desire
-
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
వయాగ్రాపై బ్యాన్.. ఉడుం నూనె కోసం ఎగబడుతున్న యువత..!
ఇస్లామాబాద్: వయాగ్రా వినియోగంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో కామోద్ధీపన కోసం ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు అక్కడి యువకులు. ఈక్రమంలో ఉడుం కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉడుములు వేటాడే ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్లో రావల్పిండి యువకులు ఈ ఉడుం నూనె కోసం పరితపిస్తున్నారు. ఎంత డబ్బైనా వెచ్చింది దీన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు నూనెలో మేరినేట్ చేసి ఎరుపు రంగు మసాలలలో ఉపయోగిస్తారు. లేదా దీనితో సాందా తైలాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే లైంగిక వాంఛ, సామర్థ్యం పెరిగి పడకగదిలొ రెచ్చిపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రావల్పిండిలోని రాజా బాజార్లో ఉడుం నూనె కోసం యువకుల తాకిడి పెరిగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో చాలా ముంది ఉడుముల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉడుములను చంపడం తమకు బాధగా అన్పిస్తోందని, కానీ జీవనోపాధి కోసం తప్పడం లేదని వారు చెబుతున్నారు. దశాబ్దాలుగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఎక్కుమంది పిల్లల్ని కంటేనే సమాజంలో ఆ దంపతులను గౌరవం ఉంటుంది. పిల్లలు లేకపోతే పరువు పోతుందని చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా ఉపయోగించేవారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఉడుం నూనెకు డిమాండ్ పెరిగింది. అయితే దీని వల్ల లైంగిక వాంఛ, సామర్థ్యం, పటుత్వం పెరుగుతుందని ఇప్పటివరకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఉడుం వేటగాళ్లు మాత్రం నిజంగానే దీనిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణాలున్నాయని చెబుతున్నారు. చదవండి: ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో.. -
2022లో ఇప్పటివరకూ టాప్ సెల్లింగ్ కార్లు ఇవే!
సాక్షి, ముంబై: 2022 మొదటి అర్ధభాగంలో కార్ల అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 2022 జనవరి- జూన్ వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల మోడల్స్‌లో మారుతి సుజుకి టాప్ లో నిలిచింది. ఈ ఏడాది విక్రయాల్లో టాప్-10 కార్లలో తొలి ఐదు స్థానాలను ఆక్రమించడం విశేషం. పాపులర్ మోడల్స్ వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఆల్టో లాంటి మోడల్స్ ఉన్నాయి. అయితే 2021 మొదటి అర్ధభాగంలో అమ్మకాలతో ఈ ఏడాది ఇదే సమాయానికి అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, ఆల్టో లాంటి కార్లతోపాటు, టాటా , హ్యుందాయ్ మోడల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి సుజుకి ది వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో , ఆల్టోతో సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ ఆర్ 20 శాతం వృద్ధితో 1,13,407 కార్లు అమ్ముడయ్యాయి. డిజైర్ 21 శాతం వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఐదు మోడళ్లలో, వరుసగా 91,177 యూనిట్లు, 85,929 యూనిట్లు, 74,892 యూనిట్లు, 68,660 కార్లను సేల్ చేఏసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 52,333 యూనిట్లను విక్రయాలతో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 7 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే కాలంలో హ్యుందాయ్ 56,286 యూనిట్లను విక్రయించింది. సెలెరియో, S-ప్రెస్సో వరుసగా 46,764 యూనిట్లు , 34,123 యూనిట్లతో మారుతి సుజుకి ఏడు, ఎనిమిదవ స్థానాలను కైవసం చేసుకుంది. మారుతి సుజుకి సెలెరియో 144 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎస్-ప్రెస్సో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ i20 తొమ్మిదో ప్లేస్‌లో ఉంది. గత సంవత్సరం 41,326 యూనిట్లతో పోలిస్తే 34,119 యూనిట్లను విక్రయించి, 17 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. టాటా ఆల్ట్రోజ్ 28,808 యూనిట్లతో టాప్-10 లో నిలిచింది. దీని అమ్మకాలు కూడా 23 శాతం పడిపోయాయి.. -
మారుతీ సుజుకీ డిజైర్ ఎస్–సీఎన్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎస్–సీఎన్జీ పరిజ్ఞానంతో కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను రెండు ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.14 లక్షల నుంచి ప్రారంభం. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో ఇవి రూపుదిద్దుకున్నాయని కంపెనీ తెలిపింది. మైలేజీ కిలోకు 31.12 కిలోమీటర్లు అని వెల్లడించింది. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, అధిక మైలేజీ కారణంగా ఎస్–సీఎన్జీ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయిదేళ్లలో కంపెనీ ఈ విభాగంలో ఏటా సగటున 19 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. -
ఫ్యాషన్ 'డిజైర్'
-
హెచ్‌టీసీ డిజైర్ కొత్త స్మార్ట్‌ఫోన్
హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గత ఏడాది తీసుకొచ్చిన హెచ్‌టీసీ డిజైర్ 12కి కొనసాగింపుగా హెచ్‌టీసీ డిజైర్ 12ఎస్‌ను తైవాన్ మార్కెట్లో విడుదల చేసింది. రెండు వేరియంట్లలో అక్కడి మార్కెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. 3జీబీ/32జీబీ వేర్షన్ ధర సుమారు రూ.13,900గాను, 4జీబీ/63జీఈ వేరియంట్ ధర సుమారు రూ. 16,240గా ఉండనుంది. భారత మార్కెట్లలో లభ్యతపై అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. హెచ్‌టీసీ డిజైర్ 12ఎస్ ఫీచర్లు 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 720x1440 పిక్సెల్స్ రిజల్యూషన్ 13ఎంపీ రియర్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 3075 ఎంఏహెచ్‌బ్యాటరీ -
మృత్యుభూతం
ఆ రైతు, అతనితోపాటు ఒక డాక్టరు.. చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ ముసలామె మంచం ఎదురుగా నిలబడ్డారు. ఆమె స్తబ్దుగా వుంది. అన్నీ వదిలేసినట్లు స్థిరంగా ఆ ఇద్దరి సంభాషణ వింటూ, వాళ్ళనే చూస్తూ వుంది. ఆమె చావడానికి సిద్ధంగా వుంది. వచ్చే చావుని ఎదిరించాలన్న కోరిక ఆమెలో లేదు. తొంభై రెండేళ్ళ వయసు అంటే అదే చివరి అంకం అని ఆమెకి తెలుసు.జ్యేష్ఠ మాసపు సూర్యుడు కిటికీలోనుంచి, తెరిచివుంచిన తలుపులోనుంచి మంటపుట్టించే వేడి కిరణాలను ప్రసరిస్తున్నాడు. అవి బురదమట్టితో అలికిన ఇంటి నేలపైన అడ్డదిడ్డంగా పడుతున్నాయి. నాలుగు తరాల మోటు మనుషులు వేసిన అడుగుల కింద నలిగిన నేల అది. ఎండతో పాటు వచ్చిన సన్నటి గాలులు పొలాల వాసనను వెంటబెట్టుకొస్తున్నాయి. డాక్టరు గొంతుపెగిల్చి కాస్త గట్టిగానే మాట్లాడటం మొదలుపెట్టాడు – ‘‘హోన్రే! మీ అమ్మ పరిస్థితి ఇలా వున్నప్పుడు నువ్వు ఆమెను వదిలి పెట్టడం మంచిది కాదు. ఆమె ఏ క్షణంలోనైనా ప్రాణాలు వదలచ్చు’’. రైతు చాలా బాధపడి సమాధానం ఇచ్చాడు – ‘‘కానీ పొలం నుంచి గోధుమలు తెచ్చుకోవాలి. కుప్పలూడ్చి అలాగే వదిలేసి చాలా రోజులైంది. వాతావరణం కూడా అనుకూలంగా వుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెచ్చుకోగలను. ఏమంటావు అమ్మా?’’ అన్నాడు. మరణశయ్య మీద వున్న ఆమె, కొడుకు లోభత్వానికి బాధపడ్డా, సరే అన్నట్లు కళ్ళతో, ముఖకవళికలతో చెప్పింది. కొడుకు గోధుమలుతెచ్చుకోడానికి వెళ్తే, ఒంటరిగా ప్రాణం వదలడానికి సిద్ధపడ్డట్టుగా వున్నదా సమాధానం.కానీ డాక్టరు కోపం నషాళాన్ని తాకింది. ‘‘నీ అంత దుర్మార్గుడు వుంటాడా? నేను నిన్ను అడుగు కూడా బయటపెట్టనివ్వను. అర్థమయిందా? కాదూ కూడదూ వెళ్ళాల్సిందే అంటే వెళ్ళే ముందు నర్స్ రాపేని తీసుకురా. ఆమెకు నీ తల్లిని దగ్గరుండి చూసుకోమని చెప్పి అప్పుడు కదులు. నా మాట వింటావా లేదా? నీకు మాత్రం ఇలాంటి పరిస్థితి రాదా? అప్పుడు కుక్కకన్నా హీనంగా చస్తావు. వింటున్నావా?’’సన్నటి పొడుగాటి ఆ రైతు చిన్న చిన్న అడుగులు వేస్తూ వెనకాముందు ఆడాడు. నిర్ణయం తీసుకోలేక తర్జనభర్జనపడ్డాడు. ఓ పక్క డాక్టరు అంటే భయం. మరో పక్క డబ్బులు వృధా అయిపోయే పరిస్థితి. స్వతహాగా రూపాయి రూపాయి కూడబెట్టడాన్ని ఎంతో ఇష్టపడే పొదుపరి. వెనుకాడాడు. లెక్కలు కట్టాడు.తడబడుతూ మాట్లాడాడు – ‘‘ఆమె ఎంత తీసుకుంటుంది?’’ అన్నాడు.‘‘నాకేం తెలుసు? ఆమెతోనే మాట్లాడుకో! కానీ చెప్తున్నా. గంటలో ఆమె ఇక్కడుండాలి.’’రైతు ఒక నిర్ణయానికి వచ్చాడు.‘‘కోప్పడకండి డాక్టరుగారూ. నేనే వెళ్ళి తీసుకొస్తాలెండి.’’ అన్నాడు. డాక్టరు వెళ్ళిపోయాక రైతు తన తల్లి వైపు తిరిగి తప్పదని ధ్వనిస్తున్న గొంతుతో – ‘‘నేను వెళ్ళి రాపేని పిల్చుకొస్తాను. ఖంగారు పడకు’’ అని బయల్దేరాడు.లా రాపే ముసల్ది. బట్టలు వుతకడం ఆమె వృత్తి. ఆ చుట్టుపక్కల ఎంతో మంది చావుల్ని చూసింది. వాళ్ళు చనిపోతుండగా చూసింది. తెల్లటి గుడ్డలో వాళ్ళను చుట్టిపెట్టి, తిరిగిరాని లోకాలకు పంపించేదాకా వెంటే వుంది. అది అయిపోగానే బతికున్నవాళ్ళ గుడ్డల్ని ఇస్త్రీ చేసే పని చేసుకునేది.ఆమె ఎవరిమీదో విరోధమున్నట్లు, ఇంకెవరినో చూసి అసూయపడుతున్నట్లు వుంటుంది. డబ్బు ఆశ. చనిపోయేవాళ్ళ యాతన చూడటం అంటే ఆమెకు ఒక పైశాచిక ఆనందం వున్నట్లు అందరూ అనుకుంటారు. హాన్రే బాన్టెంప్స్ ఆమె ఇంట్లో అడుగుపెట్టేసరికి ఆమె బట్టలకోసం గంజి తయారుచేస్తూ వుంది. ‘‘ఏమ్మా రాపే? ఏంటి విశేషాలు?’’ అన్నాడు పలకరిస్తూ. ఆమె తల వెనక్కి తిప్పి అతన్ని చూసింది.‘‘ఏముంటాయి. అంతా మాములే. నీ సంగతులు చెప్పు’’ అంది. ‘‘నేనా? నాకేం? నేను బాగానే వున్నాను. మా అమ్మ ఆరోగ్యమే సరిగాలేదు’’‘‘మీ అమ్మా?’’‘‘అవును మా అమ్మే’’‘‘ఏమైందామెకి?’’ ‘‘ఏముంది. అంతా అయిపోయింది. చావడానికి సిద్ధంగా వుంది’’ ‘‘అయ్యో మరీ అంత దారుణంగా వుందా?’’ ముసలామె గంజి కలుపుతున్న నీటిలో నుంచి చేతులు బయటికి తీసి జాలిగా అడిగింది. ‘‘డాక్టరు రేపు వుదయం దాకా కూడా వుండదేమో అన్నాడు’’‘‘అయ్యో! అయితే పరిస్థితి అసలు బాలేదన్నమాట’’హాన్రే కాస్సేపు తటపటాయించాడు. కాసేపటికి విషయంలోకి రాక తప్పలేదు. ‘‘ఆమె వెళ్ళిపోయేదాకా ఆమెతో వుండాలి. ఎంత తీసుకుంటావు? నేనేం డబ్బులున్నవాణ్ణి కాదు. కనీసం పనిమనిషిని పెట్టుకునే స్థోమత కూడా లేదు. అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా అదే!’’.అవన్నీ పట్టనట్లు అతనివైపు చూసింది రాపే. ‘‘రెండు రేట్లు వున్నాయి. పగటిపూట నలభై సౌలు, రాత్రికి మూడు ఫ్రాంకులు. ఈ రేటు డబ్బు వున్నవాళ్ళకి. ఇరవై సౌలు పగటికి, నలభై రాత్రికి ఇది మిగతావాళ్ళకి రేటు. నువ్వు కూడా ఇరవై, నలభై ఇవ్వు’’ అంది.రైతు ఆలోచించాడు. తన తల్లి గురించి తనకు బాగా తెలుసు. ఆమె పట్టు పట్టిందంటే వదిలే రకం కాదు. ఎప్పుడూ తలవంచిన ఘటం కాదు.డాక్టర్లు ఎన్ని చెప్పినాకనీసం ఇంకో వారం బండి లాగేయ్యగలదు. ఇదంతా ఆలోచించుకోని అతను ఆమెతో కొత్త ప్రతిపాదన పెట్టాడు. ‘‘అలా కాదు. నువ్వు ఆమె చనిపోయేదాకా ఆమెకు సేవ చెయ్యాలి.మొత్తానికి కలిపి ఇప్పుడే ఒక రేటు అనేసుకుందాం. ఎలా జరిగినా సరే! డాక్టర్లేమో ఇవాళో రేపో అంటున్నారు. అలా జరిగితే నీకే లాభం, నాకు నష్టం. అలా కాకుండా ఆమె తట్టుకోని నిలబడిందనుకో నీకు నష్టం, నాకు లాభం.’’నర్స్ ఆ మనిషి వైపు ఆశ్చర్యంగా చూసింది. చావుతో పందేలు వేయడం ఆమెకు కొత్త. అంచేత కాస్త తటపటాయించింది. నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం వుందని అనిపించింది. ఇంతలో వచ్చినవాడు ఏదైనా మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు అనుకుంది. ‘‘మీ అమ్మను చూస్తేగానీ నేను ఏ విషయం చెప్పలేను’’ అంది. వెంటనే చేతులు కడుక్కొని, అతని వెంటే బయల్దేరింది. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇద్దరూ. ఇంటికి చేరుకున్నాక హోన్రే సన్నగా గొణిగాడు – ‘‘ఈపాటికే అంతా అయి పోయిందేమో’’. అలా జరిగి వుంటే బాగుండు నన్న కోరిక అతని గొంతులో అస్పష్టంగా వినిపించింది.లోపల ముసలామె బతికేవుంది. ఆ దరిద్రపు మంచం మీద అలాగే వెల్లకిలా పడుకొని వుంది. దాదాపు నూరు సంవత్సరాల జీవితంలో ఆమె సాధించినవాటన్నింటికీ ఇప్పుడు అలిసిపోయినట్లు పడివుంది. రాపే మంచం దగ్గరకు వెళ్ళి చావటానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసింది. ఆమె నాడి పరిశీలించి, గుండె పైన చిన్నగా తట్టింది. ఆమె శ్వాస విని, కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించింది. అలా కొంతసేపు పరిశీలించిన తరువాత ఆ గదిలో నుంచి బయటకు నడిచింది. ఆమె వెంటే అతను కూడా కదిలాడు. ఆ ముసలామెకి ఆ రాత్రి గడిస్తే గొప్ప అని అనుకుంది రాపే.‘‘ఏమంటారు’’ అడిగాడతను. ‘‘బహుశా రెండురోజులు వుంటుందేమో! మహా అయితే మూడు అంతే. నాకు మొత్తం అన్నీ కలిపి ఆరు ఫ్రాంకులు ఇవ్వు చాలు’’ అంది. ‘‘ఆరు ఫ్రాంకులా? ఆరు ఫ్రాంకులు!’’ అంటూ అరవడం మొదలుపెట్టాడు. ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్తున్నాను కదా! ఆమె ఓ ఐదారు గంటలకన్నా బతకదని.’’ఇద్దరి మధ్యా తీవ్రమైన వాదన జరిగింది. ఆమె ఇంటికి వెళ్ళాలి కాబట్టి త్వరగా తేల్చమంది.ఇతనికి కూడా పొలానికి వెళ్ళకపోతే గోధుమల పనికాదని తెలుసు. చివరికి ఆమె చెప్పిన రేటుకే అంగీకరించాడు. అతను అంగలు వేసుకుంటూ ఎండకు గోధుమలు ఆరబెట్టిన పొలానికి వెళ్ళిపోయాడు. ఆమె ఇంట్లోకి నడిచింది. ఆమె ఎప్పుడూ తనతో పాటు ఏదో ఒక పని తెచ్చుకుంటుంది. చనిపోతున్నవాళ్ళ పక్కనే తనపని కూడా చేసుకుంటూ కూర్చుంటుంది. ఒకసారి తన పని చేసుకుంటే, ఒకసారి తనని నియమించుకున్న కుటుంబానికి పని చేసేది. ఒకసారి పనికి కుదిరాక ఎంత పనైనా చేసేస్తుంది.ఉన్నట్టుండి ఆమెకు ఏదో జ్ఞాపకం వచ్చింది.‘‘నీ గొంతులో ఎవరైనా కాసిని పవిత్రజలం పోశారామ్మా?’’ అంది.ముసలామె లేదన్నట్లు తలాడించింది. రాపే కాస్త భయం భక్తి వున్న మనిషే. అందుకే ఆ సమాధానం విని వెంటనే లేచి నిలబడింది. ‘‘భగవంతుడా! అలా ఎలా జరిగింది. వుండు నేను ఇప్పుడే వెళ్ళి నీకు పవిత్రజలం పోసే ఏర్పాటు చేస్తాను’’ అంటూ పాస్టరు ఇంటికి పరుగులుపెట్టింది. ఆమె ఉరుకులు చూసి వీధుల్లో వుండే జులాయివాళ్ళంతా ఏదో ప్రమాదం జరిగిందేమో అనుకున్నారు.ఫాదరు వెంటనే తన తెల్లగౌను వేసుకొని ఆమె వెంట బయల్దేరాడు. అతనితో పాటే చర్చిలో కాయిర్ నిర్వహించే బృందంలో పిల్లవాడు కూడా వచ్చాడు. వీళ్ళంతా ఇలా నడుస్తుంటే హోన్రే దూరం నుంచి చూసి, ‘‘పాస్టరుగారు ఎక్కడికి వెళ్తున్నారో’’ అన్నాడు. అతనికన్నా తెలివైన మరో మనిషి సమాధానమిచ్చాడు – ‘‘ఇంకెక్కడికీ! అదిగో ఆయన మీ అమ్మకోసమే పవిత్రజలం తీసుకెళ్తున్నాడు’’. హోన్రే ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. పైగా ‘‘అంతే అయ్యుంటుందిలే’’ అని తన పనిలో నిమగ్నమైపోయాడు.అతని తల్లి పాస్టరు ముందు తన తప్పులన్నీ చెప్పి క్షమాపణలు అడిగింది. స్వచ్ఛతను, శాంతిని పొందింది. ఆ తరువాత పాస్టరు వెళ్ళిపోయాడు. ఇరుకు గదిలో ఇద్దరే మిగిలారు. చావడానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసి ఇంకా ఎంతకాలం ఇలా ఆయిష్షుని సాగదీస్తుందో అని ఆలోచిస్తోంది రాపే. కృష్ణపక్ష రోజులు కావటంతో గాలులు వీచడం మొదలైంది. గోడకు వేలాడదీసిన కేలండర్ టపటపమని కొట్టుకుంటోంది. ఒకప్పుడు తెల్లగా వుండి ఇప్పుడు పచ్చగా మారిన కర్టెన్లు గాలికి ముసలి ప్రాణంలాగే ఎగిరిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి.మంచంలో కదలకుండా, కళ్ళు మాత్రం తెరిచి మనసులో ఏ భావం లేకుండా చావుకోసం ఆమె ఎదురుచూస్తున్నట్లుంది. వచ్చినట్లే వచ్చి రాకుండాపోతున్న మృత్యువు ఆమెతో ఆటలాడుతోంది. భారంగా తీస్తున్న ఊపిరి ఆమె నోటినుంచి సన్నటి ఈలలా వస్తోంది. ఆ శబ్దం ఏ క్షణంలోనైనా ఆగిపోతుంది. ఈ భూమి మీద మరో ఆడమనిషి తగ్గిపోతుంది. అలా జరిగినా ఎవరికీ పెద్ద బాధ కలిగేలా లేదు. పొద్దుగుంకుతుండగా హాన్రే తిరిగి వచ్చి నేరుగా ఆమె మంచం దగ్గరకు వెళ్ళి ఆమె ఇంకా ప్రాణాలతోనే వుందని తెలుసుకున్నాడు.‘‘ఎలా వుంది’’ అన్నాడు అక్కడికి ఆమెకి ఏదో తగ్గిపోయే అనారోగ్యం వున్నట్లు. ఆ తరువాత రాపేని వెళ్ళిపొమ్మని చెప్పాడు. ‘‘రేపు ఉదయం ఐదుగంటలకి వచ్చేసెయ్’’ అన్నాడు.‘‘అలాగే. ఐదుకే వస్తాను’’ అన్నదామె.తెల్లవారుతుండగా ఆమె ఆ ఇంటికి వచ్చేసరికి హాన్రే సూప్ తయారు చేసుకొని తాగుతూ కనిపించాడు.‘‘మీ అమ్మ చనిపోయిందా లేదా?’’ అడిగిందామె.‘‘లేదు. కాస్త కుదుటపడినట్లు వుంది’’ అంటూ సమాధానం చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు రాపే వైపు కనుచివర్ల నుంచి దొంగచూపు చూశాడు. ఆ తరువాత లేచి పనికి వెళ్ళిపోయాడు. రాపే ఆందోళనగా చావుబతుకుల్లో వున్న ముసలామె దగ్గరకు వెళ్ళింది. ఆమె అలాగే వుంది. కదలకుండా కళ్ళు మాత్రం తెరిచి, చేతులతో మంచాన్ని బలంగా పట్టుకొని వుంది. ఇది ఇలాగే సాగితే ఆమె ఇంకో రెండు రోజులో, నాలుగు రోజులో బతకచ్చు. ఎనిమిది రోజులు కూడా పట్టచ్చు. అసలే అత్యాశ వున్న ఆమెకు మోసపోయానేమోనన్న భయం కలిగింది. జిత్తులమారి రైతుమీద, చావడానికి సిద్ధంగా లేని అతని తల్లిపైనా చాలా కోపం వచ్చింది.అయినా సరే ఆమె తన పని మానుకోలేదు. అన్ని సేవలు చేసి ముడతలు పడ్డ ముసలామె ముఖాన్నే చూస్తూ ఎదురుచూసింది. కాస్సేపటికి టిఫిన్ చెయ్యడానికి తిరిగివచ్చిన హాన్రే సంతోషంగానూ, తృప్తిగానూ వున్నట్లు ప్రవర్తించాడు. కాస్త పరిహాసంతో కూడిన చణుకులు విసిరాడు.అతని గోధుమపంట సకాలంలో చేతికి వచ్చిన ఆనందం అతని మాటల్లో వుంది. రాపేలో అసహనం పెరిగిపోయింది. గడుస్తున్న ప్రతి నిమిషం ఆమె నుంచి సమయాన్ని, డబ్బుని దొంగిలిస్తున్నట్లుగా అనిపించసాగింది. ఆమెలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈ రోగిష్టిదాన్ని, దిక్కుమాలిన పక్షిని, లేకుండా చేస్తే? తన డబ్బుని తనకి కాకుండా చేస్తున్న ఆ ఎగశ్వాసని అసలు లేకుండా చేస్తే? ఆమె గొంతుని నులిమేస్తే? అంతలోనే అలా చేయడంలో వున్న సమస్యలను తలచుకుంది. మరో రకంగా పథకం వెయ్యసాగింది. మంచం దగ్గరగా వెళ్ళి –‘‘మీరెప్పుడైనా మృత్యుభూతాన్ని చూశారా?’’ అంది.‘‘లేదు’’ అని ముసలామె సమాధానం చెప్పింది. ఇక అక్కడ్నుంచి నర్స్ ఆమెకు మృత్యుభూతం గురించి భయపెట్టేలా చెప్పడం మొదలుపెట్టింది. చావుబతుకుల్లో వున్న ముసలామె బలహీనమైన మనసును భయంతో వణికించేసింది. చావడానికి కొన్ని నిమిషాల ముందు ఓ భూతం కనిపిస్తుందనీ, మరణయాతన నుంచి ఆ భూతం విముక్తిని ఇస్తుందని చెప్పింది. ఆ భూతం చేతిలో ఓ చీపురు వుంటుందనీ, తలపైన కవచం వుంటుందనీ, భయంకరమైన అరుపులు అరుస్తుందని చెప్పింది.‘‘ఒక్కసారి ఆ మృత్యుభూతాన్ని చూస్తే ఇక అంతా అయిపోయినట్లే. కొన్ని నెలల ఆయుష్షు వున్నవాళ్ళు కూడా ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తారు’’ అంటూ తన అనుభవంలో చివరి క్షణాలలో భూతాన్ని చూసిన వాళ్ళు అంటూ చాలామంది పేర్లు చెప్పింది.ముసలామెకి అదంతా విని భయంగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. అసహనంగా కదిలి అతి కష్టం మీద తలని రెండో వైపుకు తిప్పుకుంది. అదే అదనుగా రాపే అక్కడ్నుంచి తప్పుకుంది. కబోర్డ్ దగ్గర వున్న ఓ పెద్ద గుడ్డని తీసి తన చుట్టూ చుట్టుకుంది. ఇనుప మూకుడు ఒకటి తీసుకుని తలపైన బోర్లించుకుంది. దాని కాడలు కొమ్ముల్లా కనపడేట్లు పెట్టుకుంది. ఒక చేతిలో చీపురు తీసుకుని, మరో చేతితో ఇంకో గిన్నని పట్టుకుంది. ఉన్నట్టుండి ఆ గిన్నెని నేల మీదకు విసిరికొట్టింది.అది నేల తాకుతూనే పెద్ద శబ్దం చేసింది. ఆ తరువాత ఆమె కుర్చీ పైకి ఎక్కి, మంచానికి కట్టిన తెరని కిందనుంచి పైకి ఎత్తి ఒక్కసారిగా తన ముఖాన్ని ముసలామెకు చూపించింది. చేతులు భయం కలిగించేలా తిప్పుతూ, కీచు గొంతుతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ముఖం కనపడకుండా కప్పుకున్న మూకుడులో ఆ అరుపులు ప్రతిధ్వనించి ఇంకా భయంకరంగా వినపడసాగాయి. భయంతో బిక్కచచ్చిన ముసలామెని చీపురుతో తడుతూ ఇంకా బెదరకొట్టింది. అదిరిపోయిందామె. ఆమె ముఖం పిచ్చిపట్టినట్లుగా మారిపోయింది. చావడానికి సిద్ధంగా వున్న ఆమెలో ఏదో చిత్రమైన శక్తి ప్రవేశించినట్లు బలమంతా కూడదీసుకొని లేచి పారిపోవాలని ప్రయత్నం చేసింది.భుజాలు, సగం శరీరం పైకి లేపింది కూడా. అంతే! ఒక్కసారి గట్టిగా నిట్టూరుస్తూ వెనక్కిపడిపోయింది. అయిపోయింది.రాపే ఏమీ ఎరగనట్లు ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసింది. చీపురు మూల పెట్టేసింది, కప్పుకున్న గుడ్డ మళ్ళీ కబోర్డ్‌లో పెట్టేసింది. మూకుడు, గిన్నెలను గట్టుపైన, కుర్చీని గోడవారగా సర్దేసింది. ఆ తరువాత అనుభవం నేర్పిన చాకచక్యంతో చనిపోయిన ముసలామె పెద్ద కళ్ళను మూసేసింది. ఓ ప్లేటు మంచం మీద పెట్టి అందులో కాసింత పవిత్రజలం పోసింది. ఆ తరువాత మంచం పక్కనే మోకరిల్లి, ఎంతో కాలంగా చదివి చదివి నోటికి వచ్చేసిన ప్రార్థనలన్నీ చదివింది.హాన్రే సాయంత్రం తిరిగి వచ్చేసరికి ప్రార్థనలు చేస్తున్న రాపేను చూశాడు. వెంటనే లెక్కలు వేసి ఆమెకు ఇరవై సౌలు లాభం వచ్చిందని గుర్తించాడు. ఆమె గడిపిన రెండు రోజులు, ఒక రాత్రికి అయిదు ఫ్రాంకులే అయ్యేది కానీ ఒప్పందం ప్రకారం ఆరు ఫ్రాంకులు ఇవ్వాల్సివస్తోందని నష్టం లెక్క వేసుకున్నాడు. ఫ్రెంచి మూలం : గి ది మొపాసా అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్ -
మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్
హైదరాబాద్: తైవాన్‌కు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ కొత్తగా మార్కెట్లోకి డిజైర్ 12, డిజైర్ 12 ప్లస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.15,800, రూ.19,790గా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి హెచ్‌టీసీ ఈ–స్టోర్‌లోనే లభ్యమవుతాయని.. ఈనెల 11 నుంచి అన్ని రిటైల్ స్టోర్లలోను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. 18:9 ఫుల్‌స్క్రీన్, రెండు కెమెరాలు ఈ ఫోన్లలో ఉన్నాయి. -
హెచ్‌టీసీ డిజైర్‌లో కొత్త స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: తైవాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ బుధవారం రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. డిజైర్ సిరీస్‌లో హెచ్‌టీసీ డిజైర్ 12, హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ డివైస్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. హెచ్‌టీసీ డిజైర్ 12 ధరను 15,800 రూపాయలుగానూ, హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ధరను 19,790గా ను నిర్ణయించింది. గురువారం నుంచి ప్రీ ఆర్డర్లను ప్రారంభించనుంది. జూన్ 11 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మొదలుకానున్నాయి. 18.9 యాస్పెక్ట్ రేషియో, ఎడ్జ్ టూఎడ్జ్ డిస్ప్లే తమ నూతన స్మార్ట్ఫోన్ల సొంతమనికంపెనీ చెబుతోంది. హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ఫీచర్లు 6అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ డిస్ప్లే క్వాల్కం స్నాప్ డ్రాగన 450 ఎస్వోసీ ప్రాసెసర్ 720x1440 రిజల్యూషన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 2965 ఎంఏహెచ్ బ్యాటరీ హెచ్‌టీసీ డిజైర్ 12 ఫీచర్లు 5.5 అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ మీడియా టెక్ ఎంటీ 6739 క్వాడ్ కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 2టీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2,730 ఎంఏహెచ్ బ్యాటరీ -
మళ్లీ ‘ఆల్టో’కే అగ్రస్థానం
న్యూఢిల్లీ: డిజైర్‌కు ఆల్టో చెక్ పెట్టింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో డిజైర్ వాహనమే టాప్–సెల్లింగ్ ప్యాసింజర్ మోడల్‌గా అవతరిస్తూ వచ్చింది. కానీ అక్టోబర్‌లో మళ్లీ ఆల్టోనే అగ్రస్థానాన్ని దక్కించుకుంది. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన ఆల్టో వాహన విక్రయాలు 19,447 యూనిట్లుగా ఉన్నాయి. డిజైర్ వాహన అమ్మకాలు 17,447 యూనిట్లుగా నమోదయ్యాయి. డిజైర్ రెండో స్థానంలో నిలిచింది. మారుతీ బాలెనో 14,532 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నాల్గో స్థానంలో ఉంది. దీని అమ్మకాలు 14,417 యూనిటు. ఇక వేగనార్, సెలెరియో, స్విఫ్ట్ విటారా బ్రెజా, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, క్రెటా తర్వాత స్థానాల్లో నిలిచాయి. టాప్–10 సెల్లింగ్ ప్యాసింజర్ వాహనాల్లో మారుతీవే ఏడు మోడళ్లు ఉన్నాయి. -
అత్యాశ పడ్డారా... అంతే సంగతులు!
ఆత్మీయం జజీవితంలో మనం అనేకరకాలైన కోరికలను కోరుకోవడం, అది కావాలి, ఇది కావాలి అని ఆశపడటం, చివరకు అవి లభించకపోతే నిరాశకు లోనవడం చాలామందికి ఎదురయ్యే అనుభవమే. అయితే బతికినంతకాలం సుఖంగా జీవించాలంటే నిరాశను జయించడం నేర్చుకోవలసిందే. దానికి ముందు అసలు మనం ఏమి కోరికలు కోరుకుంటున్నాం? అవి తీరగలిగేవా కావా? మనం దేనిని ఆశిస్తున్నాం? అది మనకు సాధ్యమయ్యేదా కాదా? అని ఆలోచించాలి, పగటికలలు కనడం మాని ప్రాక్టికల్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం నిరాశకు లోను కాకుండా ఉండటం తగ్గుతుంది. ఉదాహరణకు మండుటెడారిలో గులాబీలు గుబాళించాలని కోరుకోవడం, పళ్లు గిట్టకరిచే చలికాలంలో మామిడిపళ్లు తినాలని తహతహలాడటం, చిన్నపాటి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నవాడు ఒక్కసారిగా నగరం నడిబొడ్డున అతి ఖరీదైన ప్రాంతంలో డ్యూప్లెక్ హౌస్‌లోకి మారాలనుకోవడం అలాంటివన్నమాట. వీటినే ఓ శతక కారుడు ఇసుకనుంచి తైలాన్ని తియ్యాలనుకోవడంతో పోల్చి చెప్పాడు. అటువంటి దుస్సాధ్యమైన కోరికలను, ఆలోచనలను మనసులోకి రానివ్వనే కూడదు. అయితే ఆశ అనేదే లేకపోతే... కోరికలేమీ కోరుకోకపోతే... అటువంటి స్థితి మామూలు మనుషులకు అసాధ్యం. అందువల్ల నిరాశను మనం ఉన్నతస్థానానికి ఎదగడానికి భగవంతుడిచ్చిన సదవకాశంగా భావించి, దానినే ఆయుధంగా మలుచుకోవాలి. ఆశకు, అత్యాశకు మధ్య తేడాను తెలుసుకోవాలి. ఆశపడటం తప్పు కాదు కానీ, అత్యాశ ఉంటే మాత్రం ముందుగా నిరాశకు లోనవడం, ఆ తర్వాత కుంగుబాటు అంటే డిప్రెషన్లు... ఆ తర్వాత హాస్పిటళ్ల చుట్టూ తిరగడం తప్పదు. -
కోరికలే గుర్రాలైతే... ఆత్మలు సవారీ చేయవూ?
ఇప్పటిదాకా ఉన్న అన్ని రూల్సూ బ్రేక్ అయిపోతున్నాయా? జన్మకు సార్థకత ఉంటుందనేది ఇప్పటి దాకా రూల్. కాదు బిలీఫ్.. నమ్మకం. అంటే ఈ లైఫ్‌లో బాగా జీవిస్తే మరో లైఫ్‌లో మంచి జన్మ దొరుకుతుందని. అంతకంటే బాగా జీవిస్తే అసలు జన్మే ఉండదని. దాన్నే ‘మోక్షం’ అంటారు. వీటన్నిటినీ తిరగరాస్తున్న కొత్త ఆలోచన ఇది. ఈ జన్మ మన పూర్వజన్మ కోరిక. ఎక్కడ పుట్టాలి? ఎవర్ని చేసుకోవాలి? ఎవర్ని కనాలి? ఎలా అస్తమించాలి? ఈ మొత్తం ప్రాసెస్ ఒక పాఠం. కాదు.. కాదు.. ఎన్నో పాఠాల... ఒక పుస్తకం. అంటే.. ఈ జీవితాన్ని మనం ఎంచుకున్నది నేర్చుకోడానికి. కష్టాన్ని కౌగలించుకోడానికి. ఛాలెంజ్‌ని అర్థం చేసుకోడానికి. మర్మాన్ని విడమర్చుకోడానికి. మనం ఇలా, ఇక్కడ ఉన్నామంటే అదొక ఆక్సిడెంట్ కాదు. లైఫ్ ఈజ్ ఎ సోల్ ప్లాన్. అదొక ప్రణాళిక. కమాన్. లెటజ్ లివ్. లెటజ్ లెర్న్. లివ్ హ్యాపీ. డోన్ట్ వర్రీ. కోరికలు గుర్రాలైతే ఆత్మలు సవారీ చేస్తాయి. కాదా మరి? ‘‘హలో.. శేఖర్! కరెక్ట్ టైమ్‌కి ఫోన్ చేశావురా, ఆఫీసుకు స్టార్ట్ అవుతున్నా. ఈ రోజు ఆఫీసులో ప్రెజెంటేషన్ ఫైల్ అంతా రెడీ! ఈ సారి ఎలాగైనా ప్రమోషన్ నాదేరా, ఇది జరిగి తీరుతుంది చూడు. మనం ఎదిగితేనే కదా, పిల్లలక్కూడా మంచి లైఫ్‌ని ఇవ్వగలం..’’ ఫ్రెండ్ శేఖర్‌తో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు వెంకట్ కృష్ణ. భార్య లక్ష్మి చూసి చూసి ‘‘ఏమండీ, అత్తయ్య ఫోన్ చేశారు. ఓసారి వెళ్లి వాళ్లను చూసి... ’’ ఫోన్ మాట్లాడుతున్న వెంకట్ ఆమె మాటలను చేత్తోనే వారించాడు ... తర్వాత అంటూ! ‘ఫ్రెండ్స్‌తో అయితే గంటలు గంటలు టైముంటుంది. ఇంటి విషయం ఏదైనా చెబితే మాత్రం అడ్డుపడుతున్నట్టు ఉంటుంది’ మనసులోనే గొణుక్కుంటూ పిల్లలను స్కూల్‌కి రెడీ చేసింది. భార్య మొహం ముడుచుకుని ఉండటం చూసిన వెంకట్æ‘‘ఏంటిది, ఆఫీసుకు వెళుతున్నప్పుడు కాస్త నవ్వు మొహం పెట్టుకోవాలనీ ఉండదా నీకు’’ విసుగ్గా అన్నాడు వెంకట్. ‘‘అది కాదండీ, పాపం అత్తయ్య మామయ్య ఆ ఊళ్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో. పొద్దున్నే ఫోన్ చేశారు అత్తయ్య. వాళ్లకసలే ఒంట్లో బాగుండదు. అక్కడే సౌకర్యాలు ఉండవు. ఇక్కడకు తీసుకువద్దామంటే మీరు వినిపించుకోరు. వాళ్లు లేని లోటు ఉన్నప్పుడు తెలియదండి. మా అమ్మానాన్నంటే నా చిన్నప్పుడే చనిపోయారు. పెళ్లి చూపులప్పుడు అత్తయ్య నన్ను చూసి ‘మహలక్ష్మిలా ఉన్నావురా! ఈ రోజు నుంచి అమ్మ లేదని బాధపడకు. నేనున్నాను’ అన్నారు. ఎంత సంతోషమేసిందో. కానీ, కూతురిలా ఆమెను చూసుకోలేకపోతున్నాను. ఈ వయసులో మనం కాకపోతే వారిని ఇంకెవరు చూసుకుంటారు...’ చెబుతూనే ఉన్న లక్ష్మి మాటలకు అడ్డుపడుతూ ‘‘ఆపుతావా! నీ సెంటిమెంట్ల గోల. వాళ్లు ఊర్లో ఉంటేనే సంతోషంగా ఉంటారు. అక్కడైతేనే అందరూ ఉంటారు. ఇక్కడుంటే అస్తమానూ నసగా ఉంటుంది. పైగా పెద్ద ఇల్లు తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. అవన్నీ తట్టుకోగలమా!’’ సలహాలు ఇవ్వడం మానుకొని నీ పని చూసుకో టిఫిన్ బాక్స్ తీసుకొని హడావిడిగా వెళ్లిపోయాడు వెంకట్. భవిష్యత్తు ఏమిటి? ‘‘ఈ ప్రకారంగా.. ఇప్పుటి యూత్‌ని అట్రాక్ట్ చేస్తే బిజినెస్ డబల్ కాదు త్రిబుల్ అవ్వడం గ్యారెంటీ సార్! ఫ్రెండ్షిప్ డే, లవర్స్ డే, యూత్ డే.. మన గిఫ్ట్ కంపెనీకి వీళ్లు మంచి మార్కెట్.. ’’ మీటింగ్ హాల్లో వెంకట్‌కృష్ణ తన ప్రెజెంటేషన్ పూర్తి చేయగానే అక్కడున్న వారంతా కరతాళ ధ్వనులతో అభినందించారు. అందరివైపు గర్వంగా చూసిన వెంకట్ బాస్ ముఖంలో ఏ భావం కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. బాస్ శంకర్రావు మౌనంగా ఉండటంతో మిగతా అందరి నోళ్లు మూతపడ్డాయి. ఏడుపదుల వయసు దాటిన శంకర్రావ్ సీరియస్‌గా ‘‘వెంకట్.. నీ ప్రెజెంటేషన్‌లో ఓ లోపం ఉంది. అదేంటో నీకు తెలుసా! ఫ్యామిలీ మిస్ అవడం. యూత్ బిజినెస్.. గురించి నువ్వు చెప్పింది ఈ కొద్ది రోజుల వరకే. నాకు నా కంపెనీ భవిష్యత్తు కావాలి. తల్లిదండ్రులు, పిల్లలు, నానమ్మ తాతయ్యలు.. కుటుంబంలోని ఈ రిలేషన్స్ గురించి నీ ప్రెజెంటేషన్‌లో లేదు. మనం చేసే పనిలో మనదేశపు విలువలు కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. మన దేశపు ప్రాచీన సంపదైన వేదాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రం, ఆత్మీయ అనుబంధాలలోని గొప్పదనం కోసం జర్మనీ, రష్యా, ఈజిప్ట్, టిబెటన్.. వంటì ఎన్నో దేశాలు మన వైపు చూస్తున్నాయి. పరిశోధనలు చేస్తున్నాయి. వాళ్లు మన నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనం మన మూలాలు మర్చిపోతే ఎలా?! ఇలాగైతే ముందుతరాలకు ఏం మిగులుస్తాం మరోసారి ట్రై చేయి. ఈ సెషన్ వేస్ట్’’ అంటూ అక్కణ్ణుంచి వెళ్లిపోయారు శంకర్రావు. థెరపీతో ఆత్మ చైతన్య వృద్ధి నేను పై చదువులకు పట్నం వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఆరోగ్యం బాగోలేదు. బెంగుళూరులో టాప్ టెన్ కంపెనీలో మంచి పోస్ట్‌కి సెలక్ట్ అయ్యాను. కానీ, ఆ సమయంలో నాన్నకు హార్ట్ ఆపరేషన్. నాతో చదువుకున్నవాళ్లు నాకన్నా మంచి హోదాలో ఉన్నారిప్పుడు. ఈ రోజు ఉదయం ఆఫీసులో ప్రెజెంటేషన్‌కి వెళుతుంటే అమ్మ ఏదో ప్రాబ్లమ్ అంటూ ఫోన్. ఇరవై ఏళ్లుగా నా ప్రతీ ఎదుగుదలకు ఏదో విధంగా అమ్మనాన్నలు అడ్డుపడుతూనే ఉంటున్నారు. నేను నా ఉన్నతి గురించి ఆలోచిస్తున్నాను. నా భార్య, నా బాస్ తల్లిదండ్రులు వారి గొప్పతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. నాకిది చాలా చిరాకుగా ఉంటోంది..’ అన్నాడు వెంకట్. ‘‘మీ తల్లిదండ్రులు మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారనేది మీ భావన. మీ జీవితంలో ఎందుకు వృద్ధి లేదో మీరే చూడండి’’ అన్నారు కౌన్సెలర్. థెరపీ మొదలయ్యింది. కళ్లు మూసుకొని ధ్యానముద్రలో కూర్చుకున్న వెంకట్‌కి మనోనేత్రంలో తన గత జీవితం 70 ఎమ్.ఎమ్ సినిమా దృశ్యంలా ఆవిషృతమైంది. ప్రస్తుతం నుంచి వెనక్కి ఆ ప్రయాణం సాగుతోంది. పెళ్లి, ఉద్యోగం, కాలేజీ రోజులు, బాల్యం.. అమ్మ గర్భంలో ఉన్న స్థితి.. అన్నీ దర్శిస్తున్నాడు. అక్కడ్నుంచి ఇంకా వెనక్కి వెళుతున్నాడు. టైమ్ మిషన్‌లో కాలాన్ని వెనక్కి తిప్పినట్టు సూక్ష్మ కాంతిగోళం నుంచి గత జన్మలోకి ప్రవేశించాడు. ఆ గత జన్మ గురించి వెంకట్ చెప్పడం మొదలు పెట్టాడు. ‘ఉద్యోగం కోసం విదేశాలలో నేను, తల్లిదండ్రులు ఊళ్లో. వృద్ధాప్యంలో వారు పడుతున్న అవస్థలను చూస్తున్నాను. తల్లిదండ్రి చనిపోయినప్పుడు కూడా నేను వారి దగ్గర లేను. చివరకు వారిని మట్టిచేసేటప్పుడు కూడా! వారికోసం దేశాలు దాటుకొని వచ్చేసరికి అంతా అయిపోయింది. ఎంతో ప్రేమగా జీవితమంతా కళ్లలో పెట్టుకుని నా కోసమే అన్నట్టు బతికిన నా తల్లిదండ్రులకు నేను ప్రేమను ఇవ్వలేకపోయాను. ఆ అపరాధ భావన నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ అనంతమైన ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవాలి. మళ్లీ జన్మ ఉంటే ఈ తల్లిదండ్రులకే పుట్టి, వాళ్లను ప్రేమగా చూసుకుంటాను. ఆనందాన్ని ఇస్తాను’ అనుకున్నాను. తల్లిదండ్రులే వంతెన లక్ష్మీ! నా ఫ్రెండ్ శేఖర్ ద్వారా గతజన్మ ప్రతిగమన చికిత్స తీసుకున్నాను. ఎందుకోసమైతే ఈ జన్మ తీసుకున్నానో ఆ విషయమే మర్చిపోయాను. నా ఎదుగుదలకు నా తల్లిదండ్రి అడ్డు అనుకున్నాను. కానీ, వాళ్లే నా జీవితానికి వంతెన అని గుర్తించలేకపోయాను. చేసిన తప్పునే మళ్లీ మళ్ళీ చేస్తున్నాను. ఇక అలా చేయను. తప్పు దిద్దుకొని మన పిల్లలకు ఓ మంచి కానుక ఇస్తాను. అదే తాతయ్యను నానమ్మను. అంటూ ఊరుకు ప్రయాణమయ్యాడు వెంకట్. తల్లీదండ్రి, భార్య, పిల్లలతో తన జీవితం నిండుగా ఉన్న ఆనందాన్ని పొందుతున్నాడు వెంకట్. ఆ సంతోషం, తృప్తి వెంకట్ పనిచేసే చోటా వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల్లోనూ తను ఏ ఉన్నతిని ఆశించాడో దానిని చేరుకున్నాడు. ఆత్మ వికాసం రంగులరాట్నంతో పోల్చవచ్చు. ఊర్ధ్వ్యలోకాలలో అంటే రాట్నం పై స్థాయిలో ఉన్నప్పుడు ఆత్మ జన్మ ఎంపిక ఉంటుంది. కిందకు వస్తున్న కొద్దీ పుట్టుకకు సంబంధించిన పాఠాన్ని నిర్ధారించుకుంటుంది. జన్మ తీసుకున్న తర్వాత తిరిగి పైకి వెళ్లడానికి అంటే వృద్ధి సాధించడానికి నిరంతర సాధన చేస్తుంటుంది. ఆత్మచైతన్యం చేసే సాహసోపేతమైన నిర్ణయాలన్నీ జ్ఞానం కోసమే. నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడుగ్గా... ఎలా పుట్టాలన్నది కూడా ఆత్మచైతన్యం నిర్ణయించుకున్నదాన్ని బట్టే ఉంటుంది. అవ్యాజమైన ప్రేమను పంచడానికే ఆత్మ జన్మలు తీసుకుంటుంది. మానసిక, శారీరక వికలాంగులుగా జన్మ తీసుకునే చైతన్యాలు ఆ కుటుంబాలలో ప్రేమను నేర్పడానికే! నేర్చుకోవడానికే ప్రయాణం ప్రతి ఒక్క ఆత్మచైతన్యం తను ఎందుకు జన్మ తీసుకోవాలో ముందు నిర్ణయించుకుంటుంది. అందుకు ఎలాంటి పాఠం నేర్చుకోవాలి, ఎలాంటి సవాళ్లను అధిగమించాలి, ఏ ప్రదేశంలో, ఏ కుటుంబంలో పుట్టాలి? .. అనేది ఈ ప్రణాళికలో భాగం. కానీ, ఒక్కసారి తల్లి గర్భంలో చేరిపోయాక ‘మాయ’ అనేది ఇనుప తెరలా అడ్డుపడిపోతుంది. అప్పుడు మరపు వచ్చేస్తుంది. దాంతో నేర్చుకోవాల్సిన పాఠాలను మధ్యలోనే ఆపేస్తాం. దీంతో ఆత్మ చైతన్యం వృద్ధి పొందదు. ఎరుకతో గ్రహించేలా ఉన్నతికి సాయం చేసేదే గత జన్మ ప్రతిగమన చికిత్స. – డాక్టర్ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్ ఆత్మ ప్రణాళికలో 7 సిద్ధాంతాలు 1. ఆత్మ చైతన్యం పొందడం 2. స్వీయ స్వేచ్ఛతో బుద్ధిని వికసింపజేసుకోవడం. 3. పునర్జన్మ ద్వారా పై లోకాలలో ఉండే ఏకత్వస్థితిని భూమండలంలో పొందగలగడం. 4. కర్త, క్రియలు కర్మకారణ శక్తికి దారి తీయడం. 5. ప్రతిజన్మలోనూ మంచి చెడులను తెలుసుకుంటూ పురోగమనిస్తూ ఉండటం. 6. పురోగమనాన్ని ఎరుకతో వేగవంతం చేసుకోవడం. అంటే, త్వరితంగా పాఠాలు నేర్చొకొని ముందుకు సాగడం. 7. మనమంతా విశ్వలోకం నుంచి వచ్చిన జీవాత్మలం. ఏకత్వంలోని ప్రేమతత్త్వాన్ని నింపుకొని చివరకు తిరిగి అక్కడకే చేరుకోవడం. – నిర్మల చిల్కమర్రి -
త్రిషకు ఆ కోరిక తీరేనా!
మనిషికి డబ్బు, ఆస్తి, అంతస్తు, కీర్తి, కనకం అంటూ అన్నీ ఉన్నా ఏదో వెలితి ఉంటుంది. ఇది నగ్న సత్యం. నటి త్రిష విషయానికొస్తే తనూ చాలా కాలంగా ఒక తీరని కోరిక వెంటాడుతోందట. ఎప్పటికైనా అది నెరవేరేనా అని ఆశతో ఎదురు చూస్తున్నారట. త్రిష నటిగా చాలానే సాధించారు. అధిక కాలం నాయకిగా కొనసాగుతున్న నటిగా రికార్డు సాధించారని చెప్పవచ్చు. త్రిషను కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకిగా పేర్కొనవచ్చు. విద్యను పూర్తి చేసిన తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత సినీరంగంలోకి వచ్చారు. తమిళంలో జోడి అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా చిన్న పాత్రతో నటిగా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం 1999లో తెరపైకి వచ్చింది. అంటే 17 ఏళ్లుగా నటిగా తన పయనం సాగుతోందన్న మాట. నాయకిగా సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంలో తెరపైకి వచ్చారు. ఈ చిత్రం 2002లో తెరపైకి వచ్చింది. ఆ తరువాత విక్రమ్, విజయ్, అజిత్, కమలహాసన్, శింబు, తెలుగులో చిరంజీవి నుంచి సిద్ధార్థ్ అంటూ అందరు ప్రముఖ కథానాయకులతోనూ నటించారు. అయితే నటిగా ఒకటిన్నర దశాబ్దం దాటినా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే అవకాశం వరించలేదు. ఇది బాధాకరమేనంటున్న త్రిష ఆ విషయం గురించి మాట్లాడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు అలాంటి కోరిక తనకు చాలా కాలంగా ఉందన్నారు. తాను 15 ఏళ్లుగా నాయకిగా కొనసాగుతున్నానంటున్నారని ఇంత కాలం నాయకిగా కొనసాగిన వారు లేరని అంటున్నారని అన్నారు. ఇది తాను అదృష్ణంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇంత కాలం నాయకిగా కొనసాగుతున్నా రజనీకాంత్‌కు జతగా నటించే అవకాశం రాకపోవడం తీరని లోటేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా ఇప్పుడు యువ నటులు విజయ్‌సేతుపతి, శివకార్తికేయన్ మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారని, వారితోనూ నటించాలని కోరుకుంటున్నానని త్రిష తన మనసులోని మాటను బయట పెట్టారు. త్వరలోనే ఈ అమ్మడు ఆశ తీరాలని కో రుకుందాం.. -
అధికారులూ.. ‘శివయ్య’ను పట్టించుకోండి
గణపురం: అందరి కోరికలు తీర్చే గణపేశ్వరుడికి వర్షంలో తడవడం తప్పడం లేదు. కాకతీయుల కళా వైభవానికి ప్రతీ కగా నిలిచిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అపురూప, అద్భుత శిల్పకళతో ఉట్టిపడుతున్న దేవాలయం వర్షం నీటిలో తడిసిపోతుంది. అధికారులకు పరిస్థితిని వివరించినా పట్టించుకున్న వారు లేరు. దేవాలయం పరిరక్షణ కమిటీ ప్రతి సంవత్సరం టార్ఫాలిన్ కవర్లు ఖరీదు చేసి దేవాలయం గోపురం పైన కప్పుతున్నారు. కేంద్ర పురావస్తు మంత్రిత్వశాఖ నుంచి రెండుకోట్ల 75లక్షల నిధులు మంజూరైన దేవాలయం పై కప్పును సవరించలేకపోయారు. మంజూరైన నిధులు మురిగిపోయాయి. రెండు సంవత్సరాల క్రితం అప్పటి పార్లమెంట్ సభ్యులు కడియం శ్రీహరి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి దేవాలయం పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు కదలలేదు. -
ఆయనే లేకపోతే నా కల నెరవేరేది కాదు
చెన్నై: భర్త ప్రోత్సాహం లేకపోతే తన కల నెరవేరేది కాదని కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ భార్య, 'మలై నేరత్తు మాయక్కం' చిత్ర దర్శకురాలు గీతాంజలి తెలిపింది. భర్త ప్రేరణ, మద్దతుతోనే తను మెగాఫోన్ పట్టానని ఆమె మురిసిపోతోంది. సెల్వ రాఘవన్ లేకపోతే తన చిరకాల కోరిక నెరవేరేది కాదని గీతాంజలి సంతోషాన్ని వ్యక్తం చేసింది. దర్శకురాలు కావాలని చిన్నప్పటి నుంచీ తాను కలలు కన్నానని, అయితే పెళ్లి, పాపకు జన్మనివ్వడంతో కొంతకాలం దానికి వాయిదా వేసినట్లు గీతాంజలి పేర్కొంది. అయితే పెళ్లయినంత మాత్రాన, అభిరుచులను పక్కనపెట్టాల్సిన అవసరం లేదని భర్త ఎపుడూ చెబుతూ ఉండేవారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టానన్నారు. మరోవైపు భర్త తనకు ఘోస్ట్ డైరెక్టర్‌గా పనిచేశాడన్న వార్తలను గీతాంజలి కొట్టి పారేసింది. ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఎంత కష్టపడ్డానో తనకు మాత్రమే తెలుసని, ఘోస్ట్ డైరెక్టర్ పేరుతో తానుపడ్డ శ్రమ అంతా వృధా కావడం, క్రెడిట్ అంతా భర్తకు పోవడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె వ్యాఖ్యానించింది. అయితే ఈ సినిమాకు తన భర్త స్ర్కిప్ట్ అందించడం గొప్ప విషయమని, సెల్వ రాఘవన్‌తో పెళ్లికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని వెల్లడించింది. కాగా 7/జి బృందావన కాలనీ సినిమా స్టోరీ నేపథ్యాన్నే తీసుకొని సరికొత్త కథను సిద్ధం చేశాడు రాఘవన్. 'మలై నేరత్తు మైకం' టైటిల్‌తో ఈ సినిమాకు గీతాంజలి దర్శకురాలిగా పరిచయం అవుతోంది. హీరోగా కోలా బాలకృష్ణ, హీరోయిన్గా వామిఖ కూడా వెండితెరపై మెరవబోతున్నారు. అమ్రిత్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికే పలువురిని ఆకట్టుకున్నాయి. హీరోయిన్ వామిఖ నటన అనుకున్నత స్థాయిలో లేకపోవడంతో... ఆమెపై షూటింగ్ స్పాట్లో సెల్వ రాఘవన్ చేయి చేసుకున్నాడనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
13కే పెళ్లి.. పద్నాలుగేళ్లకే పిల్లలు..?
ముంబై: పట్టుదల ఉంటే కొండనైనా పిండిచేయవచ్చని చెబుతుంటారు. ఆ పట్టుదలతోనే తన కలను నెరవేర్చుకున్న యువతి.. కాదు మహిళ ...కాదు కాదు. ఓ అమ్మ కథ. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన నీతూకి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు నెత్తిమీద పడినా ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. సాంప్రదాయ కుటుంబాల్లో ఉండే అన్ని అడ్డంకులను అధిగమించింది. చివరికి ప్రపంచ క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచింది. ఇంతకీ ఆమె ఏం చేసింది... రోహతక్ ట్రెయినింగ్ మ్యాట్ పై నీతూ (19) దేశంలోని సాధారణ క్రీడాకారిణి లాగానే కనిస్తుంది. కానీ ఆమె ప్రత్యేకతే వేరు. నీతూకి అతి చిన్న వయసులోనే (13 ఏళ్లు) పెళ్లయింది. ఇక పద్నాలుగేళ్లకే కవల పిల్లలకు తల్లయింది. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అయినా తనకి ఎంతో ఇష్టమైన రెజ్లింగ్ క్రీడను కెరీర్ గా ఎంచుకోవాలనుకుంది అయితే కుటుంబ సభ్యులు ఎవరూ అందుకు అంగీకరించలేదు. కానీ రీతూ ఎక్కడా నిరాశకు గురి కాలేదు....కుంగిపోలేదు. పట్టుదలతో కఠోర శ్రమ చేసి చివరకు అనుకున్నది సాధించింది. పెళ్లి, పిల్లలతో పెరిగిన తన శరీర బరువును తగ్గించుకోవడానికి రీతూ పగలు రాత్రి కష్టపడింది. తెల్లవారుఝామున మూడు గంటలకే నిద్ర లేచి రన్నింగ్ చేసి ఎనభై కిలోల బరువును అదుపులోకి తెచ్చింది. ఎలాంటి శిక్షణ లేకుండానే రెజ్లింగ్ క్రీడలోని మెళకువలు నేర్చుకుంది. అటు పిల్లల పెంపకాన్ని, ఇటు రెజ్లింగ్ సాధనను రెండింటినీ సమర్ధవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా రీతూ మాట్లాడుతూ.. 'మాది చాలా సాంప్రదాయ కుటుంబం.. రెజ్టింగ్ నేర్చుకుంటానని చెప్పగానే.. అందరిలాగానే మా కుటుంబ సభ్యులు కూడా అస్సలు అంగీకరించలేదు. అయినా గ్రామంలో ఎవ్వరూ నిద్ర లేవకముందే నా శిక్షణ పూర్తి చేసుకుని, తర్వాత ఇంట్లో పనిని చూసుకునేదాన్నంటూ' తను గెలుచుకున్న పతకాలను మీడియాకు చూపించింది. జూనియర్, సీనియర్ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో రీతూ విజేతగా నిలిచింది. ప్రపంచ రెజ్లింగ్ పోటీల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. కోచ్ మణిదీప్ సింగ్ నీతూ టాలెంట్‌ను అభినందిస్తూ.... నీతూ అస్సలు సమయాన్ని వృధా చేయదు. కష్టపడి పనిచేస్తుంది తనలో చాలా శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. ఆమె ఇంకా చాలా విజయాలు సాధిస్తుంది అనే ధీమాను వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం సహాయ సహకారాలు ఆమెకు అందించాలని కోరుతున్నారు. -
చిలిపి కృష్ణమ్మ
ఢిల్లీలో పుట్టి.. ముంబైలో పెరిగిన ఈ ముద్దుగుమ్మ ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఫ్యాషన్ రంగం నుంచి సినిమాల వైపు వచ్చిన సిమేర్ మోటియాని.. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటానంటోంది. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో బుధవారం ‘డిజైర్’ డిజైనర్ ఎగ్జిబిషన్ ప్రారంభానికి విచ్చేసిన సిమేర్ను సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే. ..:: శిరీష చల్లపల్లి నేను ఆడపిల్లనైనా.. అల్లరిలో మాత్రం శ్రీకృష్ణుడి రేంజ్ నాది. మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అమ్మ ప్రొఫెషనల్ బ్రైడల్ డిజైనర్.. ఒక తమ్ముడు ఉన్నాడు. చిన్నప్పుడు మా నాన్న ఆఫీస్‌కు వెళ్లకుండా ఫైల్స్, ఇంపార్టెంట్ కాగితాలు దాచేసేదాన్ని. ఆ ఫైల్స్ వెతుక్కునే పనిలో లేట్ అయిపోయి నాన్న ఆఫీస్‌కి వెళ్లడం మానేసేవాడు. ఇంకోసారి ఫ్రెండ్స్‌తో కలసి టూర్ వెళ్లడానికి ట్రైన్ ఎక్కాం. ట్రైన్ కదలడం స్టార్ట్ అయ్యాక.. మేం ఎక్కాల్సిన ట్రైన్ కాకుండా.. మరేదో ఎక్కామనుకున్నాం. రన్నింగ్ ట్రైన్ నుంచే అందరం సినిమా రేంజ్లో ప్లాట్‌ఫాం మీదికి దూకేశాం. మేమెక్కిన ట్రైన్ కరెక్టేనని తర్వాతగానీ తెలియలేదు. ఎంత అల్లరి పిల్లనైనా.. కల్చర్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే కథ క్ నేర్చుకున్నా. దేశవిదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. సిటీ చుట్టేశా.. డిగ్రీలో ఉండగా.. ఒకసారి ఫ్రెండ్స్‌తో కాఫీ షాప్‌నకు వెళ్లాను. ఓ మోడలింగ్ ఏజెన్సీ వాళ్లు నన్ను చూసి.. ‘మోడలింగ్ చేస్తారా’ అంటూ అప్రోచ్ అయ్యారు. అలా ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాను. తర్వాత కొద్ది రోజులకే ‘మలబార్ గోల్డ్’ యాడ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలసి చేసే అవకాశం వచ్చింది. అప్పుడే మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాను. తర్వాత సేమ్ యాడ్ తమిళంలో సూర్యతో కలసి చేశాను. అలా యాడ్స్ చేస్తూ వెళ్లిపోయాను. అందరూ మెచ్చుకోవడంతో నాకూ ఆసక్తి పెరిగింది. యాక్టింగ్ కోర్సులో చేరా. అప్పుడే ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో హైదరాబాద్‌లోనే ఉన్నాను. అప్పుడు సిటీలోని టూరిస్ట్ స్పాట్స్ అన్నీ చుట్టేశాను. చుడి బజార్లో ‘మీనాకారి గాజులు’, చార్మినార్ దగ్గర ‘ముత్యాల హారం’ కొని స్నేహితులకు బహుమతిగా పంపించాను. సర్వీలో హలీమ్ బాగా నచ్చింది. గుడ్ ఇంప్రెషన్.. సిటీకి వచ్చిన కొత్తలో కొంత ఇబ్బందిగా ఫీలయ్యాను. అయితే మంచు లక్ష్మి నా గురించి స్పెషల్ కేర్ తీసుకోవడంతో ఇక్కడి మనుషుల మీద నాకు మంచి ఇంప్రెషన్ కలిగింది. ఇక నా సెకండ్ సినిమా‘ది ఓనర్’ అనే ఇంటర్నేషనల్ మూవీ. ఆ ఫిల్మ్ గిన్నిస్ రికార్డ్ కూడా సాధించింది. ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. పూరిజగన్నాథ్ డెరైక్షన్‌లో నటించాలని ఉంది. నాకు భర్తగా వచ్చేవాడు మహేష్‌బాబు అంత హ్యాండ్సమ్గా, సూర్య అంత మంచితనంతో ఉండాలని కోరుకుంటున్నా. -
కార్ల విక్రయాల్లో మారుతీ హవా
ఏప్రిల్-ఆగస్టు టాప్ టెన్‌లో తొలి 4 మోడల్స్ మారుతీవే న్యూఢిల్లీ: దేశీ కార్ల మార్కెట్లో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ హవా కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో తొలి నాలుగు స్థానాల్లో మారుతీ కార్లే ఉండటం ఇందుకు నిదర్శనం. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం మారుతీకి చెందిన చిన్న కారు ఆల్టో అగ్ర స్థానంలో ఉంది. అదే సంస్థకు చెందిన డిజైర్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్ కార్లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలు ఆక్రమించాయి. మరోవైపు, హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 అయిదో స్థానంలో, ఎక్సెంట్ ఆరో స్థానంలో, ఇయాన్ ఏడో స్థానంలో నిల్చాయి. మరోవైపు, ఇప్పటిదాకా ఎనిమిదో స్థానంలో ఉన్న హోండా సిటీ కారు అమేజ్ పదో స్థానానికి తగ్గగా, అదే కంపెనీకి చెందిన సిటీ కారు ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఇక మారుతీ సెలీరియో తొమ్మిదో స్థానంలో ని లిచింది. ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఆల్టో కార్లు 1,03,123, డిజైర్ వాహనాలు 82,912, స్విఫ్ట్ 80,861, వ్యాగన్ ఆర్ 63,051 అమ్ముడయ్యాయి. అటు, హ్యుందాయ్ తమ గ్రాండ్ ఐ10 వాహనాలు 40,530, ఎక్సెంట్ 33,685, ఇయాన్ 32,171 కార్లను విక్రయించింది. అటు సెలీరియో కార్లు 29,591 అమ్ముడయ్యాయి. హోండా సిటీ కార్లు 30,447, అమేజ్ కార్లు 28,887 అమ్ముడయ్యాయి. -
కోరికలను అదుపులో పెట్టుకోవాలి
తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యతలు నేర్పించాలి మహా సహస్రావధాని గరికపాటి నర్సింహారావు మహబూబాబాద్ టౌన్ : మనల్ని అభివృద్ధి చేసేది, నాశ నం చేసేది కోరికలేనని, ఆ కోరికలను ప్రతి ఒక్కరూ అదుపులో పెట్టుకోవాలని మహాసహస్రావధాని, అవధాన శార ద గరికపాటి నర్సింహారావు అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కామధేను గోశాల శ్రీ బం డ్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరీ దేవాలయంలో సోమవా రం రాత్రి ‘పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత’ అనే అంశం పై విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి నర్సింహారావు ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, నాగరికతను అంది పుచ్చుకోవడంలో ఇతర భాషల వారి కంటే భారతీయులు ముందంజలో ఉన్నారన్నారు. ఇంగ్లీష్ వాఖ్యాలు వచ్చాక సంస్కృతి, ఆచారాలు, నాగరికత మారిపోయాయన్నారు. మార్పును మంచి కోసమే వినియోగించాలి తప్ప నాశనానికి వినియోగించవద్దన్నారు. తెలుగు విద్యా విధానం అమల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ అంటే ఏమిటో తెలియదన్నా రు. ఎల్కేజీ చదవాలంటే ప్రస్తుత రోజుల్లో మోతలు, లగేజీలు, ప్యాకే జీలు, లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నారు. గతాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దని, కళలను ప్రోత్సహించాలన్నారు. నాటి రోజుల్లో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే పదాలు మొదటి పేజీల్లో ఉంటే నేడు ఏబీసీడీలు మొదటికి చేరుకుని తెలుగుపై పెత్తనం చేయాలని చూస్తున్నాయన్నారు. భాషపై ద్వేషం ఏమి లేదంటూ ఏబీసీడీలు కాదు, అ,ఆ,ఇ,ఈలు కూడా ముఖ్యమేనన్నారు. విద్యార్థుల ధర్మం చదువుకోవటమేనని తెల్పుతూ తల్లిదండ్రులు కూడా అందుకు తగ్గట్టుగా వారి అలవాట్లపై శ్రద్ధ కనపరచాలన్నారు. మనం ఏ పని చేస్తున్నామో దానిపైనే దృష్టి పెట్టాలని, అప్పుడే ఆ పనిపై విజయం సాధించగలుగుతామన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు మానసికోల్లాసాన్ని కల్గిస్తూ విద్యా భోదన చేయాలని తెలిపారు. విద్యార్దులను భాగు చేసే అవకాశం వచ్చిందని అనుకోవాలన్నా రు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు గర్రెపెల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ భువనగిరి అనిల్‌గుప్త, ఇమ్మడి వెంకటేశ్వర్లు, భార్గవి, తమ్మి ఉపేందర్‌రావు, కొత్త సోమన్న, నాళ్ళ ప్రకా శ్, రాంకిషన్ ఝవర్, ప్రతాపని విశ్వనాధం, డాక్టర్ అశోక్, మహ్మ ద్ సుభాని, దైద వెంక న్న పాల్గొన్నారు. -
చిన్నారి చివరి కోరిక
పెద్ద పెద్దవాళ్లే మృత్యువు పేరు చెబితే కంగారుపడిపోతారు. అలాంటిది ఓ పదకొండేళ్ల పిల్లాడు... జీవించడం కంటే మరణించడం మేలు అంటున్నాడంటే అది ఎంత బాధాకరం! అందుకే రీస్ పుడ్డింగ్టన్ మాటలు విన్నవారంతా కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. బ్రిటన్‌కు చెందిన రీస్ వయసు పదకొండేళ్లు. ఐదేళ్ల వయసులో అతడికి అరుదైన క్యాన్సర్ సోకింది. తల్లి కే, తండ్రి పాల్లు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. చికిత్స చేయించి బిడ్డను బతికించుకున్నారు. కానీ దురదృష్టం... రీస్ శరీరంపై క్యాన్సర్ రెండోసారి దాడి చేసింది. ఈసారి కాలేయానికి, ఛాతీకి, తొడ ఎముకకు కూడా వ్యాధి సోకడంతో పరిస్థితి దిగజారింది. అతడిని కాపాడాలని వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంతలోనే రీస్ ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇక వైద్యం అవసరం లేదని, చికిత్స తీసుకుని ఆ సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇబ్బందులు పడేకంటే... చికిత్స ఆపేసి మరణించడమే మంచిదని అన్నాడు. అతడి మాటలకి తల్లిదండ్రులు, వైద్యులే కాదు... యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. రీస్ కోసం చాలాకాలం క్రితమే సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఒక అకౌంట్ తెరిచారు అతడి తల్లిదండ్రులు. అందులో రీస్ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను తెలుపు తుంటాడు. తాజాగా తన ఈ నిర్ణయాన్ని తెలిపాడు. ‘‘అమ్మ నా కోసం ఏడుస్తోంది. నాన్న చాలా కష్టపడుతున్నారు. వాళ్లని చూస్తే బాధేస్తోంది. కానీ చికిత్స నన్ను అంతకంటే ఎక్కువ బాధపెడుతోంది. ఆ బాధలు ఇక నేను పడలేను. అందుకే ఇక ట్రీట్మెంట్ తీసుకోకూడదని నిర్ణయించు కున్నాను. మరణాన్ని ఆహ్వానిస్తాను’’ అంటూ ఆ చిన్నారి రాసిన అక్షరాలు... వాటిని చదివిన లక్షల మంది కళ్లలో నీళ్లు నింపాయి. రీస్ బతకాలని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. కానీ అది జరిగేది కాదని స్వయంగా అతడి తల్లే అంటోంది. రీస్ సంతోషం కోసం మనసు చంపుకుని అతడి నిర్ణయాన్ని సమర్థిస్తోందామె. చనిపోయే ముందు తన అభిమాన హీరో జానీ డెప్‌ని కలవాలని, తన తల్లి కారు నడుపుతుంటే చూడాలని ఆశపడుతున్నాడు రీస్. ఆ చిన్నారి కోరికలు నెరవేరాలని, అతడు ఆనందంగా జీవించాలని ఆశిద్దాం! -
భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?
చరమాంకం వరకు మౌనంలో, ధ్యానంలో గడిపారు రమణ మహర్షి. అప్రమేయంగా సాగిన స్వల్ప సంభాషణలు తప్ప ఆయన ఎక్కడా ప్రసంగించలేదు. సంకేత మాత్రంగా స్వీయ శోధనను తప్ప దేనినీ ప్రవచించలేదు. ఆత్మసాక్షాత్కారం కోసం కౌమారంలోనే అరుణాచలం చేరుకున్న ఈ మహా రుషిలోని ఏ చిన్న కోణాన్నీ చిక్కువిప్పుకోడానికైనా ఎంత శక్తీ, ఎంత కాలమూ సరిపోదు. అందుకే - ఆయనతో దీర్ఘకాల ఆశ్రమ బాంధవ్యం ఉన్న ఓ వైద్యుని స్మృతులలో నుంచి ఈ నివాళి. ఓ రోజు (1948 డిసెంబరులో) శ్రీ భగవాన్ చేతిని మర్దనా చేస్తూంటే మోచేతికి కాస్త పైభాగంలో ఉన్న కణితిని గమనించాను. 1949 జూలై నాటికి ఆ భాగమంతా పచ్చి పుండు అయింది. ‘‘నయం కావాలన్న సంకల్పం మీకు ఉండాలి. సంకల్పించుకోండి’’ అని ప్రాధేయపడ్డాను. వారు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండిపోయారు. నేను మళ్లీ అర్థించాను. అప్పుడు వారు, ‘‘ఇక్కడ మనస్సంటూ ఏమీ లేదు. కాబట్టి సంకల్పించే ప్రసక్తే లేదు’’ అన్నారు. భగవాన్ శ్రీ రమణ మహర్షికి దేహం గానీ, దాని రోగాలు కానీ పట్టవు. పుండుకు కట్టు కడుతున్నప్పుడు నొప్పి అనివార్యం. కానీ వారు ఏ బాధనీ కనబరచలేదు. పెపైచ్చు ఆ కట్టు కట్టడానికి కుడిచేతితో సహాయం చేసేవారు... ఆ పుండు ఇంకెవరిదో అయినట్టు! వారి పుండుకు కట్టు కట్టే ముందు ఆ ప్రాంతాన్ని స్పిరిట్‌తో శుభ్రం చెయ్యాల్సి వచ్చేది. ఓసారి ఆ స్పిరిట్ చేతి మీదకు వచ్చింది. వెంటనే వారు, ‘‘స్పిరిట్ స్నానం అయింది నాకు’’ అన్నారు. అందరికీ అటువంటి స్పిరిట్ స్నానం అవసరమని కూడా అన్నారు. ఆ మాటల అంతరార్థమేమిటో తెలియక, వివరించి చెప్పమని కోరాను. వారు చిరునవ్వుతో ఇట్లా చెప్పారు. ‘‘చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. బయటికి వస్తే బ్రతకలేవు. అట్లాగే మనం ఎప్పుడూ స్పిరిట్లోనే, అంటే శుద్ధ చైతన్యంలోనే ఉంటాం, ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శుద్ధచైతన్యంలో, అంటే ఆత్మలోనే ఉండాలి.’’ ఈ మాటల వల్ల వారెప్పుడూ సహజ సమాధిలోనే ఉంటారని నమ్మకం కలిగింది నాకు. శ్రీ భగవాన్ తరచు చిన్న చిన్న విషయాలలో కూడా ప్రగాఢమైన బోధనలు చేసేవారు. ఆ బోధనలకు మనపై గట్టి పట్టు ఉండేది. 1949లో ఒకసారి శ్రీ భగవాన్, ‘మనం సంతోషంగా ఉన్నప్పుడు కన్నీరు ఆవలి కొన నుంచీ, విచారంగా ఉన్నప్పుడు లోపలి కొన నుంచీ వస్తుంది’ అని చెప్పారు. అది నిజమే. మహా నిర్వాణ దినం నాడు 1950 ఏప్రిల్ 14న వారి గదిలో నేనూ ఉన్నాను. వారి కోరిక మీద వారు కాళ్లు చాచుకుని కూర్చోవడానికి ఏర్పాటుచేశాం. వారు కళ్లు మూసుకున్నారు. శ్వాస నెమ్మదిగా సాగుతోంది. బయట భక్తులు ‘అరుణాచల శివ స్తోత్రం’ పాడుతున్నారు. ఒక్కసారి కళ్లు తెరిచి, ఆ పాట వస్తున్న వైపు చూసి, మళ్లీ కళ్లు మూసుకున్నారు. వారి కళ్ల ‘ఔటర్ కాన్తస్’ నుంచి కన్నీరు కారింది. అంటే పరమాత్మునిలో ఐక్యమయ్యేటప్పుడు కలిగే ఆనందానికి ఆ కన్నీరు బాహ్యరూపం అనుకున్నాను. దేహాన్ని ఎంతో ప్రశాంతంగా విడిచారు. శ్రీ భగవాన్ రమణ మహర్షి అదేరోజు సాయంత్రం 8 గం. 47 ని.లకు శివైక్యం పొందారు. తన బాధ గురించి దుఃఖిస్తున్నవారి పట్ల కరుణ ఉండేది శ్రీ భగవాన్‌కి. ఆయనెప్పుడూ అసలు సత్యాన్నీ, తన బోధనలో ప్రధానాంశమైన ‘‘మనం దేహం కాదు’’ అనే మాటను జ్ఞాపకం చేస్తుండేవారు. తనదైన రీతిలో ఒక మాట అడిగేవారు కూడా. ‘‘భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?’’ అని. - ఆశ్రమ డాక్టర్ ఎం.అనంతనారాయణరావు స్మృతుల నుంచి. (సౌజన్యం: శ్రీరమణ కేంద్రం, హైదరాబాద్) భగవాన్ శ్రీరమణ మహ ర్షి 30 డిసెంబర్ 1879 - 14 ఏప్రిల్ 1950 అసలు పేరు: వెంకటరామన్ జన్మస్థలం: తిరుచ్చుళి, తమిళనాడు తల్లిదండ్రులు: అళగమ్మ, సుందరయ్యర్ సహోదరులు: అన్న, తమ్ముడు, చెల్లి చదువు: తొమ్మిదవ తరగతి, అమెరికన్ మిషన్ హైస్కూల్ ఆత్మజ్ఞానానికి అంకురార్పణ: పదహారేళ్ల వయసులో (తిరువణ్ణామలైలోని అరుణాచలం గురించి విన్నపుడు) ఇల్లు విడిచి అరుణాచలానికి: 1896 (సందర్శన 1, సెప్టెంబర్) నివాసం: మొదట అరుణాచల ఆలయ ప్రాంగణం తర్వాత గురుముహూర్త మఠం (1897), విరూపాక్ష గుహ (1899), స్కందాశ్రమం (1916), ఆ తర్వాత జీవిత చరమాంకం వరకు } రమణాశ్రమం (అరుణాచల పాదంలో తల్లి సమాధి చుట్టూ ఏర్పడిన ఆశ్రమం-1922). తాత్వికత: మౌనం, ధ్యానం, ఆత్మజ్ఞాన సాధన, ‘నేనెవరు?’ అన్న అన్వేషణ. సందర్శకులలో ముఖ్యులు కొందరు : డాక్టర్ పాల్ బ్రంటన్, టి.ఎం. కృష్ణస్వామి అయ్యర్, చింతాదీక్షితులు, గుడిపాటి వెంకటాచలం, చిత్తూరు నాగయ్య, డాక్టర్ రాజేంద్రప్రసాద్, జమ్నాలాల్ బజాజ్. -
కారు కోరిక తీరిందిలా...
ఏ కోరికైనా సరే! సరైన ప్లానింగ్ ఉంటే సాధించటం కష్టమేమీ కాదు. చిరుద్యోగులైనప్పటికీ అనురాధ, రాఘవ దంపతులు తమకిష్టమైన కారు కొనుక్కోగలిగారంటే ప్లానింగ్ వల్లే. ఇక్కడ కారు కొనటం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. కానీ... తాము అనుకున్న రీతిలో, అనుకున్న కారును... ఇంకా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్ మొత్తం నుంచి డౌన్‌పేమెంట్ వరకు, లోను వ్యవధి వరకు అంతా తాము ప్లాన్ చేసినట్లుగానే చేయగలిగారు వీళ్లిద్దరూ. అదెలా సాధ్యమైందో మీరూ చూడండి. ‘మా ఇద్దరివీ ప్రైవేటు ఉద్యోగాలే. కారు కొనుక్కోవాలన్నది మా చిరకాల కోరిక. కొన్నాళ్లు ఆగినా... ఇక కొనేయాల్సిందేనని అనుకున్నాక ఎలా..? అనే ప్రశ్న తలెత్తింది. ముందు డౌన్‌పేమెంట్ గురించి ఆలోచించాం. మా ఇద్దరి జీతాల్లోంచీ నెలకు రూ.10 వేలు పక్కనపెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదని మాకు తెలుసు. అందుకని నెలవారీ వాయిదా రూ.10 వేలు మించకూడదనుకున్నాం. దాన్నిబట్టి డౌన్‌పేమెంట్‌గా ఎంత చెల్లించాలన్నదానిపైనా ఒక అవగాహనకు వచ్చాం. డౌన్‌పేమెంట్ ఎంత కావాలో తెలిసింది కనుక దానికోసం రెండేళ్లపాటు జీతాల్లో నుంచి కొంత మేర తీసి పక్కన పెట్టడం మొదలుపెట్టాం. మారుతి కారు కొనాలని ముందే అనుకున్నాం. కాకపోతే ఏ మోడల్ తీసుకోవాలన్నది మాత్రం అంత త్వరగా తేలలేదు. మా వారు దీనికోసం దాదాపు ఏడాది పాటు స్టడీ చేశారు. ప్రతి మోడల్ ఖరీదు... మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ ఆరా తీసి తెలుసుకున్నారు. మా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని... చివరకు స్విఫ్ట్ డిజైర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. మొత్తం నగదు చెల్లించి కారు తీసుకునే అవకాశమెటూ లేదు. కాబట్టి రుణం తీసుకోక తప్పదు. అయితే మేం ఒక్కటే అనుకున్నాం. రుణం మూడేళ్లలో తీరిపోవాలి. ఈఎంఐ 10వేలు మించకూడదు. దాని ప్రకారమే మా ప్లానింగ్ సాగింది. ఇంకో విషయం చెప్పాలి. మేం బుక్ చేసుకున్నా కారు అంత సులువుగా రాలేదు. మారుతి ప్లాంటులో కార్మికుల సమ్మె వంటి గొడవల వల్ల డెలివరీకి దాదాపు ఏడాది పట్టేసింది. దాంతో బుక్ చేసినప్పుడున్న రూ. 7.6 లక్షల రేటు చేతికొచ్చేలోగా రెండు సార్లు పెరిగి రూ.7.8 లక్షలకు చేరింది. ఇలాంటివాటికి కూడా సిద్ధమై ఉండాలన్నది అప్పుడు తెలి సింది. మొత్తానికి ఏడాదిన్నర కిందట కారు చేతికొచ్చింది. మరో ఏడాదిన్నర గడిస్తే రుణం కూడా తీరిపోతుంది. క్రమం తప్పని పొదుపు... కొనాలనుకున్నదానిపై కొంత అధ్యయనం... బడ్జెట్ అదుపునకు ప్లానింగ్... ఈ మూడూ ఉంటే ఏదైనా కొనొచ్చని తెలుసుకున్నాం.’ - కామని అనూరాధ, హైదరాబాద్ ఇలాంటి విజయగాథలు మీకూ ఉంటే మాతో పంచుకోండి. మీ వివరాలతో సాక్షి కార్యాలయానికి లేఖ రాయండి. లేదా business@sakshi.comకి ఈమెయిల్ కూడా పంపవచ్చు. -
1,492 మారుతీ కార్ల రీకాల్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కంపెనీ 1,492 కార్లను రీకాల్ చేస్తోంది. గత నెల 19-26 తేదీల మధ్య తయారైన ఎర్టిగ(306 కార్లు), స్విఫ్ట్(592), డిజైర్(581), ఏ-స్టార్(13) మోడల్ కార్లు మొత్తం 1,492ను రీకాల్ చేస్తున్నామని కంపెనీ బుధవారం తెలిపింది. స్టీరింగ్ కాలమ్‌లో సమస్యలొచ్చే అవకాశాలున్నందున ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు వివరించింది. పైన పేర్కొన్న తేదీల మధ్య తయారైన కార్లను కొనుగోలు చేసిన వారిని తమ డీలర్లు సంప్రదిస్తారని, ఈ కార్లలో స్టీరింగ్ కాలమ్‌లో ఏదైనా తేడా ఉన్నట్లు తేలితే దానిని మారుస్తారని పేర్కొంది. ఈ సేవ ఉచితమని వివరించింది. ఇప్పటికే కొత్త స్టీరింగ్ కాలమ్‌లను డీలర్లకు పంపించామని తెలిపింది. కాగా 2010 ఫిబ్రవరిలో మారుతీ కంపెనీ లక్ష ఏ-స్టార్ కార్లను రీకాల్ చేసింది. ఇంధన పంపుకు సంబంధించి ఒక భాగాన్ని రీప్లేస్ చేసే నిమిత్తం ఆ కార్లను కంపెనీ రీకాల్ చేసింది.