best selling model
-
2022లో ఇప్పటివరకూ టాప్ సెల్లింగ్ కార్లు ఇవే!
సాక్షి, ముంబై: 2022 మొదటి అర్ధభాగంలో కార్ల అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 2022 జనవరి- జూన్ వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల మోడల్స్‌లో మారుతి సుజుకి టాప్ లో నిలిచింది. ఈ ఏడాది విక్రయాల్లో టాప్-10 కార్లలో తొలి ఐదు స్థానాలను ఆక్రమించడం విశేషం. పాపులర్ మోడల్స్ వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఆల్టో లాంటి మోడల్స్ ఉన్నాయి. అయితే 2021 మొదటి అర్ధభాగంలో అమ్మకాలతో ఈ ఏడాది ఇదే సమాయానికి అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, ఆల్టో లాంటి కార్లతోపాటు, టాటా , హ్యుందాయ్ మోడల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి సుజుకి ది వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో , ఆల్టోతో సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ ఆర్ 20 శాతం వృద్ధితో 1,13,407 కార్లు అమ్ముడయ్యాయి. డిజైర్ 21 శాతం వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఐదు మోడళ్లలో, వరుసగా 91,177 యూనిట్లు, 85,929 యూనిట్లు, 74,892 యూనిట్లు, 68,660 కార్లను సేల్ చేఏసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 52,333 యూనిట్లను విక్రయాలతో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 7 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే కాలంలో హ్యుందాయ్ 56,286 యూనిట్లను విక్రయించింది. సెలెరియో, S-ప్రెస్సో వరుసగా 46,764 యూనిట్లు , 34,123 యూనిట్లతో మారుతి సుజుకి ఏడు, ఎనిమిదవ స్థానాలను కైవసం చేసుకుంది. మారుతి సుజుకి సెలెరియో 144 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎస్-ప్రెస్సో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ i20 తొమ్మిదో ప్లేస్‌లో ఉంది. గత సంవత్సరం 41,326 యూనిట్లతో పోలిస్తే 34,119 యూనిట్లను విక్రయించి, 17 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. టాటా ఆల్ట్రోజ్ 28,808 యూనిట్లతో టాప్-10 లో నిలిచింది. దీని అమ్మకాలు కూడా 23 శాతం పడిపోయాయి.. -
పేరుకు సెకండ్ హ్యాండ్ కార్లే..! హాట్‌కేకుల్లా అమ్ముడైన బ్రాండ్స్ ఇవే..!
కారు కొనాలనే కోరిక అందరికీ ఉంటుంది. కుటుంబంతో కారులో షికారు చేయాలని ఎంతో మంది కల. బడ్జెట్ రేంజ్ కారు కొనేందుకు చాలా మంది ప్రయత్నాలను చేస్తుంటారు. కొంతమంది లోన్ తీసుకోనైనా కారును సొంతం చేసుకుంటారు. కొత్తమందికీ బడ్జెట్ అడ్జెట్స్ కాకపోవడంతో సెకండ్ హ్యాండ్ కారువైపు మళ్లుతారు. ఇలా పాత కార్లను కొనుగోలు చేసి వారి సొంత వాహన కలను నేరవేర్చుకుంటారు. పాత కార్లను విక్రయించేందుకు ఇప్పటికే పలు కంపెనీలు అవతరించాయి. ఈ కంపెనీలు నమ్మకమైనవిగా నిలుస్తూ ఆయా వాహన కొనుగోలుదారులకు కార్లను అందిస్తున్నాయి. పేరుకు సెకండ్ హ్యాండే..! పేరుకు సెకండ్ హ్యాండే కార్లేఐనా భారత్‌లో మారుతీ, హ్యుందాయ్, హోండా కార్లు అత్యధిక డిమాండ్ ఉన్న కార్ బ్రాండ్స్‌గా ఉన్నాయని కార్ల రిటైలింగ్ ప్లాట్‌ఫాం స్పిన్నీ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 2021లో సుమారు 57 శాతం పైగా అమ్మకాలు జరిగాయని తెలిపింది. పీ అండ్ ఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం...స్పిన్నీ ఈ ఏడాది అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. . అగ్రగామి ఫుల్-స్టాక్ కార్ రిటైల్ ప్లాట్‌ఫారమ్ వాహనాలను ఆస్వాదిస్తున్న నగరాల్లో బెంగళూరు కేవలం కొనుగోలుదారులలో 64 శాతం పెరుగుదలను అందించింది. తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్ గణనీయమైన అమ్మకాలు జరిగినటుల కంపెనీ పేర్కొంది. స్పిన్ని ప్రస్థానం యూజ్డ్ కారు రిటైలింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా మార్కెట్లోకి ఎంటరైన అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది స్పిన్ని. ఇటీవల ఈ సిరీస్ ఈ ఫండింగ్ రౌండ్లో స్పిన్ని సంస్థలోకి 238 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు 530 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది స్పిన్ని. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేన్ 1.80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: భలే స్కూటర్.. మడత పెట్టి బ్యాగులో పెట్టేయోచ్చు! -
2021లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఏవంటే..?
మరికొద్ది రోజల్లో 2021కు ఎండ్ కార్డు పడనుంది. కొత్త ఏడాది 2022 రాబోతుంది. ఈ ఏడాదిలో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల వ్యాపారం కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా మారింది. సప్లై చైయిన్ రంగంలో అవాంతరాలు, చిప్స్ కొరత వంటివి ఆయా కంపెనీలకు ఉత్పత్తికి అడ్డుగా మారాయి. ముడి సరకుల ధరలు పెరగడంతో కంపెనీలు మార్జిన్లను దృష్టిలో ఉంచుకొని ఆయా కంపెనీలు వాహనాల ధరలను పెంచాయి. ఇదిలా ఉండగా 2021గాను భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల కంపెనీల్లో మారుతి సుజుకీ మొదటిస్ధానంలో నిలిచింది. ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు అత్యధికంగా విక్రయించిన కార్ల లిస్ట్‌ను ప్రముఖ ఆటోమొబైల్ వెబ్సైట్ కార్దేఖో వెల్లడించింది. 2021లో ఆయా కంపెనీల్లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..! 1. మారుతి సుజుకీ- వ్యాగనర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ నేమ్. దేశీయంగా అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసే కంపెనీ ఇది. ప్రతినెలా అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మారుతి సుజుకికి చెందిన వ్యాగనార్.. అగ్రస్థానంలో నిలిచింది. సుమారు 1.64 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది. 2. హ్యుందాయ్- క్రెటా మారుతి సుజుకీ తరువాత భారత్‌లో హ్యుందాయ్ కార్లకు భారీ ఆదరణ ఉంది. హ్యుందాయ్‌లో క్రెటా కార్లు అత్యధికంగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. సుమారు 1,17,828 యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. వచ్చే ఏడాది క్రెటాకు చెందిన అప్డేట్డ్ వెర్షన్‌ను హ్యుందాయ్ తీసుకురానున్నట్లు సమాచారం. 3. టాటా-నెక్సాన్ టాటా మోటార్స్‌లో నెక్సాన్ కార్లు భారీగా అమ్ముడైనాయి. పెట్రోల్, డిజీల్, ఎలక్ట్రిక్ వేరియంట్స్ నెక్సాన్‌లో అందుబాటులో ఉన్నాయి. అమ్ముడైన కార్ల సంఖ్య: 95,678 4. కియా-సెల్టోస్ దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్‌లో భారీ ఆదరణను పొందింది. కియా మోటార్స్‌లో సెల్టోస్ ఎస్యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడైనాయి. అమ్ముడైన కార్ల సంఖ్య: 94,175 5. మహీంద్రా-బొలెరో మహీంద్రా కంపెనీ న్యూ జనరేషన్ ఎస్‌యూవీలో ఈ ఏడాది ముందుకొచ్చింది. కాగా మహీంద్రాలో టాప్ సెల్లింగ్ కారుగా బొలెరో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 60,009 6. టయోటా-ఇన్నోవా క్రిస్టా ప్రముఖ జపనీస్ మోటార్స్ టయోటాకు భారత్‌లో ఎస్యూవీ వాహనాలకు మంచి పేరు ఉంది. ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా మోడల్ కార్లను భారతీయులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. 2021లో భారత్‌లో టయోటా టాప్ సెల్లింగ్ కారుగా ఇన్నోవా క్రిస్టా నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 51,261 7. హోండా-అమేజ్ 2021గాను భారత్‌లో హోండా అమ్మకాల్లో అమేజ్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 36,398 8. రెనాల్ట్-క్విడ్ 2021గాను భారత్‌లో రెనాల్ట్ అమ్మకాల్లో క్విడ్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 30,600 9. స్కోడా- కుషాక్ 2021గాను భారత్‌లో స్కోడా అమ్మకాల్లో కుషాక్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 11,173 చదవండి: అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు! -
ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్..
♦ బెస్ట్ సెల్లింగ్ మోడల్ ♦ టాప్–10లో కార్లన్నీ 2 కంపెనీలవే న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘స్విఫ్ట్’ తాజాగా అదే కంపెనీకి చెందిన ‘ఆల్టో’ మోడల్‌ను వెనక్కు నెట్టింది. దేశీ మార్కెట్లో ఏప్రిల్ నెల వాహన విక్రయాల్లో ‘స్విఫ్ట్’.. బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా అవతరించింది. కాగా మారుతీ ఎప్పటిలాగే ఇండియన్ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కంపెనీకి చెందిన ఏడు కార్లు ‘టాప్–10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్’ జాబితాలోస్థానం దక్కించుకున్నాయి. ఇక మిగిలిన మూడు స్థానాలను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఆక్రమించింది. కాగా జాబితాలో మరే ఇతర కంపెనీ మోడళ్లు లేకపోవడం గమనార్హం. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ♦ మారుతీ స్విఫ్ట్ విక్రయాలు ఈ ఏప్రిల్‌లో 23,802 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో స్విఫ్ట్ అమ్మకాలు 15,661 యూనిట్లుగా ఉన్నాయి. అంటే విక్రయాల్లో 52 శాతం వృద్ధితో ఈ మోడల్ జాబితాలో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ♦ ఇక ఎప్పుడూ టాప్‌లో ఉంటూవచ్చిన ఆల్టో ఈసారి రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. విక్రయాలు 36% వృద్ధితో 16,583 యూనిట్ల నుంచి 22,549కు పెరిగాయి. ♦ 2016 ఏప్రిల్‌లో ఆల్టో అగ్రస్థానంలో, స్విఫ్ట్ రెండో స్థానంలో ఉండేవి. కానీ ఇప్పుడు స్విఫ్ట్ తొలి స్థానానికి, ఆల్టో రెండుకు మారాయి. ♦ 17,530 యూనిట్ల విక్రయాలతో మారుతీ బాలెనో మూడో స్థానంలో ఉంది. ఇదే కంపెనీకి చెందిన వ్యాగన్–ఆర్ 16,348 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానం దక్కించుకుంది. ♦ హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఐదవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,668 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 ఆరవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,001 యూనిట్లుగా ఉన్నాయి. ♦ మారుతీ విటారా బ్రెజా 10,653 యూనిట్ల అమ్మకాలతో 7వ స్థానంలో నిలిచింది. -
ఆల్టోను బీట్ చేసిన స్విఫ్ట్
న్యూఢిల్లీ : మార్కెట్లో మారుతీ సుజుకీ కార్ల హవా అంతా ఇంతా కాదు. పోటీపడి మరీ ఆ దిగ్గజ కార్లు టాప్ ప్లేస్ లో హల్ చల్ చేస్తుంటాయి. ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండే ఆల్టోను తన తోబుట్టువు స్విఫ్ట్ బీట్ చేసింది. ఏప్రిల్ నెలలో మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా స్విఫ్ట్ నిలిచింది. 10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఏడు మారుతీ సుజుకీవే చోటు దక్కించుకున్నాయి. మిగిలిన మూడు స్థానాలు మారుతీ సుజుకీ ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కార్లు ఉన్నాయి. సియామ్ తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్విఫ్ట్ కార్లు 23,802 యూనిట్లు అమ్ముడు పోయాయని తెలిసింది. ముందటేడాది ఇదే నెలలో ఇవి 15,661 యూనిట్లుగా ఉన్నాయి. అంటే గతేడాది కంటే ఈ ఏడాదికి 51.98 శాతం అమ్మకాలను పెంచుకుంది ఈ మోడల్. ఆల్టో మోడల్ 22,549 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధి 35.97 శాతం. 2016 ఏప్రిల్ లో ఆల్టో నెంబర్ వన్ సెల్లింగ్ మోడల్. ఆ సమయంలో స్విఫ్ట్ రెండో స్థానంలో ఉండేంది. ప్రస్తుతం ఆల్టోను స్విఫ్ట్ బీట్ చేసింది. మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బెలానో మూడో స్థానంలో 17,530 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. గతేడాది 8వ స్థానంలో ఉండగా.. ఇది ప్రస్తుతం 3వ స్థానానికి వచ్చేసింది. వాగన్ ఆర్ 4వ స్థానం, హ్యుందాయ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10లు, ఐదు ఆరు స్థానాలు, మారుతీ సుజుకీ విటారా బ్రిజా 7వ స్థానం, హ్యుందాయ్ క్రిటా 8వ స్థానం, మారుతీ సుజుకి డిజైర్ టూర్ 9వ స్థానం, సెలెరియో 10వ స్థానం దక్కించుకున్నాయి.