న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన పాపులర్ వాహనం టియాగోలో కొత్త వేరియంట్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘టియాగో ఎక్స్‌జెడ్ ప్లస్’ పేరుతో విడుదలైన ఈ కారు పెట్రోల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.5.57– 5.64 లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ధరల శ్రేణి రూ.6.31– 6.38 లక్షలుగా ప్రకటించింది.
ఈ సందర్భంగా కంపెనీ ప్యాసింజర్ వాహన విభాగ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్) ఎస్.ఎన్.బర్మన్ మాట్లాడుతూ.. ‘ఈ కారును కస్టమర్లు ఎంతో ఇష్టపడతారని భావిస్తున్నాం. ప్యాసింజర్ వాహన వ్యాపారంలో అమ్మకాలు గణనీయంగా పెరగడానికి ఈ వేరియంట్ ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం.’ అని అన్నారయన.
టియాగో.. ఎక్స్‌జెడ్ ప్లస్
Published Wed, Dec 12 2018 1:35 AM | Last Updated on Wed, Dec 12 2018 1:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment