త్రిషకు ఆ కోరిక తీరేనా! | Rajinikanth fulfills Trisha's desire? | Sakshi
Sakshi News home page

త్రిషకు ఆ కోరిక తీరేనా!

Published Sun, Aug 21 2016 8:34 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

త్రిషకు ఆ కోరిక తీరేనా!

త్రిషకు ఆ కోరిక తీరేనా!

మనిషికి డబ్బు, ఆస్తి, అంతస్తు, కీర్తి, కనకం అంటూ అన్నీ ఉన్నా ఏదో వెలితి ఉంటుంది. ఇది నగ్న సత్యం. నటి త్రిష విషయానికొస్తే తనూ చాలా కాలంగా ఒక తీరని కోరిక వెంటాడుతోందట. ఎప్పటికైనా అది నెరవేరేనా అని ఆశతో ఎదురు చూస్తున్నారట. త్రిష నటిగా చాలానే సాధించారు. అధిక కాలం నాయకిగా కొనసాగుతున్న నటిగా రికార్డు సాధించారని చెప్పవచ్చు. త్రిషను కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకిగా పేర్కొనవచ్చు. విద్యను పూర్తి చేసిన తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి ఆ తరువాత సినీరంగంలోకి వచ్చారు.
 
తమిళంలో జోడి అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా చిన్న పాత్రతో నటిగా రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం 1999లో తెరపైకి వచ్చింది. అంటే 17 ఏళ్లుగా నటిగా తన పయనం సాగుతోందన్న మాట. నాయకిగా సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంలో తెరపైకి వచ్చారు. ఈ చిత్రం 2002లో తెరపైకి వచ్చింది. ఆ తరువాత విక్రమ్, విజయ్, అజిత్, కమలహాసన్, శింబు, తెలుగులో చిరంజీవి నుంచి సిద్ధార్థ్ అంటూ అందరు ప్రముఖ కథానాయకులతోనూ నటించారు.
 
అయితే నటిగా ఒకటిన్నర దశాబ్దం దాటినా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జతకట్టే అవకాశం వరించలేదు. ఇది బాధాకరమేనంటున్న త్రిష ఆ విషయం గురించి మాట్లాడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు అలాంటి కోరిక తనకు చాలా కాలంగా ఉందన్నారు. తాను 15 ఏళ్లుగా నాయకిగా కొనసాగుతున్నానంటున్నారని ఇంత కాలం నాయకిగా కొనసాగిన వారు లేరని అంటున్నారని అన్నారు.
 
ఇది తాను అదృష్ణంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇంత కాలం నాయకిగా కొనసాగుతున్నా రజనీకాంత్‌కు జతగా నటించే అవకాశం రాకపోవడం తీరని లోటేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా ఇప్పుడు యువ నటులు విజయ్‌సేతుపతి, శివకార్తికేయన్ మంచి కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్నారని, వారితోనూ నటించాలని కోరుకుంటున్నానని త్రిష తన మనసులోని మాటను బయట పెట్టారు. త్వరలోనే ఈ అమ్మడు ఆశ తీరాలని కో రుకుందాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement