కరోనా తీసుకొచ్చిన సెమికండక్టర్ చిప్‌ల కొరత ఉక్రెయిన్ మోసుకొచ్చిన సప్లై చైయిన్ ఇబ్బందుల మధ్య ఇండియాలో కార్ల అమ్మకాలు మార్చిలో చెప్పుకోతగ్గ రీతిలోనే జరిగాయి. ఎప్పటి లాగే టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో అధిక భాగం మారుతి సుజూకివే ఉన్నాయి. మరోవైపు భారత్ మార్కెట్‌లో మారుతికి సమీప ప్రత్యర్థిగా ఎదిగేందుకు టాటా దూసుకొస్తోంది.
Maruti Wagon R
- 2022 మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి వ్యాగన్ ఆర్ నిలిచింది. గతేడాది వచ్చిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కె్‌ట్‌లో దూసుకుపోతోంది. గతేడాది టాప్ సెల్లర్‌గా నిలిచిన వ్యాగన్ ఆర్ ఈ మార్చిలోనూ హవా కొనసాగించింది. 2022 మార్చిలో 24,636 మారుతి వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ కారు ప్రారంభ ధర రూ.5.18 లక్షలుగా ఉంది.
Swift Dezire
- మారుతిలో అత్యంత సక్సెస్‌ఫుల్ మోడళ్లలో ఒకటైన స్విఫ్ట్ డిజైర్ మార్చిలో తన ప్రతాపం చూపించింది. మారుతి స్విఫ్ట్‌ని క్రాస్ చేసి ఏకంగా 18,623 కార్లు సేల్ అయ్యాయి. స్విఫ్ట్ డిజైర్ ప్రారంభ ధర రూ.6.09 లక్షలుగా ఉంది.
Suzuki Baleno
- సూజుకి పోర్ట్‌ఫోలియోలో మార్కెట్‌లో ఎక్కువ ప్రభావం చూపించిన కారుగా బాలేనోకి గుర్తింపు ఉంది. మార్చిలో దేశవ్యాప్తంగా 14,520 కార్లు అమ్ముడయ్యాయి. సగటున 22 కి.మీ మైలేజ్ ఇవ్వడం ఈ కారు ప్రత్యేకత. ప్రారంభ ధర రూ. 9.49 లక్షలుగా ఉంది.
Tata Nexon
- ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ కేటగిరిలో టాటాకి సిరుల పంట పండించిన మోడల్‌గా నెక్సాన్ నిలిచింది. ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ కేటగిరిలో మార్కెట్ లీడర్లుగా ఒక వెలుగు వెలిగిన బ్రెజా విటారా, క్రెటాలను నెక్సాన్ వెనక్కి నెట్టింది. ఇదే ఊపులో మార్చిలో 14,315 కార్ల అమ్మకాలు సాగాయి. ఈ కారు ధరలు రూ.7.42 లక్షల నుంచి మొదలు.
Maruti Swift
- ఇండియాలో ఏ మారు మూల ప్రాంతానికి వెళ్లిన కనిపించే కారుగా మారుతి స్విఫ్ట్ గురించి చెప్పుకోవచ్చు. పదేళ్లుగా ఈ మోడల్ రారాజుగా వెలుగుతోంది. కొత్త మోడళ్లు ఎన్ని వచ్చినా స్విఫ్ట్ వాటా స్విఫ్ట్‌దే అన్నట్టుగా పరిస్థితి ఉంది. 2022 మార్చిలో 13,623 కార్ల అమ్మకాలు జరిగాయి. ప్రారంభ ధర రూ.5.90 లక్షలు
Maruti Brezza Vitara
- ఇండియాలో ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ మార్కెట్ సత్తా ఎంటో ప్రపంచానికి చాటిన మోడల్ మారుతి విటారా బ్రెజా. సగటున 17.5 కి.మీ మైలేజీ ఇవ్వడం ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత. మార్చిలో 12,.439 కార్లు రోడ్లపైకి వచ్చాయి.
Hyundai CRETA
- వివిధ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్నా ఇప్పటికీ హ్యుందాయ్‌కి మార్కెట్‌లో మేజర్ షేర్ ఉండటానికి కారణం క్రెటా మోడల్. మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో క్రెటా రారాజుగా వెలుగుతోంది. మార్చిలో 19,532 కార్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 10.23 లక్షలు
TATA PUNCH
- ఊహించనదానికి కంటే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది టాటా మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారు. ఈ కారు విడుదలకు ముందే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకోగా.. తర్వాత కూడా అదే జోరు చూపించింది. చిప్‌సెట్ల సమస్య తీవ్రంగా వేధిస్తున్నప్పటికీ దేశ్యాప్తంగా ఏకంగా 10,526 పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ఈ మోడల్ ప్రారంభ ధర రూ.5.67 లక్షలు.
చదవండి: హాట్ కేకుల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు.. మరీ ఈ రేంజ్‌లోనా!
Comments
Please login to add a commentAdd a comment