఉంది. ఇక 1.05 లీటర్ డీజిల్ వేరియంట్లో కూడా నాలుగు వెర్షన్లే ఉన్నాయి. వీటి ధర రూ.5.6 లక్షలు–7.09 లక్షల శ్రేణిలో ఉంది. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. తాజా టిగోర్ మోడల్ వల్ల తమ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించిందని, కొత్త కస్టమర్లను ఆకర్షిస్తామని, ప్యాసెంజర్ వాహన మార్కెట్లో తిరిగి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామని టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గుంటెర్ బషెక్ ధీమా వ్యక్తంచేశారు. టాటా మోటార్స్ 2017లో ఆవిష్కరించిన రెండో కొత్త మోడల్ ‘టిగోర్’. కంపెనీ దీనికన్నా ముందు జనవరిలో ‘హెక్సా’ అనే ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది. టాటా టిగోర్ ప్రధానంగా మారుతీ స్విఫ్ట్ డిజైర్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక్కడ స్విఫ్ట్ డిజైర్ కన్నా టైగర్ ధర తక్కువగా ఉంది. కాగా సుప్రీంకోర్టు విధించిన బీఎస్–3 వాహనాల నిషేధంపై కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.