Tata Nexon EV, Tigor EV Get Massive Discount Of Up To Rs 80,000 Off - Sakshi
Sakshi News home page

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్‌

Published Sat, Aug 12 2023 4:40 PM | Last Updated on Sat, Aug 12 2023 5:02 PM

Tata Nexon EV and Tigor EV Available with massive Discounts - Sakshi

Tata Nexon EV and Tigor EV: మార్కెట్ లీడర్ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన తగ్గింపు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ప్రతి నెలా వివిధ కార్ల తయారీదారుల నుండి కార్లపై ప్రయోజనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో భారతీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్  టిగోర్‌ ఈవీ, టాటా నెక్సాన్‌ ఈవీలపై  80వేల దాకా తగ్గింపు లభిస్తోంది. 

టిగోర్‌ ఈవీ
దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి టిగోర్‌ ఈవీ. టాటా మోటార్స్ దీని మీద రూ. 80,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపు,ఎక్సేంజ్‌ బోనస్, కార్పొరేట్ తగ్గింపు, అదనపు వారంటీ లేదా ఉపకరణాలు ఉండవచ్చు. దీని ధర రూ. 12.49-13.75 లక్షల (ఎక్స్-షోరూమ్‌) వరకు  ఉంది.

నెక్సాన్‌ ఈవీ
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు నెక్సాన్‌ ఈవీ. టాటా మోటార్స్ దీనిని వివిధ బ్యాటరీ పరిమాణాలతో ప్రైమ్ , మ్యాక్స్‌ అనే రెండు వేరియంట్‌లలో  లభిస్తోంది. మాక్స్‌ , ప్రైమ్ వేరియంట్‌లపై రూ. 61,000 56,000 తగ్గించింది.  వీటి ధర రూ. 14.49-17.19 లక్షల (ఎక్స్-షోరూమ్‌) వరకు  ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement