ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్‌.. | Maruti Suzuki Swift beats Alto as best selling model in April : Cars | Sakshi
Sakshi News home page

ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్‌..

Published Tue, May 23 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్‌..

ఈసారి ఆల్టో కాదు స్విఫ్ట్‌..

బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌
టాప్‌–10లో కార్లన్నీ 2 కంపెనీలవే


న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ’ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌ ‘స్విఫ్ట్‌’ తాజాగా అదే కంపెనీకి చెందిన ‘ఆల్టో’ మోడల్‌ను వెనక్కు నెట్టింది. దేశీ మార్కెట్‌లో ఏప్రిల్‌ నెల వాహన విక్రయాల్లో ‘స్విఫ్ట్‌’.. బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా అవతరించింది. కాగా మారుతీ ఎప్పటిలాగే ఇండియన్‌ ప్యాసెంజర్‌ వాహన మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కంపెనీకి చెందిన ఏడు కార్లు ‘టాప్‌–10 బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్స్‌’ జాబితాలోస్థానం దక్కించుకున్నాయి. ఇక మిగిలిన మూడు స్థానాలను హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఆక్రమించింది. కాగా జాబితాలో మరే ఇతర కంపెనీ మోడళ్లు లేకపోవడం గమనార్హం. సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం..

మారుతీ స్విఫ్ట్‌ విక్రయాలు ఈ ఏప్రిల్‌లో 23,802 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో స్విఫ్ట్‌ అమ్మకాలు 15,661 యూనిట్లుగా ఉన్నాయి. అంటే విక్రయాల్లో 52 శాతం వృద్ధితో ఈ మోడల్‌ జాబితాలో టాప్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది.  

ఇక ఎప్పుడూ టాప్‌లో ఉంటూవచ్చిన ఆల్టో ఈసారి రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. విక్రయాలు 36% వృద్ధితో 16,583 యూనిట్ల నుంచి 22,549కు పెరిగాయి.

2016 ఏప్రిల్‌లో ఆల్టో అగ్రస్థానంలో, స్విఫ్ట్‌ రెండో స్థానంలో ఉండేవి. కానీ ఇప్పుడు స్విఫ్ట్‌ తొలి స్థానానికి, ఆల్టో రెండుకు మారాయి.

17,530 యూనిట్ల విక్రయాలతో మారుతీ బాలెనో మూడో స్థానంలో ఉంది. ఇదే కంపెనీకి చెందిన వ్యాగన్‌–ఆర్‌ 16,348 యూనిట్ల అమ్మకాలతో నాల్గవ స్థానం దక్కించుకుంది.

హ్యుందాయ్‌ ఎలైట్‌ ఐ20 ఐదవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,668 యూనిట్లుగా ఉన్నాయి. ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్‌ ఐ10 ఆరవ స్థానంలో ఉంది. దీని విక్రయాలు 12,001 యూనిట్లుగా ఉన్నాయి.

మారుతీ విటారా బ్రెజా 10,653 యూనిట్ల అమ్మకాలతో 7వ స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement