
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎస్–సీఎన్‌జీ పరిజ్ఞానంతో కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను రెండు ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.14 లక్షల నుంచి ప్రారంభం. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో ఇవి రూపుదిద్దుకున్నాయని కంపెనీ తెలిపింది. మైలేజీ కిలోకు 31.12 కిలోమీటర్లు అని వెల్లడించింది.
నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, అధిక మైలేజీ కారణంగా ఎస్–సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయిదేళ్లలో కంపెనీ ఈ విభాగంలో ఏటా సగటున 19 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment