సాక్షి, ముంబై: 2022 మొదటి అర్ధభాగంలో కార్ల అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 2022 జనవరి- జూన్ వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల మోడల్స్‌లో మారుతి సుజుకి టాప్ లో నిలిచింది. ఈ ఏడాది విక్రయాల్లో టాప్-10 కార్లలో తొలి ఐదు స్థానాలను ఆక్రమించడం విశేషం. పాపులర్ మోడల్స్ వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఆల్టో లాంటి మోడల్స్ ఉన్నాయి.
అయితే 2021 మొదటి అర్ధభాగంలో అమ్మకాలతో ఈ ఏడాది ఇదే సమాయానికి అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, ఆల్టో లాంటి కార్లతోపాటు, టాటా , హ్యుందాయ్ మోడల్ అమ్మకాలు బాగా పడిపోయాయి.
టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి సుజుకి ది వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో , ఆల్టోతో సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ ఆర్ 20 శాతం వృద్ధితో 1,13,407 కార్లు అమ్ముడయ్యాయి. డిజైర్ 21 శాతం వార్షిక అమ్మకాలను నమోదు చేసింది.
ఐదు మోడళ్లలో, వరుసగా 91,177 యూనిట్లు, 85,929 యూనిట్లు, 74,892 యూనిట్లు, 68,660 కార్లను సేల్ చేఏసింది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 52,333 యూనిట్లను విక్రయాలతో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 7 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే కాలంలో హ్యుందాయ్ 56,286 యూనిట్లను విక్రయించింది.
సెలెరియో, S-ప్రెస్సో వరుసగా 46,764 యూనిట్లు , 34,123 యూనిట్లతో మారుతి సుజుకి ఏడు, ఎనిమిదవ స్థానాలను కైవసం చేసుకుంది. మారుతి సుజుకి సెలెరియో 144 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎస్-ప్రెస్సో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది.
హ్యుందాయ్ i20 తొమ్మిదో ప్లేస్‌లో ఉంది. గత సంవత్సరం 41,326 యూనిట్లతో పోలిస్తే 34,119 యూనిట్లను విక్రయించి, 17 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. టాటా ఆల్ట్రోజ్ 28,808 యూనిట్లతో టాప్-10 లో నిలిచింది. దీని అమ్మకాలు కూడా 23 శాతం పడిపోయాయి..
Comments
Please login to add a commentAdd a comment