మరికొద్ది రోజల్లో 2021కు ఎండ్ కార్డు పడనుంది. కొత్త ఏడాది 2022 రాబోతుంది. ఈ ఏడాదిలో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల వ్యాపారం కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా మారింది. సప్లై చైయిన్ రంగంలో అవాంతరాలు, చిప్స్ కొరత వంటివి ఆయా కంపెనీలకు ఉత్పత్తికి అడ్డుగా మారాయి. ముడి సరకుల ధరలు పెరగడంతో కంపెనీలు మార్జిన్లను దృష్టిలో ఉంచుకొని ఆయా కంపెనీలు వాహనాల ధరలను పెంచాయి. ఇదిలా ఉండగా 2021గాను భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల కంపెనీల్లో మారుతి సుజుకీ మొదటిస్ధానంలో నిలిచింది. ఈ ఏడాదిలో ఆయా కంపెనీలు అత్యధికంగా విక్రయించిన కార్ల లిస్ట్‌ను ప్రముఖ ఆటోమొబైల్ వెబ్‌సైట్ కార్‌దేఖో వెల్లడించింది.
2021లో ఆయా కంపెనీల్లో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!
1. మారుతి సుజుకీ- వ్యాగనర్
ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఓ బ్రాండ్ నేమ్. దేశీయంగా అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసే కంపెనీ ఇది. ప్రతినెలా అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో మారుతి సుజుకి టాప్ ప్లేస్‌లో ఉంటుంది. మారుతి సుజుకికి చెందిన వ్యాగనార్.. అగ్రస్థానంలో నిలిచింది. సుమారు 1.64 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలుస్తోంది.
2. హ్యుందాయ్- క్రెటా
మారుతి సుజుకీ తరువాత భారత్‌లో హ్యుందాయ్ కార్లకు భారీ ఆదరణ ఉంది. హ్యుందాయ్‌లో క్రెటా కార్లు అత్యధికంగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. సుమారు 1,17,828 యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. వచ్చే ఏడాది క్రెటాకు చెందిన అప్‌డేట్‌డ్ వెర్షన్‌ను హ్యుందాయ్ తీసుకురానున్నట్లు సమాచారం.
3. టాటా-నెక్సాన్
టాటా మోటార్స్‌లో నెక్సాన్ కార్లు భారీగా అమ్ముడైనాయి. పెట్రోల్, డిజీల్, ఎలక్ట్రిక్ వేరియంట్స్ నెక్సాన్‌లో అందుబాటులో ఉన్నాయి. అమ్ముడైన కార్ల సంఖ్య: 95,678
4. కియా-సెల్టోస్
దక్షిణ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా భారత్‌లో భారీ ఆదరణను పొందింది. కియా మోటార్స్‌లో సెల్టోస్ ఎస్‌యూవీ కార్లు ఎక్కువగా అమ్ముడైనాయి. అమ్ముడైన కార్ల సంఖ్య: 94,175
5. మహీంద్రా-బొలెరో
మహీంద్రా కంపెనీ న్యూ జనరేషన్ ఎస్‌యూవీలో ఈ ఏడాది ముందుకొచ్చింది. కాగా మహీంద్రాలో టాప్ సెల్లింగ్ కారుగా బొలెరో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 60,009
6. టయోటా-ఇన్నోవా క్రిస్టా
ప్రముఖ జపనీస్ మోటార్స్ టయోటాకు భారత్‌లో ఎస్‌యూవీ వాహనాలకు మంచి పేరు ఉంది. ఫార్చూనర్, ఇన్నోవా క్రిస్టా మోడల్ కార్లను భారతీయులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. 2021లో భారత్‌లో టయోటా టాప్ సెల్లింగ్ కారుగా ఇన్నోవా క్రిస్టా నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 51,261
7. హోండా-అమేజ్
2021గాను భారత్‌లో హోండా అమ్మకాల్లో అమేజ్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 36,398
8. రెనాల్ట్-క్విడ్
2021గాను భారత్‌లో రెనాల్ట్ అమ్మకాల్లో క్విడ్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 30,600
9. స్కోడా- కుషాక్
2021గాను భారత్‌లో స్కోడా అమ్మకాల్లో కుషాక్ కారు టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమ్ముడైన కార్ల సంఖ్య: 11,173
చదవండి: అమ్మకాల్లో దూసుకెళ్తున్న మారుతీ సుజుకీ బాలెనో కారు!
Comments
Please login to add a commentAdd a comment